• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
వేడుకలు మరియు పండుగలు

మీ పిల్లలకు క్రిస్మస్ గురించి ఎలా వివరించాలి

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Dec 14, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

"హే, ఇది క్రిస్మస్ ! క్రిస్మస్ గురించి నీకు తెలుసా," నేను నా మూడు సంవత్సరాల చిన్న బిడ్డను అడిగాను. " తను బహుమతులు ఇవ్వడానికి వచ్చే శాంతా క్లాస్ గురించి, మరియు నాకు పింకు రిమోట్ కారు కావాలి" అని  వెంటనే సమాధానం చెప్పింది. నేను మళ్ళీ ప్రయత్నించాను - శాంతా క్లాస్ గురించి, కానీ క్రిస్మస్ గురించి ఏమిటి ?

 

" మమ్మా, మనం ఇప్పుడు ఆడుకునేందుకు బయటకి వెళ్దామా ? కింద పిల్లల  శబ్దాలు వినిపిస్తున్నాయి. స్పష్టంగా వెళ్లాలి అని నిర్ణయించుకుని ఇంకొకసారి చెప్పడానికి కూడా ఇష్టపడకుండా , వేడిగా ఉండటానికి తన జాకెట్ వేసుకోసాగింది, బహుమతులనే ప్రత్యేకంగా తీసుకోకుండా ఆనందం మరియు భాగస్వామ్యం గల ఈ వెచ్చని పండుగ యొక్క నీతిని నేను ఎలా వివరించగలరు అని నా మనస్సు ఆలోచిస్తూనే ఉంది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఆమెకు తన సొంత భాషలో వివరించాల్సిన అవసరం ఉంది. మీ చిన్న పిల్లలకు మీరు క్రిస్మస్ గురించి ఎలా వివరించవచ్చో తెలుసుకోవడానికి దీనిని చదవండి .

 

పిల్లలకు క్రిస్మస్ గురించి వివరించే మార్గాలు ?

సాధారణంగా క్రిస్మస్ అంటే కేక్ గురించి మరియు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మరియు రహస్య శాంటా గురించి మాత్రమే పిల్లలకు తెలుసు. పండుగ గురించి మీరు వారికి వివరించాలి అనుకుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

 

వారికి కథ చెప్పండి :

పిల్లలకు పురాతన విధానంలో మంచిగా అనగనగా ఒక రోజు అంటూ మొదలు పెట్టే కథలంటే ఎంతో ఇష్టం.

వారికి నచ్చే విధానంలో కథను వివరించండి.

యేసు ఎలా జన్మించాడు మరియు ముగ్గురు జ్ఞానులు నక్షత్రాన్ని, తొట్టిని ఎలా అనుసరించారు అని తెలుసుకోవడానికి వారు ఆసక్తి చూపుతారు. నా బిడ్డ ఆశ్చర్యంగా అడిగింది - " యేసుకి మంచం లేదా ?" అని నమ్మలేక పోయింది ! " జీసస్ మనలను ప్రేమించాడు!" వారు మరింత తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటారు.

 

విశదీకరించండి, ఆధారాలను చూపండి :

చిన్న పిల్లల కోసం కథ చెప్పాలంటే అన్ని రకాల కళలు ఉండాలి. వారి దుస్తులు, చిత్రీకరణ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉండాలి.

మీ ఇంట్లో ఒక తొట్టి, గడ్డి లేదా ప్యాకింగ్ సామాగ్రిని ఉపయోగించి మరియు ఆమె బొమ్మలను జ్ఞానులుగాను , బేబీ జీసస్, మేరీ మరియు జోసెఫ్ గా ఉంచి ఏర్పాట్లు చేసుకోవచ్చు.

 

విలువలను పంచుకోవడం :

విలువలను గురించి దేవుడి గురించి మరియు దేవుని ప్రేమ గురించి వివరించడం 3  సంవత్సరాల వయస్సు గల పిల్లలకు చాలా ముందస్తుగా ఉంటుంది. నిజంగా కాదు ? అది ఒక రకమైన ఆచారం కావచ్చు ! కానీ, క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యము, దేవుడు తన ఏకైక కుమారుని మన మానవాళి కోసం ఎలా ఇచ్చాడో మరియు అతను మనలను ఎలా ప్రేమిస్తున్నాడో వారికి తెలియచెప్పండి.

 

పిల్లలు ప్రేమ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు మరియు సహృదయంతో ఇతరులపై శ్రద్ధ చూపాలని స్థిరంగా అనుకుంటారు. ఇది నిజంగా నా బిడ్డ సంతోషానికి కారణం అయింది.

 

శాంటా, పురాణాల నిజం :

ఇది గమ్మత్తయినది. అయితే కొంతవరకు వాస్తవానికి మరియు కల్పనకు మధ్యలో ఉంటుంది కనుక ఎంతవరకు పిల్లలకు వాస్తవికంగా తెలపగలరో మీరే నిర్ణయించుకోవాలి. నా విషయానికి వస్తే నేను అస్పష్టంగా ఉంచాను. ఉత్తర ధ్రువంలో నివసించే శాంటా మన చిన్నారులకు కల్పన అయితే, మనలో ఉండే శాంటా నిజమైన వాడు. నేనే నా బిడ్డకు శాంటా, ఈ చల్లని వాతావరణంలో ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్న లెక్కలేనంతమంది చిన్నపిల్లలకు ఆమె శాంటా కావచ్చు. తను ఇవ్వడానికి ఇష్టమైన బొమ్మలు, వెచ్చని బట్టలు మరియు కొన్ని ఆట వస్తువులను మా కారులో నింపుకుని ఒక మురికివాడకి వెళ్లి మేము ఆ వస్తువులను పంచాము. ఆమె చిన్నపిల్ల అయినప్పటికీ,  విషయాన్ని అర్థం చేసుకోగలిగింది. మేము తిరిగి వచ్చే సమయంలో, మళ్లీ ఈ విధంగా చెప్పసాగింది " మమ్మా, ఈ బ్లూ కలర్ టెడ్డి ని కూడా నేను ఇచ్చేస్తాను. నేను ఇకపై దానితో ఆడను." పథకం ఫలించింది !

 

సరదాగా సజీవంగా ఉంచండి :

పిల్లలకు కొంత సరదా కూడా అవసరం. పిల్లలకు ఎర్రటి వస్త్రాలు, రోజీ చీక్స్, క్రిస్మస్ ఫాదర్ హో హో హో లతో దానిని సజీవంగా ఉంచండి.

 

మీరు శాంటాను అద్దెకు తెలుసుకునేందుకు అనేక దుకాణాలు ఉన్నాయి.

బహుమతులు మరియు బహుమతుల విలువను ముందే నిర్ణయించుకోండి. ఆ సమయానికి శాంటా మీ ఇంటికి వచ్చి ఆ బహుమతులను మీ పిల్లలకు అందిస్తాడు. హూ హూ అంటూ సంతోష గానం చేసి వెళ్ళిపోతాడు.

 

ఒక సర్వీస్ కు తీసుకు వెళ్ళండి :

క్రిస్మస్ సర్వీస్ లేదా ప్రార్థనకు తీసుకువెళ్లడం మానకండి.

ఒకటితో ఒకరు కలిసి ఎంత మంచిగా జరుపుకుంటారో పిల్లలకు తెలియజేస్తుంది. ఇది మీరు ఇంట్లో చేయగలిగే పని మాత్రం కాదు.

 

ఒక చిన్న పాటలు పుస్తకాన్ని తీసుకు వెళ్ళండి. లేదా జనాదరణ పొందిన పాటలను ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయండి.  ఆమె మీరు పాడిన తర్వాత వాటిని పునరావృతం చేయవచ్చు మరియు సర్వీసులో పాల్గొనవచ్చు.

 

నేను నా చిన్న బిడ్డను సర్వీస్ కి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, " క్రిస్మస్ అంటే ఏమిటి ?" అని మళ్ళీ అడిగాను. "మనలను ప్రేమించమని దేవుడు యేసును మన దగ్గరకు పంపిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే నాకిష్టం నేను బహుమతులు పొందుతాను మరియు బహుమతులు ఇస్తాను." నా ముఖంలో సంతోషం.

 

కాబట్టి ఈ సీజన్ను మీ పిల్లలకి అర్థవంతం చేయండి. మేము కూడా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము !


క్రిస్మస్ గురించి మీరు మీ పిల్లలకు ఏ విధంగా చెప్పారు? మీ అనుభవాన్ని వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి ! మీ నుండి తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన వేడుకలు మరియు పండుగలు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}