• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
విద్య మరియు శిక్షణ

మాతృదేవోభవ - సృష్టి యొక్క మూలం

Vidyadhar Sharma
0 నుంచి 1 సంవత్సరాలు

Vidyadhar Sharma సృష్టికర్త
నవీకరించబడిన May 17, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కుటుంబం లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

తల్లి తన రక్తాన్ని పాలుగ మార్చి బిడ్డలకు ఇస్తుంది. తన సుఖలను బిడ్డల అభివృద్ధికి త్యాగం చేస్తుంది.

అనురాగాలను, ఆప్యాయతను, జ్ఞానన్నీ విలువలను నేర్పిస్తుంది. నవమాసాలు మోసి ప్రసవ వేదనను భరించి బిడ్డకు జన్మను ఇస్తుంది.

తల్లితండ్రులకు పుట్టిన బిడ్డకు మధ్య గల బంధమే వారి ప్రేమ అనుబంధం. బిడ్డ పై ప్రేమానురాగాలు వారు కురిపిస్తారు. బిడ్డను  సంరక్షిస్తారు పోషిస్తారు. అర్ధరాత్రి అయినా సరే బిడ్డ కొరకు లేచి శ్రద్ధ చూపి ఆ బిడ్డకు అన్ని అందిస్తారు. ఏడిస్తే చాలు ఎంతో విలపిస్తారు. తల్లితండ్రులకు బిడ్డకు మధ్య గల మొట్టమొదటి బంధంలో ఒక భధ్రత, సవ్యమైన తీరు, వారి గౌరవాలు ఇమిడి వున్నాయని భావిస్తున్నారు. ఒక పసివాడి ఆక్రందనలకు జవాబుగా వుండే తల్లితండ్రుల తీరు తెన్నులు బిడ్డకు సమాజంలో ఒక స్ధానాన్ని సంపాదించిపెడతాయి.

ప్రేమానురాగాలు బిడ్డ కి ఎంతో అవసరం.తల్లితండ్రుల అవసరం ఉన్న అప్పుడు బిడ్డ అవసరాలకు స్పందిస్తే, ఆ బిడ్డ సమాజంలో బాగా అభివృధ్ధి చెందుతుం తుంది . చాలామంది పిల్లలు తక్షణమే తమ తల్లితండ్రులతో బంధం భావిస్తారు. అయితే బిడ్డపై తల్లితండ్రులకు విభిన్న అభిప్రాయాలుంటాయి. కొంతమంది మొదటి నిమిషంలో లేదా రోజునే బిడ్డ పుటుకకు బంధం పెంచుకోగా, మరి కొంతమందికి అధిక సమయం తీసుకుంటుంది. కాని, ఈ బంధం ఏర్పచుకునే ప్రక్రియ కొద్ది నిమిషాలలోనే ఏర్పడుతుంది కాని, దీర్ఘకాలం కాదు. దానికి కొంత సమయం అంటూ వుండదు.

చాలామంది తల్లి తండ్రులకు ప్రేమ బంధం ప్రతిరోజూ శ్రద్ధ చూపుతుంటే ఏర్పడుతుంది.అది ఏర్పడుతోందని కూడా తెలియదు. మీ బిడ్డ మిమ్మల్ని చూసి నవ్విందంటే చాలు మీరు ఆనందంతో నిండిపోతారు.

స్పర్శ...చర్మానికి చర్మం తగలటం. ఇది ఆనందం కలిగించి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

చూపు - పాప కళ్ళు, మీ కళ్ళు కలిస్తే చాలు బంధం ఏర్పడుతుంది.

పిల్లలు తమ తల్లి తండ్రుల స్వరధ్వని వినటానికి ఇష్టపడతారు. దానికి స్పందిస్తారు.

బిడ్డ తో బంధం  తన పట్ల తీసుకునే జాగ్రత్త మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. బిడ్డ ని స్పర్శించటం, జో కొట్టటం, ఊయల ఊపటం, అనురాగం పెంచుతాయి.  పాలు పట్టేటపుడు, ఊయలలో వేసేటపుడు, చిన్నగా బిడ్డకి మసాజ్ చేసేటపుడు, బిడ్డ అవసరాలు తీర్చేటపుడు బిడ్డ తోగల స్పర్శానందం అనుభవించితీరాలి. అపుడే ఒక గట్టి తల్లిబిడ్డల బంధం ఏర్పడుతుంది.

 తల్లిపాల గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవి అమ్మ పంచే అమృతం. జీవితాంతం బిడ్డకు అండగా నిలుస్తుంది. వారిని అనారోగ్యాల దుష్టశక్తులు పిల్లలకు సోకకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది. తల్లిపాలు చేసే మేలు తెలిసీ నిర్లక్ష్యం చేయడం, తల్లిపాల గొప్పదనాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం పెద్ద లోపం. బిడ్డ భూమీదకు వచ్చాక ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్లూ, వ్యాధులూ దాడికి సిద్ధమవుతుంటాయి. వాటి నుంచి కాపాడుకునేందుకు అమ్మ చేతిలో ఉన్న అస్త్రం చనుబాలే!

బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం తల్లిపాలు తప్పనిసరి. తల్లిపాలు ప్రకృతి ప్రసాదం, దివ్యౌషధం. పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తికావడం, అపుడే పుట్టిన బిడ్డకు ఏమీ తెలియదు కానీ, పాలు తాగే విద్య మాత్రమే తెలియడం, అమ్మ కౌగిలిలో వెచ్చదనం, అమ్మపాలలో కమ్మదనం, భద్రతాభావం నిత్యం అనుభవించాలని పుట్టిన బిడ్డ భావించడం తెలియకుండానే జరిగిపోతాయి. ఇది సృష్టి ధర్మం.

శిశువుకు తల్లిపాలే సరైన ఆహారమని ప్రపంచంలోని దేశాలన్నీ గుర్తించాయి. శిశువు చనుపాలను త్రాగడంవల్ల తల్లీ బిడ్డల అనుబంధం బలపడుతుంది. శిశువు ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి. తల్లి బిడ్డకు ఆహారంగా త్రాగించే చనుపాలల్లో బిడ్డకు కావలసిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి. తల్లి పాలలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు, నీరు పుష్కలంగా లభిస్తాయి. తల్లి పాలలో వుండే ఇమ్యూనోగ్లోబిన్స్, లాక్టోఫెర్రీస్, లాక్సోఫెర్సాడేస్ బిడ్డ ఆరోగ్యానికి రక్షణగా పనిచేసి అంటువ్యాధులు సోకకుండా కాపాడతాయి. తల్లిపాలు త్వరగా జీర్ణమవుతాయి. శిశువుకు అజీర్ణవ్యాధులు, వాంతులు, విరేచనాలు లాంటి అనారోగ్యాలు ఏర్పడవు. బిడ్డకు చురుకుదనాన్ని, బుద్ధికుశలతనూ పెంచి, వయస్సుకు తగినట్లుగా ఎదుగుదల, ఆటపాటలు, ఆరోగ్యం పెంపొందేలా చేస్తాయి తల్లిపాలు.తల్లి పాలు కడుపునిండా తాగిన శిశువు రెండు మూడు గంటలసేపు ఆదమరచి నిద్రపోతుంది. వయస్సుకు తగిన బరువు కూడా పెరుగుతుంది. కనీసం మూడు నాలుగు నెలల వయస్సువరకైనా శిశువుకు తల్లిపాలు త్రాగించటం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మంచిది.

తల్లి బిడ్టకు స్తన్యమివ్వడంవల్ల పాపాయి ఎదుగుల, ఆరోగ్యంతోపాటు తల్లి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే పాలు ఇవ్వడంవల్ల తాను పెరిగిన బరువును తగ్గించుకోగలుగుతుంది.పోతపాలు తాగినవారికంటే తల్లిపాలు తాగే పిల్లల్లో ఎదుగుదల ఆశాజనకంగా ఉందని, ఆరోగ్యపరంగా వీరు ముందంజలో ఉన్నారని వారు గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను, ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి.

తల్లిదండ్రుల ఆనందంగా ఉంచాలి అనుకుంటే వృద్దాప్యంలో  తనని ఆశ్రమాలకు పంపకండ మనతో పాటు పెట్టుకొని వారికి సేవలు చేసుకుంటే మన జన్మ ధాన్యమవును. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన విద్య మరియు శిక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}