• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ - లాభాలు మరియు నష్టాలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 22, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

అందమైన గర్భధారణ అనుభవంలో , చంచలంగా ఉండే మానసికస్థితి, తలనొప్పి,  ఒళ్ళు నొప్పులు, కోరికలు మరియు ఆలోచనలతో మహిళలు ఆందోళన చెందుతూ ఉంటారు.' నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ '! మీకు మరియు మీ బిడ్డకు ఏ డెలివరీ అయితే సురక్షితం అని మీరు నిరంతరం ఆలోచిస్తుంటారు అని నాకు బాగా తెలుసు. కాబట్టి, డెలివరీ ఎంపికల గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంది.

 

నార్మల్ డెలివరీ - లాభాలు మరియు నష్టాలు :

 

ప్రసవం విషయానికి వస్తే,  నార్మల్ డెలివరీ మొదటి ఎంపిక మరియు సురక్షితమైన ఎంపికగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది సహజ ప్రక్రియ. భవిష్యత్తులో ఎక్కువమంది పిల్లలు కావాలనుకునేవారు మొదటిసారి నార్మల్ డెలివరీ కావాలి అని ఇష్టపడతారు. ఈ ప్రక్రియలో మీ బిడ్డ మరియు మీ శరీరం సహజసిద్ధమైన ప్రసవానికి పురోగతి ప్రారంభిస్తాయి. నార్మల్ డెలివరీకి వెళ్లే మహిళలలో తీవ్రమైన రక్తస్రావము, ఇన్ఫెక్షన్లు, ప్రసవం తర్వాత సంభవించే నొప్పులు మరియు శస్త్రచికిత్స తర్వాత వచ్చే అనేక రకమైన ప్రమాదాలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా సిజేరియన్ తో పోలిస్తే కోలుకునే సమయము మరియు హాస్పిటల్లో ఉండాల్సిన సమయం చాలా తక్కువగా ఉంటాయి. నార్మల్ డెలివరీ మీ బిడ్డకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

నార్మల్ డెలివరీ ద్వారా ప్రసవం జరిగే సమయంలో శిశువు కొన్ని రక్షిత బ్యాక్టీరియాను తీసుకుంటుంది. అది వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, నార్మల్ డెలివరీ లో తల్లుల మరణాల రేటు తక్కువగా ఉంటుంది.

 

మరింత సమాచారం కోసం..

 

అయినప్పటికీ, యోని చుట్టూ వల్ల చర్మం లేదా కణజాలం శిశువు తల్లి ద్వారం గుండా ప్రయాణించేటప్పుడు సాగి పోవచ్చు. కొన్ని సందర్భాలలో చిరిగిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు నార్మల్ డెలివరీ వలన మూత్రము ఆపుకోలేని సమస్యలు కూడా తలెత్తుతాయి. మహిళలు తమ యోని మరియు పాయువు మధ్య ప్రాంతంలో నొప్పిని కూడా అనుభవిస్తారు. బిడ్డ పెద్దదిగా ఉండి , నార్మల్ డెలివరీ అయినట్లయితే ,  ఈ ప్రక్రియలో శిశువు కూడా గాయపడే ప్రమాదం ఉంది.

 

సిజేరియన్ డెలివరీ - లాభాలు మరియు నష్టాలు :

 

సిజేరియన్ ప్లాన్ చేయబడింది అంటే, ఇది తల్లి ప్రసవానికి మానసికంగా తనను తాను సిద్ధం చేసుకోవడానికి మరియు ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. మీరు మూత్రం ఆపుకోలేని సమస్యతో బాధపడే అవకాశం తక్కువ మరియు చిరిగిపోయే ప్రమాదం లేదు. మీరు ఆరోగ్యంగా బొద్దుగా ఉంటే బిడ్డకు జన్మం ఇవ్వబోతున్నట్లు అయితే సిజేరియన్ సమయంలో బిడ్డ గాయపడే ప్రమాదం నుండి తప్పించుకుంది. ఒకవేళ తల్లి హెచ్ఐవి వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే, శిశువుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా హెచ్ఐవి నుండి రక్షించడానికి సిజేరియన్ మంచి పరిష్కారంగా పరిగణించబడుతుంది.

 

మరింత సమాచారం..

 

సిజేరియన్ ప్రసవానికి ప్రణాళిక చేయబడినప్పటికీ మీ బిడ్డ ఇంకా పుట్టడానికి సిద్ధంగా ఉండక పోవచ్చు లేదా పరిపక్వత చెందకపోవచ్చు. గడువు తేదీ లెక్కింపు పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది శాస్త్ర చికిత్స ప్రక్రియ. ఇది భారీ రక్త నష్టానికి దారి తీస్తుంది. మరియు తల్లికి ఇన్ఫెక్షన్లు మరియు రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉంది. నార్మల్ డెలివరీతో పోల్చినట్లయితే హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండవలసి ఉంటుంది. మరియు కోలుకునేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మంది తల్లులు నార్మల్ డెలివరీని ఎన్నుకోవడానికి కారణం,ఆమెకు మొదటిసారి సిజేరియన్ డెలివరీ అయితే భవిష్యత్తులో కూడా సిజేరియన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఎక్కువ గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది.


ప్రసవం అంటే ఆరోగ్యకరమైన బిడ్డను సురక్షితంగా ప్రసవించడం. రెండింటిలోనూ దేనిలో ఉన్న నష్టాలు మరియు ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అందువలన మీరు ఎల్లప్పుడూ మీ వైద్యుని సలహాలు పాటించండి. మీకు మరియు మీ చిన్ని ఏంజెల్ కు ఉత్తమంగా ఉండే ఎంపికను నిర్ణయించుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}