• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్

స్క్రీన్ పై హింస మీ బిడ్డను ప్రభావితం చేస్తుందా ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 23, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

 

టెక్నాలజీని తెలివిగా ఉపయోగిస్తే మీ పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది. చిన్నపిల్లలు వీడియోల ద్వారా అక్షరాలు, సంఖ్యలు, ఆకృతుల భావనలు మొదలైనవి త్వరగా నేర్చుకుంటారు. వివిధ రకాలుగా ప్రదర్శించడం వలన త్వరగా నేర్చుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

 

ఈ రోజులలో పిల్లలు, పెద్దవారు మరియు వృద్ధులు కూడా స్క్రీన్ ల ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది మీ పిల్లల ప్రవర్తన మీద మరియు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పెద్దల కంటే కూడా ఒకటి నుండి మూడు సంవత్సరాల వైద్య వయస్సు గల పిల్లలు స్క్రీన్ లపై మూడు రెట్లు ఎక్కువగా గడుపుతున్నారు. ఈ రంగంలో పని చేస్తున్న పలువురు బాలల నిపుణులు స్క్రీన్ పై కనిపించే హింస పిల్లలపై చెడు ప్రభావాలను చూపిస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఈ రంగంలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం రోజుకు మూడు నుండి నాలుగు గంటల పాటు స్క్రీన్ను చూడడం ద్వారా వారి ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసే లోపల 8 వేల మర్డర్ లను చూడడం పూర్తి చేస్తారు. మార్కెట్లో హాట్కేకుల్లా గా అమ్ముడు పోయే అనేక ఇంట్రాక్ట్ ఆటలను పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

 

స్క్రీన్ పై హింసకు మరియు వీధి హింసకు మధ్య సంబంధం ఉందా ? స్క్రీన్ పై హింస 100% ఖచ్చితంగా వీధి హింసకు దారి తీస్తుందని మేము చెప్పలేనప్పటికీ, దాన్ని అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేము.

 

స్క్రీన్ పై హింస పిల్లలను ఎందుకు ప్రభావితం చేస్తుంది ?

 

స్క్రీన్ పై హింస రకాలు (ఆటలు మరియు చలన చిత్రాలలో) మరియు పిల్లల పై వారి ప్రభావం పై ఆసక్తికరమైన అధ్యయనం ఎక్కడ ఉంది..

 

హింసకు ప్రతిఫలం :

 

అనేక ఆటలు మరియు చలన చిత్రాలలో, హింసాత్మక చర్యలకు బహుమతి ఇవ్వబడుతుంది లేదా శిక్ష పడదు. చాలా మంది పిల్లలు శిక్ష పడకపోవడంను హింసను  ప్రోత్సాహంగా భావించవచ్చు. దానికి తోడు బహుమతి ఇవ్వడం అన్నది కేక్ పై ఐసింగ్ మాదిరిగా తీసుకుంటారు.

 

హింసను వాస్తవికంగా చిత్రీకరించడం :

 

తెరపై చాలా హింసాత్మక చర్యలు వాస్తవికంగా చిత్రీకరించబడతాయి. మానవీయంగా సాధ్యమయ్యే తెరపై హింసతో పిల్లలు ప్రభావితం అవుతారు. వారు దానిని అనుకరించే ధోరణి చూపుతారు.

 

దూకుడు పాత్రలను రోల్ మోడల్ గా తీసుకోవడం మరియు హింసను సమర్థించడం :

 

చాలా మంది పిల్లలు తెరపై పాత్రలను రోల్ మోడల్ గా చూస్తారు. మానవాళిని కాపాడటానికి అవసరమైన హింసను చిత్రీకరించిన మానవాతీత హీరో వైపు పిల్లలు ఆకర్షితులవుతారు. ఈ సమర్పించబడిన హింసను అనుసరించే అవకాశం ఉంది. పిల్లలు దురుసుగా ఉండే పాత్రలతో తమని తాము పోల్చుకున్నట్లయితే, వారు కూడా దూకుడుగా మారే అవకాశం ఉంది.

 

అధిక హింస :

 

అత్యధిక హింసాత్మకంగా ఉండే దృశ్యాలు వారిని మానసికంగా ఉత్తేజపరిచి దూకుడుగా మారడానికి దారితీస్తాయి. పిల్లలు ఆ పాత్రలను సొంతం చేసుకొని నిజజీవితంలో హింసను అనుకరించడానికి ప్రయత్నించవచ్చు.

 

3 నుండి 7 సంవత్సరాల వయసులో స్క్రీన్ పై హింస ప్రభావం :

 

మూడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఇతరులను అనుసరించే ధోరణిని కలిగి ఉంటారు అని మనకు తెలుసు. వారు తల్లిదండ్రులను లేదా వారికి దగ్గరగా ఉన్న వారిని అనుసరించవచ్చు. అదేవిధంగా, వారు తెరపై చూసే దృశ్యాలను కూడా అనుకరించే ధోరణి కలిగి ఉంటారు. మీ పిల్లలు చలన చిత్రాలు లేదా కార్టూన్లలో హింసలు చూసినట్లయితే అది  అతనిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రీ స్కూల్ పిల్లలు కూడా స్క్రీన్ పై చూసే హింసకు గురై దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది అని మీకు తెలుసా ? అదేవిధంగా, చాలా మంది పిల్లలు స్క్రీన్పై హింసాత్మక దృశ్యాలు చూసినప్పుడు వారిలో మానసిక సమస్యలు, పీడకలలు మరియు నిద్రపోకపోవడం లాంటివి జరుగుతాయి. నిజమైన హింస నొప్పి మరియు వేదన కలిగిస్తుందని పెద్ద పిల్లలకు తెలుసు. చిన్నపిల్లలు హింస అంటే నొప్పి లేనిది కొన్నిసార్లు సరదా అయినది అని కూడా అనుకుంటారు. పిల్లలు కుటుంబము మరియు పరిసరాల నుండి నేర్చుకున్నట్లు స్క్రీన్ నుండి కూడా మంచి మరియు చెడు అలవాట్లను కూడా నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు వీటిని చూసి గొడవలు పడటం మరియు హింసను ఆస్వాదించడం నేర్చుకుంటారు.

 

7 నుండి 11 సంవత్సరాల వయస్సులో స్క్రీన్ పై హింసల ప్రభావం :

 

ఈ వయసు పిల్లలు హింసను మాత్రమే చూడరు. మరోవైపు, వారు అందులో పూర్తిగా లీనమై హింసాత్మక సంఘటనలలో చురుకుగా పాల్గొంటారు. ఇది ఈ వయసు వారిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వారు అందులో చూసే ఆటలు సమాజంలో ఉన్నాయనే ఆలోచన, నిజ జీవితంలో వారు వీడియో గేమ్ కథానాయకుడిగా ఉండాలని కోరుకుంటారు. వారిలో కోపము, హింస అనేటటువంటి లక్షణాలు తలెత్తవచ్చు. ఆ వయస్సులో అవి హానికరంగా లేనప్పటికీ, వయస్సు పెరుగుతున్న కొద్దీ అవి చెడు ప్రభావం చూపిస్తాయి.

 

11 నుండి 16 సంవత్సరాల వయస్సులో స్క్రీన్ పై హింస ప్రభావం :

 

వీడియో గేమ్స్, ఇంటర్నెట్ గేమ్స్ మొదలైనవి ఎంతో జనాదరణ పొందాయి. మరియు ఎంతోమంది టీనేజర్లు వారానికి 40 గంటల పాటు వీటిని ఆడుతున్నారు. 17 సంవత్సరాల లోపు పిల్లలకు ఎం రేటెడ్ ఆటలు మంచిది కాదు. ఈ వయసులో ఉన్న పిల్లలు నిస్సందేహంగా చిన్న వారి కంటే ఎక్కువ పరిణతి చెంది ఉంటారు. కానీ వారిలో ఇంకా చిన్నతనం ఉంటుంది మరియు యువతలో ఉండే జ్ఞానం వారికి ఉండదు. ఈ కాలం మీడియాతో సమస్య ఏమిటంటే, వారు ఉద్దేశ్యపూర్వకంగా చేసినా లేదా చేయక పోయినప్పటికీ కూడా వారి మీద దాని ప్రభావం పడుతుంది. చిన్న వయస్సులోనే మద్యం, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు మరియు లైంగిక కార్యకలాపాలను దొంగచాటుగా మరియు సరదాగా చూడడం కారణం కావచ్చు. ఇలాంటి దృశ్యాలను చూడనివారి కంటే కూడా చూస్తున్న పిల్లలు లైంగిక కార్యక్రమాలలో ముందుగానే పాల్గొనడానికి అవకాశం ఉంది అని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. టీవీలో పొగత్రాగడం మరియు మద్యం సేవించడం ఏ విధంగా ఆమోదయోగ్యంగా ఉంటాయో అదేవిధంగా వీటిని కూడా వారు ఆమోదయోగ్యంగా భావించి ఎన్నో సమస్యలకు గురవుతున్నారు.

 

తల్లిదండ్రులు ఏమి చేయగలరు ?

 

ఈ రోజుల్లో, హింస అనేది అక్షరాల ప్రతిచోట ఉంది. ఇది వీడియో గేమ్స్, సినిమాలు, పుస్తకాలు మరియు మ్యూజిక్ వీడియోలలో ఉంది. మీరు వార్తల కోసం టీవీ ఆన్ చేసినప్పుడు సానుకూల వార్తలు కంటే హింసాత్మకమైన వార్తలు మీకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ప్రభావం కార్టూన్లు మరియు వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపిస్తుంది. సంక్షిప్తంగా, మీరు మీ బిడ్డను హింస నుండి పూర్తిగా రక్షించలేరు. హింస యొక్క చెడు ప్రభావాలను పిల్లలు తెలుసుకోవాలి. అహింసను నమ్మే వ్యక్తిని ఏ ఒక్కటి దూకుడుగా మార్చగలదు. అయినప్పటికీ, స్క్రీన్ పై హింస పిల్లలపై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు తల్లిదండ్రులు కావడం వలన , మీ పిల్లలను రక్షించుకోవడానికి మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పగలము. స్క్రీన్ పై హింస యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మీ పిల్లలను రక్షించడం మరియు చెడు ప్రభావాలు నుండి అతనికి మార్గనిర్దేశం చేయడం మీ కర్తవ్యము.

 

ఏడు సంవత్సరాలు మరియు అంత కంటే తక్కువ వయసున్న పిల్లల తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు :

 

మీ పిల్లలు ఏమి ఆడుతున్నారో మరియు ఏమి చూస్తున్నారో ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండండి.

 

పిల్లలు చూసే దానిని అనుకరిస్తు మరియు దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు గమనించినట్లయితే వాటి నుండి పిల్లలను దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మరణాలు మరియు తీవ్రమైన గాయాలకు దారితీసే హింసను చూడడం నివారించాలి.

 

స్క్రీన్ పై మీ పిల్లలను పరిమితం చేయండి. రోజుకి 20 నిమిషాల నుండి ఒక గంట వరకు మాత్రమే చూడడానికి అనుమతించండి.

 

పిల్లలను హింసాత్మకమైన ఆటల నుండి విద్య అనువర్తనాలకు అలవాటు చేయండి.

 

పిల్లలతో కలిసి కూర్చోవడానికి ప్రయత్నించండి. దౌర్జన్యాలు మరియు పోరాటాలు చూస్తూ ఉన్నప్పుడు అవి ఎంత చెడ్డవొ  సున్నితంగా వివరించి చెప్పండి.

 

పిల్లలు వయసుకు తగిన సినిమాలు చూడటానికి మరియు వయస్సుకు తగిన ఆటలను ఆడడానికి మాత్రమే అనుమతించండి.

 

7 నుండి 11 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు :

 

హింస, సెక్స్ లేదా పొగాకు మరియు మద్యపానం వంటి అనుచితమైన వాటిని కలిగి ఉన్న ఆటలను పిల్లలను ఎప్పుడు ఆడనివ్వకండి. ఆ వయస్సులో అవి పిల్లలపై కచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

 

హింస యొక్క నిజమైన పరిమాణాలను మీ పిల్లలకు వివరించండి. హింస ఎప్పుడు పరిష్కారంకాదని, తెరపై వారు చూపేది అవాస్తవమని ఒక ఉదాహరణతో వారికి వివరించి చెప్పండి.

 

స్క్రీన్ పై వచ్చే హింసాత్మక సంఘటనలతో పిల్లలు ఎక్కువ సమయం గడపనివ్వకండి. వారు హింసాత్మక సంఘటనలను ఎక్కువ సమయం చూస్తున్నప్పుడు దాని ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది.

 

ఈ వయస్సు పిల్లలు ఆ ఆటలు మరియు చలన చిత్రాల నుండి గ్రహించే మరొక చెడ్డ విషయం భాష. చెడు భాష మాట్లాడటం కూడా హింస అని మీ పిల్లలకు అర్థమయ్యేలా చేయండి. మంచి పదజాలంతో ఉన్నతంగా మాట్లాడడం అలవాటు చేయండి.

 

పిల్లలను చూడడానికి అనుమతించే ముందు ఆటలు మరియు చలనచిత్రాల రేటింగులను తనిఖీ చేయడం ఎంతో ముఖ్యం. ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియోలను చూడడానికి వారిని ఎప్పుడూ అనుమతించవద్దు. ఈ వీడియోలకు రేటింగ్ ఇవ్వబడదు మరియు ఎంతో చెడు అంశాలను కలిగి ఉండవచ్చు.

 

రక్తపాతం లేనంతవరకు పిల్లవాడు కత్తిసాము లేదా గన్ ప్లే లను ఆడటం నివారించవలసిన అవసరంలేదు. గోరె లేదా గ్రాఫిక్ హింసలు దగ్గరనుండి చూడకుండా జాగ్రత్త తీసుకోండి.

 

కంప్యూటర్లు మరియు టీవీని  అందరూ  ఉండే హాలులో లేదా కుటుంబ సభ్యులు అందరూ ఉండే ప్రదేశాలలో ఉంచండి. పిల్లలకు ప్రత్యేకమైన స్క్రీన్లు ఇవ్వకండి.

 

11 నుండి 16 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రుల కోసం చిట్కాలు :

 

మీ పిల్లవాడు కొనమని అడిగే వీడియో మరియు కంప్యూటర్ ఆటల వివరాలను అన్వేషించండి లేదా కొనడానికి ప్రయత్నించండి. లేదంటే వారు తమ స్నేహితుల దగ్గర నుండి అప్పు తీసుకుంటారు. మీరు ఆ తరువాత ఆటలు మరియు సినిమాలను పర్యవేక్షించవచ్చు.

 

హింస యొక్క చెడు ప్రభావాలను వారి సమక్షంలోనే చర్చించండి. కొన్ని వార్తలకు సంబంధించి నిజజీవితంలో జరిగే సంభాషణలను వారితో పంచుకోండి.

 

టీవీలో మంచి కార్యక్రమాలను పిల్లలతో కలిసి చూడడాన్కి కొంత సమయాన్ని వెచ్చించండి. అది మీకు మరియు మీ పిల్లలకు విశ్రాంతినిస్తుంది.

 

మీ పిల్లలు స్క్రీన్ కి అతుక్కుపోకుండా చూసుకోండి. మరియు వారు స్నేహితులతో కలిసి కొంత సమయం బహిరంగ ఆటలతో సమయం గడపడానికి సమయాన్ని ఇవ్వండి .

 

కుటుంబం అంతా భోజనం చేసే సమయంలోనూ మరియు నిద్ర పోయే సమయంలోనూ అన్ని స్క్రీన్లను ఆపివేయాలని కచ్చితంగా తెలపండి.

 

మీ యుక్తవయసులో ఉన్న పిల్లల బెడ్ రూమ్ కర్టెన్లను తెరిచి ఉంచండి.

 

కంప్యూటర్ను అందరూ ఉండే గదిలో ఉంచండి. తద్వారా వారు ఏమి చేస్తున్నరో మీరు గమనించవచ్చు.

 

యుక్త వయస్సులో పిల్లలు ఉన్న రూమ్ కి ఎటువంటి తెరలు లేకుండా చూడాలి.


మీ పిల్లలకు ఇంటర్నెట్ భద్రత మరియు సోషల్ మీడియాల గురించి ప్రతి దానిని జాగ్రత్తగా తెలియజేయండి. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడం లేదా సెక్స్టింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను వారికి నేర్పండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}