• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీకు పీరియడ్స్ సమయం దాటినట్లయితే 8 ప్రారంభ గర్భ సంకేతాలు మరియు లక్షణాలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 13, 2021

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీరు మీ పీరియడ్స్ సమయం దాటకముందే మీ శరీరం తన మధురమైన మార్గంలో మీలో కొత్త జీవితానికి ఆకృతి చేయడం ప్రారంభిస్తుంది. అయినప్పటికీ, చాలా మంది మహిళలు అడిగే ప్రశ్న ఏమిటంటే, నేను గర్భవతి అని ఎలా తెలుసుకోగలను ? మీ శరీరం చూపించే అనేక సంకేతాలు మరియు లక్షణాలు మీరు గర్భవతి అని మరియు త్వరలోనే తల్లి కాబోతున్నారు అని సూచిస్తుంది. మీ పీరియడ్స్ సమయం దాటడం మాత్రమే కాకుండా మీ గర్భం గురించి ఇతర సంకేతాలను తెలుసుకోవాలనుకుంటే , ఈ క్రింది అంశాలను చదవండి.

 

మీ పీరియడ్స్ సమయం దాటిపోయిన తర్వాత మీరు గర్భవతి అని తెలుసుకోవడానికి 8 గర్భదారణ సంకేతాలు :

 

మీరు మీ పీరియడ్స్ సమయం దాటకముందే గర్భవతిగా ఉన్నారా లేదా అని తెలుసుకోగలరా? సమాధానం అవును అయితే ఈ లక్షణాలను ఇక్కడ చదవండి....

 

1. నొప్పి, సున్నితంగా మరియు బరువుగా ఉండే వక్షోజాలు : ప్రారంభంలో వక్షోజాల్లోని రక్తనాళాలు విడదీయబడిన పెరగడం ప్రారంభించినప్పుడు, నిపుల్స్ పై ముదురు రంగు వృత్తాకారం ఏర్పడి వక్షజాలు పెద్దవిగాను మరియు ముదురు రంగు లోనికి మారుతాయి. గర్భం దాల్చిన తర్వాత ఒకటి లేదా రెండు వారాల్లో ఈ మార్పును గమనించవచ్చు. మీ వక్షోజాలు తాకినప్పుడు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఈ సమస్యలను మీరు నెలసరి ముందు ( పీ ఎం ఎస్ ) సమస్యలుగా అపోహ చెందే అవకాశం ఉంది. మీకు భరోసా కావాలి అనుకుంటే , మీరు వెంటనే గర్భ పరీక్షలు చేయించుకోవాలి.

 

2. అలసట : ఇది గర్భం యొక్క సాధారణ సంకేతం. ఎందుకంటే శరీరం పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తుంది . అందువలన ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది .ఇది అలసటకు దారితీస్తుంది . మీరు బలహీనంగా మరియు అలసిపోయినట్లుగా అనిపించవచ్చు అందుకే అలసటతో పోరాడడానికి మీరు నిద్రను అలవాటు చేసుకుంటారు . అలసట రక్తహీనత, హైపోథైరాయిడిజం వంటి ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కూడా కావచ్చు. కాబట్టి మీరు గర్భ పరీక్ష చేయించకుండా మరియు వైద్యుడిని సంప్రదించకుండా ఉన్నట్లయితే మీరు గర్భం గురించి ఖచ్చితంగా చెప్పలేరు.

 

3. వికారం : గర్భం యొక్క అతి ముఖ్యమైన ఈ సంకేతం అన్నిటి కన్నా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్ని సమయాల్లోనూ వికారం అనుభూతిని చెందుతారు. ముఖ్యంగా ఉదయం పూట. ఎప్పుడు తల తిరిగినట్లుగా మరియు బలహీనంగా ఉన్నట్లుగా ఉంటుంది. మీ ఫలితాలను నిర్ధారించుకోవడానికి మీరు గర్భ పరీక్ష చేయించుకోవాలి అనుకోవచ్చు. ఇది సాధారణంగా కనిపించే లక్షణం కాబట్టి , దీని యొక్క తీవ్రత ప్రతి గర్భిణీ స్త్రీలలోనూ మారుతూ ఉండవచ్చు. కొంత సమయం తరువాత ఇది తగ్గుముఖం పడుతుంది.

 

4. ఉబ్బరం : లక్షణాలన్నీ నెలసరి ముందు సమస్యలవలే ఉండి గందరగోళానికి గురి చేసినప్పటికీ, ప్రారంభ దినాలలో పిండం చిన్నదిగా ఉన్నప్పటికీ ఇది గర్భధారణకు సంకేతం. మీ కడుపులో ఉబ్బరంగా అనిపించవచ్చు మరియు ఊపిరాడనట్లుగా ఉంటుంది. కడుపులో ఉబ్బరంగా ఉండడం వలన చాలా అసౌకర్యంగా ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కారణంగా త్రేన్పులు మరియు అపాన వాయువులు ఉంటాయి. ఈ పరిస్థితుల నుండి ఉపశమనం పొందడానికి మీరు రోజంతా కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వేపుడు పదార్థాలను మరియు చీజ్ తో తయారుచేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు.

 

5. ఎక్కువసార్లు వాష్ రూమ్ కి వెళ్ళవలసి రావడం : మీరు మీ పీరియడ్స్  తేదీని దాటకముందే గర్భం యొక్క ప్రారంభ సంకేతాల సమయంలో , ముఖ్యంగా రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళవలసి రావచ్చు. గర్భధారణ సమయంలో అనేక హార్మోనల్ మార్పులు సంభవిస్తాయి. ఇది తరచుగా మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. మూత్రపిండాలలో ఎక్కువ రక్తాన్ని నింపడానికి మూత్రపిండాలు పని చేస్తాయి. ఇది మూత్ర విసర్జనకు కారణం అవుతుంది.

 

6. కొన్ని రకాల ఆహారాలపై విరక్తి కలుగుతుంది : మీకు ఇష్టమైన వంటను వండుతూ ఉండడం చూసినప్పుడు మీ ఆకలిని మీరు నియంత్రించగలరా ? మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రారంభ దినాలలో మీకు ఇష్టమైన ఆహారాన్ని చూడడం లేదా వాసన పీల్చడం కూడా మీకు నచ్చకపోవచ్చు. గర్భిణీ స్త్రీలలో 85 శాతం మంది తమ మొదటి త్రైమాసికంలో ఆహారంపై విరక్తి గురించి ఫిర్యాదు చేస్తారు. కానీ ఆ తర్వాత వారు సాధారణ స్థితికి వస్తారు.

 

7. మలబద్ధకం : మీరు మీ పీరియడ్స్ ను మిస్ అయిన తర్వాత మలబద్ధకం అనిపిస్తే అది మీ గర్భం యొక్క సంకేతం కావచ్చు. ఆ తరువాత మీరు పరీక్ష చేయించుకోవడం ద్వారా లేదా వైద్యుడిని సంప్రదించడం ద్వారా దాన్ని ధృవీకరించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం నెమ్మదిగా వెళుతున్నప్పుడు మీ ప్రేగు కదలికలను కష్టతరం చేసే ఎలివేటెడ్ ప్రోజెస్టరోన్ స్థాయిలు తీసుకువచ్చే హార్మోన్ల మార్పులకు ఇది కారణం కావచ్చు.

 

8. అధిక దాహం : గర్భం యొక్క ప్రారంభ సంకేతాలులలో ఎక్కువగా దాహంగా ఉంటుంది. అందుకే మీరు ఎక్కువ నీటిని తీసుకోవడం ద్వారా ఆ దాహాన్ని తీర్చాలి. అందుకే మీరు తరచుగా వాష్ రూమ్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ వలన మీ శరీరంలో రక్త ఉత్పత్తి పరిమాణం పెరుగుతుంది.

 

స్పష్టమైన సంకేతం అయిన పీరియడ్స్ సమయం దాటిపోవడం కాకుండా, శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, నోటికి రుచి తెలియకపోవడం, తలనొప్పి, మైకము, మరియు వెన్నునొప్పి వంటి లక్షణాలు మరెన్నో ఉంటాయి.

 

ఆ తరువాత మీరు ఏమి చేయాలి ?

పీరియడ్స్ సమయం దాటిపోవడం కాకుండా గర్భం యొక్క ఇతర లక్షణాలను మీరు గమనించినట్లయితే, అది గర్భం అని మీరు నిర్ధారించుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఈ సంకేతాలు ఇతర ఆరోగ్య సమస్యలు లేదా పీరియడ్స్ కు ముందుగా వచ్చే సమస్యలు కూడా కావచ్చు. అందువలన మీరు మీ పీరియడ్స్ సమయం దాటిపోయిన తరువాత ఒకటి నుండి రెండు వారాలపాటు వేచి ఉండి ఆపై ఇంటిలోనే గర్భ పరీక్ష చేసుకోండి లేదా మీ సందేహాన్ని తొలగించుకోవడానికి వెంటనే వైద్యుని సంప్రదించండి.

 

మనస్సులో ఉంచుకొవాల్సిన విషయాలు :

మీరు గర్భం కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లయితే, పరీక్ష చేసుకుని తుది నిర్ణయానికి వచ్చే వరకు పైన సూచించిన వాటిలో కొన్నిటిని పరిశీలించవచ్చు.

 

1. తగినంత ఆహారం తీసుకోండి, పుష్కలంగా నీరు త్రాగండి మరియు మంచిగా నిద్రపోండి.

 

2. మీ వైద్యుడు సూచించిన విధంగా ఫోలిక్ యాసిడ్ , ఐరన్, విటమిన్లు మరియు ఖనిజాలను సరైన మోతాదులో తీసుకోండి.

 

3. ధూమపానం మరియు మద్యపానం మానేయండి. అనారోగ్యకరమైన ఆహారాలు, డాక్టర్లతో సూచించబడని మందులు మరియు అక్రమ పదార్థాలను నివారించండి.


మీరు గర్భవతి అని తెలుసుకోగల సంకేతాల పై ఉన్న ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. గర్భం యొక్క ఇతర సంకేతాలు మీకు తెలిసినట్లయితే వాటిని కూడా మాతో పంచుకోండి. మీ నుండి తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}