• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

వేవిళ్ళను ఎలా ఎదుర్కోవాలి... దీనికి తగిన మందులు ?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 16, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భవతి యొక్క ఆనందాన్ని దూరం చేయడానికి వేవిళ్ళు కంటే మరొకటి ఉండదు. మనలో చాలామందికి ఇది మొదటి మూడు నెలలలో మాత్రమే ఉన్నప్పటికీ, ఎవరో కొంతమంది అదృష్ట వంతులైన తల్లులకు మాత్రం అస్సలు ఉండవు, కొంతమంది నాలాంటి దూరదృష్టవంతులు మాత్రం చివరి వరకు వేవిళ్లతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ వికారమైన అనుభూతితో మేలుకోవడం, నేను గర్భవతి గా ఉండక పోయినా బాగుండేది అని కోరుకునేలా చేసింది. కానీ తర్వాత, కొన్ని నివారణలు మరియు మందులు కూడా వీటికి సహాయ పడుతున్నాయి.

వేవిళ్ళను ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలు:

వేవిళ్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి..

ప్రతి గర్భం  భిన్నమైనది.  కొంత మందిలో వేవిళ్ళు ఎక్కువగా ఉంటాయి. మరికొంతమందిలో ఇవి తక్కువగా ఉంటాయి. వాంతులు, వికారం మరియు ఆహారం అంటేనే విరక్తి కలగడం. ( వేవిళ్ళు అంటేనే ఆహారానికి ప్రతికూలంగా ఉంటుంది) ఈ వేవీళ్ళకు కారణం ఏమిటో వైద్యులకు ఇంకా తెలియదు. కానీ అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం ఏమిటంటే, వేవిల్లు అనేది గర్భధారణ హార్మోన్,  హ్యూమన్ కొరియనిక్ గోనాడోట్రోఫీన (హెచ్ సి జి) కు శరీర ప్రతిచర్య. ఇది గర్భధారణ అన్ని సమయాలలో కంటే మొదటి త్రైమాసికంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

ఇవి సాధారణంగా హార్మోన్ల ప్రభావం వలన కలుగుతాయి. సాధారణంగా చేపలు, వెల్లుల్లి లేదా గుడ్లు వంటి బలమైన వాసనగల ఆహారాలు కారణమవుతాయి. నా విషయంలో మాత్రం నా భర్త కారులో ఉపయోగించిన కారు పరిమళం. ఒక్కసారి ఆ వాసన ప్రతి చర్యను ప్రేరేపించిన తర్వాత మీరు తిన్న ప్రతిదీ బయటకు త్రోసివేసి బడుతుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు వేవిళ్లకు  లిఖితపూర్వక కారణం ఖాళీ కడుపు.

అలాగే దీనిని ఉదయపు అనారోగ్యం అన్నది ఒట్టి మాట. ఈ వికారం పగటి పూట ఎప్పుడైనా సరే మహిళలను దెబ్బతీస్తుంది. కానీ సాధారణంగా ఒకే సమయంలో మరియు ఒకే పరిస్థితులలో ఇది సంభవిస్తుంది మరియు ఒకే నమూనాను కలిగి ఉంటుంది.

మరింత సమాచారం కోసం..

అయినప్పటికీ మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. వేవిళ్ళు పిండం యొక్క ఆరోగ్యము మరియు భద్రతపై ప్రభావితం చేయజాలవు. పిండం అమ్నియోటిక్ శాక్ లో బాగా రక్షించబడి ఉంటుంది. వాంతులు చేసే సమయంలో వచ్చే కుదుపులు శిశువుకు హాని కలిగించవు. కానీ నిరంతరం వికారము, గర్భిణీ స్త్రీకి జరిగే వాంతుల వల్ల ఆమె ఆహారం తీసుకోవడంలో రాజీ పడడంవలన తల్లికి మరియు బిడ్డకు ఇద్దరికీ కూడా పోషక లోపాలకు దారితీస్తుంది.

వేవిళ్లను ఎదుర్కోవడానికి మార్గాలు :

ఇక్కడ వేవిళ్లను ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి... చదవండి..

మీ ట్రిగ్గర్ లను తెలుసుకోండి :

మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వాటిని గుర్తించండి . మరియు వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఘాటయిన వాసన గల ఆహారం, వంట చేసేటప్పుడు వెలువడే వాసన, మూసివున్న కార్లలో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసన మొదలైనవి..

నమూనాను గుర్తించండి :

మీరు ఏ సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారో ఒక ప్రణాళికతో పట్టీ తయారు చేసుకోండి. అది ఉదయమా, లేక సాయంత్రమా? మీరు ఆహారం తీసుకున్న తర్వాత ఎంత సేపటికీ వాంతులు మొదలు అవుతున్నాయో అన్నది ఈ పట్టిక ద్వారా మీరు గుర్తించగలరు. తదుపరి సమయంలో కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.

తినుబండారాలను అందుబాటులో ఉంచుకోండి :

ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఖాళీ కడుపు వికారంను పెంచుతుంది. అందువలన ఆరోగ్యకరమైన స్నాక్స్ ను సిద్ధంగా ఉంచుకోండి. ఆపిల్ , బేరిపండ్లు, క్రాకర్స్, బిస్కెట్స్, నేరేడు పండ్లు, ఎండిన రేగుపండ్లు మరియు ఎండుద్రాక్షలు (వీటిని షాపింగ్ బ్యాగ్ లో కూడా తీసుకువెళ్ళవచ్చు) మొదలైన పండ్లు వికారం నుండి బయటపడడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అవసరమైన కార్బోహైడ్రేట్లను శరీరానికి అందిస్తాయి. మీరు ఉదయం పూట వేవిళ్ళ కి గురవుతున్నట్లు అయితే, మీ బెడ్ దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంచుకుని ప్రతిసారి ఒక్క బిస్కెట్ తింటూ ఉండండి. రాత్రిపూట లేచిన ప్రతిసారి కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉండండి.

మీ శరీరం చెప్పే మాట వినండి :

ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా స్పందిస్తుంది. కొంతమందికి అల్లం ముక్క వలన ఉపయోగం ఉంటుంది, మరికొందరికి నిమ్మకాయ రసం ఉపయోగకరంగా ఉండవచ్చు. మీకు నచ్చిన ఆహారాలపై ప్రయోగాలు చేయండి. ఇది మీకు వేవిళ్ళ నుండి బయట పడడానికి సహాయపడుతుంది.

ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి :

ఖాళీ కడుపుతో ఉన్న అసౌకర్యాన్ని ఎదుర్కోవడానికి మీ అల్పాహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకుని ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండండి.

మసాలా మరియు గ్యాస్ ఉన్న ఆహారాలను మానుకోండి :

అజీర్ణం కలిగించే ఆహారం వేవిళ్లను తీవ్రతరం చేస్తుంది. అందువలన ఎక్కువగా నూనెతో తయారు చేసిన ఆహారాలను, మసాలాతో చేసిన ఆహారాలను మరియు క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వంటి గ్యాస్ ను కలిగి ఉండే ఆహార పదార్థాలను మితంగా తీసుకోండి.

మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి :

డిహైడ్రేషన్ అనేది వేవిళ్లుగల వారిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి  వీరు రోజంతా పుష్కలంగా నీటిని తీసుకోవాలి. వీటితోపాటుగా లేత కొబ్బరి నీరు , నిమ్మకాయ నీరు, తాజా రసాలు మరియు హెర్బల్ టీ మొదలైనవి చాలా మంచిది. ఒక్కసారిగా గుటగుట త్రాగకుండా మెల్ల మెల్లగా సిప్ చేసుకుంటూ తాగండి.

మరింత సమాచారం కోసం..

వేవిళ్ళకు మందులు :

ఇవి సాధారణమైన మందులు అయినప్పటికీ వీటికీ గైనకాలజిస్ట్ సలహా అవసరం.

వీటికి సురక్షితమైన మందులు ఉన్నాయి :

వేవిళ్లతో బాధపడుతూ పోషకాహార లోకం ఉన్న మహిళలు డాక్టర్ల సహాయం తీసుకోవడం అవసరం. దీని కోసం చాలా సురక్షితమైన మందులు ఉన్నాయి. ఈ సమయంలో వీటిని తీసుకున్నట్లయితే లక్షణాల తీవ్రతను తగ్గిస్తాయి. ఈ మాత్రలను మీలో లక్షణాలు రాకమునుపే తీసుకోవాలి. లేదంటే ఇవి కూడా వాంతులు రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వికారపు లక్షణాలు ఉదయాన్నే వస్తున్నట్లయితే ముందురోజు రాత్రే ఈ మాత్రలను తీసుకోండి.

కొన్ని మందులు వికారాన్ని కలిగిస్తాయి :

కొంతమంది మహిళలలో ఐరన్ మాత్రలు వంటివి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఐరన్ మాత్రలను సూచించినప్పుడు డాక్టర్ ఇచ్చిన మోతాదులో వాటిని తీసుకోవాలి. అదేవిధంగా పోషకాహార విషయంలో కూడా డాక్టర్ సలహా తీసుకోండి.

విటమిన్ బి 6 సహాయపడుతుంది :

విటమిన్ బి 6 కడుపు ఉపశమనానికి సహాయపడుతుంది అని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా వేవిళ్లతో బాధపడేవారికి విటమిన్ బి 6 సహాయపడుతుంది. కానీ మీ వైద్యుడి సలహాతో మాత్రమే వీటిని వాడడం మంచిది.


కాబట్టి వేవిళ్లతో బాధపడడం అన్నది చాలా సాధారణం అయినప్పటికీ కొన్ని సందర్భాలు ఎంతో దారుణంగా ఉంటాయి. ఇది గర్భధారణ సమయం పూర్తిగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగా తల్లి కాబోతున్న వారు అవసరమైనంత ఆహారము మరియు నీటిని అందించలేక పోతున్నారు. ఇది ఒక భయంకరమైన దశ. ఈ విషయంపై మీ డాక్టర్ తో సంప్రదించి వారి అభిప్రాయాన్ని తీసుకోండి. గర్భధారణ సమయం అనేది ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ ఒక శిక్షగా కాదు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}