• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ప్రసవానికి ముందు యొగ వలన ప్రయొజనాలు

Radha Shree
గర్భధారణ

Radha Shree సృష్టికర్త
నవీకరించబడిన Nov 22, 2018

ఇవి కాకుండా చాలా వరకు సర్వసాధారణంగా నడుము నొప్పి, కాళ్ళ వాపులు వంటి చిన్న చిన్న సమస్యలతో కూడా బాధపడుతుంటారు. గర్భిణుల్లో అనేక అపోహలు తలెత్తుతాయి. ముఖ్యంగా వాళ్లు చేసే పనుల విషయంలో. కొందరేమో ఎంత ఎక్కువ పని చేస్తే ప్రసవం అంత సులువుగా అవుతుంది అని ఆలోచిస్తారు. మరి కొందరేమో దీనికి పూర్తి విరుద్ధం. తల్లి, బిడ్డ ఇద్దరి ఆహారం తినాలని ఎక్కువెక్కువ తింటుంటారు. మరి మంచం అసలు దిగరు. రెండు ధోరణులు సరికాదు.

సమపాల్లలో వ్యాయామం చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా వ్యాయామం అనగానే అందం కోసం అనే అపోహలో ఉంటారు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత ఇంకా పెద్దగా అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం అనుకుంటారు. నిజానికి అందమే కాకుండా, వారి ఆరోగ్యం, జీవనశెైలి చురుకుగా మల్చడానికి వ్యాయామం తోడ్పడుతుంది.       

గర్భిణిల్లో ప్రసవానికి ముందు తరువాత సహజంగా జరిగే మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యకు సమర్థవంతంగా ఎదుర్కొనుటకు వ్యాయామం చాలా బాగా సహాయపడుతుంది. బిడ్డకు జన్మనివ్వడమనేద ప్రతిఒక్కరి జీవితంలో అత్యద్భుతమైన, ఉద్వేగభరితమైన సంఘటనలలో ఒకటి. ప్రసూతికి పూర్వం యోగా చేయటం వలన గర్భధారణ సమయంలో ధృఢంగా మరియు చురుకుగా ఉండటానికి తోడ్పడటంతో పాటుగా మిమ్మల్ని బిడ్డకు జన్మనివ్వడానికి సంసిద్ధం చేస్తుంది. తరువాత రోజుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది.

స్త్రీలు గర్భం దాల్చినప్పుడు లేక ప్రసవం తరువాత వ్యాయామం మొదలుపెట్టే ముందు ఫిజీయోథెరపిస్ట్‌ని సంప్రదించి వారి సలహా మేరకు పాటించడం మంచిది. స్త్రీ యొక్క శారీరక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించి వారికి సురక్షితమైన వ్యాయామం సలహాలు సూచించగలరు.

ప్రసూతి పూర్వ యోగా వలన ఒనగూడే లాభాలు:

1. శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది:

ప్రసూతి పూర్వ యోగా మీ శరీరం మరియు మనసును మీ బిడ్డకు జన్మనివ్వడానికి తగినట్లు సంసిద్ధం చేస్తుంది. ప్రసూతి పూర్వ యోగా తరగతులలో మీకు నేర్పే కదలికలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి మీలోని ఒత్తిడిని తగ్గించి, బిగుసుకుపోయిన కండరాలను మామూలు స్థితికి తీసుకొస్తాయి. అంతేకాక రక్తప్రసరణను మెరుగుపరచి మీ శారీరక శక్తిని మరియు పాటుత్వాన్ని పెంచుతాయి. యోగా మీ శరీరాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్ది, మీ కదలికను సులభతరం చేసి, మీ ప్రసవసమయంలో సెర్విక్స్ తెరుచుకోవడానికి మరియు సులువుగా బిడ్డ బయటకు రావడానికి సహకరిస్తుంది.

2. మీ శరీర భంగిమలను మెరుగుపరచుకోండి:

మనం వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో మార్పులకు లోనవుతున్న కొన్ని భాగాలను లక్ష్యంగా చేసుకుని చేస్తాం. పెరుగుతున్న స్థనాల కొరకు చెస్ట్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. భుజాలు మరియు కటిభాగ స్థిరీకరణ వ్యాయామాలు చేస్తే క్రమముగా పెరిగే బిడ్డకు తగినంత ప్రదేశం మరియు శరీరానికి సరైన భంగిమను ఇవ్వడానికి తోడ్పడతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అప్పటి అవసరాలకు అనుగుణంగా ఉండే వ్యాయామాలపై దృష్టి సారించాలి.

3. మీ శరీరం చెప్పేది వినండి మరియు నమ్మండి:

గర్భధారణ సమయంలో మీ శరీరం 40 వారాల పాటు వివిధ మార్పులను చవిచూస్తుంది. ప్రసూతి పూర్వ యోగా మీ శరీరం యొక్క అవసరాన్ని కనిపెట్టి, మీ శరీరంపై మీకు నమ్మకం పెరిగేట్టు చేస్తుంది. మీరు అలసిపోయినట్టనిపించిన రోజున సులువైన వ్యాయామాలు, ఉత్సాహంగా ఉన్నట్టనిపించిన రోజున కొంచెం కఠినమైన వ్యాయామాలు చేయండి.

4. శ్వాసక్రియను గురించి మరియు శ్వాసక్రియ ద్వారా విశ్రాంతిని పొందే పద్ధతులను గురించి తెలుసుకోండి:

గర్భధారణ సమయంలో సరిగా నిద్రపట్టకపోవడం మరియు అలసిపోయినట్టనిపించడం సర్వసాధారణం. కాబోయే తల్లులు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామాలు (ప్రాణాయామం) మరియు ధ్యానం చేయడం వలన శరీరానికి మరియు మనసుకు ప్రశాంతత చేకూరి మంచి విశ్రాంతి దొరుకుతుంది.

5. ప్రసవవేదన మరియు జన్మనివ్వడం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది:

లేబర్ వార్డులో యోగా అభ్యసించిన తల్లులను సులభంగా గుర్తించవచ్చు. వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ప్రసూతి పూర్వ యోగా తరగతులు మీ వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుదలకు, త్వరగా నొప్పులు రావడానికి, ప్రసవమవడానికి మరియు బాలింతలకు తగిన శక్తినివ్వడానికి చాలా ఉపకరిస్తాయి. మీ తరగతిలన్నీ మీకు విశ్రాంతిని అందివ్వడంతో ముగుస్తాయి. యోగా వలన మీకు విశ్రాంతి తీసుకోవడానికి తగిన వాతావరణం, సమయం కల్పింపబడి ఒత్తిడి లేకుండా ఉంటుంది.

వాపుల నియంత్రణ:

ఎక్కువ సమయం నిల్చోవడం, కాలు కిందకు పెట్టి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం చేయకూడదు.

సులువెైన ప్రసవం:

పెల్విక్‌ ఫ్లోర్‌ అవసరమైన కండరాలను సురక్షితమైన వ్యాయామంతో బలోపేతం చేయడంతో కాన్పు సులువుగా జరుగుతుంది. విసర్జన సమస్యలు కూడా నివారించవచ్చు.

చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డ:

పూర్వం గర్భిణులు వ్యాయామం చేస్తే గర్భానికి జరగవలసిన రక్త సరఫరా, వ్యాయామం చేసే గర్భిణి కండరాలకు జరుగుతుందని వ్యాయామాన్ని నిర్దేశించేవాళ్లు. అయితే ఆధునిక పరిశోధన, వారానికి 5 రోజులు, 30 నిమిషాల పాటు నడక (వాకింగ్‌), సైక్లింగ్‌, కుదిరితే ఈత (స్విమ్మింగ్‌) వంటి సులువెైన ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం చేత గర్భిణికి ఎటువంటి హానీ జరగదు అంతే కాకుండా పరిమిత బరువు, చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవిస్తారని తేల్చి చెప్పారు.

కంగుబాటు:

కొందరు అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి రిలాక్సేషన్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉపయోగపడతాయి.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}