సిజేరియన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఆహార చిట్కాలు - శస్త్రచికిత్స తర్వాత తీసుకోకూడని ఆహారాలు...

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jun 25, 2020

సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత తల్లికి మరియు శిశువుకు పోషకాల అవసరాలను తీర్చడానికి మంచి పోషకాలతో కూడిన ఆహారం ఎంతో అవసరం. తల్లి శారీరకంగా కోలుకోవడానికి మరియు బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి కూడా సరైన ఆహారాన్ని తీసుకోవాలి .ఆపరేషన్ అయిన తర్వాత తల్లి కి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి .కేలరీలు ,ప్రొటీన్లు, కాల్షియం ,విటమిన్లు, ఖనిజాలు మరియు పాలిచ్చే తల్లికి అవసరమైన ద్రవాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి .ఆహారం సులువుగా జీర్ణం అయ్యే విధంగా ఉండాలి .ఎటువంటి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .అలా చేసినట్లయితే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
సిజేరియన్ తర్వాత మంచి ఆరోగ్యానికి సహాయపడే చిట్కాలు :
పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తికి అవసరమైన అదనపు శక్తి కలిగిన ఆహారం అవసరం ఉంటుంది . సులభంగా జీర్ణమయ్యే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రైస్, అటుకులు , సేమ్యా మరియు బంగాళాదుంపలు చాలా అవసరం .కొంత కాలం తరువాత ఓట్స్ ,రాగి ,గోధుమ నూక, సజ్జలు మొదలైన తృణధాన్యాలను కూడా తీసుకోవచ్చు .ఇవి ఫైబర్ తో పాటు క్యాల్షియం, ఐరన్ ,బి కాంప్లెక్స్ విటమిన్లు వంటి అదనపు పోషకాలను కలిగి ఉంటాయి.
మలబద్ధకాన్ని నివారించేందుకు ఫైబర్ చాలా అవసరం .ఈ సమయంలో తల్లి కదలకుండా ఉన్నందు వల్ల మలబద్ధకం రావడానికి చాలా అవకాశం ఉంటుంది . మలబద్ధకము కుట్లు మరియు గాయాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
పప్పులలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది . వీటిని బాగా కడిగి సూపుల రూపంలోనూ, కిచిడీ లాగానో లేదా రోటీ, రైస్ ల లోనికి కూడా తీసుకోవచ్చు .గుడ్లు ,చేపలు, చికెన్ ,ఫ్యాట్ తక్కువగా ఉండే పెరుగు , చీజు మొదలైన వాటిలో ఎక్కువ శాతం ప్రోటీన్ లభిస్తుంది. కణాల ఉత్పత్తికి మరియు త్వరగా కోలుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా కొవ్వు శాతం తక్కువగా గల పాల ఉత్పత్తులు కాల్షియం తో పాటు తల్లిపాలను పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.
గుడ్డులోని పచ్చసొన ,డ్రై ఫ్రూట్స్ ,ఎండు ద్రాక్ష, మాంసము మరియు ఆకుకూరల వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు డెలివరీ సమయంలో కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందేందుకు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు సహాయపడతాయి .పుష్కలంగా ఉన్నట్లయితే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు వేగంగా గాయం నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది.
సులభంగా జీర్ణమయ్యే కాయగూరలు మరియు బంగాళదుంప, పొట్లకాయ, బచ్చలికూర ,మామిడి బొప్పాయి మరియు అరటి పండ్లను తీసుకున్నట్లయితే విటమిన్లు మరియు ఖనిజాలను పొందవచ్చు .ఇతర కాయగూరలు కూడా సూపులు మరియు జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు.
పండ్లు మరియు కాయగూరలను సమృద్ధిగా తీసుకున్నట్లయితే సి విటమిన్ పుష్కలంగా లభించి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించబడి త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయి .వాటితో పాటుగా బొప్పాయి ,స్ట్రాబెర్రీ ,ద్రాక్ష ,క్యాప్సికం, టమోటా కూడా తీసుకోండి.
సిజేరియన్ తర్వాత ,ఆ సమయంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి సమకూర్చుకోవడం చాలా అవసరం .ఒంట్లోని చెడును బయటకు పంపేందుకు ,మలబద్ధకం రాకుండా ఉండేందుకు మరియు బిడ్డకు పాలు సమృద్ధిగా వచ్చేందుకు కూడా ఇవి ఎంతో అవసరం . దీనికొరకు పాలు, మజ్జిగ , సూపులు మరియు తగినంత నీటిని తీసుకోండి. కెఫిన్ పానీయాలు అయిన కాఫీ, టీ ,కార్బొనేటెడ్ పానీయాలు మరియు ప్యాక్ చేసిన జూసు లకు దూరంగా ఉండండి.
వెన్న ,మీగడ మరియు సులభంగా జీర్ణమయ్యే వెజిటబుల్ ఆయిల్ ను కూడా తీసుకోవచ్చు. సాంప్రదాయంగా ఇవ్వబడే ఈ ఆహారాలు పాల ఉత్పత్తికి మరియు త్వరగా కోలుకునేందుకు కూడా ఉపయోగపడతాయి.
పసుపు నొప్పి తగ్గించడంతో పాటు గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది .మరియు అనేక పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది . గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తల్లికి ఇవ్వండి.
వామ్ము మరియు అవిస గింజలు అజీర్ణము మరియు వాయువులను తగ్గించేందుకు సహాయపడుతాయి . ఇవి గర్భాశయాన్ని శుభ్రపరిచి, ప్రసవం తర్వాత కలిగే నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి .
ఇవి పాలను కూడా బాగా ఉత్పత్తి చేసేందుకు సహాయపడే ' గేలాక్టోజెనిక్ ' ఆహారము. జీలకర్ర కూడా ఇదే పనితీరును కలిగి ఉంటుంది .కషాయాలను తయారు చేసే నీటిలో వీటిని చేర్చడం ఎంతో మంచిది.
అదేవిధంగా అల్లం మరియు సొంటి వల్ల కడుపులో మంటను తగ్గించి మరియు పాల ఉత్పత్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.వెల్లుల్లి జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ను తొలగించేందుకు వీటిని తల్లికి ఇవ్వవచ్చు. వంటలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను బాగా ఉపయోగించవచ్చు.
మెంతులు ,ఇంగువ ,నువ్వులు కూడా పాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్ ,ప్రొటీన్లు, కాల్షియం కూడా మెండుగా ఉంటుంది.
సిజేరియన్ తర్వాత తీసుకోకూడని ఆహార పదార్థాలు :
ఎక్కువ కారము, అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు, మరియు వేపుడు పదార్థాలను తినకండి. అవి కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు అజీర్తికి కారణం అవుతాయి. ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నట్లయితే అందువల్ల అనవసరమైన బరువు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా నూనె పదార్థాలను తీసుకోకండి.
మద్యం ,ధూమపానం ,కెఫిన్ పానీయాలకు కూడా దూరంగా ఉండండి .ఎందుకంటే అవి తల్లిపాలలో కలిసిపోతాయి.
మూడు పూటల ఎక్కువ భోజనాన్ని తీసుకునే కంటే కూడా ,కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువ సార్లు గా తీసుకున్నట్లయితే మంచిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది . ఒకవైపు శస్త్రచికిత్స మరియు మరోవైపు తల్లి పాలు ఇవ్వడంవలన అవసరమైన అధిక పోషకాలను కూడా అందిస్తుంది.
ఈ బ్లాగు మీకు నచ్చిందా ?మీకు ఇది ఉపయోగకరంగా ఉందా ? దయచేసి మీ ఆలోచనలను మరియు సూచనలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు

| Sep 05, 2020
Very nice i will definitely try .but this diet which month to follow me