సిజేరియన్, నొప్పి లేకుండానే ఎంటోనాక్స్ తో సహజ ప్రసవాలు

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jun 15, 2022

సహజ ప్రసవమే తల్లి-బిడ్డల ఆరోగ్యానికి మేలు అని తెలిసినా.. నేటి మహిళలు పురిటి నొప్పులంటే ఉన్న భయంతో సిజేరియన్ ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో ఆపరేషన్ ప్రసవాలకు అడ్డుకట్ట వేసి, అధిక సహజ ప్రసవాలకు వీలు కలిగించే ఉద్దేసంతో తెలంగాణా రాజదాని హైదరాబాద్ లోని కింగ్ కోఠీ జిల్లా ఆస్పత్రి వైద్య బృందం ఓ కొత్త ముందడుగు వేసింది. గర్భిణీలకు ఎంటనాక్స్ వాయువును వాడి నొప్పి తెలియకుండా సహజ ప్రసవం చేసేందుకు తెరతీసింది. ఆ రాష్ట్ర వైద్య, ఆరోగయ శాఖ మంత్రి హరీష్ రావు దీని ఫలితాలపై ప్రత్యెక శ్రద్ధ కనపర్చడంలో ఈ అంశం అంతటా చర్చనీయంశమై౦ది. ఈ నేపధ్య౦లో, ఈ వైవిధ్యమైన డెలివరీ విధానాన్ని గురించి ముఖ్య విషయాలు.. ఇవిగో మీకోసం.
ఎంటోనాక్స్ అంటే ఏమిటి?
ఎంటోనాక్స్ గ్యాస్ అనేది నైట్రస్ ఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మిశ్రమం. మీరు దానిని మౌత్ పీస్ లేదా మాస్క్ ద్వారా పీల్చుకోవచ్చు.
ఎంటోనాక్స్ ఎ౦దుకు?
ప్రసవ వేదన అనేది మానవులలో అత్యంత తీవ్రమైన నొప్పి కలుగచేస్తుంది. ప్రసవ నొప్పి అంటే ఉన్న భయం, ఈ రోజుల్లో సిజేరియన్ సెక్షన్ (CS) కు అత్యంత ముఖ్యమైన కారణం. కాగా, ఎంటోనాక్స్ ప్రసవ నొప్పి సమయంలో సురక్షితమైన బాధ నివారిణిగా పనిచేస్తుంది. ఇది బాధాకరమైన ప్రసవ సమయంలో త్వరగా పనిచేస్తుంది. దీనిని లాఫింగ్ గ్యాస్ లేదా గ్యాస్ అని కూడా అంటారు.
ప్రసవంలో గ్యాస్ ఎలా పనిచేస్తుంది?
మీకు ప్రసవ సమయంలో, భరించలేని నొప్పులు మొదలైనపుడు ఈ ఎంటోనాక్స్ సిలేండరుకు పైపుకు కనెక్ట్ చేసి, మౌత్ పీస్ లేదా మాస్క్ ను అమర్చి మీ చేతికి ఇస్తారు. గ్యాస్ కావాలనుకున్నప్పుడు మౌత్ పీస్ లేదా మాస్క్ పెట్టుకోండి. అప్పుడు మీరు లోతైన శ్వాస తీసుకోండి. మీరు పీల్చే గ్యాస్ మొత్తం, మీరు ఎంత గట్టిగా మరియు వేగంగా ఊపిరి పీల్చుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది.
ఎలా వాడాలి?
చాలా మంది మహిళలు నొప్పుల సమయంలో మాత్రమే వాయువును ఉపయోగిస్తారు. కానీ ఇది పని చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, నొప్పులు మొదలు కావటానికి కాస్త ముందే లేదా మొదలైన వెంటనే ఎంటోనాక్స్ ను శ్వాస ద్వారా తీసుకోవడం ఉత్తమం. మౌత్‌పీస్ లేదా మాస్క్‌ని పట్టుకోమని ఎవరినీ అడగవద్దు. మీరు దానిని మీ అదుపులో ఉంచుకోవాలి. మీకు కావలసిన సమయంలో పీల్చవచ్చు, అక్కరలేదు అనుకున్నపుడు పీల్చడం మానేయవచ్చు.
ఎంటోనాక్స్ సురక్షితమేనా?
మహిళల ప్రసవ సమయంలో ఎంటోనాక్స్ గ్యాస్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
-
దీనిని ప్రసవం యొక్క ఏ దశలోనైనా ఉపయోగించవచ్చు.
-
ఇది మీ బిడ్డపై ప్రభావం చూపదు.
-
దేని ప్రభావం మీ శరీరంలో చాలా కాలం పాటు ఉండదు.
-
మీరు ఉపయోగించే గ్యాస్ మొత్తాన్ని మీరే నియంత్రించవచ్చు.
-
మీరు నొప్పుల మధ్య స్థానాన్ని తరలించవచ్చు మరియు మార్చవచ్చు.
-
ఇది లయబద్ధంగా శ్వాస తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
-
ఇది నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ప్రసవ సమయంలో నైట్రస్ ఆక్సైడ్ ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
-
ఇది కొంతమంది మహిళలకు పాక్షికంగా మాత్రమే ప్రభావవంతం. అంటే నొప్పిని పూర్తిగా తగ్గించదు.. నేమ్మదిన్చేలా చేస్తుంది.
-
కొన్ని రకాల వైద్య సమస్యలు ఉన్నవారు దీనిని ఉపయోగించకూడదు.
-
నిద్ర కోసం వాడే పెథిడిన్ వంటి మందులను తీసుకుంటే మీరు నైట్రస్ ఆక్సైడ్‌ను ఉపయోగించకూడదు.
దుష్ప్రభావాలు
-
నైట్రస్ ఆక్సైడ్ మీ బిడ్డపై ఎటువంటి చెడు ప్రభావాలను చూపదు. అయితే, ఒకోసారి మీకు మైకము, తల తిరగడం, వికారం లేదా వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు.
-
ప్రత్యేకించి ఎవరైనా మౌత్ పీస్ లేదా మాస్క్ పట్టుకుని ఉంటే, మీకు ఓవర్ డోస్ అయి మగత లేదా కొద్దిసేపు స్పృహ కోల్పోవచ్చు.
అధిక మోతాదు అసంభవం
అక్కరలేదు అన్నపుడు మీరు దానిని శ్వాసించడం ఆపివేయవచ్చు మరియు అది మీ శరీరం నుండి దాదాపు 5 నిమిషాలలో బయటకు పోతుంది. మీరు మౌత్‌పీస్ లేదా మాస్క్‌ని వదలాగానే కొన్ని సెకన్లలో వాస్తవ స్థితికి తిరిగి వస్తారు.
కాగా, తెలంగాణా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, జిల్లా ఆస్పత్రుల్లో ఎంటోనాక్స్ సేవలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే, అత్యధిక శాతం సిజేరియన్ ప్రసవాలకు తెర పడ్డట్టే! పై విషయమై మీ సలహాలను, అభిప్రాయాలను, సందేహాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు