మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ వైద్య హక్కులు ఏమిటి

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Dec 21, 2020

గర్భిణీ స్త్రీలకు భారత ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని పథకాలు మరియు నియమాలను ప్రకటించింది అని మీకు తెలుసా ? మీ రెగ్యులర్ మెడికల్ చెకప్ లు మాత్రమే కాకుండా, మీ వైద్య హక్కుల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత డెలివరీలు, ఉచిత ఔషధాలు మరియు ఇతర విషయాల గురించి. గర్భిణీ స్త్రీలను రక్షించే చాలా నియమాలు మరియు పథకాలు ఉన్నప్పుడు గర్భధారణ సమస్యలు ఎందుకు వస్తాయి? దీనికి సమాధానం, అవగాహన లేకపోవడం.
కాబట్టి, ప్రాథమిక విషయాల నుండి తెలుసుకోవడం ప్రారంభిద్దాం..
దిగ్భ్రాంతికి గురి చేసే లెక్కలు :
గర్భధారణ సమస్యల ఫలితంగా ప్రతీ సంవత్సరం సుమారు 56 వేల మంది మహిళలు చనిపోతున్నట్లు అంచనా. అదే విధంగా 13 లక్షలకు పైగా శిశువులు పుట్టిన ఒక సంవత్సరం లోపే చనిపోతున్నట్లుగా కనుగొనబడింది. ఆశ్చర్యకరంగా, ఈ శిశుమరణాలలో 2/3 వంతు పుట్టిన మొదటి నాలుగు వారాల్లోనే జరుగుతుంది. 2/3 వ వంతు అంటే దాదాపుగా 7 లక్షల మంది నవజాత శిశువుల మరణాలలో 75 శాతం మంది పుట్టిన వారం లోపల జరుగుతున్నాయి. మరియు వీటిలో ఎక్కువ భాగం పుట్టిన మొదటి రెండు రోజుల్లోనే జరుగుతుంది. ఇది ఏ విదేశీ గణాంకం కాదు. ఇవన్నీ మన సొంత భారతదేశంలోనే నిర్వహించిన వివిధ అధ్యయనాలలో కనిపిస్తున్నాయి.
ప్రసూతి మరియు శిశు మరణాల రేటు పెరుగుదల :
ఈ తల్లి మరియు శిశుమరణాలలో ఎక్కువ భాగం మన దేశంలోని గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాలలో జరుగుతుండగా, దేశంలోని పట్టణ ప్రాంతాలలో కూడా ఈ మరణాలు జరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల గాని.
గర్భిణీ స్త్రీల హక్కులను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వము మరియు పథకాలు
భారత ప్రభుత్వము విజయవంతమైన ప్రసవాల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. తద్వారా తల్లి మరియు శిశువుల మరణాల రేటును తగ్గిస్తుంది.
మన ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, ప్రసూతి మరణాలు తగ్గించడానికి భారత ప్రభుత్వము మరియు ఆరోగ్య సంస్థ అనేక సందర్భాలలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి.
ఇది పూర్తిగా అపోహ. గర్భిణీ స్త్రీల భద్రత మరియు శ్రేయస్సుకోసం భారతదేశానికి చాలా చక్కని చట్టాలు, నియమాలు మరియు పథకాలు ఉన్నాయి.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం :
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చాలా ముఖ్యమైన ఎజెండాను తెచ్చింది. దీని ద్వారా గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ఆపరేషన్లు మరియు నవజాత శిశువుల అనారోగ్యంతో సహా (పుట్టిన 30 రోజుల వరకు పూర్తిగా ఉచిత మరియు నగదు రహిత సేవలను అందించడానికి అన్ని రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఇది అందుబాటులో ఉంటుంది.
అవగాహనా రాహిత్యం వలన వెనక పడుతున్న జనని-శిశు సురక్ష కార్యక్రమం.
అసలు సమస్య ఏమిటంటే , అవగాహన లేకపోవడం. జననీ శిశు సురక్ష కార్యక్రమం గురించి ఎంత మంది మహిళలకు తెలుసు ? 12 మిలియన్ల మంది గర్భిణీ స్త్రీలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో 2011లో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు అనేక ముఖ్యమైన హక్కులను కలిగిస్తుంది. మనదేశంలో ప్రతి గర్భిణీ స్త్రీ వారి వైద్య హక్కుల గురించి తెలుసుకోవాలి. ఈ అధికారాలను తెలుసుకోండి మరియు ఉపయోగించుకోండి. ఈ సమాచారాన్ని మీ సంఘంలోని ఇతర మహిళలకు కూడా తెలియపరచండి.
జనని-శిశు సురక్ష కార్యక్రమం ఏమి చేస్తుంది ?
2011 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన జనని-శిశు సురక్ష కార్యక్రమం పథకం కింద ప్రజారోగ్య సంస్థలో ప్రసవించడానికి ఎంచుకున్న గర్భిణీ స్త్రీలకు ఈ క్రింది సౌలభ్యాలను అందిస్తుంది.
ఉచిత మరియు నగదు రహిత డెలివరీ
ఉచిత సిజేరియన్ డెలివరీ
ఉచిత మందులు మరియు వినియోగ వస్తువులు
ఉచిత విశ్లేషణలు
ఆరోగ్య సంస్థలలో బస చేసేటప్పుడు ఉచిత ఆహారం
ఉచిత రక్త సదుపాయం
వినియోగదారుల ఛార్జీల నుండి మినహాయింపు
ఇంటి నుండి ఆరోగ్య సంస్థలకు ఉచిత రవాణా సదుపాయం
48 గంటలు గడిచిన తరువాత సంస్థల నుండి ఇంటికి ఉచిత డ్రాప్
అనారోగ్యంతో పుట్టిన నవజాత శిశువులకు 30 రోజుల వరకు ఉచిత అర్హతలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. అనారోగ్య శిశువుల కొరకు ఇది ఇప్పుడు విస్తరించబడింది.
ఉచిత చికిత్స
ఉచిత మందులు మరియు వినియోగ వస్తువులు
ఉచిత విశ్లేషణలు
ఉచిత రక్త సదుపాయం
వినియోగదారుల చార్జీల నుండి మినహాయింపు
ఇంటి నుండి ఆరోగ్య సంస్థలకు ఉచిత రవాణా
సంస్థల నుండి ఇంటికి ఉచిత డ్రాప్
గర్భిణీ స్త్రీలకు సహాయపడే ఇతర పథకాలు :
నగదు సదుపాయం:
గర్భిణి స్త్రీలు ( బి పి ఎల్ కుటుంబాలు మరియు ఎస్ సీ/ ఎస్ టి లకు) జననీ సురక్ష యోజన పథకం కింద ప్రభుత్వ ఆరోగ్య సదుపాయంలో ప్రసవించడానికి ఎంచుకున్న వారికి నగదు సహాయం అందించబడుతుంది.
ఉచిత టీకాలు:
గర్భిణీ స్త్రీలకు టేటానస్కు వ్యతిరేకంగానూ, నవజాత శిశువులకు క్షయ, పోలియో, టేటానస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ మరియు మీసెల్స్ కు వ్యతిరేకంగా ఉచిత టీకాలు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా అందించబడతాయి. డీ టీ పీ వ్యాక్సిన్ పెంటవాక్ (5 ఇన్ 1) వ్యాక్సిన్‌తో భర్తీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రసూతి సెలవులు:
80 రోజుల పాటు ఒక సంస్థలో పనిచేసి ఉన్నట్లయితే, సెలవు సమయంలో పూర్తి వేతనం మంజూరు చేయాలి. కొత్త చట్టం ప్రకారం, మొదటి ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలలో 2 వారాల నుండి 26 వారాల వరకు పెంచారు. మూడవ బిడ్డకు, వేతనం చెల్లించి 12 వారాల సెలవు వ్యవధిని నిర్ణయించారు.
గర్భం కారణంగా తొలగించలేరు :
ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం గర్భం కారణంగా మహిళలను ఉద్యోగం నుండి తొలగించలేరు. యజమానులు గర్భం కారణంగా డిప్రమోట్ చేయడం లేదా ఆమె జీతం తగ్గించడం నిషేధించబడింది.
గర్భధారణ లేదా ప్రసవం సమయంలో సంక్లిష్టతకోసం అదనపు వేతన సెలవులు :
గర్భస్రావము లేదా మరేదైనా గర్భ సమస్యలు తలెత్తినప్పుడు వారికి 6 వారాల పాటు పూర్తి వేతనంతో సెలవు లభిస్తుంది. గర్భధారణ సమస్యలు, ప్రసవ సమస్యలు, ముందస్తు జనన సమస్యలు, గర్భస్రావ సమస్యలు మరేదైనా ఇతర సమస్యలు ఉన్నప్పుడు మరొక నెలరోజుల పాటు వేతన సెలవు లభిస్తుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించు కున్నట్లయితే అదనంగా మరో రెండు వారాల పాటు వేతన సెలవు లభిస్తుంది.
మెడికల్ బోనస్ :
12 వారాల జీతంతో పాటుగా, మెడికల్ బోనస్ కూడా లభిస్తుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రాథమిక మొత్తాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. 2008 ఆగస్టులో బోనస్ మొత్తం 2,500 రూపాయలు అయితే, 2011లో 3500 రూపాయలకు పెంచబడింది.
నిరాకరణ : ఈ వ్యాసం సాధారణ ప్రజల సమాచారం కోసం వ్రాయబడింది. అంతే కానీ ఇది వృత్తిపరమైన న్యాయ లేదా వైద్య అభిప్రాయాలకు ప్రత్యామ్నాయం కాదు.
గర్భిణీ స్త్రీలకు మరేమైనా ఇతర వైద్య హక్కులు గురించి మీకు తెలిసినట్లయితే మీ నుండి తెలుసుకోవడానికి మేము ఇష్టపడతాము. దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు