• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

పిల్లల్లో హెచ్ఐవి సంక్రమణను (హెచ్ఐవి +) నిర్ధారించడానికి 8 మార్గాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Dec 01, 2020

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవసరమైన అవగాహన కల్పించడానికై ప్రతిజ్ఞ చేద్దాం. హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతుంది. హెచ్ఐవి (యూనిసెఫ్ ఇండియా 2015 ) ప్రకారం భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను గురించి హెచ్ఐవి గురించి కొన్ని ప్రాథమిక గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. భారత ప్రభుత్వ అంచనా ప్రకారం...

 

  • హెచ్ఐవి సోకిన వారిలో 40% వరకు మహిళలు

 

  • ప్రసవం సమయంలోనూ మరియు ప్రసవానికి ముందు ఈ వ్యాధి సోకిన పిల్లలు 5.7% కాగా, ఏడాదికి 23,000 మంది నవజాత శిశువులు దీని బారిన పడుతున్నారు.

 

  • హెచ్ఐవి పాజిటివ్ ఉన్న జనాభాలో 3.5 % మంది పిల్లలు 15 ఏళ్ల లోపు వారు.

 

హెచ్ఐవి ఉన్న పిల్లల సంఖ్య ఎందుకు పెరుగుతుంది ?

కలుషితమైన సూదులు మరియు అసురక్షిత రక్తమార్పిడి ద్వారా కూడా పిల్లల్లో రోగనిరోధకశక్తిని దెబ్బతీసే ఈవ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఏదిఏమైనప్పటికే, 15 సంవత్సరాల లోపు  పిల్లలకు ఈ వ్యాధి తల్లి ద్వారానే సంక్రమించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందువలన గర్భిణీ స్త్రీలలో హెచ్ఐవి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించడం వలన ఈ వ్యాధి పిల్లలకు సంక్రమించకుండా నివారించవచ్చు.

 

హెచ్ఐవి పాజిటివ్ ఉన్న గర్భిణీ స్త్రీలు ఎక్కువ శాతం  ఆరోగ్య నిపుణుల నుండి వివక్షను ఎదుర్కొంటున్నారు. చాలామంది ఆరోగ్య నిపుణులు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లుల ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సంరక్షణ, గర్భస్రావము లేదా స్టెరిలైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇది హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లల పుట్టుకను పెంచుతుంది.

 

హెచ్ఐవి పాజిటివ్ మరియు ఎయిడ్స్ ఒకేలాంటివా ?

కాదు. హెచ్ఐవి పాజిటివ్ మరియు ఎయిడ్స్ ఒకేలా ఉండవు. హెచ్ఐవి అనేది ఒక వైరస్, మరియు ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక స్థితి. దీని కారణంగా శరీరం తేలికపాటి ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడలేక పోతుంది. ఎందుకంటే ఈ హెచ్ఐవి వైరస్ మానవ రోగనిరోధకశక్తిని తీవ్రంగా బలహీనపరుస్తుంది. సాధారణ జలుబు ద్వారా కూడా ప్రాణాలను కోల్పోతారు. కాబట్టి ఎయిడ్స్ కి హెచ్ఐవిని ఒక కారణంగా చెప్పవచ్చు.

 

హెచ్ఐవి పాజిటివ్ అయితే బిడ్డకు త్వరలో ఎయిడ్స్ అభివృద్ధి చెందుతుందా ?

 

హెచ్ఐవి ఉన్న పిల్లలందరికీ ఎయిడ్స్ అంత త్వరగా రాదు. నిజానికి హెచ్ఐవి బారిన పడిన పిల్లలులో కొంత మంది ముందు కొన్ని సంవత్సరాల వరకు ఎంతో ఆరోగ్యంగా అనిపించవచ్చు. హెచ్ఐవికి చికిత్స అనేది నివారణ కాదు. ఇది వ్యాధి యొక్క పురోగతిని నివారించడానికి లేదా ఆలస్యం అవ్వడానికి సహాయపడుతుంది. హెచ్ఐవికి చికిత్స చేయించనట్లయితే ఇది పిల్లలలోని రోగనిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

 

హెచ్ఐవి సోకిన పిల్లల్లో ఎక్కువకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి దానిని ముందుగా గుర్తించి, సరైన చికిత్స చేయడం ఎంతో అవసరం.

 

హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డకు ఎంత త్వరగా హెచ్ఐవి పరీక్షలు చేయించాలి ?

హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డకు హెచ్ఐవి పరీక్ష చేయించడం చాలా ముఖ్యం. శిశువు హెచ్ఐవి బారిన పడ్డారో లేదో తెలుసుకోవడానికి పుట్టుకతోనే ఈ పరీక్ష జరిపించాలి. ఈ పరీక్షను వైరోలాజికల్ టెస్టింగ్ అని పిలుస్తారు. 18 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో హెచ్ఐవి సంక్రమణను నిర్ధారించే పరీక్షలలో ఇది అత్యంత నమ్మదగిన పరీక్ష విధానం. దీనికోసం ప్రత్యేక ప్రయోగశాలకు రక్త నమూనాను పంపడం అవసరం. ఇది సాధారణంగా చవకైనది మరియు  గుర్తించడం కూడా సులభం. ఇది బిడ్డ పుట్టిన 14 రోజుల నుండి 21 రోజుల లోపల చేయాలి. తిరిగి 1నెల నుండి 2 నెలల లోపల , ఆ తరువాత 4 నుండి 6 నెలల లోపల ఈ పరీక్షలు జరపాలి.

 

శిశువుకు హెచ్ఐవి నెగెటివా లేదా హెచ్ఐవి పాజిటివా అని నిర్ధారించుకోవడానికి కనీసం రెండు హెచ్ఐవి వైరోలాజికల్ పరీక్షల ఫలితాలు అవసరం ఉంటుంది.

 

బిడ్డను హెచ్ఐవి నెగిటివ్ గా ఎప్పుడు పరిగణించవచ్చు ?

రెండు వైరోలాజికల్ పరీక్షల ఫలితాలు నెగిటివ్గా ఉన్నప్పుడు. మొదటి పరీక్ష యొక్క నెగెటివ్ ఫలితం బిడ్డకు ఒకనెల అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు, రెండవ పరీక్ష యొక్క ఫలితం బిడ్డకు 4 నెలలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు.

 

బిడ్డ హెచ్ఐవి పాజిటివ్ గా ఎప్పుడు పరిగణించబడుతుంది  ?

 

రెండు వైరోలాజికల్ పరీక్షల ఫలితాలు పాజిటివ్ గా ఉన్నప్పుడు.

 

మీ బిడ్డకు హెచ్ఐవి పాజిటివ్ అని ఎలా తెలుసుకోవాలి ?

హెచ్ఐవి సోకిన పిల్లల్లో వయస్సుతో పాటు దాని లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ క్రింద ఇవ్వబడ్డవి కొన్ని సాధారణ లక్షణాలు. బిడ్డ హెచ్ఐవి పాజిటివ్ అని తెలుసుకోవడానికి 8 మార్గాలు.

 

1. తక్కువ బరువు పెరగడం :

హెచ్ఐవి సోకిన శిశువులు మరియు పిల్లలు  పెరుగుదల మరియు అభివృద్ధి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అనగా బరువు పెరగడం మరియు వయస్సుకి తగిన ఎదుగుదలలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇది హెచ్ఐవి పాజిటివ్ యొక్క ముఖ్యమైన సంకేతాలలో ఒకటి.

 

2. సాధారణ ఎదుగుదలను అందుకోలేరు :

ఆయా సమయాల్లో వచ్చే ఎదుగుదలను చేరుకోవడంలో వైఫల్యం చెందుతారు. ఉదాహరణకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లలను ఇతర పిల్లలతో పోల్చినప్పుడు బోర్లా పడడం, ప్రాకడం, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

 

3. బాల్యంలో తరచు అనారోగ్యంగా ఉండడం :

మానవ  రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే ఈ వైరస్ పిల్లల అభివృద్ధి చెందుతున్న వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆ కారణంగా పిల్లలలో తేలికపాటి మరియు సాధారణ అంటువ్యాధులతో కూడా పోరాడే శక్తి ఉండదు. తత్ఫలితంగా పిల్లలు తరచూ చెవి, సైనస్ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. వీటివలన తరచుగా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, విరోచనాలు మరియు అలసటతో బాధపడుతూ ఉంటారు.

 

4.నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు పునరావృతం అవుతాయి :

హెచ్ఐవి పిల్లల యొక్క జీర్ణ వ్యవస్థను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలను ఈస్ట్ ఇన్ఫెక్షన్ల అసమానతలను పునరావృతం చేస్తుంది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పిల్లలలో 50% నుండి 85% వరకు నోటి అనారోగ్యము మరియు డైపర్  ప్రదేశాలలో చర్మంపై వాపు ఉంటుంది. గొంతు, నాలుక మరియు చిగుళ్లపై తెల్లని పుండ్లు కనిపించడం ఈస్ట్ ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది.

 

5. ఉదర వాపు :

హెచ్ఐవి సోకిన పిల్లల్లో ఉదరపు వాపు అన్నది వారి మామూలు కదలికలను కూడా కష్టతరం చేసే మరొక సమస్య. ఇది వైరస్ వలన లివరు మరియు స్ప్లీన్ లలో వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుంది.

 

6. చర్మాన్ని ప్రభావితం చేస్తుంది :

హెచ్ఐవి కారణంగా పిల్లలలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, వారు చర్మశోథ అని పిలువబడే తీవ్రమైన చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. వారి శరీరంలోని చర్మం అంతా కూడా ఎర్రగా, పొడిబారి దురదతో కూడిన మచ్చలు ఏర్పడతాయి.

 

7. లింఫ్ గ్రంథుల వాపు :

లింఫ్ గ్రంథుల వాపు మరియు బాధాకరమైన నొప్పి పిల్లల్లో హెచ్ఐవి పాజిటివ్ కు మరో ముఖ్యమైన సంకేతం. ఇన్ఫెక్షన్ కారణంగా లింప్ గ్రంధులలోని ద్రవం ప్రేగులకు చేరుతుంది. సాధారణంగా హెచ్ఐవి మెడ ప్రాంతం చుట్టూ , అలాగే చంకలోని లింప్ గ్రంధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

 

8. నాడీ సమస్యలు :

సాధారణంగా హెచ్ఐవి నరాలను దెబ్బతీస్తుంది. మూర్చలు, నడవడంలో ఇబ్బంది వంటి నరాల సమస్యలు నాడి దెబ్బతినడం వలన సంభవిస్తాయి. పిల్లలు వీటిలో దేనితోనైనా బాధపడుతున్నట్లయితే హెచ్ఐవి పాజిటివ్ అయిఉండవచ్చు.

 

ఈ బ్లాగ్ ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి సమాజానికి అవసరమైన అవగాహన అందించాలని మేము ఆశిస్తున్నాము. మీకు మరేమైనా సందేహాలు మరియు ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి వెంటనే వైద్యుని సంప్రదించండి. మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ దిగువ వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఎంత ఇష్టపడతాము.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}