• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

కొత్త తల్లిదండ్రులుగా డబ్బును ఎలా ఆదా చేయాలి.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 25, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కొత్తగా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికీ శిశువు రాకడ అన్నది అద్భుతమైన క్షణాలలో ఒకటి. అయితే ఆచరణాత్మకంగా చూస్తే దీని అర్థం ఖర్చులు మరియు మీ నెలవారీ బడ్జెట్ పెరుగుదల. వాస్తవానికి అకస్మాత్తుగా వచ్చే దుస్తుల బిల్లులు, బొమ్మలు మరియు వైద్య ఖర్చులు. అయినప్పటికీ,  కొత్త తల్లిదండ్రులుగా మీరు డబ్బులు ఎలా ఆదా చేయవచ్చు? మీ బిడ్డకు ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు  అనవసరంగా మరియు పిచ్చిగా ఖర్చు చేయకుండా చూసుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు ?

 

కొత్త తల్లిదండ్రులుగా డబ్బు ఆదా చేసే మార్గాలు :

 

కొత్త తల్లిదండ్రుల కోసం డబ్బు ఆదా చేసే కొన్ని మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము. శిశువు కోసం ఆదా చేయడం, బిడ్డను పెంచేటప్పుడు డబ్బు ఆదా చేయడం మరియు శిశువు యొక్క భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం వంటి మార్గాలుగా మేము వాటిని వర్గీకరించి ఇస్తున్నాము.

 

శిశువు కోసం డబ్బు ఆదా చేయడం ఎలా ?

 

ఇంటిని పునరుద్ధరించడం :

 

మీరు బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తరుణంలోనూ, ఆ తర్వాత తల్లిదండ్రులుగా మీరు మీ ఇంటిని బిడ్డ కోసం పూర్తిగా పునరుద్ధరించాలని కోరుకుంటారు. శిశువు కోసం ప్రత్యేక నర్సరీని నిర్మించడం, ఇంటిని బిడ్డకు అనుకూలంగా మార్చడం లాంటివి తల్లిదండ్రులందరూ చేయాలనుకునే కొన్ని విషయాలు. అయినప్పటికీ మీరు అలంకరణలతో ఇంటిని పునర్నిర్మించడానికి, అతిగా ఖర్చు చేయడానికి బదులుగా ఆ డబ్బును శిశువు యొక్క అవసరాలకు ఆదా చేయవచ్చు. శిశువు కోసం మీ గదిలోనే చిన్న చిన్న విభజనలు చేయడం , వారి  అల్మరాలు మరియు ఉయ్యాలకు చిన్నచిన్న అలంకరణ వస్తువులను అమర్చడంలాంటివి ఖర్చును తగ్గించడానికి కొన్ని సులభమైన మార్గాలు.

 

ఆస్పత్రి ఖర్చులు :

తల్లి మరియు బిడ్డ ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనది. అయినప్పటికీ మనలాంటి దేశంలో వైద్య సంరక్షణ మరియు సౌకర్యాల పరిధి విస్తృతంగా ఉంది. మీరు మీ గదిని మరొకరితో పంచుకోవడం లేదా మంచి వైద్య సహాయం గల సహేతుకమైన ఆస్పత్రిని ఎంచుకోవడం చేసినట్లయితే మీరు చాలా డబ్బు ఆదా చేయవచ్చు. అవి ఎంతో నాగరికమైనవి మరియు విలాసవంతమైనవి కావాల్సిన అవసరం లేదు.

 

శిశువుపై డబ్బు ఆదా చేయడం ఎలా ?

 

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను అడగడానికి సిగ్గు పడకండి :

 

పిల్లల బట్టలు మీరు ఊహించిన దాని కంటే త్వరగా పెరుగుతాయి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పిల్లలు ధరించిన బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తీసుకోండి. పిల్లలు బట్టలు ఎప్పుడూ మంచి స్థితిలో ఉంటాయి ఎందుకంటే అవి ఎక్కువగా ధరించలేరు. అలాగే, బట్టల డ్రైపర్లను ప్రయత్నించి వాడిచూడండి. వీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు.

 

ఆఫర్లు/డిస్కౌంట్లు /కూపన్ల కోసం గమనిస్తూ ఉండండి :

 

ఆన్లైన్ మరియు రిటైల్ షాపులలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో నిండి ఉంటాయి. ముఖ్యంగా పండుగ సీజన్లలో అలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నప్పుడు మీ బిడ్డ కోసం పెద్ద మొత్తంలో షాపింగ్ చేయండి.

 

వినూత్నంగా ఉండండి :

 

పిల్లలు నిజంగా వేగంగా పెరుగుతారు. కాబట్టి మీరు వారికి తగిన పరిమాణంలో బట్టలు కొనకుండా చూసుకోండి. కొంచెం వదులుగా ఉండే టీ షర్ట్ లు మరియు పైజామాలు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ఎక్కువ మన్నికగా ఉంటాయి, మరియు ఎక్కువ డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయ పడతాయి. అలాగే మీ అవసరాలను ఇంట్లోని వస్తువులను వినూత్నంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు పాత టీ షర్టుని అందంగా కుట్టి ఇంటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించండి. డబ్బు ఖర్చు చేసి ఫ్యాన్సీ బట్టలు కొనకుండా అవి తుడవడానికి ఉపయోగపడతాయి.

 

ఆహారపు అలవాట్లు :

 

కనీసం మొదటి సంవత్సరం అంతా కూడా శిశువుకు తల్లి పాలు ఇవ్వడం మంచిది. ఇది పిల్లల ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి చాలా మంచిది. అంతేకాకుండా శిశువు ఆహారాలపై డబ్బు ఆదా చేయడంలో ఇది గొప్ప మార్గం. కొన్ని కారణాల వల్ల తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాకపోతే, ఖరీదైన బిడ్డ ఆహారాలను బయట కొనడం కంటే ఇంట్లోనే శిశువు ఆహారాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నించండి.

 

శిశువు యొక్క భవిష్యత్తు కోసం డబ్బు ఆదా :

 

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయడానికి ఉత్తమ మార్గం పిల్లల పొదుపు ఖాతాను తెరవడం. శిశువు బంధువుల నుండి పొందే డబ్బును, మీ పొదుపును మరియు పిల్లవాడు అందుకునే ఇతర బహుమతులను ఈ ఖాతాలో జమ చేస్తూ ఉండండి. తద్వారా మీరు దానిని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చు.

 

కొత్త తల్లిదండ్రులుగా, ఒక చిన్నారి జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మీలో ఎన్నో భావాలు మిళితమై ఉంటాయి. ఎంతో ప్రేమ ఉంటుంది. అదేవిధంగా ఆందోళన మరియు ఆత్రుత కూడా. మీ ఆందోళనలకు డబ్బులు కారణంగా కానివ్వకుండా చూసుకోండి.


ఈ బ్లాగు మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ ఆలోచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}