పిల్లలను దృఢనిశ్చయం గలవారిగా పెంచడం ఎలా

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jan 11, 2021

మీ చిన్న పిల్లలను తన తోటి వారు త్రోసి వేయడాన్ని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నరా - వారి సమయం వచ్చినప్పుడు వారు ఊగేందుకు ఊయల ఇవ్వనప్పుడు, వారి వంతు వచ్చినప్పుడు వారికి సైకిల్ ఇవ్వనప్పుడు లేదా వారి నుండి ఏదైనా బలవంతంగా తీసుకున్నప్పుడు - మీ పిల్లలు అటువంటి పరిస్థితులను తామే ఎదుర్కొంటారా లేదా మీరు జోక్యం చేసుకునే వరకు ఏడుస్తూ ఉంటారా ? కొంతమంది పిల్లలు అటువంటి పరిస్థితులను స్వయంగా ఎదుర్కోగలుగుతారు. కానీ చాలా మంది పిల్లలు తమంతట తాముగా మాట్లాడడానికి లేదా పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినంత మానసిక బలంతో ఉండరు. కానీ , ఇది పిల్లల గురించి ఆందోళన చెందవలసిన విషయం అని కాదు ! దీని అర్థం మీరు పిల్లలకు కొంచెం దృఢంగా ఉండాలి అని నేర్పించాల్సిన అవసరం ఉంది అని.
మనం విషయంలోనికి వెళ్లే ముందుగా, నిష్క్రియాత్మకంగా, దృడంగా మరియు దూకుడుగా ఉండటానికి మధ్య ఉన్న చిన్న తేడాలను అర్థం చేసుకోవాలి.
నిశ్చయత అంటే ఏమిటి ?
నిజాయితీగా మరియు గౌరవప్రదంగా మాట్లాడడానికి ఒక మార్గమే నిశ్చయత. నిష్క్రియాత్మకగా ఉండడం అంటే ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా లేదా తాను చేయవలసిన దానిని చేయకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉండడం. మరియు దూకుడు అంటే ఎల్లప్పుడూ ఇతరుల భావాలను గౌరవించకుండా నిజాయితీ అన్నది లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించడం.
పిల్లలు దృఢ నిశ్చయంగా ఉండడానికి మనం ఏ విధంగా సహాయ పడగలము ?
దృఢనిశ్చయంగా ఉండడం కొంతమంది పిల్లలకు సహజంగా రావచ్చు . మరి కొంతమంది పిల్లలకు వారు ఎలా ప్రవర్తించాలో మరియు ఏ పరిస్థితులలో ఎలా ఉండాలో నేర్పించవలసి ఉంటుంది. ఎదుటివారు తిరస్కరిస్తారు అనే భయం లేదా విమర్శించబడతారేమో అనే భయం పిల్లలను మాట్లాడకుండా చేస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసము మరియు స్థిరత్వం అనేవి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.
1. నిశ్చయత అంటే ఏమిటో వివరించి చెప్పడం : అందరితో స్నేహపూర్వకంగా ఉండే పిల్లవాడు కొన్ని సందర్భాలలో అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంటున్నట్లుగా మీరు అనుమానించినట్లయితే, ముందుగా వారితో మాట్లాడి పరిస్థితులను అర్థం చేసుకునేవిధంగా ఎలా ప్రవర్తించాలో వారికి చెప్పండి.
చాలా మంది పిల్లలకు స్థిరంగా ఉండడం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడాలో మీ పిల్లలతో మాట్లాడి చూపించండి.
నిష్క్రియాత్మకత: నిష్క్రియాత్మక వ్యక్తులు ఎదుటివారు ఏమనుకుంటారో లేదా అవతలి వారు ఏ విధంగా స్పందిస్తారో అనుకొని మాట్లాడడం వలన కలిగే పరిణామాలకు భయపడతారు. ఇతర వ్యక్తుల హక్కులు తమ కన్నా ముఖ్యమైనవి అని వారు భావిస్తారు. అందువలన ఏది కూడా కాదు అని చెప్పడానికి భయపడతారు.
దృఢ నిశ్చయత : దృఢనిశ్చయం కలిగిన వ్యక్తులు వారి అవసరాలు ఏమిటో వారికి ఏమి కావాలో సాధారణంగా తెలుసుకోగలరు. ఇతరులు చెప్పేదానిని వింటారు వారికి అవసరమైన వాటి కొరకు స్థిరంగా మాట్లాడతారు.
2. ఆరోగ్యకరమైన రిస్కులకు మద్దతు ఇవ్వండి : మీ పిల్లలను స్వతంత్రంగా గ్రూప్ యాక్టివిటీస్ లో పాల్గొనమని ప్రోత్సహించండి. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయాన్ని ఇవ్వండి. ఉదాహరణకు మీ పిల్లలు పార్కులో ఆడుకుంటున్న సమయంలో జారుడు బల్ల ఉపయోగించాలనుకుంటే, సహాయం కోసం మీరు ముందుకి వెళ్ళకుండా పిల్లలను పరిస్థితిని గమనించమని చెప్పండి. మీ పిల్లవాడు తన వంతు కోసం క్యూలో నిలబడాలి అని మరియు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ఉపయోగించుకోవాలి అని చెప్పండి. అదేవిధంగా మిగతా పిల్లలలో ఎవరైనా దూకుడుగా ఉండి నిబంధనలను పాటించనట్లయితే వారితో ఎలా ప్రవర్తించాలో తెలియ చెప్పవలసిన అవసరం ఉంటుంది.
3. వారికి మాదిరిగా ఉంటూ పరిస్థితులను వివరించండి : పిల్లలతో మాదిరిగా ఉంటూ నిజ జీవితంలో అన్యాయమైన పరిస్థితులను సరైన విధానంలో ఎదుర్కొని మంచిగా మలుచుకోవడం ఎలాగో తెలియ చెప్పండి. మన జీవితంలో రోజువారీ పరిస్థితులను గురించి సూచనలను ఇవ్వవచ్చు. న్యాయబద్ధంగా వ్యాపారం చేసే ఒక దుకాణదారుని గురించి, మన సొసైటీలోని పొరుగు వారిని మన ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచమని మర్యాదపూర్వకంగా ఏవిధంగా చెప్పాలో తెలియ చెప్పండి.
4. ఎవరితోనూ పోల్చకండి : తల్లిదండ్రులు సహజంగానే తమ బిడ్డను ఇతర పిల్లలతో పోల్చడానికి మొగ్గుచూపుతారు. ఇది మీ పిల్లల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలను తోటివారితో పోల్చినప్పుడు వారిలో వెంటనే ఆత్మన్యూనతభావం తలెత్తి అసమర్థులుగా భావిస్తారు. దానికి బదులుగా మీ పిల్లలకి ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని మెరుగుపరచడంలో సహాయపడడానికి వారు జీవితంలో చేసే ప్రతి చిన్న మంచి పనిని కూడా ప్రోత్సహించండి.
5. మీ పిల్లలతో మాట్లాడండి : మీ పిల్లలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని అర్థం చేసుకోండి. వారికి అవసరం అనిపించినప్పుడు మాట్లాడగలరు లేదా నో చెప్పగలరు. చిన్నపిల్లలు తరచుగా తమ తల్లిదండ్రులను కలవర పెట్టకూడదు అనే స్పృహ తోనే ఉంటారు. లేదంటే వారు బహిరంగంగా మాట్లాడడం వలన మొండి వారిగా ముద్రించబడతారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య స్వతంత్రంగా మాట్లాడుకునే చనువు లేనట్లయితే పిల్లలు వారి ఇష్టాలను పంచుకునే విషయంలో అవరోధంగా మారవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక షాప్ కి వెళ్ళినప్పుడు మీ పిల్లవాడు స్వీట్ తినాలి అనుకుని ఉండవచ్చు, కానీ అది తల్లిదండ్రులకు ఇష్టం ఉండదేమో అని అడగడం మానుకోవచ్చు. ఈ విధమైన పునరావృత భావన ఆ పిల్లవాడిని మరింత నిష్క్రియాత్మకంగా తయారు చేస్తుంది. అటువంటి పరిస్థితులలో, పిల్లలు తమకు కావలసింది అడిగితే తప్పు లేదు అని అర్థం చేసుకోగలగాలి (వారు దానిని పొంద లేనప్పటికీ) వాటిని అణిచివేయడం మంచి పద్ధతి కాదు. వారు పాఠశాలలో ఉన్నప్పుడు కూడా ఇది వర్తిస్తుంది. చాలామంది పిల్లలు తమ స్నేహితులు లేదా ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో, ఏమంటారో లేదా నవ్వుతారేమో అని భయపడతారు. ఇది చాలా సాధారణమైన పరిస్థితి. పిల్లలు వారి స్నేహితులతో ఉన్నప్పుడు కూడా మాట్లాడమని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది వారి హక్కుగా ఉండాలి. ఎవరైనా నవ్వినప్పటికి దానిని పట్టించుకోకుండా ఉండగలగాలి.
6. మీ బిడ్డకు సరైన భాషను నేర్పండి : పిల్లల వయస్సుకు తగినట్లుగా వారి సొంత భాషతోనే మాట్లాడే విధానాన్ని నేర్పండి. పిల్లలు ఆంగ్లం మాట్లాడటంలో సౌకర్యంగా లేనప్పుడు, ఖచ్చితంగా మాట్లాడాలి అని బలవంతం చేయకండి. పిల్లలకు అలా నేర్పించడం వలన ప్రయోజనం ఉండదు. వారు ఏ భాషలో అయితే సౌకర్యంగా ఉంటారో అదే భాషలో వారికి మాటలు నేర్పండి. వారు కోపంలో ఎటువంటి భాషలో మాట్లాడతారో గమనించండి.
7. స్వరంపై దృష్టి పెట్టండి : అరవడం కేకలు వేయడం లాంటివి ఎక్కడ కూడా చేయకూడదు అని పిల్లలకు చెప్పండి. అతను బిడియపడే స్వభావం కలవాడు అయితే దానికి వ్యతిరేకంగా ఉండమని మీరు బలవంతం చేయడం ద్వారా వారు ఎంతో అసౌకర్యానికి గురవుతారు. దానికి బదులుగా నేరుగా ఎదుటి వారి కళ్ళలోకి చూస్తూ సరైన స్వరంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం ఎలాగో చెప్పండి.
8. మీకు వీలు కుదిరినప్పుడు పిల్లలకు సహాయం చేయండి : చాలా మంది పిల్లలు ఇంటికి ఫిర్యాదుతో తిరిగి వస్తారు. నేను వద్దు అని చెప్పాను కానీ అవతల పిల్లవాడు నా మాట వినలేదు. ఇటువంటి సమయాలలో మీరు పిల్లలు ఇతర పిల్లలతో ప్రవర్తించే విధానాన్ని క్రమబద్ధీకరించడానికి వారికి సహాయం చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి. మీరు జోక్యం చేసుకోవడమే కాదు. మీరు అక్కడ ఉన్నారని మీ పిల్లలకు తెలియజేయండి. ప్రత్యామ్నాయంగా పరిస్థితి చక్కబడనట్లయితే పెద్ద వారిని బాధ్యత వహించాలి అని కోరమని కూడా మీరు అతనికి నేర్పించవచ్చు.
9. ప్రేమ మరియు నమ్మకంతో కూడిన వాతావరణాన్ని ఏర్పరచండి : ఎటువంటి ప్రవర్తనకైనా మార్గదర్శం అన్నది ఇంట్లోనే ప్రారంభమవుతుంది. మీ పిల్లవాడు మీతో మాట్లాడడం లేదా ఏదైనా కావాలి అని అడగడానికి భయపడుతూ ఉన్నట్లయితే, మీ అసమ్మతిని నివారించడానికి లేదా వద్దు అని చెప్పడానికి భయపడుతున్నట్లు అయితే, మీ వైఖరిని మార్చుకుని ఇంట్లో మరింత సహాయక వాతావరణాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. మీ సహాయం వారికి ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలియజేయండి. వారి చిన్న కోరికలను వ్యక్తపరచనివ్వండి మరియు స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయండి.
10. న్యాయంగా ఉండండి : చివరిది , కానీ తక్కువది కాదు. పిల్లలలోని చాలా లక్షణాలు అంతర్గతంగా ఉంటాయి. మీరు పిల్లలకు ఎన్నో రకాల నైపుణ్యాలతో పొందుపరచండి, వారికి శిక్షణ ఇవ్వండి, కానీ మీరు వారిని మార్చలేరు. ఇతరుల వలే ప్రవర్తించమని వారిని బలవంతం చేసినట్లైతే అది వారిని మరింత గందరగోళానికి గురి చేస్తుంది. వారిని మరింత కూరుకుపోయేలా చేస్తుంది.
తల్లిదండ్రులందరూ తమ బిడ్డ మంచిగా మాట్లాడాలని, అవసరం అయినప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలని మరియు ఇతరుల కోసం నిలబడాలని కోరుకుంటారు. మన పిల్లలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు మద్దతివ్వడం మరియు ప్రోత్సహించడం చేయాలి. వారి ఆలోచనలను మరియు భావాలను అణచివేయడం ద్వారా వారి చుట్టూ అడ్డుగోడలు నిర్మించకుండా నిరోధించడం అవసరం.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}