• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో న్యూమోనియా

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 06, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

న్యూమోనియా ఒక భయంకరమైన వ్యాధి. మరియు ఇది గర్భధారణ సమయంలో సంభవించినట్లయితే ఇది మీ గర్భధారణలో అనేక సమస్యలకు దారితీస్తుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ , ముఖ్యంగా ఈ శీతాకాలంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. న్యూమోనియా కు చికిత్స చేయగలిగినప్పటికీ, ప్రసూతి న్యూమోనియా కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ప్రసూతి న్యూమోనియా అంటే ఏమిటి మరియు ప్రసూతి న్యూమోనియా చికిత్సకు ఎందుకు గమ్మత్తయినది? మొట్టమొదటిగా ప్రసూతి  న్యూమోనియా అంటే ఏమిటో చూద్దాం..

 

ప్రసూతి న్యూమోనియా అంటే ఏమిటి ?

 

న్యుమోనియాను కాలానుగుణ అనారోగ్యంగా పరిగణించవచ్చు. ఇది శీతాకాలంలో సంభవిస్తుంది. ఇది బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇది ఊపిరితిత్తుల సంక్రమణకు దారితీస్తుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత ఊపిరితిత్తులలోని గాలి సంచులు ద్రవం మరియు చీముతో నిండిపోతాయి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది . గర్భధారణ సమయంలో న్యూమోనియా కనిపించినప్పుడు దీనిని ప్రసూతి న్యూమోనియాగా పరిగణిస్తారు.

 

ప్రసూతి న్యూమోనియాకి కారణం ఏమిటి ?

 

రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం గర్భిణి స్త్రీలు అంటు వ్యాధులకు గురికావడానికి ప్రధాన కారణం. ఇది ప్రసూతి న్యూమోనియాకి ముఖ్య కారణం.

 

గర్భధారణ సమయంలో ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం వలన శ్వాసకోస సమస్యలు, సాధారణ దగ్గు లేదా ఫ్లూ ఉన్నట్లయితే అది న్యూమోనియాగా అభివృద్ధి చెందుతుంది. గర్భధారణ సమయంలో తగ్గిన రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువకాలం కొనసాగుతాయి. దీని కారణంగా న్యుమోనియా బారినపడే అవకాశం పెరుగుతుంది.

 

గర్భధారణ సమయంలో ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం తగ్గడం వలన న్యుమోనియా బారినపడే అవకాశం ఉంటుంది.

 

న్యూమోనియా అనేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఫ్లూ, చికెన్ ఫాక్స్, ఛాతి ఇన్ఫెక్షన్లు , దగ్గు , సాధారణ జలుబు అనేవి కూడా ప్రసూతి న్యూమోనియాకి దారి తీసే సాధారణ అంటువ్యాధులు.

 

గర్భిణీ స్త్రీలలో ఇతర ప్రమాద కారణాలు ఏమిటి ?

ప్రసూతి న్యూమోనియాకి కారణం అయ్యే అనేక అంశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ప్రసూతి న్యూమోనియా వ్యాధిని పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 

ప్రసూతి న్యూమోనియా యొక్క లక్షణాలు ఏమిటి ?

ప్రసూతి న్యుమోనియా యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

 

గర్భిణీ స్త్రీలకు న్యూమోనియా ఎలా సంభవిస్తుంది ?

న్యూమోనియా అంటువ్యాధి కాదు. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు న్యూమోనియా సంభవించదు. వారికి న్యూమోనియా వచ్చేందుకు కారణం సూక్ష్మక్రిములు. వాయు బిందువులలో ఉండే వైరస్ లు మరియు బ్యాక్టీరియా దీనికి కారణం. గర్భిణీ స్త్రీలు దానిని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది. న్యూమోనియా సంక్రమించడం అనేది గర్భిణీ స్త్రీల శరీరంపై ఉండే సూక్ష్మక్రిముల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణమైన జలుబు, ఫ్లూ మొదలైన వాటి కారణంగా నిర్ణీత సమయంలో న్యూమోనియాగా మారుతుంది.

 

ప్రసూతి నిమోనియా ఎలా నిర్ధారణ అవుతుంది ?

ప్రసూతి న్యూమోనియా యొక్క లక్షణాలు మరియు ఆరోగ్య చరిత్ర విశ్లేషించడం ద్వారా  వైద్యుడు న్యూమోనియాగా నిర్ధారిస్తారు. ఎక్స్ రే సహాయంతో అతడు ఊపిరితిత్తులను పరిశీలిస్తాడు. గర్భధారణ సమయంలో ఎక్స్రే లకు ప్రాధాన్యత ఇవ్వరు. ఏది ఏమైనప్పటికీ , రుగ్మతను ముందుగానే గుర్తించడం వలన కలిగే ప్రయోజనాలతో పోల్చినప్పుడు ఒక ఎక్స్రే స్కాన్ వలన వచ్చే నష్టాలు చాలా తక్కువ. ఊపిరితిత్తుల సంక్రమణకు కారణాన్ని కనుగొని పరీక్షలకోసం డాక్టర్ కఫం నమూనాలను ల్యాబ్ కు పంపుతారు.

 

ప్రసూతి న్యుమోనియాతో ఉన్న సంబంధం ఉన్న ప్రమాదాలు ఏమిటి ?

 

ప్రస్తుతి న్యూమోనియాతో సంబంధం వున్న కొన్ని ప్రమాదాలు ఇక్కడ ఉన్నాయి.

 1. రక్తహీనత

 2. ఉబ్బసం

 3. రోగనిరోధక శక్తిని బలహీనపరిచే దీర్ఘకాలిక అనారోగ్యం కలిగి ఉన్నవారికి

 4. చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపే వారిలో

 5. తరచుగా హాస్పటల్ కు మరియు నర్సింగ్ హోమ్ లకు వెళ్లేవారికి

 6. పొగ త్రాగేవారికి

 7. మద్యపానం తీసుకునే వారికి

 

న్యుమోనియా యొక్క ప్రధాన లక్షణం కఫం తో కూడిన దగ్గు కలిగి ఉండడం. ఎక్కువ సమయం ఛాతి నొప్పి ఉంటుంది.

మరి కొన్ని లక్షణాలు క్రింద ఉన్నాయి:

 1. శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ ఇబ్బందులు

 2. తలనొప్పి

 3. మైకం

 4. శరీరంలో తీవ్రమైన బలహీనత

 5. వాంతులు

 6. ఆకలి లేకపోవడం

 7. చలి జ్వరం

 

ప్రసూతి న్యూమోనియాకి చికిత్స ఏమిటి ?

 

ప్రసూతి న్యూమోనియా చికిత్సలో కొన్ని పరిమితులు ఉన్నందున గర్భధారణ సమయంలో న్యూమోనియా చికిత్స సులభం కాదు. ఈ సంక్రమణ నుండి బయట పడడానికి సాధారణంగా ఇచ్చే అనేక మందులు గర్భధారణ సమయంలో సురక్షితంగా కాదు. ఎందుకంటే ఇది పిండం యొక్క సాధారణ పెరుగుదల మరియు గర్భం యొక్క పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

 

ఇతర చికిత్సలు :

 

సంక్రమణ రకంతో సంబంధం లేకుండా లక్షణాల తీవ్రతను బట్టి ప్రసూతి న్యూమోనియా  చికిత్సకు ఈ క్రింది పద్దతులను కూడా ఉపయోగించబడతాయి.

 

గర్భధారణ సమయంలో న్యూమోనియా వ్యాధి నివారించవచ్చా ?

 

న్యూమోనియా వ్యాధిని నివారించడానికి ఉత్తమమైన మార్గం ఫ్లూ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం.

 

 1. గర్భిణీ స్త్రీలు న్యుమోనియా బారిన పడినట్టు అయితే అది తల్లి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చికిత్స చేయకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి . ప్రసూతి న్యూమోనియాతో సంబంధం ఉన్న ప్రధానమైన ప్రమాదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

 2. ముందస్తు ప్రసవానికి అవకాశాలు పెరుగుతాయి. కనుక తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 3. గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి .ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో తల్లి న్యుమోనియా బారిన పడినప్పుడు.

 4. ఇది నవజాత శిశువులలో అంగవైకల్యానికి దారితీస్తుంది.

 5. తీవ్రమైన సందర్భాలలో ,గర్భాశయ మరియు నియోనేటల్ మరణం కూడా సంభవిస్తుంది.

 6. న్యూమోనియా ఎక్కువ శరీర ఉష్ణోగ్రతతో ఉన్నట్లయితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది.

 

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే న్యూమోనియాకి చికిత్స :

దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడంతో వైరల్ న్యూమోనియా చికిత్స చేయడానికి మరింత కష్టతరంగా ఉంటుంది .ఇది చాలా ప్రమాదకరమైన న్యూమోనియా . మరియు ఇది బ్యాక్టీరియా న్యుమోనియా కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది .యాంటీ వైరల్ మందులు ప్రారంభదశలోనే సూచించబడతాయి. ఇవి ఫ్లూ లక్షణాలు తగ్గించడానికి మరియు శరీరంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి సహాయపడుతాయి.

 

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే ప్రసూతి న్యూమోనియాకు చికిత్స :

బ్యాక్టీరియల్ న్యూమోనియా ను యాంటీబయోటిక్స్ తో చికిత్స చేయవచ్చు శిశువుకు హాని కలిగించని మందులను వైద్యులు జాగ్రత్తగా ఎన్నుకుంటారు .బీటా - లాక్టమ్ మరియు మాక్రో లైట్ వంటి యాంటీ బయాటిక్స్ మందులు సాధారణంగా సూచించబడతాయి. దగ్గు నిరోధించే తీవ్రతను బట్టి సూచించబడతాయి. వైద్యులు ఒక నియమం ప్రకారం దగ్గును ఆపడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. ఎందుకంటే దగ్గు అనేది ఊపిరితిత్తులలో నుండి కఫం బయటకు రావడానికి ఒక సంకేతం.

 

 1. శ్వాసకోశ చికిత్స శ్వాస సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

 2. శ్వాస కోశ సంకేతాలను తగ్గించడానికి ఇన్హేలర్లు మరియు నెబ్యులైజర్లను కూడా ఉపయోగిస్తారు.

 3. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయినప్పుడు ఆక్సిజన్ థెరపీ కూడా ఇవ్వబడుతుంది.

 4. త్వరగా కోలుకోవడానికి తగినంత నిద్ర మరియు విశ్రాంతి పుష్కలంగా ఉండటం అన్నది చాలా ముఖ్యం.

 5. గర్భంతో సంబంధం ఉన్న అనేక సమస్యలను తొలగించడానికి బాగా హైడ్రేటెడ్గా ఉండడం ఎంతో అవసరం.

 6. నొప్పిని తగ్గించడానికి పెయిన్ రిలీవర్ మరియు జ్వరాన్ని తగ్గించడానికి మందులను కూడా డాక్టర్లు సూచిస్తారు.

 

 1. పరిశుభ్రత అన్నది ఎంతో అవసరం. మీ చేతులను తరచుగా శుభ్రపరచుకోండి.

 2. ఆరోగ్యకరమైన జీవనశైలికి కట్టుబడి ఉండండి. గర్భధారణ సమయంలో మద్యం సేవించడం మరియు ధూమపానం లాంటివి ఎంత మాత్రమూ మంచిది కాదు.

 3. ఫ్లూ వచ్చిన తర్వాత న్యూమోనియాగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సమయంలో ఫ్లూ షాట్ తీసుకోవడం వలన దీనిని నివారించడానికి సహాయపడుతుంది.

 4. విటమిన్ సీ తో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం న్యూమోనియాను నివారించడానికి కొంతవరకు సహాయపడుతుంది.

 5. బహిరంగ ప్రదేశాలలో, ముఖ్యంగా వెంటిలేషన్ లేని మూసి ఉన్న ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపడం మానుకోండి.


ప్రెగ్నెన్సీ సమయంలో న్యూమోనియా విషయంపై వచ్చిన  బ్లాగ్ మీకు నచ్చిందా ?దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి . మీ నుండి వినడం మాకు ఎంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}