• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

తెలంగాణాలో మంకీపాక్స్ కలకలం? పరీక్షల కోసం హైదరాబాద్ తరలింపు

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 25, 2022

కరోనావైరస్ కాస్త నెమ్మదించింది అనుకునే లోగా ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ తలెత్తింది. తాజా సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రమైన కేరళలో మూడు కేసులు నమోదు కాదా, దేశ రాజధాని దిల్లీలో మరి కేసు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణాలో ఒక వ్యక్తికి మంకీ వైరస్ సోకిందనే సమాచారం ఇపుడు తెలుగు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

 కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తీ కువైట్ నుంచి ఈ నెల ఆరవ తేదీన తన స్వగ్రామం చేరుకున్నాడు. కాగా, అతనికి అనుమానిత మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాట్టు తెలియవచ్చింది. అతనికి ఈ నెల 20న  జ్వరం రావడంతో పాటు మూడు రోజున అనంతరం ఒళ్ళంతా దద్దురులు పొడసూపాయి. దీనితో బాధితుడు మొదట ఒక ప్రైవేటు అస్పత్రికి, అనంతరం వైద్యుల సూచనతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి వెళ్ళాడు. వైద్య పరీక్షల అనంతరం ఆ వ్యక్తిని ఆదివారం రాత్రి సమయంలో హైదరాబాద్ లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి మరింత మెరుగైన చికిత్స కోసం తరలించినట్టు తెలిసింది. అక్కడి వైద్యులు అనుమానిత కేసుగా నమోదు చేసుకుని అతనిని   మంకీపాక్స్మాక్ ప్రత్యెక ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

మంకీపాక్స్ గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

ఈ నేపధ్యంలో, మంకీపాక్స్ ప్రాణానికి ప్రమాదం కలిగించే వ్యాధి కాదని, ఆందోళన చెందనవసరం లేదని రాష్ట వైద్య నిపుణులు వివరించారు. కేంద్రం సూచనల మేరకు యంత్రాగం సిద్ధంగా ఉందని, చికిత్సకు ఏర్పాట్లు, మందులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 

ఎవరు  అప్రమత్తం కావాలి అంటే..

  • ఇటీవల విదేశాల  నుంచి వచ్చినవారు

  • ఒంటిపై దద్దుర్లు, బొబ్బలు ఉన్నవారు 

మంకీపాక్స్ వస్తే ఎం చేయాలి?

ఎవరైనా పై లక్షణాలు కలిగి ఉంటే.. వైద్యులను సంప్రదించాలి. నిర్ధారణ అయితే కనుక 21 రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. ఐతే అనవసరంగా భయపడవద్దు. ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతాయి.  ఐతే, చర్మపై వచ్చిన దద్దుర్లు, బుడిపెలు పూర్తిగా పైపొర ఊడిపోయి, కొత్త చర్మం వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. 

మంకీపాక్స్ గురించి మరిన్ని వివరాలు, కచ్చితమైన సమాచారం కోసం parentune.com ని ఫాలో అవండి. మరిన్ని వివరాలను కామెంట్ సెక్షన్లో చర్చించండి.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}