• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అభిరుచులు

పావురాల వల్లనే ప్రముఖ నటి మీనా భర్త కన్నుమూత? అవి ప్రాణాంతకమా..

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 02, 2022

ప్రముఖ దక్షణ భారత నటి మీనా భర్త విద్యాసాగర్ కోవిడ్ అనంతర పరిణామాల వాళ్ళ ఇటీవల హఠాత్తుగా మృతి చెందారు. అయితే,  పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయన  ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని,  దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో గత కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని తమిళ మరియు ఇతర భాషల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనితో  మీనా భర్త విద్యాసాగర్‌ (48) కన్నుమూత  విషయం చర్చనీయాంశంగా మారింది.

చెన్నైలోని మీనా దంపతుల  ఇంటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని.. వాటి వల్లే విద్యాసాగర్ ఇన్‌ఫెక్షన్‌కు గురై అనారోగ్యం పాలయ్యారని స్థానిక మీడియా పేర్కొ౦ది. కాగా, తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా పావురాల సంచారం చాలా అధికంగా ఉంటుంది. వాటిని పెంచడ౦ హాబీగానే కాకుండా సెంటిమెంటుగా కూడా  భావిస్తారు. అవి శుభప్రదమని, వ్యాపార వృద్ధి చెందుతుందని ఇక్కడ పలువురు నమ్ముతారు.ఈ నేపధ్యంలో, పావురాల నుంచి ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందా? ఉంటే అవి ఏమిటి అనేది ఇపుడు వివరంగా తెలుసుకుందాం.

పావురాలను చూసి చాలా మంది ముచ్చటపడుతుంటారు. కానీ, వాటి నుంచి మనుషులకు అనేక ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని  వైద్య  నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్ట నుంచి రెప్పల వరకు శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటుందని వీరు వెల్లడించారు. తద్వారా వీటి నుంచి పెద్ద సంఖ్యలో వైరస్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు అప్రమత్తం చేసారు.

 గర్భిణులు, చిన్నపిల్లలకు..

గబ్బిలాల మాదిరిగానే, పావురాల రెట్టల్లో ‘హిస్టాప్లాస్మా’ అనే ఫంగస్ ఉంటుందని.. దీని వల్ల ‘హిస్టాప్లాస్మోసిస్’ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు. పావురాల వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా  వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు వెంటనే సోకే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. పావురాల కారణంగా చాలా మంది, వారికి తెలియకుండానే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు.

సాధారణంగా ఏసీ మెకానిక్‌లు ఎక్కువగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు. ఇందుకు కారణం పావురాలేనని శాస్రవేత్తలు చెబుతున్నారు. అనెక  అంతస్తులు ఉండే భవనాల్లో పావురాలు ఎక్కువగా ఏసీ యంత్రాలను ఆవాసంగా చేసుకొని ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.

జంట నగరాల పరిధిలో..

జంట నగరాల పరిధిలో ఇన్‌ఫెక్షన్లను వ్యాప్తి చేస్తూ పలువురికి ప్రాణాంతకంగా మారిన పావురాలను అటవీ ప్రాంతాలకు తరలించారు. 2019లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వందలాది పావురాలను బంధించి శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టి వచ్చారు  ప్రధానంగా బ్లాక్‌ రాక్ రకానికి చెందిన పావురాలను వలల సాయంతో పట్టుకొని తరలించారు.

చారిత్రక మొజాంజాహీ మార్కెట్ వద్ద బల్దియా సిబ్బంది వందలాది పావురాలను పట్టుకొని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు. అక్కడి ఐస్‌క్రీమ్ షాపులు, మాంసం విక్రయ షాపులు, బేకరీ నిర్వాహకులు, సిబ్బందితో పాటు కస్టమర్లు పావురాల కారణంగా శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. అంతేకాకుండా..నగర పరిధిలోని మొజాంజాహీ మార్కెట్ తదితర చారిత్రక కట్టడాలపై వేలాది పావురాలు రెట్టలు వేయడంతో అవి అంద విహీనంగా మారుతున్నాయి. వాటిని తొలగించి, శుభ్రపరచడం జీహెచ్‌ఎంసీ అధికారులకు అదనపు పనిగా మారింది. 

పావురాలకు ఆహారం ఇవ్వవద్దని బల్దియా అధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు విక్రయించే షాపులు, మార్కెట్ల వద్ద పావురాలను అస్సలు చేరనీయ వద్దని సూచించారు. ఇక జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని పార్కుల్లో పావురాల ఫీడింగ్ను నిషేధించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పావురాలు, వాటితో ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్న తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పావురాల నుంచి కొవిడ్ వైరస్ కూడా వ్యాప్తి చెందుతుందేమోనని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, దీనికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు పరిశోధనల ద్వారా తెలియాల్సి ఉంది.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అభిరుచులు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}