• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

మీ బిడ్డను క్రమశిక్షణలో ఉంచేందుకు ఆరు మార్గాలు !

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Dec 07, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తల్లిదండ్రుల జీవితంలో ఆ క్షణం వస్తుంది, ఒక చిన్న పిల్లవాడు ఆకస్మాత్తుగా తన పదజాలంలో ఒక పదాన్ని ఉపయోగిస్తాడు- కాదు ! మీ శిశువు పిల్లవాడిగా ఎదిగినప్పుడు, ఆపై పాఠశాలకు వెళ్లే  సమయంలోనూ, అతడు తన వ్యక్తిత్వానికి మరియు స్వతంత్రానికి అహంకారాన్ని చేరుస్తాడు. వారి తంత్రాలు, వారి నటన మరియు వారి సాధారణ తిరుగుబాటు ప్రవర్తన వారి పెరుగుదల మరియు అభివృద్ధికి సంకేతాలు అయినప్పటికీ, కానీ ఆ సంకేతాలు మితిమీరిన సందర్భాలలో ప్రేమతో మరియు ఓర్పుతో పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం అన్నది ఉత్తమంగా పనిచేస్తుంది.

 

పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం అంటే ఏమిటి ?

సాధారణంగా క్రమశిక్షణ అన్నది శిక్షతో సమానం. ఏదేమైనప్పటికీ, పిల్లలు చేసే పనిలో పొరపాటు ఉన్నప్పుడు మాత్రమే వారికి శిక్ష అన్నది ఇవ్వబడుతుంది. కానీ వారికి అది మంచి సూచనగా అనిపించదు.  అది వారిని ఆదేశాలు మరియు సూచనలకు తిరుగుబాటు చేసే విధంగా తయారు చేస్తుంది మరియు అదే పని తిరిగి చేయడం ద్వారా అతని స్వతంత్రాన్ని నొక్కి చెబుతుంది. క్రమశిక్షణ అంటే మీ బిడ్డను సరైన మార్గంలో నడిపించడం. సానుకూల క్రమశిక్షణ మీ పిల్లలు మీ నుండి దూరం కాకుండా బాధ్యతాయుతంగా మారడానికి మరియు నమ్మకాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది.

 

మీ పిల్లలను క్రమశిక్షణలో ఉంచటానికి కొన్ని చిట్కాలు :

 

ప్రతి కుటుంబానికి పిల్లల పెంపకంలో ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. క్రమశిక్షణ మరియు నియమ నిబంధనలు కూడా ఇందులోని భాగాలు. అయినప్పటికీ మీ పిల్లలు క్రమశిక్షణారాహిత్యంలో మునిగి పోతున్నప్పుడు మీకు సహాయపడే కొన్ని ప్రాథమిక చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

 

1. శ్రద్ధ మరియు సానుభూతి చూపండి :

మీ పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం గడపండి. వారికి ప్రత్యేకమైన మరియు సంతోషమైన అనుభూతిని కలిగించడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. పిల్లలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కోరుకుంటారు. మీరు వారికి దానిని ఇవ్వలేనప్పుడు వివిధ మార్గాలలో వారు దానిని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉన్నట్లయితే, వారిలోని ప్రతికూల భావాలను తెలుసుకుని ముందుగానే శ్రద్ధ తీసుకోగలుగుతారు.

 

2 . కొన్ని పరిమితులను నియమించండి  మరియు వాటికి కట్టుబడి ఉండండి :

ఏది ఆమోద యోగ్యమైనది మరియు ఏది కాదు అని స్పష్టంగా వివరించండి. మరియు సంబంధంలేని శిక్షతో మీ పిల్లలను బెదిరించ కండి. ఉదాహరణకు పిల్లలు తమ ఆట వస్తువులను మరియు పుస్తకాలను సరైన స్థానంలో ఉంచనట్లయితే, వాటిని సరి చేయడంలో సహాయం చేయమని అడగండి. లేదా శుభ్రం చేయమని అడగండి. మీ ఐస్క్రీం ను, బయటకు తీసుకు వెళ్లడాన్ని రద్దు చేస్తామని బెదిరించకండి. ఈ నియమాలను పాటించే ఈ సమయంలో స్థిరంగా ఉండండి. స్థిరంగా ఉండండి కానీ బెదిరించకండి.

 

3. ప్రశాంతంగా ఉండండి :

మీ పిల్లవాడు ప్రకోపానికి లోనవుతున్న సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం చాలా కష్టం. కేకలు వేయడం వలన గొడవ మరింత అధికమవుతుంది. కానీ మీరు ఆ సమయంలో  మీ కోపాన్ని అరికట్ట కలిగితే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు కలత చెందుతున్నారు అని నాకు తెలుసు. కానీ కొట్టడం సరైనది కాదు. ఆ సమయంలో మీరు పిల్లలను గట్టిగా అరిచినట్లు అయితే, అరవడం అనే మార్గం మంచిది అని వారికి సందేశం ఇచ్చినట్లుగా ఉంటుంది.

 

4. ఒకే మాటపై ఉండడం :

మీరు మరియు మీ భాగస్వామి కూడా పిల్లల క్రమశిక్షణ విషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. మీరు మీ బిడ్డను ఏదో ఒక విషయాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మీ భాగస్వామి ఆ విషయంలో మౌనంగా ఉన్నట్లయితే మీ బిడ్డ దానిని తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోనట్లయితే పిల్లలు మరింత మొండిగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది.

 

5. వారికి మాదిరిగా ఉండండి :

మీరు కూర్చున్న గదిలోనే మీ పుస్తకాలు మరియు వార్తాపత్రికలను చిందరవందరగా వదిలేసినప్పుడు, మీ పిల్లవాడు తన గదిని చక్కగా ఉంచుతాడు అని మీరు ఊహించండి. మీ పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటారో మీరు దానిని చేసి చూపించండి. మర్యాదగా మాట్లాడటం లేదా గిన్నెలు విసిరివేయడం. మీరు చేసే పనిని మీరు సక్రమంగా చేస్తున్నారని పిల్లలు గమనించినప్పుడు వారు కూడా అదే విధంగా చేస్తారు.

 

6. మంచి ప్రవర్తనను ప్రశంసించండి :

మీ పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే వారిని ప్రశంసించండి. పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ మరియు ప్రోత్సాహం కంటే మంచి క్రమశిక్షణసాధనం మరొకటి ఉండదు.

 

నా బిడ్డను క్రమశిక్షణలో ఉంచే సమయంలో నేను ఏమి చేయకూడదు ?

మీ పిల్లల ఎదుగుదలకు తోడ్పడే  క్రమంలో వారిని ఆజ్ఞాపించడం, బలవంతం చేయడం లేదా బెదిరించడం ఎంతమాత్రం సహాయకరంగా ఉండవు. ఈ చర్యలు మరింత ప్రతికూల ప్రభావాలను పెంచి పిల్లలతో మీకున్న బంధాలపై ప్రభావితం చూపిస్తాయి. మీ బిడ్డకు క్రమశిక్షణ విధించే సమయంలో నివారించవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

 

శారీరకంగా హింసించడం (కొట్టడం, లాగడం) :

మీ హద్దులకు పరీక్ష పెడుతున్నప్పటికీ మీ పిల్లలను కొట్టడం , లాగడం లాంటివి ఎంత మాత్రం చేయకూడదు. పిల్లలను శారీరకంగా హాని చేయడం, గట్టిగా దూకుడుగా ప్రవర్తించడం మంచిపనిగా వారు గ్రహిస్తారు. ఒక చిన్న పిల్లవాడు నొప్పిని మాత్రమే గుర్తించగలడు. అతని ప్రవర్తనకు దానిని శిక్షగా గుర్తించలేడు.

 

బెదిరించడం లేదా అబద్ధం చెప్పడం :

కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల పరిస్థితులను సానుకూలంగా తీసుకువచ్చే ప్రక్రియలో అతిత్వరగా అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తారు. ఉదాహరణకు పిల్లలు నిద్ర పోవడానికి అనుకూలంగా లేకుండా నిరాకరిస్తున్న సమయంలో బూచోడు వస్తాడు అని భయపెడతారు. ఇటువంటివి మీ పిల్లల మనస్సులో అనవసరమైన ఆందోళన మరియు భయాలను కలిగిస్తాయి. ఇది వారి నిద్రకు ఆటంకంగా మారి భయాందోళనలకు గురి చేస్తుంది.

 

లంచాలు ఆఫర్ చేయండి :

అత్యవసరమైన సమయంలో పరిష్కారం కోసం ఎదురు చూసే సమయంలో లంచం ఇవ్వడం ఒక ప్రలోభం. " మీరు ఈ పనిని పూర్తి చేయండి నేను మీకు ఈ గేమ్ కొంటాను" లేదా " మీరు ఈ కాయగూరలు తింటే మీకు ఈ చాక్లెట్ ఇస్తాను" అలా పిల్లలు ఒక కొత్త ఆట వస్తువును ఆశిస్తారు లేదా ఆరోగ్యకరమైన భోజనం తిన్న ప్రతిసారి ఒక చాక్లెట్ను ఆశిస్తారు.

 

మీ పిల్లల కోసం మీరు విధించిన నియమాలను ఉల్లంఘించకండి :

మీరు నియమాలను విధించినట్లు అయితే వాటిని అనుసరించాలి అని నిర్ధారించుకోండి. మీకు మీరే వాటిని అనుసరించనట్లయితే పిల్లలు వాటిని అంగీకరించలేరు.

 

మీ పిల్లలు తిరుగుబాటు చేయడం వెనుక మిమ్మల్ని బాధ పెట్టడం లేదా అవమానించడం అనే ఉద్దేశం ఏమీ ఉండదు. అది అసలు మీకు సంబంధించినది కాదు. అది వారి గురించి మాత్రమే. వారు మీ నుండి గుర్తింపును కోరుతున్నట్లు అయితే వారు దానిని పొందలేని సమయంలో అటువంటి ప్రవర్తన ద్వారా దానిని బయల్పరుస్తారు. మీ బిడ్డపై దయగల మాటలతో ప్రేమను కురిపించండి. వారు ఒక పనిని పూర్తి చేసినప్పుడు వారిని ప్రోత్సహించండి మరియు  ప్రశంసించండి. అది ఎంత చిన్న పని అయినప్పటికీ! అలా చేసినప్పుడు మీ పిల్లలు ప్రేమ ద్వారా క్రమశిక్షణను నేర్చుకుంటారు.


పిల్లల క్రమశిక్షణ పై మాతో పంచుకోవడానికి మీకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా ? వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}