ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా పిల్లలను పెంచడం ! ఒక అమ్మ ఎలా చేసిందో ఇక్కడ చూడండి

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jul 13, 2020

ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు అవ్వకుండా లేదా టీవీ కి అతుక్కుపోకుండా పిల్లలను పెంచడం నిజంగా సాధ్యమేనా? నేను ముగ్గురికి పిల్లల తల్లిని అయిఉండి, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. పెద్ద పిల్లలిద్దరికీ 11 సంవత్సరాలు మరియు 9 సంవత్సరాలు వయసు ఉండడం వలన ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం చాలా కష్టం. ఎందుకంటే వారు నిరంతరం వాటి చుట్టూనే ఉంటూ పెరిగారు.
పరికరాలను పరిశీలించడం :
నేను ముగ్గురు అందమైన పిల్లలకు తల్లిని. 11 మరియు 9 సంవత్సరాల వయస్సు కలిగిన మా పెద్ద పిల్లలు పుట్టుకతోనే , అక్షరాల, ఎలక్ట్రానిక్ పరికరాలతో పెరిగారు. నేను వారికి ఆహారం తినిపించే సమయంలో ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ లో రైమ్స్ పెట్టేదాన్ని. వారు టీవీలో పిల్లల ఛానల్స్ ను క్రమం తప్పకుండా చూసేవారు . మరియు నా ఫోన్లో ఆటలు ఆడేవారు .నెమ్మదిగా స్మార్ట్ఫోన్లు మరియు ఐప్యాడ్ లు పరిచయం చేయబడ్డాయి . వారు బయటకు వెళ్లి కూడా ఆటలు ఆడుకునేవారు . కానీ , వారి చేతుల్లో ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉండేది . ఎక్కువ సమయం దానితోనే గడిపేవారు.
మరింత తెలుసుకోండి...
ఇద్దరు పిల్లలు కూడా చదువులో ఎంతో ప్రతిభ చూపిస్తున్నారు , పుస్తకాలు చదవడానికి ఎంతో ఇష్టపడతారు , ఎంతో మంచి పదజాలాన్ని ఉపయోగిస్తారు . అయినప్పటికీ, 24 /7 ఎలక్ట్రానిక్ పరికరాల పై ఆధారపడి ఉండడం వలన కలిగే ప్రభావాలు గురించి నేను చాలా ఆందోళన చెందేదానను. అందుకే నేను వారి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పరిమితం చేసేందుకు ప్రయత్నించాను.
ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండడం :
పోయిన సంవత్సరం మూడవ పాప పుట్టినప్పటి నుండి , ఆమెను ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచాలి అని నేను నిర్ణయించుకున్నాను . కానీ అది చెప్పడం అన్నది చాలా సులువు . కానీ , ఆచరించడం ఎంతో కష్టం. ఆమె చుట్టూ ఉన్న పెద్ద వాళ్ళంద రి చేతుల్లోనూ ఒక ఫోన్ ఉంటుంది . మేము టీవీ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారి దానికి పాప ఆకర్షితురాలైపోఏది . నేను తనకు రైమ్స్ పాడేదాన్ని . కానీ , ఇంటర్నెట్ లో వచ్చే సంగీతం దానికంటే చాలా బాగుండేది . నేను తనకోసం ఎంతో చదివి వినిపించే దానిని . కానీ , ఒక సంవత్సరం చివరికి వచ్చేసరికి నేను గ్రహించింది ఏమిటంటే , ఈ ఎలక్ట్రానిక్ పరికరాలతో పాప గడిపే సమయాన్ని మాత్రమే తగ్గించగలనని గ్రహించగలిగాను. మరియు ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వారిని పూర్తిగా దూరం చేయవలసిన అవసరం లేదు అని కూడా గ్రహించగలిగే గాను.
సమతుల్యతను కనుగొనడం :
నిజానికి పిల్లలు కోరుకునే వినోదాన్ని అణగదొక్కి వేయాలని అనుకునేంత అవసరం అయితే నాకు కనిపించలేదు . వారికి పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇవ్వకూడదు అని మనం నిర్ణయించుకున్నప్పటికీ , వారికి కొన్ని పరికరాలను ఇవ్వవలసి ఉంటుంది . అని నేను తెలుసుకున్నాను . కానీ, వాటిని ఇచ్చే సమయంలో వారికి కొన్ని షరతులను మాత్రం తప్పక విధించాలి.
1. తల్లిదండ్రులు సమయ పరిమితులను విధించాలి.
2 . పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునేందుకు ప్రోత్సహించాలి.
3 . ఎలక్ట్రానిక్ పరికరాల వలన కలిగే చెడు ప్రభావాలను గురించి పిల్లలకు వివరించి చెప్పాలి.
4 . అన్నింటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు వారికి ఉదాహరణగా ఉండి వారిని నడిపించాలి . మీ పిల్లలు మీతో మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో మీరు ఫోన్లో ఉండకండి . మరియు పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాలను తెలివిగా ఎలా ఉపయోగించాలో వారికి నేర్పండి.
మీరు మీ పిల్లల ' ఎలక్ట్రానిక్ పరికరాల సమయం ' ను గమనిస్తున్నారా ? వాటిని వారు సమతుల్యంగా , సరైన విధానంలో వాడుతున్నారా ? దయచేసి ఈ దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}