• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

కార్టూన్లు పసిబిడ్డల పై ప్రతికూల ప్రభావాలను చూపుతాయా ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 29, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

అందమైన జెర్రీని వెంబడిస్తూ కోపంగా ఉన్న టామ్ కనిపించేవాడు. ఇది నా బాల్యంలో టీవీ లో ఎక్కువగా చూసిన జ్ఞాపకం. నేను మరియు నా సహోదరీ అది చూసి ముసి ముసి నవ్వులు నవ్వు కునే వాళ్ళం. అది నిజంగా చాలా హాస్యంగా మరియు సరదాగా ఉండేది. మిస్టర్ బీన్ మూర్ఖపు భావాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది చాలా నవ్వు తెప్పించేది. ఈ హాస్య వినోదాలను పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా వాటిని ఆస్వాదించేవారు. సరదాగా ఉండే కార్టూన్ యుగం ముగిసిపోయి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు విదేశీ నైపుణ్యం చేర్చి కొత్త యుగం సృష్టించబడింది. క్రమంగా చిన్న పిల్లలు అందులో ప్రాచుర్యం పొందడం ప్రారంభించారు. జపాన్ నుండి వచ్చిన పోకీమాన్ మరియు షిన్చాన్ భారతీయ పిల్లల కార్టూన్లలో సరికొత్త దృక్పథాన్ని తీసుకు వచ్చాయి. కార్టూన్ పాత్రలు పిల్లల రోజు వారి జీవితాలలో అంతర్భాగంగా మారి పోయినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇది ఒక వినోదంగా కాకుండా , ఇప్పుడు ఒక దినచర్యగా మారిపోయింది. మీ పిల్లలపై కార్టూన్ యొక్క ప్రభావాలు సానుకూలంగా ఉన్నాయా ? మీరు ఆరోగ్యకరమైన కార్టూన్లను చూసినట్లయితే అవి జ్ఞానానికి మూలంగా తెలుపవచ్చు . అవి సమాచారాన్ని తెలుసుకోవడంలోనూ మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం లోను సహాయపడతాయి. కార్టూన్ల యొక్క కొన్ని ప్రయోజనాలు.... చిన్న వయస్సులోనే అభ్యాసం నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది : కార్టూన్లలోని చిత్రాలు మరియు రంగులు చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లక ముందే నేర్చుకునే లాగా చేస్తాయి. ఆలోచనా శక్తిని పెంచుతాయి : వారిలోని ఆలోచన శక్తిని పెంచి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి. ప్రాంతీయ భాషలలో పరిజ్ఞానము : పిల్లలు ప్రాంతీయబాష ద్వారానే వివిధ భాషలను నేర్చుకుంటారు. ఒత్తిడిని పోగొడతాయి : ఇవి పిల్లలలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడానికి సహకరిస్తాయి. పురాణాలను మరియు భారతీయ చరిత్రను బాగా అర్థం చేసుకోవడం : కార్టూన్ లు పురాణాలు మరియు భారతీయ చరిత్రను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అటవి మరియు వన్యప్రాణుల అవగాహనను అభివృద్ధి చేస్తాయి : కొన్ని అడవి ధారావాహికలు మీ పిల్లలకి అటవీ మరియు వన్యప్రాణుల గురించి తెలుసుకోవడంలో సహాయపడతాయి. పిల్లల్లో సృజనాత్మకత , నైపుణ్యాలను పెంచుతాయి : ఇవి పిల్లల్లో సృజనాత్మకతను మరియు ఊహాత్మకతను అభివృద్ధి పరుస్తాయి. కార్టూన్లు కేవలం విశ్రాంతి కార్యకలాపాలు మాత్రమే కాదు. తల్లిదండ్రులు తమ రోజువారీ పనులను చేసుకుంటున్న సమయంలో మీ పిల్లలు కూడా వీటితో బిజీ గా ఉండేలా చేస్తుంది. అయినప్పటికీ, మీ పిల్లల సున్నితమైన మరియు ఇంకా అభివృద్ధి చెందుతున్న మనసుపై కార్టూన్ల ప్రభావం పడుతుంది. అందుకే మీ పిల్లలు చూసే కథాంశం తో పాటు, వారు మాట్లాడే భాషను కూడా మీరే నిర్ధారించుకోవడం తెలివైన మరియు అవసరమైన పని కదా ? అలా చేసినట్లయితే పిల్లలు వారి వయస్సుకు సరిపోయిన కథాంశాలను ఎంచుకుంటారు. పేరెంటూన్ చిట్కా : పిల్లలు చూసే మరియు వినే ప్రతి దాన్ని నిర్వహిస్తున్నారని గుర్తుంచుకోండి. అవును, ఆ అందమైన కార్టూన్ పాత్రలు రాక్షసులుగా మారవచ్చు. మీ పిల్లలపై కార్టూన్ యొక్క ప్రతికూల ప్రభావాలు ఏమిటి ? మీ పిల్లల మీద మరియు వారి మనస్సు మీద కార్టూన్ల యొక్క కొన్ని సానుకూల ప్రభావాలు నేను చర్చించినప్పటికీ, ఎల్లప్పుడూ నాణం కు రెండువైపులు ఉన్నట్టు , నేను కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీ పిల్లలపై కార్టూన్ యొక్క ప్రతికూల ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి. హింస : హింసాత్మక కార్టూన్ చిత్రాలు చూసే పిల్లలు దూకుడు ప్రవర్తనను ప్రదర్శిస్తారు. పోకీమాన్, స్కూబీ డూ, పవర్ రేంజర్స్ వంటి అనిమేటెడ్ యాక్షన్ సిరీస్ డ్రామాలను చూపిస్తుంది. అది పిల్లలను కూడా అదే విధంగా చేయమని ప్రోత్సహిస్తుంది. తుపాకీ షాట్లు , ధూమపానం మరియు ఇతర దృశ్యాలు మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. మనసుని చెడు త్రోవ పట్టిస్తాయి : యువ హృదయాలను ఆకట్టుకునే విధంగా అంతర్జాతీయ కార్టూన్ సిరీస్ లు ఉంటాయి. ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు రోబోలతో తయారు చేయబడి ఉంటాయి. ఈ పాత్రలను పిల్లలు ఆరాధించడం ప్రారంభిస్తారు. తమను కూడా తాము ఒక సూపర్ హీరో గా ఉండాలని కోరుకుంటారు. వారు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అయ్యే పనులనే నమ్ముతారు. క్రమంగా సోమరితనం గా మారిపోతారు : స్ట్రీమింగ్ కార్టూన్లు దుష్ప్రభావానికి మరొక ప్రతిరూపం. నేను షిన్చాన్ చాలా మొరటు వాడిగా మరియు క్రమశిక్షణ లేని పిల్లవాడిగా చూశాను . అతను ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు అవిధేయత చూపుతూ ఉంటాడు. దీనిని చూసి చాలా మంది పిల్లలు విధేయత గురించి మరచిపోతారు. చెడు భాష : కార్టూన్స్ ద్వారా పిల్లలు దీన్ని చాలా త్వరగా అలవర్చుకుంటారు. ఊగ్గీ మరియు కాక్రోచ్ లను బాలీవుడ్ విలన్ల స్వరాలతో అనుమతిస్తారు. వారు అనువదించడానికి ఉపయోగిస్తున్న భాషను చూసి నేను ఆశ్చర్య పోతున్నాను. వారు సరైన ప్రేక్షకులను లక్ష్యంగా ఎంచుకున్నారు అని బ్రాంతి చెందుతున్నాను. సరైన మానసిక పరిస్థితిలో ఉన్న ఎవరు కూడా బొద్దింక , పిల్లి మధ్య గొడవలు చూడాలి అనుకోరు. సామాజిక ప్రవర్తన : కార్టూన్లలో ఇది మరొక ఆందోళనకరమైనది. ఒక కార్టూన్ సిరీస్ కృష్ణ లో ఈ పేరుని క్రిష్ గా మార్చడం నన్ను లోతుగా కదిలించింది . వారు అశాస్త్రీయంగా పురాణాలను ఎంతో తారుమారు చేస్తున్నారు. పాఠశాల నీతులను తారుమారు చేస్తున్నందున వీటిని ఉపాధ్యాయులు విభేదిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులతో విభేదిస్తున్నారు. ఆరోగ్య ప్రమాదాలు : ఊబకాయము , బలహీనమైన కంటిచూపు మరియు చెడు ఆహారపు అలవాట్లు వంటి ఆరోగ్య సమస్యలు టెలివిజన్ సరదాలతో వస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను టీవీల ముందు పోషించడం సౌకర్యంగా ఉంది .ఇది అనారోగ్యకరమైన ఆహార విధానాలకు మరొక మూల కారణం. సోమరితనంతో కట్టిపడేస్తున్న జీవనశైలి : ఇది పిల్లలలో ఎటువంటి కార్యాచరణ లేదా ఎటువంటి పని లేకుండా చేస్తుంది. ఇవి సెట్ల ముందు సోమరితనం గా కూర్చోవడం : సరదాగా బయటకు వెళ్లి ఆడుకోవడం కంటే టీవీ సెట్లు ముందు సోమరితనంగా కూర్చోవడం అంటే పిల్లలకు సరదాగా అనిపిస్తుంది . కార్టూనులు చూడడం మీ పిల్లల శారీరక పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. మరియు మనశ్శాంతికి కూడా భంగం కలిగిస్తుంది. పిల్లలలో ముఖ్యంగా 2 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో కార్టూన్లను చూడడం నియంత్రించడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మనకి తెలుసు. ఎందుకంటే అవి మనసు మరియు వ్యక్తిత్వం రెండింటి మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ వయసు శరీరము మరియు మనసు వికసించే సమయము. అందువల్ల మనం వినోదం ఇచ్చే మార్గాన్ని మార్పు చేస్తే అది వారి ఆరోగ్యకరమైన జీవితం కోసం తమ బిడ్డలకు సహాయపడుతుంది. కార్టూన్లలోని ప్రతికూలతలను తనిఖీ చేయడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు ? మీ పిల్లలకు ఈ హానికరమైన విషయాన్ని సున్నితంగా వ్యవహరించండి : తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నింటిని సున్నితంగా వివరించాలి . ఏది ఆమోదయోగ్యమైనది మరియు ఏది హానికరమైనది అని ప్రతి విషయాన్ని విపులంగా చెప్పాలి. టీవీ చూడడానికి తగిన సమయాన్ని నిర్ణయించండి : టీవీ చూసే సమయాన్ని తగ్గించండి . దానికోసం సమయ పరిమితులను విధించండి. జ్ఞాన పూరితమైన కొత్త ఛానల్స్ కోసం అన్వేషించండి: డిస్కవరీ , అనిమల్ ప్లానెట్ వంటి మంచి జ్ఞానాన్ని ఇచ్చే ఛానల్స్ ను చూసినట్లయితే వారి పరిపూర్ణమైన అభివృద్ధికి దోహదపడతాయి. ఎప్పుడూ కుటుంబంగా కలిసి ఉండండి : సరదా కోసం మీడియా మీద ఆధారపడే కంటే కుటుంబమంతా కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నియంత్రణ : మీ పిల్లలకు హానికరం కలిగించే వాటిని నియంత్రించండి . తల్లిదండ్రుల నియంత్రణ అనువర్తనాలను ఉపయోగించండి . రైమ్స్ మరియు స్టోరీ ల కోసం ఆడియో సీడీలను ఉపయోగించండి : ఆన్లైన్ లో రైమ్స్ వీడియోలకోసం చిన్నపిల్లలను ఫోన్ స్క్రీన్లలో చూడకుండా నిషేధించండి. మీరు చిన్న వయసులో నియంత్రించినట్లయితే వారి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. జ్ఞానాన్ని అందించే కార్టూన్ ఛానల్ ను ప్రోత్సహించండి : ఈ పాత్రను నిర్మించకుండా జ్ఞానాన్ని అందించే కార్టూన్ ఛానల్ ను ప్రోత్సహించండి. మరియు చిన్న పిల్లలకు సంబంధం కలిగిన కార్టూన్లు ఎన్నో ఉన్నాయి. జంతువుల పాత్రలతో మాట్లాడే కార్టూన్లు సరదాగా ఉంటాయి : డాన్స్ చేసే హిప్పో , మాట్లాడే సీతాకోకచిలుక, పక్షులు గ్రాండ్పా జాన్ మరియు అతని మాయాజాలం , ఆటస్థలం గురించి సమాచారం ఇచ్చే స్నేహితులు , కోతి మరియు అతని బామ్మగారు పక్షుల గురించి సమాచారం ఇవ్వడం, గ్రాండ్పా జాన్ మరియు అతని ఆట స్థలం మరియు చిన్న హెన్రీ రక రకాల కూరగాయల కోసం ఆకలితో తిరగడం. ఇవన్నీ చిన్న పిల్లలు నేర్చుకోవడానికి ఎంతో సరళమైనవి మరియు ఉత్తేజకరమైనవి కదా ? వారు మంచి విషయాలు మాత్రమే మాట్లాడతారు. అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీ పసిబిడ్డ మెదడు మరియు మనస్సును ఎంతో ఉత్తేజపరుస్తుంది. మంచి భాష నేర్చుకోవడానికి సహాయపడుతుంది : ఇది మీ చిన్న పిల్లలకు అక్షరాలు , పదాలు మరియు రైమ్స్ ఒకేసారి మంచి భాషతో నేర్చుకోవడానికి సహాయపడుతాయి. పేరేంటూన్ చిట్కా : కార్టూన్లు ఆహ్లాదకరంగా మరియు వినోదంగా ఉంటాయి. అవి ఎప్పుడు అంటే , కేవలం కొన్ని గంటలు మాత్రమే చూడగలిగినప్పుడు. పసి మనసుల మీద ప్రభావం చూపించే ఈ కార్టూన్ల సమాచారం తో వచ్చిన ఈ బ్లాగ్ చూసి కార్టూన్ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. దయచేసి మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}