పిల్లలకు ఉపయోగపడే యాప్స్ మరియు సరదా గాడ్జెట్స్

Canisha Kapoor సృష్టికర్త నవీకరించబడిన Apr 18, 2021

ఇంటర్నెట్ అనేది మన జీవితం లో భాగమైపోయింది. ఫోను, లాప్టాప్ లేనిదే మన ఉద్యోగాలు అస్సలే నడవవు. మరి మనంచూసి నేర్చుకునే పిల్లలకి ఈ ఫోన్లు గాడ్జెట్స్ ఎంతవరకు ఉపయోగం, అవసరం? ఒకవేళ ఉపయోగమే ఐతే ఎలా వారు అనవసరమైన వెబ్సైట్ కి వెళ్లకుండా చూడాలి? వారిని కేరింతలు కొట్టించడానికి ఏ ఆప్స్ వాడాలి? ఇన్ని ప్రశ్నలకి కింద వీలైనంతవరకు సమాధానాలు మేము వెతికి పెట్టాము.
పిల్లలు ఇంటర్నెట్ ను ఎంత సేపు ఉపయోగించవచ్చు?
అమెరికన్ అకాడమీ అఫ్ పెడియాట్రిక్స్ వారి అధ్యనం ప్రకారం పిల్లలు 18 నెలలు నిండక ముందు ఇంటర్నెట్ ని వినియోగించకూడదు తరువాత కూడా తల్లితండ్రుల పర్యవేక్షణ లో మాత్రమే ఉపయోగించాలి. 3-7 వయసు గల పిల్లలు కేవలం కొన్ని పరిమితమైన ఆంక్షలతో ఇంటర్నెట్ ని ఉపయోగించవచు.
పీడియాట్రిక్ నిపుణుల నుండి అధికారిక సిఫార్సులు ఏమిటంటే, 2 సంవత్సరాల లోపు పిల్లలు అసలు ఇంటర్నెట్ ను వాడకుండా ఉండడమే మంచిది 5 సంవత్సరాల వయసు వారు కేవలం రోజుకు 2 గంటలు మాత్రమే వినియోగించాలి.
యాప్స్ ఫర్ కిడ్స్:
1. యూట్యూబ్ కిడ్స్:
పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది మరియు పర్యవేక్షించబడినది. ఇది వారి ఇష్టమైన ప్రదర్శనలు చూడటానికి ఒక సులభమైన మార్గం అందిస్తుంది. ఇది పిల్లలకు ఉత్తమ అభ్యాస అనువర్తనాల్లో ఒకటి. యూట్యూబ్ కిడ్స్ యాప్ ను ఉచితంగా ప్లే-స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్కొవచ్చును.
2. స్పెల్లింగ్ స్టేజ్:
పిల్లలు స్పెల్ల్లింగ్స్ పలకడానికి కొంత కష్టపడతారు.ఈ యాప్ తో పిల్లలు పదాలు పలకడం నేర్చుకోవచ్చు. ఇది కూడా ప్లే -స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
3. క్లాస్ డోజో:
క్లాస్ డోజో ఒక ఆసక్తికరమైన యాప్ .ఇందులో పిల్లలు వారికీ నచ్చిన విషయాలను గురించి శోధించవచ్చు . దీని వలన పిల్లలకు లోక జ్ఞానం మరియు విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది . ఎదిగే పిల్లలకు ఈ జ్ఞానం ఎంతో అవసరం.
4. డుయోలింగో:
ఈ యాప్ సహాయం తో పిల్లలు ఏదైనా ఫారిన్ భాష నేర్చుకోవచ్చు .దీనిని ఉపయోగించి స్పానిష్ , ఇంగ్లీష్ ,జర్మన్,ఇటాలియన్,ఫ్రెంచ్ భాషలు నేర్చుకొనవచును .యాప్ లో భాష ఎంతో సరళం గా ఉంది నేచుకోవడానికి అణువు గా ఉంటుంది .ఇది ఉచితం హా డౌన్లోడ్ చేసుకొనవచు.
5. డ్రాగన్ బాక్స్:
ఇది ఒక విద్య ఆధారిత ఆట, ఇందులో ఆటల రూపం లో మ్యాథ్స్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకొనవచు. చిన్నతనం లోనే ఫండమెంటల్స్ నేర్చుకోవడం వలన పిల్లలు మానసిక వికాసం కలిగి ఉంటారు. ఈ యాప్ ద్వారా పిల్లలు ఎంతో సులభం గా మ్యాథ్స్ లోని కొన్ని అంశాలను సులభం గా ఆటల రోపం లో. నేర్చుకోవచ్చు.
6. సైన్స360:
ఈ యాప్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారిచే రూపొందించబడింది .దీని వలన పిల్లలకు సైన్స్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు చూపించవచ్చు .ఈ యాప్ లోని సమాచారం వివిధ దేశాల సైంటిస్ట్స్ చే రూపొందించబడింది.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్:
వీటీచ్ కీదిజుమ్ స్మార్ట్ వాచ్:
ఇది పిల్లల వాచ్. ఇందులో టైమ్ చూసుకోవడమే కాకుండా పిల్లలు వారికీ నచ్చిన వారిని ఫోటోలు వీడియోలు తియ్యొచ్చు. మరియు దింట్లో గేమ్స్ కూడా ఆడుకొనవచు.ఇది అమెజాన్.కామ్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
హనీ బన్నీ డిజిటల్ ప్లేయర్:
ఇది ఒక వైవిధ్యమైన ఆటవస్తువు. ఇది పిల్లలకు కథలు వినిపిస్తుంది. దీని నుంచి వచ్చే ధ్వని పిల్లలకు ఏ హాని కలిగించకుండా ఎంతో మధురం గా ఉంటుంది.
ఇదే విధం గా ఇంకా ఎన్నో గాడ్జెట్స్ పిల్లల కోసం అందుబాటు లో ఉన్నాయి.
భద్రత చిట్కాలు:
-
పిల్లలు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నప్పుడు వారి పక్కనే కూర్చోండి .
-
ఇంటర్నెట్ ఫిల్టర్ టూల్స్ ని వాడి ..పిల్లలకు హాని కలిగించే వాటిని బ్లాక్ చెయ్యండి.
-
పిల్లల కోసం రూపొందించిన వెబ్సైట్ ని మాత్రమే వారికీ అందుబాటు లో ఉంచండి.
-
పిల్లలని ఒంటరి గా ఇంటర్నెట్ ను వినియోగించడానికి అనుమతించకండి.
-
ఎల్లప్పుడూ ఇంటర్నెట్ ప్రైవసీ సెట్టింగ్స్ లి ఉపయోగించండి
-
పిల్లలను ఇంటర్నెట్ కు ఎంత దోరం గా ఉంచితే అంత మంచిది ఎందుకంటే ఇంటర్నెట్ విజ్ఞానాన్ని అందిస్తుంది మరియు వారిని ఇంటర్నెట్ వ్యసన పరులు గా మారుస్తుంది
ఇంటర్నెట్ లో మంచి మరియు చెడు రెండు ఉంటాయి; కొన్ని జాగ్రత్తలు తెల్లితండ్రులు తీసుకోవడం వలన పిల్లలని ఇంటర్నెట్ లోని మంచిని మాత్రమే వారికీ పరిచయం చెయ్యాలి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్ బ్లాగ్లు
పైన గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్ చర్చలు
పైన గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}