• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ వేడుకలు మరియు పండుగలు

నేషనల్ పేరెంట్స్ డే 2022 తేదీ, ప్రాముఖ్యత, వివరాలు: ఎలా జరుపుకోవాలంటే..

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 23, 2022

 2022

ప్రతి వ్యక్తి జీవితంలో  తల్లిదండ్రులకు ముఖ్యమైన పాత్ర ఉంది, వారి నీడలో  పిల్లలు విద్య, సంస్కృతి, సంప్రదాయం, భాష, ప్రవర్తనలను నేర్చుకుంటాడు. కాబట్టి ఏ బిడ్డకైనా తల్లిదండ్రుల ప్రాముఖ్యతను కొన్ని పదాలతో చెప్పలేము. నిజానికి, తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒకరినొకరు సంపూర్ణం  చేస్తారు. ఈ భావాలను గౌరవించడానికి  జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం లేదా నేషనల్ పేరెంట్స్ డే ని ప్రతి సంవత్సరం జూలై నాలుగవ ఆదివారం నాడు జరుపుకుంటారు.  ఈ సంవత్సరం అది 24 జూలై 2022న వస్తుంది. తల్లిదండ్రులు మరియు వారి సంతానం ఇద్దరి మధ్య సంబంధాన్ని ఆప్యాయంగా, ఆరోగ్యంగా, మధురంగా ​​మరియు ఆనందంగా ఉంచడమే ఈ రోజు జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం . 

పేరెంట్స్ డే చరిత్ర

1994లో, US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హయాంలో, రిపబ్లికన్ సెనేటర్ ట్రెంట్ లాట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  ఇది తల్లిదండ్రుల దినోత్సవ తేదీని ఖరారు చేసింది. 'పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తించి, ఉద్ధరించడం మరియు మద్దతునివ్వడం' దీని ఉద్దేశం అని స్పష్టం చేశారు. జూలై నాలుగో ఆదివారాన్ని పేరెంట్స్ డేగా జరుపుకోవాలని US కాంగ్రెస్ నిర్ణయించింది. ఫాదర్స్ డే మరియు మదర్స్ డే ఉన్నత  ప్రాముఖ్యత, ఈ పేరెంట్స్ డే కి కూడా ఉంది.

తల్లిదండ్రుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత

పేరెంట్స్ డే అనేది అక్షరాలా తల్లిదండ్రులకు అంకితం చేయబడిన రోజు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయత, ప్రేమ మరియు త్యాగంతో శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంటారు. వారి స్వాభావిక శక్తి మరియు ప్రతిభకు అనుగుణంగా పిల్లల వ్యక్తిత్వాన్ని మలచడం ఇంకా  నైతిక విలువలతో  జీవించాలనే భావాన్ని తల్లిదండ్రులే అందిస్తారు. వారు ఎదగడానికి మరియు ముందుకు సాగడానికి మార్గం సుగమం చేస్తారు. పిల్లల భౌతిక అవసరాలను తీర్చడమే కాకుండా, వారికి నిజమైన గైడ్ మరియు సంరక్షకుని పాత్రను కూడా పోషిస్తారు. ఇది పిల్లల జీవితం, ప్రవర్తనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సానుకూల శక్తి ప్రవాహం తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది.

పేరెంట్స్ డే ఇలా జరుపుకోండి

తల్లిదండ్రుల దినోత్సవ౦ రోజు పిల్లలు వారి తల్లిదండ్రులకు అభినందనలు మరియు బహుమతులు ఇస్తారు. ఈ బహుమతులలో చిరస్మరణీయమైన ఫోటోలు, ఫోటో కోల్లెజ్‌లు ఫ్రేం చేయించి వారికి ఇవ్వచ్చు.  స్టిక్కర్లు, చేతితో తయారు చేసిన స్కార్ఫ్‌లు, వాచ్, పర్స్, అలెక్సా వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి కూడా మంచి చాయిస్. ఈ రోజున, కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి వారి ఇష్టాలకు అనుగుణంగా  స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు.  సమీప ప్రాంతంలో పిక్నిక్, రాత్రిపూట హోటల్‌కు డిన్నర్‌ తీసుకెళ్ళడం, థియేటర్‌లో మంచి సినిమాకి తీసుకెళ్ళడం, ఒకరోజు ఇంటి బాధ్యతలను, పనులను తామే నిర్వహించడం తీసుకెళ్ళడం వంటివి.. పేరెంట్స్ కి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలవు.

ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? సమాచారం ఆసక్తికరంగా, useful గా ఉందా? దయచేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి. మా రాబోయే బ్లాగులు మరింత ఉత్తమ౦గా ఉండేందుకు మీ సూచనలు ఎంతో సహాయపడతాయి!

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}