• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమేనా ?

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Sep 29, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

బొప్పాయిలో అధిక పోషక విలువలు ఉన్నందున దీనిని " దేవదూత పండు" గా పరిగణిస్తారు. ఏది ఏమైనప్పటికీ, గర్భం అనేది అన్నిటినీ మారుస్తుంది. ముఖ్యంగా తల్లి కాబోతున్న వారి ఆహారపు అలవాట్లను. పోషక విలువలను పక్కనపెడితే, అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండవు. అటువంటి వాటిలో బొప్పాయి ఒకటి. ఇది గర్భధారణ సమయంలో అంతగా సురక్షితం కాదు అని భావించ బడుతుంది. గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం అనేది  ఎల్లప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. పండిన బొప్పాయిని తినే విషయంలో  డాక్టరు నన్ను నిరోధించనప్పటికీ, మా కుటుంబ పెద్దలు సాంప్రదాయం ప్రకారం దీనిని పూర్తిగా నివారించాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే , నేను అక్షరాల బొప్పాయిని ఇష్టపడుతున్నాను. ఇది నన్ను ఆలోచింప చేసింది. గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం నిజంగా హానికరమా ? బొప్పాయి మరియు గర్భం గురించి నేను సేకరించిన సమాచారం తెలుసుకోవడానికి దీనిని చదవండి..

 

మరింత సమాచారం

 

గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం సురక్షితమెనా?

 

బొప్పాయి బాగా పండినట్లయితే గర్భధారణ సమయంలో తినడం పూర్తిగా సురక్షితం. వాస్తవానికి పూర్తిగా పండిన బొప్పాయిని మితమైన పరిమాణంలో తినడం గర్భధారణ సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ మరియు బి, పొటాషియం మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అయితే, సగం పండిన మరియు పండని బొప్పాయిని తినడం వల్ల ప్రమాదం వస్తుంది. పండని మరియు పాక్షికంగా పండిన బొప్పాయిలో రబ్బరు పాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది .  గర్భస్రావం మరియు చనిపోయిన బిడ్డలు పుట్టడం వంటి గర్భధారణ సమస్యలకు దారి తీస్తుంది.

 

గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల పోషక ప్రయోజనాలు ఏమిటి ?

 

బొప్పాయి ఒక పోషక శక్తి కేంద్రము. ఇది మంచి అల్పాహారంగా పనిచేస్తుంది మరియు ఇది జుట్టు , చర్మం మరియు జీర్ణ వ్యవస్థకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మనందరికీ తెలుసు. నా జీవితంలో చాలా ముఖ్యమైన మరియు సున్నితమైన సమయంలో దానిని తినడం మానేయడానికి నేను ఇష్టపడటంలేదు. గర్భధారణ సమయంలో పూర్తిగా పండిన బొప్పాయిని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో బొప్పాయిని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి..

 

మరింత సమాచారం..

 

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :

 

పండిన బొప్పాయి లో బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మరియు విటమిన్ సి, ఈ కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

 

మలబద్ధకము నుండి ఉపశమనం :

 

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మలబద్దకం అనేది గర్భధారణ సమయంలో ఒక సాధారణ సమస్య.

 

గ్యాస్టిక్ రుగ్మతలను పరిష్కరించడానికి సహాయపడుతుంది :

 

పండిన బొప్పాయి తినడం వల్ల ప్రేగు కదలిక తగ్గుతుంది. అందువలన కడుపులో ఆమ్ల నిర్మాణాన్ని తటస్థం చేయడానికి సహాయపడుతుంది. అందువలన గర్భధారణ సమయంలో పండిన బొప్పాయి తినడం వల్ల గుండెల్లో మంటను నివారించడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా తలెత్తే గ్యాస్ సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

 

విటమిన్లు మరియు ఖనిజాలు యొక్క గొప్ప మూలం :

 

పండిన బొప్పాయిలో విటమిన్ ఏ, బి , సి మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఇవి కీలకమైనవి. అందువల్ల పండిన బొప్పాయి తినడం గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యానికి మరియు పిండం యొక్క అభివృద్ధికి సహాయ పడుతుంది.

 

పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది :

 

బొప్పాయిలో ఫోలిక్ యాసిడ్ అధికమైన మొత్తంలో ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో చాలా ముఖ్యమైనది .ఎందుకంటే గర్భధారణ సమయంలో రక్తం యొక్క అవసరం 50 శాతం వరకు పెరుగుతుంది.

 

వికారంను అరికడుతుంది :

 

బొప్పాయిని అల్పాహారం  లేదా భోజనంలో గాని తీసుకోవడం వలన ఉదయాన్నే వచ్చే అనారోగ్యం మరియు వికారంను అరికడుతుంది.

 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

 

బొప్పాయి పెద్ద ప్రేగులో సంభవించే క్యాన్సర్ కు ఎంతో మంచిదని నిరూపించబడింది. మరియు గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

 

మరింత సమాచారం...

 

గర్భధారణ సమయంలో పండని బొప్పాయి తినడం :

 

గర్భధారణ సమయంలో పండని బొప్పాయి తినడం వలన గర్భం యొక్క సాధారణ పురోగతికి మరియు పిండం అభివృద్ధికి ముప్పు కలిగిస్తుంది . మరియు సగం పండిన బొప్పాయిలో రబ్బరు పాలు అనే పదార్థం ఉంటుంది . రబ్బరు పాలలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది .ఈ ఎంజైమ్ గర్భం యొక్క ఆరోగ్యకరమైన పురోగతికి మరియు పిండం అభివృద్ధికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.

 

గర్భధారణ సమయంలో పండని లేదా సగం పండిన బొప్పాయి వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎక్కడ ఉన్నాయి :

 

పాపైన్ అని ఎంజయియ్ పిండం యొక్క ముఖ్యమైన పొరను బలహీనపరుస్తుంది. అందువలన పిండం యొక్క మనుగడకు ఆటంకం కలిగిస్తుంది. గర్భం యొక్క ప్రారంభ దశలలో పిండం చాలా సున్నితంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. మాంసం లాంటి వంటకాలు బాగా ఉడకడానికి రబ్బరు పాలు ఉపయోగించబడతాయి. కాబట్టి సున్నితమైన పిండం యొక్క పెరుగుదలకు ఇది ఎంత హాని చేయగలదో ఊహించుకోండి.

 

పండని బొప్పాయి లోని ఎంజైమ్లు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. ఇది అంతర్గత రక్తస్రావము మరియు రక్తస్రావానికి కారణం అవుతాయి. రక్తస్రావం చాలా తక్కువగా అనిపించినప్పటికీ ఇది పిండం యొక్క అభివృద్ధికి మరియు పెరుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 

పండని బొప్పాయిలోని ఎంజైమ్ లు ఎడేమ లేదా ద్రవం నిలుపుదలకు కూడా కారణం అవుతాయి. దీని వలన రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన పిండం పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

 

పండని బొప్పాయిలోని రబ్బరు పాపైన్ మరియు చైమోపాపైన్ అనే రెండు ప్రధాన ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. ఈ ఎంజైములు పిండం యొక్క శారీరక వైఫల్యాలకు దారితీస్తాయి లేదా గర్భస్రావానికి కూడా అవకాశం ఉంటుంది.

 

గర్భం యొక్క మూడవ త్రైమాసికంలో పండని బొప్పాయి తినడం ముందస్తు గర్భాశయ సంకోచాలను పెంచుతుంది. తద్వారా అకాల ప్రసవానికి దారితీస్తుంది.

 

గర్భధారణ తొలి దినాలలో బొప్పాయి తినడం వలన గర్భస్రావం అవుతుందా ?

 

బొప్పాయిలోని  పపైన్ మరియు చైమో పపైన్ అనే రెండు ఎంజైములు కారణంగా అనేక ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో అభర్తోఫేసీఎంట్ గా ఉపయోగిస్తారు. మహిళలు తమ రుతుక్రమాల సమయంలో  పచ్చి బొప్పాయిని నీటితో ఉడికించుకొని ఎక్కువగా తింటారు. పండని బొప్పాయిలోని రబ్బరుపాలు గర్భాశయ సంకోచానికి కారణం అవుతాయి. అధిక మొత్తంలో తీసుకునే సి విటమిన్ కూడా రుతుక్రమాన్ని ప్రేరేపిస్తాయి. అందువలన పండని బొప్పాయి తినడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మరికొన్ని కారణాలు...

 

బొప్పాయి ప్రేగు కదలికకు సహాయపడుతుంది. కానీ అధికమైన ప్రేగు కదలికలు గర్భాశయంపై ఒత్తిడి తెచ్చి గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో పండిన బొప్పాయిని కూడా అతిగా తినడం వలన గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

 

బొప్పాయి యొక్క రబ్బర్ పాలలో ఉండే ఎంజాయ్ అయిన పాపైన్ గర్భాశయం యొక్క సంకోచాన్ని ప్రేరేపిస్తుంది . తద్వారా గర్భస్రావం జరుగుతుంది.

 

పచ్చి బొప్పాయిలోని రబ్బరు పాలు ప్రోస్టాగ్లాండిన్స్  మరియు ఆక్సిటోసిన్ యొక్క ఏజెంట్ల వలే పనిచేస్తాయి. ఈ రెండు హార్మోన్ల కారణంగా గర్భస్రావానికి దారితీస్తుంది.

 

గర్భధారణలో  దశలో బొప్పాయి తినకూడదు ?

 

గర్భం యొక్క ఏ దశలో కూడా పండని బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే  అందులోని రబ్బరుపాలు పిండం యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయి. లేదా గర్భస్రావం జరగడానికి కూడా కారణం అవుతాయి.

 

మీకు గతంలో గర్భస్రావం అయిన సందర్భాలు ఉన్న లేదా అకాల ప్రసవాల చరిత్ర ఉన్న కూడా బొప్పాయిని తినకూడదు.

 

మీరు గర్భధారణ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు లేదా ఎన్నో ప్రయత్నాల తరువాత గర్భం ధరించిన సమయంలోనూ బొప్పాయిని తినకూడదు.

 

నీకు రబ్బరుపాలు అలర్జీ గా ఉంటే బొప్పాయి తినడం మానుకోండి. గర్భధారణ సమయంలో రబ్బరు పాల అలర్జీ లక్షణాలు ఉన్నట్లయితే తల్లికి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవుతుంది.

 

మీకు గర్భధారణ సమయంలో మధుమేహం చరిత్ర ఉన్నట్లయితే బొప్పాయి తినడం మానుకోండి.

 

గర్భధారణ సమయంలో బొప్పాయి మిల్క్ షేక్ తీసుకోవచ్చా ?


పండిన బొప్పాయి యొక్క గుజ్జును, పాలు మరియు  తేనె కలిపి మీరు బొప్పాయి మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. వీటి కలయిక మీ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరియు ఇది ఆరోగ్యానికి కూడా టానిక్ అని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ఇది అనేక పోషకాల యొక్క గొప్ప వనరుగా పరిగణించబడుతుంది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}