• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అభిరుచులు

పిల్లల మనస్తత్వం, మానసిక ఆనందం

Bhavna
3 నుంచి 7 సంవత్సరాలు

Bhavna సృష్టికర్త
నవీకరించబడిన May 16, 2022

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

జీవితం అందంగా,  ఉత్సాహంగా కనిపించాలన్నా జీవితం అంటే బోల్డంత ఇష్టం రావాలన్నా, సమస్యలు ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా   ఎదుర్కోవాలన్న న్యాయంగా ఆలోచించాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా మంచి జీవితం కావాలన్నా చివరికి ఆరోగ్యంగా ఉండాలన్నా అన్నిటికి ఒకటే  కారణం పుస్తకాలు చదవడం అని చెప్పవచ్చు.

పుస్తకాలు చదవడం వలన ఉపయోగాల గురించి అందరికి తెలిసిందే. అయితే మనకి తెలిసిన ఉపయోగాలు కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు  పుస్తకాలు చదివే అలవాటు వల్ల కలుగుతుంది.

పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారిలో   ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం, మెదడు చురుకుగా పనిచేయడం, మానసికంగా బలంగా  ఉండటం మాములు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటాయి. అలాగే సంబంధాలను పెంపొందించేందుకు , మానసిక ఆందోళనను తగ్గించేందుకు కూడా పుస్తకాలు చదవడం సహాయం చేస్తుంది.

పిల్లలకు  చిన్న అప్పుడు నుండి మంచి అలవాట్లు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత . వారి అలవాట్లు మంచి దశలో ఉన్నాయా చెడు దిశగా మళ్ళుతున్నాయా  తెలుసుకోవడం తలిదండ్రుల బాధ్యత .

పిల్లలకు పుస్తకాలు చదవడం, యోగా, ధ్యానం చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. వాటి వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చును.

యోగాను ఒత్తిడి, మనస్థితి మార్పులను తగ్గించడం, అలాగే శారీరక శ్రేయస్సును పెంచడంలో సహాయపడే జనాదరణ పొందిన ఆరోగ్య విధానాల్లో ఒకటిగా చెప్పవచ్చు. యుక్త వయస్సులో పిల్లల మనస్సు మరియు శరీరంలో పలు మార్పుల సంభవించే కాలము , ఈ సమయంలో వారు ఒత్తిడికి, గందరగోళానికి, ఆందోళనకు, కొన్నిసార్లు డిప్రెషన్‌కు లోనవుతారు. ఈ సమయంలోనే మెదడు మరియు శరీరం అభివృద్ధి చెందుతుంది మరియు యుక్త వయస్సులో పిల్లల జీవితంలో హార్మోన్ల అసమతుల్యత ఉపద్రవానికి దారి తీయవద్దును.

ఈ క్లిష్టమైన సమయంలో యుక్త వయస్సులోని  పిల్లలకు వారి జీవితంలో కొంత వరకు సమతుల్యతను మరియు సరైన క్రమాన్ని అందించడానికి యోగా మరియు ధ్యానం వంటి అంశాలను పరిచయం చేయాలి. ఈ దశలో యోగా మరియు ధ్యానం చేయడం వలన యుక్త వయస్సులోని  పిల్లలు స్వీయ-నియంత్రణ, క్రమశిక్షణను పెంపొందించుకోగలరు, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోగలరు మరియు చదువులో మంచి ప్రదర్శనను కనబర్చగలరు మరియు వారి శరీరంలో జరుగుతున్న మార్పులకు అనుకూలంగా ప్రవర్తించగలరు. అనుభవం ఉన్న గురువుల పర్యవేక్షణలో వారు యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలి.

యోగా మరియు ధ్యానం యొక్క ప్రయోజనాలు:

విభిన్న యోగా భంగిమల వలన సమన్వయం, సమతుల్యత మరియు వశ్యతను అభివృద్ధి చేసుకోగలరు. యోగా వలన వ్యక్తులు వారి శరీరానికి అనుకూలంగా ప్రవర్తించగలరు. ప్రధాన కండరాల శక్తిని పెంచుకోవడంలో ఇది సహాయపడుతుంది.ఆందోళన మరియు ఒత్తిడి అనేవి రెండు ప్రధాన సమస్యలు. విద్యా సంబంధిత సవాళ్లు, తోటివారి ఒత్తిడి, వేధింపులు, శరీర ఆకృతి మరియు ఆత్మ విశ్వాస సమస్యలు, ఇంటిలో ఒత్తిడి వంటి వాటితోసహా యుక్త వయస్సులో సంభవించే మార్పులు ఇలా పలు సమస్యలు  ఎదుర్కొవల్సి వస్తుంది. యోగా మరియు ధ్యానం అభ్యసించడం వలన వయస్సులోని పిల్లలు మరింత స్థిరమైన మరియు శక్తివంతమైన మానసిక శక్తిని పొందగలరు. ఇవి వారు విభిన్నమైన ఒత్తిడికి గురి చేసే అంశాలను ఎదుర్కొని, ప్రశాంతంగా ఉండటానికి, ఆందోళన స్థాయిలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది మరియు వారు శ్వాసక్రియా పద్ధతులతో ఉపశాంతిని పొందవచ్చు.వయస్సులో పిల్లల చెడు ఆహారపు అలవాట్లు లేదా హార్మోన్ల మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యోగా వలన వారు సరైన బరువును కలిగి ఉండగలరు, దీని వలన వారిలో ఆత్మ విశ్వాస స్థాయిలు మెరుగవుతాయి.యుక్తవయస్సులోని పిల్లలకు భంగిమ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, యోగా వలన వారు వారి భంగిమను సరి చేసుకోగలరు. నిటారుగా నిలబడే భంగిమను పొందడానికి మరియు వెన్నుముకను శక్తివంతం చేసుకోవడానికి యోగా సహాయపడుతుంది.శ్వాసక్రియా పద్ధతులు వలన మనస్థితి మరియు ఏకాగ్రత మెరుగుపడతాయి. ఇంటిలో యుక్తవయస్సులోని పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రుల ప్రధాన వేదనల్లో ఒకటి సావధానత లేకపోవడం. యోగా మరియు ధ్యానం చేసే సమయంలో అభ్యసించే శ్వాసక్రియా పద్ధతుల్లో వ్యక్తులు వారి శ్వాసపై దృష్టి సారించాలి మరియు వ్యక్తుల దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడే విభిన్న భంగిమలతో శ్వాసక్రియను సమన్వయం చేయాలి, ఇవి  పిల్లల చదువులో మంచి ఫలితాలు పొందడానికి సహాయపడతాయి.యోగాతో, పిల్లలు శారీరక వశ్యత మాత్రమే కాకుండా వారి సృజనాత్మక సామర్థ్యాలను కూడా మెరుగుపరచుకోవచ్చు.ధ్యానం వలన స్వీయ జాగృతిని పొందుతారు, అంటే ఆలోచనా సరళిని మరియు ప్రస్తుత ప్రతిస్పందనలను తెలుసుకోగలరం. దీని వలన పిల్లలు భవిష్యత్తులో వారి ఆలోచనలు మరియు ప్రతిస్పందనలను నియంత్రించడంలో మంచి ప్రావీణ్యతను సాధించగలరు. ధ్యానం చేయడం వలన మనస్సు ఉపశాంతి పొందడమే కాకుండా, రాత్రి సమయంలో మంచి నిద్ర పొందడానికి సహాయపడటమే కాకుండా గాఢ మరియు విశ్రాంతితో కూడిన నిద్ర పొందడానికి సహాయపడుతుంది.దీని వలన వారు కోపాన్ని అదుపులో ఉంచుకోగలరు మరియు సానుకూల ఆలోచనలను పొందుతారు మరియు ధ్యానం నుండి పొందే శక్తితో డిప్రెషన్ బారిన పడకుండా రక్షించబడతారు.

ధ్యానంతో కూడిన యోగా ఒక అద్భుతమైన వరం, ఇది వయస్సులో సంభవించే సాధారణ సమస్యలను ఎదుర్కొవడానికి సహాయపడటమే కాకుండా సహనాన్ని పెంపొందించుకోవడానికి, దయతో మెలగడానికి, ఇతరులతో సఖ్యతగా ఉండటానికి మరియు స్వీయ ఆమోద భావాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలు వలన యుక్త వయస్సులోని పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని పొందగలరు మరియు వారు భవిష్యత్తు రోజుల్లో పరిపక్వతతో మంచి వ్యక్తులుగా మారతారు.

సెలవులు   వదలడం ఆలస్యం కొంతమంది పిల్లలు  ఊరుకి వెళ్లడం, మరికొంత మంది సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అవడం, మరికొంత మంది ఇంటి ముందు    కబడ్డీ, కో- కో, క్రికెట్, దాగుడుమూతలు, ఆడుతుంటారు. బొమ్మలు గీయడం వాటికి రంగులు నింపడం ,  కార్టూన్లు చూడటం వారికి ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. కనుక పిల్లల్ని అన్ని రంగాల్లో పాల్గొనేలా  తల్లిదండ్రుల ప్రోత్సాహం చేయడం వలన భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అభిరుచులు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}