• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

కేరళలో ఇద్దరు విద్యార్థులకు నోరోవైరస్: కారణాలు, లక్షణాలు మరియు ఇతర వివరాలు

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 07, 2022

కేరళలోని తిరువనంతపురంకి చెందిన ఇద్దరు  ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోరోవైరస్ అనే కొత్త అంటువ్యాధి సోకిన వార్త ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ చిన్నారులలో వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని నమూనాలను పరీక్షల కోసం పంపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయినట్టు  తెలుస్తోంది. 

నోరోవైరస్ అంటే ఏమిటి? 

నోరోవైరస్ అనేది వైరస్ వల్ల అతివేగంగా వ్యాప్తించే  అంటువ్యాధి, దీనిని కొన్నిసార్లు 'స్టమక్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఇది కలుషితమైన ఆహారం, నీరు మరియు పరిసరాల  ద్వారా వ్యాపిస్తుంది. ప్రాథమిక మార్గం ఆరార, విసర్జన అలవాట్ల వాళ్ళ ఇది సోకుతుంది. .

ఇది డయేరియా కలిగించే రోటవైరస్‌ని పోలి ఉంటుంది.  మరియు వయస్సుల వారికి సోకుతుంది. ఈ వ్యాధి వ్యాప్తి సాధారణంగా క్రూయిజ్ షిప్‌లలో, నర్సింగ్ హోమ్‌లు, డార్మిటరీలు మరియు ఇతర మూసి ఉన్న ప్రదేశాలలో సంభవిస్తుంది. 

WHO నివేదిక ప్రకారం, నోరోవైరస్ ఇన్ఫెక్షన్ పేగు మంట, పోషకాహార లోపంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం కావచ్చు.  ఏటా ప్రపంచవ్యాప్తంగా 685 మిలియన్ల నోరోవైరస్ కేసులు నమోదవుతున్నాయని అంచనా వేయబడింది, ఇందులో 5 ఏళ్లలోపు పిల్లల్లో 200 మిలియన్ కేసులు ఉన్నాయి.

లక్షణాలు ఏమిటి?

నోరోవైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు వాంతులు, అతిసారం.  ఇవి వైరస్‌కు గురైన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత కనిపిస్తాయి. రోగులు వికారంగా ఉన్నట్టు కూడా అనుభూతి చెందుతారు. వారి కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి మరియు శరీర నొప్పులతో బాధపడతారు. వ్యాధి  తీవ్రమైన సందర్భాల్లో, శరీర  ద్రవం కోల్పోవడం డీ హైడ్రేషన్ కి దారితీస్తుంది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?

నోరోవైరస్ వివిధ జాతులను కలిగి ఉన్నందున, ఇది చాలాసార్లు సోకవచ్చు. నోరోవైరస్ అనేక క్రిమిసంహారిణులకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది 60 ° C వరకు వేడిని తట్టుకోగలదు. అందువల్ల, ఆహారాన్ని వండటం లేదా నీటిని క్లోరినేట్ చేయడం వల్ల ఈ  వైరస్‌ చనిపోదు. ఇది సాధారణ హ్యాండ్ శానిటైజర్‌లను కూడా తట్టుకుంటుంది. 

దీని నివారణకు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు చాలా స్పష్టంగా ఉన్నాయి: లావెటరీని ఉపయోగించిన తర్వాత లేదా డైపర్లను మార్చిన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం. ఆహారం తీసుకునే ముందు లేదా ఆహారాన్ని సిద్ధం చేసే ముందు చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. నోరోవైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో, ఉపరితలాలను హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమిసంహారక౦ చేయాలి. 

వ్యాధి సోకిన వారు ఇతరులతో సమీపంగా ఉండటాన్ని నివారించాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ తరవాత రెండు రోజుల వరకు ఇతరులకు ఆహారాన్ని తయారు చేయకుండా ఉండాలి.

నోరోవైరస్ చికిత్స ఏమిటి?

వ్యాధి వ్యాప్తి సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ వాళ్ళ  రోగి  చాలా బలహీనం చేసిన్నప్పటికీ, ఇది సాధారణంగా రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. చాలా చిన్నపిల్లలు, వృద్ధులు  లేదా పోషకాహార లోపం ఉన్నవారు తప్ప, మిగిలినవారు  తగినంత విశ్రాంతి మరియు ద్రవాలను తీసుకోవడం ద్వారా  దాన్ని తగ్గించవచ్చు.

నోరోవైరస్ వాక్సిన్ ఉందా?

రియల్-టైమ్ రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనే విధానం  ద్వారా నోరోవైరస్ రోగనిర్ధారణ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. వ్యాధి తీవ్రంగా ఉంటె శరీరానికి ద్రవాలను అందిచాలి.  నిర్వహించడం ముఖ్యం. ఇంకా అవసరమైతే , రోగులకు నరాల ద్వారా  రీహైడ్రేషన్ ఫ్లూయిడ్‌లను అందించాలి.

https://indianexpress.com/article/explained/what-is-norovirus-stomach-bug-infected-students-kerala-7954041/

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}