పిల్లలు బాగా చదువుటకు మార్గములు

3 to 7 years

Monika

12.9K వీక్షణలు

4 days ago

 పిల్లలు బాగా చదువుటకు మార్గములు

పిల్లలు వారి జీవితంలో ప్రారంభ  సంవత్సరములను తల్లితండ్రులతో గడుపుతారు  కావున వారు ఏదైనా నేర్చుకోవడానికి తల్లితండ్రులే ప్రధాన పాత్ర పోషిస్తారు. పిల్లల యొక్క మొత్తం పనితీరు, ప్రవర్తన  వారి తల్లితండ్రుల నుంచి వచ్చిన శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తల్లితండ్రులు నిర్లక్ష్యం చేసినా విద్యార్థుల కంటే తల్లితండ్రుల నుండి సరైన శ్రద్ధ పొందిన పిల్లలు వారి విద్యా జీవితం లో ఎక్కువ విజయాలను సాధించారనేది వాస్తవం. పిల్లల్ని పెంచడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి తల్లితండ్రులు కొన్ని అవసరమైన విషయాలను పరిగణించాలి అప్పుడే వారు విద్యలో అలాగే సాధారణ జీవితంలో రాణించగలరు.

Advertisement - Continue Reading Below

తల్లితండ్రులు తమ పిల్లలకు ఎక్కువ సమయం మరియు శ్రద్ధ ఇవ్వాలి:

పిల్లలకు సరైన శ్రద్ధ ఇవ్వాలి. వారితో సమయాన్ని గడపడం, వారి కార్యకలాపాలలో ఆసక్తి పెంచుకోవడం, వారిని మెరుగుపర్చడం కోసం మార్గదర్శకత్వం చేయడం మరియు వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం చేయాలి. చిన్న వయసులో పిల్లలకు మంచి చెడుల అవగాహన ఉండదు కాబట్టి  వీలైనంత వరకు చెడు అలవాట్లు ఉన్న వాళ్లకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. పిల్లలతో ఆటలు ఆడటం కోసం సమయం కేటాయించాలి. సాధారణ విషయాల గురించి వారితో చర్చించడం, చదువు గురించి వారిని అడగడం కుదిరితే వారి చదువులో సహాయం చేయడం లాంటివి చేయాలి. పాఠశాలలో మన చిన్ననాటి రోజుల గురించి చెప్పి చదువు అనేది సవాలుగా మరియు సరదాగా ఉంటుందని వివరించాలి. ఇలా చేయడం వలన వారికి చదువు పట్ల ఉన్న బాధ్యత  తెలుస్తుంది అలానే వారి యొక్క విశ్వాసస్థాయి పెరిగి వారికి చదువు పట్ల ఉన్న ఆసక్తి పెరిగేలా చేస్తుంది.

అనుకూలమైన వాతావరణమును ఇవ్వాలి:

తల్లితండ్రులు మరియు కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి తల్లితండ్రులు వారి పిల్లలకు స్నేహపూరిత వాతావరణాన్ని అందించాలి. చుట్టూ ఉన్నవారు పిల్లల్ని నొప్పిస్తున్నట్లైతే వారు ఒత్తిడికి లోనై చదువు పై ఆసక్తి చూపించలేరు. అలాగే ఇంటి వాతావరణం కూడా అనుకూలముగా ఉండేలా చూడాలి. ఉదాహరణకు వారు చదువుతున్నపుడు టీవీ పెట్టకుండా ఉండడం  లాంటివి చేయాలి లేకుంటే వారు వారి యొక్క ఏకాగ్రతని కోల్పోతారు.

తల్లితండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి:

పిల్లలు సరిగా చదవకపోయినా పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నా వారిని చివాట్లు పెట్టకూడదు. అలా చేస్తే వారు నిరాశ చెంది చదువు పట్ల ఆసక్తిని కోల్పోతారు. తల్లితండ్రులు పిల్లల్ని మంచి విజయాల కోసం కృషి చేయడానికి ప్రోత్సహించాలి. పిల్లలు చదువులో మరియు పరీక్షలలో చక్కగా రాణిస్తుంటే వారిని అభినందించాలి. ఇలా చేయడం వలన వారు ఇంకా ఎక్కువ ప్రశంసలు అందుకోవడం కోసం చదువుతారు.

Advertisement - Continue Reading Below

తల్లితండ్రులు తరచూ ఉపాధ్యాయులను సంప్రదిస్తూ ఉండాలి:

తల్లిదండ్రులు వారి పిల్లల ఉపాధ్యాయులతో క్రమబద్ధంగా సంప్రదిస్తూ ఉండాలి. వారి పిల్లల పనితీరు, అభివృద్ధి, బలహీనతల గురించి అడిగి తెలుసుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇలా వారి గురించి చర్చించడం వలన  చదువు మరియు పరీక్షలలో వారికీ ఉన్న బాధ్యత తెలుసుకుంటారు.

తల్లిదండ్రులు వారి బలహీనత మరియు సమస్యల గురించి వారి పిల్లలతో మాట్లాడాలి:

తల్లిదండ్రులు వారి పిల్లల సమస్యలు మరియు బలహీనతల  గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తల్లితండ్రులు తమ పిల్లలతో చర్చించాలి , వారికి  ఉన్న సమస్య గురించి వారిని అడిగి తెలుసుకోవాలి. పిల్లలు కొన్నిసమస్యలను కలిగి ఉండవచ్చు, వాటి వాళ్ళ వారు సరిగా చదవకపోవచ్చు . తల్లిదండ్రులు వాటి  గురించి తెలుసుకోవాలి మరియు వారి సమస్యకు పరిష్కారం పొందడానికి వారికి సహాయం చేయాలి.

తల్లితండ్రులు వారి పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ ఉండాలి:

తల్లితండ్రులు వారి పిల్లల కార్యకలాపాల గురించి అవగాహన కలిగి ఉండాలి. వారు వారి పిల్లల సాధారణ కార్యక్రమాల పై దృష్టిని కలిగి ఉండాలి. వారు సమయాన్ని, శక్తిని నిరుపయోగమైన విషయాలలో వృధా చేయకుండా చూస్తూ ఉండాలి . వారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటే ( వీడియో గేమ్లు అన్ని సమయాలలో ఆడటం), తల్లితండ్రులు వారిని  అలా చేయకుండా ఆపాలి.

తల్లితండ్రులు వారి పిల్లల సాధారణ  మరియు అలవాట్లు నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సహాయం చేయాలి:

పిల్లలకు అధ్యయన అలవాట్లు మరియు ఇతర మంచి అలవాట్లను తతెలిసేలా చేయాలి అనగా ఆరోగ్య అలవాట్లు, నిద్ర అలవాట్లు, ఆహార అలవాట్లు మొదలగునవి. తల్లితండ్రులు పిల్లలకు  చదవడం , సమయానికి నిద్రించడం , సమయానికి తినడం లాంటి విషయాలలో సలహా ఇవ్వడమే కాకుండా సంభాషణా నైపుణ్యాలు, రచనా నైపుణ్యం వారికి నేర్పించాలి.

తల్లితండ్రులు వారి పిల్లలకు సలహా ఇవ్వడానికి సరైన ప్రవర్తన కలిగి ఉండాలి:

తల్లితండ్రులు వారు పిల్లల పైన కొన్ని సందర్భాలలో ప్రేమను చూపిస్తారు కొన్ని సందర్భాలలో కఠినత్వం చూపిస్తారు. కానీ ప్రేమ మరియు కఠినత్వంలో  సమానత్వం ఉండాలి. పిల్లలు చిన్న తప్పులు చేసినప్పుడు వారితో కఠినముగా ఉండకూడదు చిన్న తప్పులని ప్రేమతో కూడా సరి చేయవచ్చు. కానీ ఏదైనా ఒక తప్పు వల్ల దాని  ప్రభావం పిల్లల పైన ఎక్కువగా చుపిస్తున్నట్లయితే వారిని కఠినముగా హెచ్చరించాలి.

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...