మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచే ఈ 8 సందర్భాలను వదులుకోకండి.

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Aug 26, 2020

ఎంతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మనము కొన్ని సార్లు పిల్లలను తరచుగా కౌగిలించుకోవడం లేదా వారిని చూసి నవ్వడం
కూడా మానేస్తాము. ఆ క్షణాలను కోల్పోకండి. మీ పిల్లలతో సన్నిహితంగా ఉండడానికి మీరు చేయవలసిన 8
విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మీ పిల్లలతో ఈ 8 పనులు తప్పక చేయాలి:
మన పిల్లలతో ఎటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలో మన అందరికీ తెలుసు. అద్భుతమైన క్షణాలను భద్ర
పరుచుకోవడానికి కొన్ని గొప్ప ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. పరిశీలించండి.
మీ పిల్లల మీద ఆసక్తి చూపండి :
పిల్లల విషయంలో ఎప్పుడూ ఆసక్తిగా ఉండండి. పిల్లలతో మీరు మాట్లాడే సమయంలో హృదయ పూర్వకంగా , శ్రద్ధగా
మాట్లాడండి. మీ ఇమెయిల్ ను మరియు మెసేజెస్ ను వారు నిద్రపోయే వరకు వేచి ఉండనివ్వండి.
వారితో ప్రయాణించే సమయంలో వారు చెప్పేది శ్రద్ధగా వినండి :
పిల్లలతో కలిసి మీరు కారులో ప్రయాణం చేసేటప్పుడు వారికి చేసేదేమీలేక మీతో మాట్లాడాలని ఎంతో ఆసక్తి
చూపుతారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. దాని నుండి మీరు ఎంతో నేర్చుకుంటారు. సూటిగా వారిని ప్రశ్నించే
బదులు వారి మాటల ద్వారానే మీరు ఎంతో తెలుసుకుంటారు.
పిల్లలను ఎప్పుడూ బిజీగా ఉంచాలి అనుకోకండి :
ప్రతిరోజు వారికంటూ కొంత సమయాన్ని ఇవ్వండి. యాక్టివిటీ క్లాసెస్ కంటే కూడా ఆత్మ పరిశీలన మరియు
సమాజాన్ని పరిశీలించడం ద్వారా పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.
వారి స్నేహితులను ప్రేమించండి :
వారి స్నేహితులను ప్రేమించండి . ఎందుకంటే వారు వారి స్నేహితులను ప్రేమిస్తారు. వారి స్నేహితులను ఇంటికి
తీసుకురావడానికి, వారి గురించి మీతో బహిరంగంగా మాట్లాడడానికి అనుమతించండి. అది భవిష్యత్తులో వారితో
ఉన్న సంబంధాల గురించి మీతో మాట్లాడటానికి భరోసా కలిగించేలా చేస్తుంది.
జ్ఞాపకాలను భద్రపరచండి :
పిల్లలు పెద్దయ్యాక చిన్ననాటి జ్ఞాపకాలను తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. అందుకే వారి చిన్ననాటి
జ్ఞాపకాలను అన్నిటినీ భద్రపరచండి.
రహస్యాలు పంచుకోండి :
చిన్న చిన్న సరదా విషయాలను కూడా పిల్లలతో పంచుకోండి. ముసిముసినవ్వులు మరియు గురక ఇలాంటి చిన్న
చిన్న విషయాలు కూడా పిల్లలతో పంచుకుంటూ సరదాగా గడపండి.
ప్రత్యేకమైన కారణం లేకుండా కూడా కౌగిలించుకోండి :
మధురమైన ఏ క్షణాన్ని వదిలి పెట్టకండి. పిల్లలను సంతృప్తిగా ఉంచండి. ఈరోజు క్లాస్ ఎలా ఉంది అనేలాంటి ప్రశ్నలు
అడిగే కంటే కూడా చిరునవ్వుతో ఈరోజు ఎలా ఉంది అని అడగండి. ఆ ప్రశ్నల మధ్య ఎంతో వ్యత్యాసాన్ని కనుగొంటారు.
మీరు మీ పిల్లలను చూసిన ప్రతిసారి నవ్వండి :
స్కూల్ ఎలా ఉంది , క్లాస్ఎలా ఉంది, ఆ ఎగ్జామ్ ఎలా రాశావు అనేటటువంటి ప్రశ్నలను అడిగే కంటే ముందు
చిరునవ్వుతో పలకరించండి. ఆ రెండింటికి మధ్య పిల్లలు ఎంతో వ్యత్యాసాన్ని చూస్తారు.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}