• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లల జుట్టుకి నూనె ఎందుకు అవసరం ?

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 15, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీ పిల్లల జుట్టు సంరక్షణ విషయానికి వస్తే, ముఖ్యంగా అమ్మాయి, జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం తల్లులందరూ చేయాలనుకునే మొదటి ఎంపిక. మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, మరియు పిల్లల కొరకు '. పిల్లల షాంపూలు ' గా విక్రయించబడే అనేక రకాల షాంపూలు దొరుకుతూ ఉండడంతో తల్లులు దేనిని ఎంచుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఇది వారి చిన్నారుల జుట్టు విషయం కనుక దానిని ఎంపిక చేసుకోవడంలో చాలా కఠినమైనది. కాబట్టి మీరు ఏం చేస్తారు ?

 

మీరు గుర్తుంచుకోవలసిన మొదటి మరియు ప్రధానమైన వాస్తవం ఏమిటంటే, మీ జుట్టు యొక్క అవసరము మరియు మీ పిల్లల జుట్టు యొక్క అవసరము పూర్తి భిన్నంగా ఉంటుంది. పిల్లలకు 10 నుండి 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు జుట్టుయొక్క రంగు , మందము, ఆకృతి మరియు పొడవు పూర్తిగా వృద్ధి చెందవు. అప్పటివరకు మీ పిల్లలు జుట్టు మీ జుట్టు కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందువలన మీ పిల్లల జుట్టు సంరక్షణ మీ కంటే భిన్నంగా ఉండాలి.

 

మీ పిల్లల జుట్టుకు నూనె రాయడం, ఉత్తమ నూనెలు మరియు పిల్లల కోసం ఇతర జుట్టు సంరక్షణ చిట్కాల గురించి మరింత తెలుసుకోవడానికి దీనిని చదవడం కొనసాగించండి.

 

పిల్లల జుట్టుకు నూనె రాయడం - మంచిదా లేదా చెడ్డదా :

ప్రతిరోజు మీ శిశువు జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం . తరచుగా నూనె రాయడం వలన నెత్తి పైన రక్తప్రసరణ పెరుగుతుంది. మరియు తల పైభాగానికి తగినంత తేమను అందిస్తుంది. అయినప్పటికీ , శిశువు పెరిగే కొద్దీ వివిధ కారణాల వలన వారి జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం కష్టమవుతుంది . ఇది పిల్లల జుట్టు,  వాతావరణం మరియు కార్యాచరణ స్థాయి లపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని ప్రయోగాల ద్వారా మీ పిల్లల జుట్టు సంరక్షణ పద్ధతులను తెలుసుకోవచ్చు.

 

పిల్లల జుట్టుకు నూనె రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు :

నూనెతో మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి పిల్లలు జుట్టుకు నూనె రాయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలి.

 

1. ఎక్కువ నూనె ఎప్పుడు రాయకండి : ఎక్కువ నూనె రాయడం వలన మీ పిల్లల నెత్తిపై ఉన్న రంధ్రాలను నిరోధించవచ్చు. ఇది చుండ్రు మరియు పొలుసు మొదలైన వివిధ సమస్యలకు దారి తీస్తుంది.

 

2. స్నానం చేసిన తర్వాత నూనెను జుట్టులో  ఉండకుండా చూసుకోండి : మీరు మీ పిల్లలు జుట్టుకు నూనె రాసిన ప్రతి సారి, నెత్తికి అవసరమైన తేమ మరియు పోషకాలను గ్రహించడానికి కొంత సమయం ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయించండి. నూనె పూర్తిగా తొలగించబడిందని నిర్ధారించుకోండి. లేదంటే, వాతావరణం నుండి వచ్చే దుమ్ము జుట్టు మరియు నెత్తి మీద ఉన్న నూనెతో కలిసి జుట్టుకు మరియు నెత్తికి దుష్ప్రభావాలను తీసుకొస్తుంది.

 

3. నూనెను వేడి చేయండి : నెత్తి మీద కొద్దిగా వేడిగా ఉన్న నూనెతో మసాజ్ చేయడం వలన నూనె యొక్క ప్రభావం పెరుగుతుంది. ఎందుకంటే నెత్తిమీద తేమ ఎక్కువ సేపు ఉంటుంది.

 

4. నూనెను ఎంచుకోవడం : నూనెలో రసాయనాలు లేవని నిర్ధారించుకోండి. ఎక్కువ వాసన కలిగిన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం మానుకోండి. నూనె నెత్తికి తగిన పోషణను అందిస్తుంది అని నిర్ధారించుకోండి. వర్జిన్ ఆయిల్స్ పిల్లల తలకి రాయడానికి ఎంతో మంచివి. అదేవిధంగా నూనె వాతావరణానికి తగిన విధంగా ఉండాలి.( వేసవి కాలంలో ప్రయోజనకరమైనది శీతాకాలంలో ఉపయోగించినట్లయితే అదే ఫలితాలను ఇవ్వకపోవచ్చు)

 

పిల్లల జుట్టుకి ఉత్తమమైన నూనెలు ఏమిటి ?

పిల్లల జుట్టుకి ఉత్తమమైన మసాజ్ ఆయిల్స్ కొరకు ఇక్కడ చూడండి.

 

1. ఆలివ్ ఆయిల్ : మీ పిల్లలు ఎక్కువ జుట్టును బలంగా చేయడానికి మరియు పిల్లల పొడిబారి, చిక్కులతో, ముతకగా ఉన్న జుట్టును మృదువుగా, సున్నితంగా చేయడానికి ఉపయోగపడుతుంది. శిశువుల్లోని ఉయ్యాల టోపీల సమస్యలనుంచి తొలగించడానికి ఆలివ్ ఆయిల్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ చాలా జిడ్డుగా ఉన్నందున, ఒక గంట పాటు పిల్లల జుట్టుకు ఆయిల్ రాసి వదిలేయండి. ఆ తర్వాత షాంపూతో పూర్తిగా ఆయిల్ ను తొలగించడం మంచిది.

 

2. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో విటమిన్ ఈ, విటమిన్ కె, ప్రోటీన్ మరియు లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇతర నూనెలతో పోలిస్తే ఇది చాలా తేలికగా ఉంటుంది. కొబ్బరినూనె అద్భుతమైన హెయిర్ కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నూనె సులభంగా పిల్లల జుట్టు లోనికి ఇంకిపోతుంది . కొబ్బరి నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు పొడిబారడం గణనీయంగా తగ్గుతుంది . ఇది శీతలీకరణ నూనె. అందువలన వేసవిలో ఉపయోగించడం ఉత్తమం .(పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు దీనిని ఉపయోగించకుండా ఉండటం మంచిది)

 

3. నువ్వుల నూనె : నువ్వుల నూనె జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మరియు జుట్టు మరియు నెత్తిని రక్షిస్తుంది. నువ్వుల నూనె అద్భుతమైన చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది పిల్లల నెత్తిని ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

 

4. ఆవనూనె : ఆవనూనె వేడిని ఉత్పత్తి చేసే నూనె. ఇది సీతాకాలంలో ఉపయోగించడం మంచిది . ఇది రక్తప్రసరణను పెంచుతుంది మరియు శీతాకాలంలో తక్కువగా ఉండే జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పిల్లలు జలుబు మరియు దగ్గు లక్షణాలను ఎదుర్కొంటున్న సమయంలో దీనిని ఉపయోగించడం మంచిది.


మీ పిల్లల జుట్టుకు నూనెను ఎందుకు రాయాలి అనే దానిపై ఉన్న ఈ బ్లాక్ మీకు నచ్చిందా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}