• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

వర్షాకాలంలో పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 20, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

వర్షాకాలం వచ్చేసింది.. దానితోపాటు  వేడివేడి టీ తో మంచిగా కరకరలాడే పకోడీలను తినాలని కోరిక కూడా వస్తుంది. మీరు మరియు మీ బిడ్డ  కారం గా ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. మరికొన్నిసార్లు ఆయిల్ లో బాగా ఫ్రై చేసిన వాటిని తినాలని చూస్తారు .కానీ ,ఇవి ఉబ్బరం మరియు దప్పికను కలిగించే ఆహారాలు . కాబట్టి , మీరు ఏమి తినాలి మరియు ఏమి తినకూడదు మరియు మీ బిడ్డకు ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి ?

 

మన తోటి తల్లి భావనా తన బ్లాగ్ లో ఇక్కడ రుతుపవనాల సమయంలో ఏమి తినాలి మరియు ఏమి నివారించాలి అనే దాని గురించి మీ సందేహాలు అన్నిటికీ సమాధానం ఇచ్చారు.

 

ఋతుపవనాలు సమయంలో పిల్లలకు ఇవ్వకూడని ఆహారం.

 

రుతుపవనాల సమయంలో తీసుకోవలసిన ఉత్తమమైన ఆహారం మరియు నివారించవలసిన ఆహారం యొక్క జాబితా ఇక్కడ ఉంది....

 

ఉబ్బరం మరియు దప్పికను కలిగించే ఉప్పు మరియు కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని నివారించడం మంచిది.

 

వర్షాకాలంలో చేపలు లేదా మాంసాన్ని ఎక్కువగా తినకూడదు. ఆకుపచ్చ కూరగాయలు తృణధాన్యాలు మరియు పండ్ల ను మీ ఫ్రిజ్ లో నిలువ చేయండి. మీ శరీరం యొక్క జీర్ణ సామర్థ్యాన్ని తగ్గించే  వేయించిన లేదా ఎక్కువగా ఉడికించిన ఆహారాన్ని మానుకోండి.

 

పొడిగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.మొక్కజొన్న వంటి తృణధాన్యాలు మీకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి . వర్షాకాలంలో కరివేపాకు వంటి నీటి తో కూడిన ఆహారాన్ని నివారించడం మంచిది .ఎందుకంటే అవి ఉబ్బరం కలిగిస్తాయి.

 

వర్షాకాలంలో ఆవా నూనె , నువ్వుల నూనె వంటి భారీ నూనెలు మానుకోవాలి. ఇది శరీరంలో వాయువుని పెంచడంతోపాటు శరీరం అంటు వ్యాధి బారిన పడేలా చేస్తుంది. వర్షాకాలంలో వంట చేయడానికి మొక్కజొన్న వంటి పొడి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెలను వాడటం మంచిది.

 

వర్షాకాలంలో సలాడ్లను నివారించండి. మరియు పండ్లను తగ్గించండి . వీటికి బదులుగా ఉడికించిన సలాడ్లను తీసుకోండి.

 

పండ్లను మరియు చింతపండుతో తయారుచేసిన పుల్లటి ఆహారాన్ని చట్నీలను , కూరగాయలను నివారించండి. ఎందుకంటే ఇవి దాహాన్ని కలిగిస్తాయి.

 

బయట తినేటప్పుడు రైత మరియు పన్నీరు వంటి పాల ఆధారిత పదార్థాలను నివారించడం మంచిది.

 

రోడ్డు మీద అమ్మే పన్నీరు, రైత మొదలైన పాల ఆహారాలను బయట తినడం మానుకోండి.

 

కాకరకాయ వంటి చేదు కూరగాయలను మరియు వేప , తులసి , మెంతి , పసుపు వంటి చేదు దినుసులను ఎక్కువగా తీసుకోండి.

 

ఏది ఏమైనా  మీరు మిగిలిన మీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే టీ మరియు వేడి వేడి పకోడీలతో విందు చేసుకోవడానికి సంకోచించవలసిన అవసరం లేదు.

 

మీరు ఏమి తినాలి మరియు ఏమి తినకూడదు,  లేదా మీ బిడ్డకు ఏ ఆహారాన్ని ఇవ్వకూడదు ? ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? ఈ వర్షాకాలంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు ?ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి !

 

 

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}