• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్

మంకీపాక్స్ మరియు స్మాల్ పాక్స్: ఒకటేనా వేరువేరా.. ఏది ఏదో తెలుసుకోవడం ఎలా?

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 26, 2022

రజితకి రెండు రోజులుగా కంగారుగా ఉంది. వాళ్ళ కుటుంబం ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి వచ్చారు. వచ్చిన మూడు రోజులకు వాళ్ళ పాప తేజకి  జ్వరం వచ్చింది. ఆ తర్వాత శరీరంపై ఎర్రని దద్దుర్లు  రావడం కనిపించింది. మామూలుగా అయితే ఇది సీజన్ కాబట్టి చికెన్ పాక్స్ (ఆటలమ్మ) లేదా స్మాల్ పాక్స్ (చిన్న అమ్మవారు) కావచ్చు అనుకునేది. కానీ ఇపుడు కొత్త అంటువ్యాధి మంకీ పాక్స్ గురించి విన్నప్పటి  నుంచి ఆమెకు తన బిడ్డను గురించి ఆందోళన అధికమయింది. 

రెండు వ్యాధులకు ఇంచుమించు ఒకే లక్షణాలు ఉండటంతో, తన చిన్నారికి ఎం వచ్చిందో తెలియక సతమతమయింది.  మరి మంకీ పాక్స్ ఇంకా చికెన్ పాక్స్.. ఈ రెండిటి గురించి వివరంగా తెలుసుకోవడం వల్ల  మాత్రమే తన సమస్యకి పరిష్కారం అని ఆమెకు అర్ధం అయింది. మరి ఇలాంటి పరిస్థితి, అనుమానం మీకూ ఉన్నాయా .. అందుకే ఆ వివరాలను ఆ బ్లాగులో చదువుదాం రండి… 

మొట్ట మొదటి మంకీపాక్స్ కేసు ఆఫ్రికాలో బయటపడింది. అప్పటినుండి అమెరికా, కెనడా ఇంకా ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక కేసులు గుర్తించబడ్డాయి. దీని వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది.  ఇప్పుడు భారత్ లో కూడా కాలు పెట్టింది. దేశంలో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గుర్తించని కేసులు కూడా ఉంటాయి అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. 

 ప్రపంచం ఇంకా కరోనావైరస్ (COVID-19) పోరాడుటూ ఉండగానే, అరుదైన మంకీపాక్స్ వైరస్ పెరుగుదల గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు తలెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 15 దేశాలలో మంకీ పాక్స్ కేసులను నిర్ధారించింది, ఈ ఇన్ఫెక్షన్ మరిన్ని దేశాలలో వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరోగ్య అధికారులు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటె, మంకీ పాక్స్ లక్షణాలు  మశూచి అని మనకు ఇప్పటికే తెలిసిన మరో వ్యాధి లక్షణాలు ఒకేవిధంగా ఉంటున్నాయి. ఇది మంకీపాక్స్‌ ఒకటేనా.. వేరువేరా తెలుసుకుందాం. 

మంకీపాక్స్ మరియు స్మాల్ పాక్స్- పోలికలు

  • మంకీపాక్స్ అనేది మశూచి వర్గానికే సంబంధించిన ఒక వైరల్ వ్యాధి.  ఇది ఒకరకమైన  దద్దుర్లు, జ్వరం, కండరాల నొప్పి మరియు తలనొప్పికి కారణమవుతుంది. 

  • ఇది జూనోటిక్ వ్యాధి, అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ఆర్థోపాక్స్ అనే వైరస్ వల్ల వస్తుంది, ఇది మశూచిని పోలి ఉంటుంది కానీ, తీవ్రత తక్కువగా ఉంటుంది. 

  • స్మాల్ పాక్స్ లాగే మంకీ పాక్స్ సోకినపుడు కూడా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు,ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. 

  • ఒక్కసారి వస్తే కనీసం మూడు వారాల పాటూ ఉంటుంది. అందుకే దీన్ని మశూచిగా పొరబడే ప్రమాదం ఉంది. 

 యూరప్ మరియు ఇతర దేశాలలో కేసుల ఆకస్మిక పెరుగుదల కారణంగా, స్పర్శ (స్కిన్ టు స్కిన్) మాత్రమే కాకుండా పరిశోధకులు దీని వ్యాప్తికి ఇతర కారణాల కోసం అన్వేషిస్తున్నారు. 

మంకీపాక్స్ మరియు స్మాల్ పాక్స్- తేడాలు

మంకీపాక్స్ యొక్క లక్షణాలు మశూచికి చాలా పోలి ఉంటాయి, తేడా తెలుసుకోవడం కాస్త  కష్ట౦గా ఉంటుంది. కొన్ని భేదాలు..

  • మంకీ పాక్స్ వాళ్ళ కలిగే బొబ్బలు సాధారణంగా మశూచి పొక్కుల కంటే పెద్దవిగా ఉంటాయి. గాయాలు సాధారణంగా ఒక వారం నుండి మూడు వారాల వరకు ఉంటాయి.  చర్మపు గాయాలు పూర్తిగా ఎండిపోయి, నయం అయ్యే వరకు బాధితులను ఐసోలేషన్ లో  ఉంచడం అవసరం. 

  • మంకీపాక్స్ మరియు మశూచి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మంకీపాక్స్ సోకినపుడు మెడకు రెండు వైపులా ఉండే లింఫ్ నోడ్స్ లో వాపు కనిపిస్తుంది. 

  • మంకీ పాక్స్ సోకినా జంతువు నుంచి వచ్చే ద్రవాలు, రక్తం, గాయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటే అది మనుషులకు వ్యాపిస్తుంది. కానీ మశూచి అలా జంతువుల ద్వారా సోకదు. 

మంకీపాక్స్ మరియు స్మాల్ పాక్స్- ఎలా వ్యాప్తిస్తాయి?

మశూచి చాలా తీవ్రమైన అంటువ్యాధి, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి చాల త్వరగా వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఇక, మంకీపాక్స్ జంతువు నుండి మనిషికి వస్తుంది. అంటే ఈ వైరస్ సోకిన కోతులు, ఎలుకలు, ఉడతలు నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇది మనిషి నుండి మనిషికి కూడా  వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి మీకుసమీపంగా వచ్చినప్పుడు ఇది మీకు సోకుతుంది. దీని వైరస్ గాలిలో బిందువుల ద్వారా వ్యాపిస్తుంది.

మా బ్లాగ్ లో సమాచారం మీకు నచ్చిందా..  దయచేసి మీ అభిప్రాయాలను, సూచనలు కామెంట్ సెక్షన్లో పంచుకోండి.. మీ తోటి తల్లితండ్రులకు షేర్ చేయండి!

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}