• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ వేడుకలు మరియు పండుగలు

పండుగల్లో పిల్లలని ఎలా భాగస్వాముల్ని చేయాలి

Vidyadhar Sharma
3 నుంచి 7 సంవత్సరాలు

Vidyadhar Sharma సృష్టికర్త
నవీకరించబడిన Dec 14, 2018

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పండుగంటే మరింత ఆనందంగా ఉంటుంది వచ్చిందంటే సందడి వచ్చినట్టే, ఇల్లంతా చుట్టాలు రక రకాల పిండి వంటలతో కళకళలాడుతూ, ఘుమఘుమలాడుతూ ఉంటుంది. మరి ఈ సంతోషంలో పిల్లలని ఏ విధంగా భాగస్వాములను చేయాలి ? చిన్న వయసు పిల్లలు అంటే ముఖ్యంగా మూడు నుంచి ఏడేళ్ల మధ్య వయసు వారికి పండుగ లో పాలుపంచుకునేలా చేయడం అమ్మా నాన్నల బాధ్యతే అవుతుంది ఎందుకంటే చిన్న వయసు నుంచే మన సంప్రదాయాలు మీద అవగాహన కల్పించడం ముఖ్యం కాబట్టి.

వాళ్లకి రంగు రంగుల పావడాలు పరికిణీలు షేర్వాణీలు కొంటాం కానీ మనలా వారు కూడా పండగ వాతావరణం ఆస్వాదించేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

పండుగ గురించి వివరించండి:

కనీసం ఒక వారం ముందుగానే పిల్లలకి రాబోయే పండుగ గురించి అసలు దానిని ఎందుకు జరుపుకుంటాం ఎలా జరుపుకుంటాం వంటి విషయాల మీద ఒక అవగాహన కల్పించండి. దీనివల్ల వాళ్లలో ఉత్సాహం పెరుగుతుంది, మనతో పాటు వారు కూడా సరదాగా గడుపుతారు.

వాళ్ళని భాగస్వాముల్ని చేయండి:

తీపి మిఠాయిలు చేస్తున్నారా లేదా పిండి వంటలు మొదలు పెట్టారా?. ఐతే పిల్లలు పనికి అడ్డం అని వారిని దూరం పెట్టకుండా వారికి ఎదో ఒక చిన్న పని అప్పగించండి. వాళ్ళ చిట్టి చేతులతో ఏది చేసిన ముద్దుగానే ఉంటుంది. వాళ్ళకి కూడా తామూ సంబరాల్లో ఒక భాగమే అని అర్థం అవుతుంది.  

అలంకరణలు:

ఇంటికి చేసే పండుగ అలంకరణలు, తోరణాలు కట్టడం పువ్వులతో చేసే దండలు గ్రీటింగ్ కార్డులు వంటివి పిల్లలచేత చేయించండి. రంగురంగుల పూలతో వారు ఏ పనైనా చాలా ఇష్టంగా అత్యుత్సాహంగా చేస్తారు. ఇటు వంటి జ్ఞాపకాలే వారికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఇంటికి వచ్చే అతిధులకు ఇచ్చే కానుకలని వారి చేతితో ఇప్పించండి పిల్లలు భలేగా ఆనందిస్తారు, దానితో పాటు పక్కవారికి ఇచ్చే గుణం కూడా అలవడుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఇంటికి చేసే అలంకరణలు నిప్పు మరియు విధ్యుత్చ్చక్తి తో చేసేవైతే మాత్రం వారిని దూరంగా ఉంచడం మేలు.

బట్టలు -ముస్తాబులు:

వారికి సాంప్రదాయబద్దంగా ఉండే దుస్తుల్ని ఎంపిక చేయండి. మన సంస్కృతి సంప్రదాయాల మీద గౌరవం కలిగేందుకు ఇది అవసరం కూడా. ఇబ్బంది కలగకుండా మరీ వదులుగా లేదా పట్టినట్టుగా ఉండే బట్టలు వేయకండి. పండుగ సమయాల్లో వదులుగా ఉండే సిల్కు బట్టలు ప్రమాదం.

అతిధి మర్యాదలు:

ఇంటికి వచ్చే అతిధులనిఏ విధంగా పలకరించాలో వారికి చెప్పండి. సిగ్గుతో ముడుచుకుపోకుండా సరదాగా వారితో ఎలా నడుచుకోవాలో నేర్పించండి. అదే విదంగా ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఉండేలా ముందే చెప్పాలి. ఇలా బంధువులతో కలసి గడపడం వలన పిల్లలకి కూడా పండుగ అంటే కలసి సంతోషించడం అనే భావన కలుగుతుంది. బంధువులలో చిన్న వయసు వారు ఉంటే ఇక మన పిల్లలకి కొత్త బంధాలు, స్నేహితులు దొరికినట్టే.

ఒక వేళ పండుగలలో ఆట పాటలు వంటి కార్యక్రమాలు ఉంటే మీ బుజ్జి పాపలని ముందుగానే సిద్ధం చేయండి. మెరిసే బట్టలు వారికి కొత్త ఉత్సాహం ఇస్తాయి. అదే సమయంలో వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండటం అవసరం. ఇటువంటి సమయంలో మనం అందంగా కనపడాలనే ఆరాటం కంటే మన పిల్లలని ఎంత ముద్దుగా తయారు చేయాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది కదా.

ఫొటోల ముచ్చట్లు:

ఇంత చక్కగా ముస్తాబయ్యాక మరి ఆ సంతోషం అందం ఒక ఫోటో లో బంధించక పోతే ఎలా?. బుజ్జమ్మల బుంగమూతులు కొత్త బట్టల్లో వారి మెరుపులు ఇతరులతో వారు చేసిన సందడి అంతా అందమైన చిత్రంగా మన కళ్ళలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందే. పిల్లలు ఆ ఫోటోలని చూసినప్పుడు వారికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత పండుగ విశేషాలు బాగా గుర్తుంటాయి పైగా అదంతా ఎంతో సరదాగా గడుస్తుంది కాబట్టి పిల్లలు కూడా సంతోషిస్తారు.

పిల్లలకి ప్రత్యేకమైన పండుగలు:

అన్ని పండుగలలో పిల్లలని భాగస్వాములుగా చేయలేక పోవచ్చు. పెద్ద వాళ్ళకే పరిమితమైన పండుగలు కాకుండా పిల్లలు కూడా పాలుపంచుకునే వాటి విషయంలో శ్రద్ధ వహించి వాటిని ఎలా నిర్వహించాలో ఒక ప్రణాళిక రూపొందించండి. రంగులు ఆట పాటలు వుండే కార్యక్రమాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి కాబట్టి వీలుంటే వారికోసం ఆ ఏర్పాట్లు చేయండి .

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పండగలు మన సంస్కృతీ సంప్రదాయాలని మన పిల్లలకి పరిచయం చేసే ఒక అవకాశం. అంతే కాదు బంధాల విలువలు కలసి ఉండటం, పంచుకోవడం వంటివి పండగలో ఒక భాగం. సంబరం ఏదయినా కావచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని అందులో ఎదో ఒక విధంగా పాలుపంచుకోనివ్వండి.

వచ్చిన అతిధులకి వారి చేతులతో మిఠాయిలు ఇప్పించండి. పిల్లలకి సిగ్గు భయం తగ్గి కలివిడిగా ఉండగలుగుతారు.

ఈ అమరికలన్నీకనీసం ఒక వారం ముందుగానే చేసుకోవాలి. పండగ ముందు, తరువాత వారితో స్నేహపూర్వకంగా మాట్లాడండి. వారి సందేహాలు భయాలు తొలగించే ప్రయత్నం చేయండి. కొంత మంది పిల్లలు నలుగురితో కలవడానికి ఇష్టపడరు. అటువంటి పిల్లల విషయంలో ఈ విధం గా చేయడం వల్ల వారికి బిడియం తగ్గి సరదాగా గడుపుతారు.

  • 1
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Mar 10, 2019

typap

  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన పేరెంటింగ్ బ్లాగ్లు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}