• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

గర్భధారణ సమయంలో అవసరమైన గర్భ పరీక్షలు

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భధారణ సమయంలో స్త్రీ తన శరీరం లోనూ మరియు జీవితంలోనూ కొన్ని మార్పులను ఎదుర్కొంటుంది. గర్భిణీ స్త్రీ జీవితంలో ఇది చాలా అవసరం. గర్భధారణ తొమ్మిది నెలల వ్యవధిలో చేసే పరీక్షలు తల్లి మరియు బిడ్డ యొక్క శ్రేయస్సుకోసం ఎంతో అవసరమైనవి. గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో ఈ పరీక్షల విలువను అర్థం చేసుకోవాలి. కాబట్టి, ఈ పరీక్షలు ఏమిటో తెలుసుకోవడానికి దీనిని చదవండి.

 

మొదటి త్రైమాసిక పరీక్ష :

 

గర్భం యొక్క మొదటి మూడు నెలల్లో ఈ పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ పరీక్షలు పిండం యొక్క అభివృద్ధి, వ్యాధులు మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాల ప్రమాదాలను నిర్ధారిస్తాయి. ఈ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

 

గర్భధారణ రక్తపరీక్ష :

 

ఈ రక్త పరీక్షలు సూదితో చేతి నరంలో నుంచి సిరంజి సహాయంతో రక్తం తీయబడుతుంది. గర్భిణి స్త్రీలలో రూబెల్లా, చికెన్ పాక్స్, ఏపీటెట్ఎస్బి, సిఫిలిస్, హెచ్ఐవి, హిమోగ్లోబిన్ స్థాయి, ఆర్హెచ్ స్థితి, రక్త సమూహం మరియు టాక్సోఫ్లాస్మోసెస్ వంటి కొన్ని విషయాలను నిర్ధారించడానికి ఈ రక్త పరీక్ష జరుగుతుంది.

 

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ :

 

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రాథమికంగా గర్భధారణకు భరోసా ఇవ్వడానికి మరియు నిర్ణీత తేదీని లెక్కించడానికి నిర్వహిస్తారు.

 

మూత్ర గర్భ పరీక్ష :

 

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల సమస్య, హ్యూమన్ కోరియానిక్ గొనదోట్రోపిం స్థాయి మరియు మూత్రంలో గ్లూకోజ్ ఉనికిని గుర్తించడానికి మూత్ర పరీక్ష నిర్వహించబడుతుంది.

 

ప్లాస్మా ప్రోటీన్ స్క్రీనింగ్ :

 

శరీరంలో క్రోమోజోముల స్థాయిని నిర్ధారించడానికి ఈ పరీక్షలు అమలు చేయబడతాయి.ఈ స్క్రీనింగ్ ద్వారా ఏదైనా జన్యుపరమైన రుగ్మతలు ఉన్నట్లయితే సులభంగా నివారించవచ్చు.

 

న్యూచల్ ట్రాన్స్లుసేన్సీ :

 

డౌన్ సిండ్రోమ్ ట్రిసోమీ 21 మరియు ట్రిసోమీ

లను తనిఖీ చేయడానికి ఈ పరీక్షలు జరుపుతారు.

 

రెండవ త్రైమాసిక పరీక్ష :

 

మీ మొదటి త్రైమాసిక సమయం పూర్తయిన తర్వాత మీరు మీ రెండో త్రైమాసికంలో ప్రవేశిస్తారు. కానీ మీరు మీ మొదటి త్రైమాసికంలో ఉన్నంత ఆందోళన రెండవ త్రైమాసికంలో చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల కాలంలో ప్రణాళిక లేని గర్భస్రావాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, మీరు రెండవ త్రైమాసికంలో ప్రవేశించిన తర్వాత ఈ అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. రెండవ త్రైమాసికంలో నిర్వహించాల్సిన సాధారణమైన మరియు ముఖ్యమైన కొన్ని పరీక్షలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి...

 

రక్త పరీక్ష 

 

మూత్ర పరీక్ష

 

వెన్నెముకలోని లోపాలు

 

డౌన్ సిండ్రోమ్

 

గర్భధారణ మధుమేహం

 

త్రిబుల్ మార్కర్ టెస్ట్

 

క్వాడ్ర ఫుల్ మార్క్ టెస్ట్

 

అల్ట్రాసౌండ్ స్కానింగ్ :

 

అన్ని పరీక్షలలో కంటే కూడా ఇది ఎంతో ముఖ్యమైనది. మీ గర్భధారణ సమయం అంతా కూడా  పిండం యొక్క పెరుగుదల ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, గర్భాశయం యొక్క పొడవును కొలవడానికి, పిండం యొక్క కదలికలను తనిఖీ చేయడం మరియు బిడ్డ శరీరావయవాలు యొక్క అభివృద్ధిని దీని ద్వారా కనుగొంటారు.

 

మూడవ త్రైమాసిక పరీక్ష :

 

మీరు మూడవ త్రైమాసికం లోనికి వెళ్ళినప్పుడు మీరు ప్రసవ సమయానికి దగ్గరవుతారు. ఎంతో ముఖ్యమైన ఈ వారాలలో ఈ క్రింది పరీక్షలు అవసరం ఉంటాయి.

 

అల్ట్రాసౌండ్ స్కానింగ్ :

 

మూడవ త్రైమాసికంలో కూడా అమ్నఈ టిక్ ద్రవం, శిశువు యొక్క పెరుగుదల, తొడ ఎముక కొలత, తల మరియు మధ్య విభాగాలు మరియు  గర్భాశయంలోని శిశువు యొక్క స్థానాన్ని పరీక్ష చేయడం ద్వారా మీకు సిజేరియన్ అవసరం ఉంటుందా లేదా నార్మల్ డెలివరీ అవుతుందా అని తెలుసుకోవడానికి ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ జరుగుతుంది.

 

మూత్ర గర్భ పరీక్ష :

 

షుగర్ స్థాయిలు మరియు ఐరన్ స్థాయిలను తనిఖీ చేయడానికి మూత్ర పరీక్షను అమలు చేస్తారు.

 

స్వెబ్ పరీక్ష :

 

దీనిని గ్రూప్ బీ  స్ట్రే ప్టొ కోకస్  బ్యాక్టీరియా టెస్ట్ అని కూడా అంటారు. ఈ పరీక్ష వలన యోని మరియు పురీషనాళం లో ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే సులభంగా నివారించవచ్చు.

 

నాన్ స్ట్రెస్ టెస్ట్ :


ఈ పరీక్షలు హృదయ స్పందన రేటు మరియు కదలికలను తనిఖీ చేయడానికి చేతితో పట్టుకునే పరికరం అయిన డాప్లర్ ను  ఉపయోగించి గర్భధారణ సమయం అంతా కూడా హృదయ స్పందన పరీక్షిస్తారు.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}