• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ప్లేట్లెట్ సంఖ్యను పెంచడానికి సహాయపడే 10 సహజ ఆహారాలు

Aparna Reddy
7 నుంచి 11 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 19, 2021

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ప్లేట్లెట్స్ అనే పదం గురించి మనం చాలా సార్లు వింటూ ఉంటాము. ఇప్పుడు ఇది చాలా సాధారణం అయింది." ప్లేట్లెట్ కౌంట్ పెరగడం లేదా ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది " అనే మాట తరచూ వింటూ ఉంటాము. ఆతర్వాత అన్నివైపుల నుండి సలహాలు వస్తాయి. దీనిని ప్రయత్నించండి లేదా దీనిని తినండి లేదా దీనిని నివారించండి. అసలు ప్లేట్లెట్స్ అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అనేది సాధారణమైన సమస్య మాత్రం కాదు. కానీ, ఒక మంచి విషయం ఏమిటంటే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చడం ద్వారా ప్లేట్లెట్ కౌంట్ను సాధారణ స్థితిలోకి తీసుకు రావచ్చు.

 

 ప్లేట్ లెట్స్ అంటే ఏమిటి ?

ముందుగా , ప్లేట్లెట్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ! ప్లేట్లెట్స్ అనేది మన రక్త కణాలలోని అతి చిన్న కణాలు. అవి మన రక్తంలో పెరుగుతాయి మరియు దెబ్బతిన్న రక్తకణాల ప్రదేశంలో కలిసి పోతాయి. మామూలుగా చెప్పాలంటే ఏదైనా రక్త కణాలకి గాయం అయినప్పుడు , అది రక్తకణాలకు ఒక సంకేతాన్ని పంపుతుంది. సంకేతం అందుకున్న తర్వాత ప్లేట్ లెట్స్ ఆ ప్రదేశానికి చేరుకుంటాయి. ఆ దెబ్బతిన్న ప్రాంతాల్లో రక్తస్రావాన్ని నియంత్రిస్తాయి లేదా ఆపుతాయి. వాటిని "ఆన్  సైట్ రిపేరింగ్ ఇంజనీర్లు " అని కూడా పిలుస్తారు.

 

 ప్లేట్లెట్ కౌంట్ అంటే ఏమిటి ?

ప్లేట్లెట్స్కు కీలక పాత్ర ఉంది. ఒక చిన్న రక్త కణాలు సాధారణ సంఖ్యను నిర్వహించడం చాలా ముఖ్యము. ఒక సాధారణ ప్లేట్లెట్ లెక్కింపు రక్తం యొక్క మైక్రో లీటర్కు 150,000 నుండి 450,000 ప్లేట్లెట్ల వరకు ఉంటుంది. సి బి సి అని పిలువబడే సాధారణ రక్తపరీక్ష ద్వారా ప్లేట్లెట్ కౌంట్ ను తెలుసుకుంటారు. ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం లేదా ప్లేట్లెట్ సంఖ్య పెరుగుదల అనేవి రెండూ కూడా అంతర్లీన సమస్యలను సూచిస్తుంది. దీనిని వైద్యులు అర్థం చేసుకోగలుగుతారు.

 

ప్లేట్లెట్ కౌంట్ ఏ సమయంలో పడిపోతుంది ?

రక్తం యొక్క మైక్రోమీటర్ కు 150,000 కన్న తక్కువ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నట్లయితే అది ప్లేట్లెట్ కౌంట్ పడిపోయినట్లుగా సూచిస్తుంది మరియు ఈ పరిస్థితిని వైద్యపరంగా " త్రాంబోసైతోపెనియా " అని పిలుస్తారు. ప్లేట్లెట్ కౌంట్ పతనం రక్తంలో ప్లేట్లెట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది అని సూచిస్తుంది. కొన్ని రకాల మందులు, వైరల్ ఇన్ఫెక్షన్, వారసత్వంగా వచ్చిన పరిస్థితి, మూత్రపిండాలు పనిచేయకపోవడం వంటి అనేక రకాల కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. అయితే, వీటిలో సాధారణ కారణం వైరల్ ఇన్ఫెక్షన్ లేదా డెంగ్యూ జ్వరం. వీటివలన ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పడిపోతుంది. ఎంతగా అంటే, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిన వ్యక్తి కోలుకునే విషయంలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కాకుండా ఇతర కారణాల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం వలన అలసట, గాయం తగ్గడంలో ఆలస్యం, చిగురు లేదా ముక్కుల్లో రక్తస్రావం, మూత్రం మరియు మలంలో రక్తం మరియు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి.

 

ప్లేట్లెట్ సంఖ్య సులభంగా పెరగడానికి సహాయపడే 10 సహజ ఆహారాలు :

ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అంతే సాధారణ సమస్య కాదు. కానీ, ఒక మంచి విషయం ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా అకౌంట్ను సహజంగా సాధారణ పరిమితుల్లో పెంచవచ్చు మరియు నిర్వహించవచ్చు. ప్లేట్లెట్ సంఖ్యను సహజంగా పెంచడానికి సహాయపడే విటమిన్లు మరియు ఖనిజాలు..

 

 1. ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు : ఆరోగ్యకరమైన రక్తకణాలకు ఫోలేట్ ఒక రకమైన బి విటమిన్. దానికి ఫోలేట్ అనే పేరు " ఫోలియం "అనే పదం నుండి వచ్చింది. అంటే ఆకులు అని అర్థం. అందువల్ల ఇది ప్రధానంగా ఆకుపచ్చ ఆకులు లేదా కాయగూరల లో కనిపిస్తుంది. బచ్చలి కూర, ఆకుపచ్చ కాయగూరలు, ఆస్పరాగస్, బఠానీలు (లోబియ) వంటి ఆహారాలు ఈ విటమిన్ యొక్క గొప్ప వనరులు. ఫోలేట్ యొక్క లోపం తక్కువ ప్లేట్లెట్స్ సంఖ్య తో ముడిపడి ఉంటుంది అందువలన ఈ పోషకాలు ఉన్న ఆహారం ద్వారా తీసుకోవడంలో సంఖ్య పెరగడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.

 

 1. విటమిన్ బి - 12 ఆహారాలు : ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి విటమిన్ బి - 12 అవసరం ఉంటుంది. శరీరంలో విటమిన్ బి - 12 యొక్క స్థాయిలు తక్కువగా ఉండడం వలన ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడానికి దోహదం చేస్తుంది. బీ - 12 ప్రధానంగా గుడ్లు, మాంసం మరియు పాలు లేదా జున్ను వంటి ఇతర జంతువులు ఆహారాలలో ఉంటుంది. పాల పదార్థాలు తీసుకోని వారికోసం మరియు శాకాహారుల కోసం ఈ సంఖ్యను పెంచడానికి సప్లిమెంట్స్ తీసుకోవాలి.

 

 1. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు : రోగనిరోధక పనితీరులో విటమిన్ సి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది ప్లేట్లెట్స్ సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది మరియు అదనంగా  శరీరం ఇనుమును తీసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది .ఇది ప్లేట్లేట్లకు మరొక ముఖ్యమైన పోషకం. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు సిట్రిక్ పండ్లు , బెర్రీలు, బత్తాయి, కివి, స్ట్రాబెర్రీ, మామిడి, పైనాపిల్, బ్రోకలీ, ఆకుపచ్చ మరియు ఎరుపు మిరియాలలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ వేడిలో సున్నితమైనది కాబట్టి, ఈ ఆహారాలను ముడిపదార్థాల రూపంలో తీసుకోవడం మంచిది.

 

 1. విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు : రక్తం గడ్డ కట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె ఎంతో అవసరం. కొన్ని అధ్యయనాలు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ప్లేట్లెట్ సంఖ్యను మెరుగుపరచడం లోనూ మరియు రోగ లక్షణాలను నియంత్రించడంలోనూ సహాయ పడింది అని గుర్తించారు. విటమిన్ కె అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆకుకూరలు ( బచ్చలి కూర , టర్నిప్ గ్రీన్స్, పార్స్లీ) బ్రోకలీ, గుమ్మడి కాయ, గుడ్లు మరియు మాంసం.

 

 1. ఐరన్ పుష్కలంగా దొరికే ఆహారాలు : ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఐరన్ ఎంతో అవసరం. ఆకుకూరలు, పప్పులు, కిడ్నీ బీన్స్ (రాజ్మా), గుమ్మడికాయ గింజలు వంటి ఆహార పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లు మరియు మాంసం వంటి జంతువుల ఆహారాలలో ఇనుము శాతం తక్కువగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందువలన వాటిని మంచి వనరులుగానే పరిగణించబడతాయి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలతో కలపడం వలన దానిలోని గుణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, మీ భోజనంతోపాటు ఫ్రూట్ సలాడ్ లేదా సిట్రస్ ఫ్రూట్స్ తో తయారుచేసిన బీన్ సలాడ్ తీసుకోవడం మంచిది.

 

 1. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలు : ఆరోగ్యకరమైన ప్లేట్లెట్ ఉత్పత్తికి విటమిన్ ఏ సహాయ పడుతుంది. క్యారెట్, పసుపు గుమ్మడికాయ, ఆకుకూరలు, చిలగడదుంపలు, పాలు, జున్ను, గుడ్లు, మాంసము మరియు అన్ని రంగులలో గల పండ్లు మరియు కాయగూరలు వంటివి విటమిన్ ఏ యొక్క గొప్ప పనులు.

 

 1. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు : ప్లేట్లెట్స్ మరియు ఇతర రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముక మజ్జ కణాల పనితీరులో విటమిన్-డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరం విటమిన్-డి ని ఉత్పత్తి చేయగలదు. కానీ, ప్రతిరోజు కొంత సమయం సూర్యరశ్మికి దగ్గరగా ఉండడం అవసరం. అదనంగా, గుడ్డులోని పచ్చసొన, కొవ్వు చేపలు, సాల్మన్ వంటి ఆహారాలు విటమిన్ డి కి మంచి వనరులు.

 

 1. క్లోరోఫిల్ : క్లోరోఫిల్ అనేది మొక్కలలో కనిపించే ఆకుపచ్చ రంగు ద్రవ్యము. క్లోరోఫిల్ తీసుకోవడం వలన ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్న లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. కానీ, దీనిపై పరిశోధనలు తక్కువగా చేయబడ్డాయి. క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటే గోధుమ గడ్డిని రోగనిరోధకశక్తి బూస్టర్ గా పిలుస్తారు. ఇది ప్లేట్లెట్స్ సంఖ్యను బాగా మెరుగు పరుస్తుంది.

 

 1. బొప్పాయి మరియు బొప్పాయి ఆకు రసం : పుష్కలమైన ఏ విటమిన్ తో నిండిన బాగా పండిన బొప్పాయి ప్లేట్లెట్ సంఖ్యను పెంచడానికి సహాయపడే గొప్ప ఆహారం. అనేక అధ్యయనాలు ప్లేట్లెట్ సంఖ్యను పెంచడంలో గొప్ప యొక్క పాత్రను పోషిస్థాయి. అదేవిధంగా బొప్పాయి ఆకు యొక్క రసంతో ప్లేట్లెట్ మరియు ఎర్రరక్తకణాల సంఖ్య గణనీయంగా మెరుగు పడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. తాజా బొప్పాయి ఆకుల నుండి రసాన్ని తాజాగా తయారు చేసుకోవాలి. ఆకులను మెత్తగా నూరి ఆ రసాన్ని తీయడం లేదా శుభ్రంగా కడిగిన ఆకులను నీటిలో ఉడక పెట్టడం ద్వారా రసాన్ని తయారు చేసుకోవచ్చు.

 

 1. దానిమ్మ : దానిమ్మ పండు ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ పండు ఇనుము, విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ప్లేట్లెట్ సంఖ్య తక్కువగా ఉండే సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతో మంచిది. ఈ పండు ను పురాతన కాలం నుండి  ఆరోగ్యకరమైన మరియు ఔషధ లక్షణాలు కోసం ఉపయోగించబడుతుంది.


చివరిగా, ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్నవారు నిర్దిష్ట ఆహారాన్ని తీసుకోవడం ద్వారా లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా వారి పరిస్థితిని మెరుగు పరుచుకోవాలి. అదే సమయంలో, ప్లేట్లెట్ స్థాయిలను తగ్గించే ఆల్కహాల్, క్వినైన్, అస్పర్తమ్ లను నివారించడం కూడా ఎంతో ముఖ్యం. అయినప్పటికీ, ప్లేట్లెట్ సంఖ్య తక్కువగా ఉండడానికి కారణాలను అర్థం చేసుకోవడానికి వైద్య సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చర్చలు

Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}