• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

నవజాతశిశువును వ్యాధులబారిన పడకుండా కాపాడడం ఎలా?

Monika
0 నుంచి 1 సంవత్సరాలు

Monika సృష్టికర్త
నవీకరించబడిన Apr 13, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

నవజాత శిశువులు గాజుబొమ్మవలె అపురూపమైనవి. అత్యంత సున్నితంగా, జాగ్రత్తగా వారి సంరక్షణా చర్యలను చేపట్టవలసి ఉంటుంది. మీ నవజాత శిశువును ప్రపంచానికి పరిచయం చేసే ముందుగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన వివరాలను ఈవ్యాసంలో పొందుపరచడం జరిగినది. మీ శిశువు పట్ల సరైన సంరక్షణా బాద్యతలు నిర్వహించడం మీకు క్రొత్త అనుభవం కావచ్చు. వారిపట్ల నిరంతర శ్రద్ధ అవసరం, వారు నిద్రపోతున్నప్పటికీ, 24/7 వారిని పర్యవేక్షిస్తూనే ఉండాల్సి వస్తుంది.

మీ ప్రసూతి కేంద్రంలోని నిపుణుల నుండి, మీ వైద్యుని సూచనల వరకు ఏ అంశాలను విస్మరించకుండా, కనీస అవగాహనతో మెలగాల్సిన అవసరం ఉంటుంది. మీరు నవజాత శిశువును కలిగి ఉండడం కన్నా, వారికి పరిసరాలను పరిచయం చేయడం ముఖ్యం. అంటే, మైదానాల్లో తిప్పమని అర్ధం కాదు. తాను నిద్రించే పరిసరాలలో అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవలసి ఉంటుంది. పిల్లలు ఈ ప్రపంచంలోకి పూర్తిగా నిర్మించబడిన అవయవాలతో అడుగుపెడుతారు, ఆ అవయవాలు పరిసరాలకు అనుగుణంగా, మార్పులు చెందడం ప్రారంభిస్తాయి. క్రమంగా అలవాటుపడుతాయి.

కొన్ని రోగాల నుండి పోరాడే కనీస రోగనిరోధక శక్తితో జన్మించినప్పటికి కూడా, వారి రోగనిరోధకవ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటుంది. కావున, అపరిశుభ్ర ఆహారం, సరైన ప్రాణవాయువు లేకపోవడం, బాక్టీరియా, సూర్యరశ్మి, కాలుష్యం(ముఖ్యంగా ఇళ్ళల్లో కట్టెలపొయ్యి వాడకం) వారి అనారోగ్యానికి ప్రధాన హేతువులుగా పరిణమిస్తాయి. పెద్దలం మనమే, వీటిని తట్టుకోలేని పరిస్థితులకు లోనవుతుంటే, రోగనిరోధకవ్యవస్థ అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న నవజాత శిశువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కనీసం తమ అసౌకర్యాన్ని కూడా తెలుపలేని స్థితిలో ఉన్న వీరి జాగ్రత్తలను తీసుకునే క్రమంలో పూర్తి సంరక్షణా చర్యలు తీసుకోవలసి అవసరం ఉంటుంది.

నవజాత శిశువులు వారి శరీర ఉష్ణోగ్రతని సైతం నియంత్రించలేరు, క్రమంగా వ్యాధులబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవజాతశిశువులు పుట్టుకతోనే తల్లి నుండి సంగ్రహించిన రోగనిరోధకశక్తి కారణంగా జబ్బుల బారిన పడనప్పటికీ, 1-2 నెలల వయసు వచ్చేవరకు వారి శరీర జీవక్రియలు అనేక మలుపులకు లోనుకావొచ్చు. మరియు వివిధరకాల అనారోగ్యాలను కలుగజేసే సూక్ష్మజీవుల బారిన పడకుండా నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మీ శిశువు యొక్క రోగనిరోధకవ్యవస్థ అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది, ఈలోపున వారు ఎటువంటి వ్యాధులకు లోనుకాకుండా చూసుకోవలసిన అవసరం ఉంటుంది.

మీ శిశువుకు సంబంధించిన వస్తువులను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచడం, శానిటైజర్లు, బేబీ-వైప్స్ వాడడం, వంటి అనేకములైన చర్యల ద్వారా మీ శిశువు అనారోగ్యానికి గురికాకుండా నిరోధించవచ్చు.

మీ శిశువును వెచ్చగా ఉండేలా చూసుకోండి: ఇది మనసులో ఉంచుకోవలసిన ముఖ్యమైన విషయం. నిజానికి, శిశువులకు శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈసమయంలో, మీరు చేయవలసిన అంశాలు అనేకం ఉంటాయి. అతి శీతల వాతావరణంలో ఉన్న ఎడల అనారోగ్యాలు చుట్టుముడుతాయి. మరియు అతి వేడి వాతావరణం, డీ-హైడ్రేషన్ మరియు అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. కావున చుట్టుపక్కల వాతావరణం వీలైనంత వెచ్చగా, క్రమబద్దీకరింపబడి ఉండేలా జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీశరీరానికి హత్తుకుని ఉండేలా బిడ్డను ఉంచడం ద్వారా, వారు వెచ్చని మరియు సౌకర్యవంతమైన అనుభూతికి లోనయ్యేలా చేస్తుంది. మరియు ఇది తల్లీబిడ్డల మద్య అనుబంధాన్ని కూడా పెంచుతుంది.

చేతులు శుభ్రంగా కడుక్కోండి: మన చేతులు రోజువారీ సంగ్రహించే బాక్టీరియాను అంచనా వేయడం కష్టం. లక్షల సంఖ్యలో ఉంటాయి కాబట్టి. పెద్దవారికి, వారి రోగనిరోధకవ్యవస్థ కారణం చేత, అంతగా హానికరం కాకపోయినా, పసిపిల్లలు, నవజాత శిశువులు తేలికగా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీ శిశువును సందర్శించే ఎవరికైనా అది వర్తిస్తుందని నిర్ధారించుకోండి. మీ శిశువు ఆరోగ్యానికి మీరు అధిక ప్రాధాన్యతనివ్వవలసి ఉంటుంది.

బయట వ్యక్తులు శిశువును చుంబించకుండా జాగ్రత్తలు వహించడం: ఆసుపత్రిలో, ఇంటి చుట్టుపక్కల అనేకమంది అపరిచిత వ్యక్తులు ఉండవచ్చు. మీబిడ్డను గట్టిగా కౌగలించుకోవడం, లేదా ముద్దుపెట్టుకోవాలని భావించేవారు కూడా ఉంటారు. అది వారి ప్రేమకు సంకేతం అయినా, మీశిశువుకు హానికరమని గుర్తించండి. వారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో కూడా మీకు తెలియదునవజాత శిశువులు ముద్దు ద్వారా కూడా ప్రాణాంతక అంటువ్యాధులకు గురవుతుంటారు. వీటికి సంబందించిన అనేక వివరాలు ఇంటర్నెట్లో లభిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లో, ఎంతవారలనైనా మీశిశువు దగ్గరకు అనుమతించవద్దు, శుభ్రత పాటించనప్పుడు. ఎవరైనా మీశిశువు తర్వాతే అని గుర్తుపెట్టుకోండి.

మీబిడ్డకు చనుబాలను ఇవ్వడమే శ్రేయస్కరం: బాహ్యకారకాలు కాకుండా, మీ శిశువును అంతర్గతంగా కాపాడడమే అత్యంత ముఖ్యమైన చర్య. ఇక్కడ చనుబాల కన్నా మెరుగైన మార్గం కనిపిస్తుందా? మీ శిశువు ఆరోగ్యంగా పెరగడానికి మరియు రోగనిరోధకవ్యవస్థను బలంగా నిర్మించుకోడానికి మీశిశువుకు చనుబాలే శ్రేయస్కరం. చనుబాలను ఇచ్చేందుకు మీ శిశువును తిరస్కరించకూడదు. ఎందుకంటే వాటి ఆరోగ్యకర ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి

టీకాలు మరచిపోవద్దు: అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు మీశిశువుకి ఒక రక్షణ కవచాన్ని అందించే క్రమంలో మీశిశువు యొక్క టీకా షెడ్యూల్ ఖచ్చితంగా పాటించాలని గుర్తుపెట్టుకోండి. ఈ టీకాలు మీశిశువును కోరింతదగ్గు మరియు టెటానస్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. వైద్యులు ధృవీకరించిన ఇచ్చిన టీకా-చార్ట్ తప్పనిసరిగా పాటించండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Apr 02, 2020

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}