• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

అంతర్ముఖ పిల్లలను పెంచడానికి 8 చిట్కాలు.

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 17, 2020

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

స్వతంత్రంగా ఉండాలనుకునేటటువంటి లేదా అతి తక్కువమంది అర్థవంతమైన స్నేహితులు గల ఒక బిడ్డకు మీరు
తల్లి. మీ పిల్లవాడు సిగ్గు పడే వాడుకాదు. కానీ అంతర్ముఖుడు. అంతర్ముఖుడు లేదా బహిర్ముఖుడు కావడం అన్నది
వారి వ్యక్తిత్వం. తల్లిదండ్రులుగా మీరు దానిని గౌరవించాలి మరియు బిడ్డను యధావిధిగా అంగీకరించాలి. అవును,
మీ మనసులో తలెత్తే ప్రశ్న నాకు తెలుసు. అంతర్ముఖుడు లేదా బహిర్ముఖుడు అంటే ఏమిటి ? ఇక్కడ చూడండి..

అంతర్ముఖుడు అంటే ఎవరు ?

అంతర్ముఖులు అంటే సిగ్గు పడేవారు లేదా అందరికీ దూరంగా ఉండేవారు అని కాదు. వాస్తవానికి అంతర్ముఖులు
అంటే వారి లోపల ఎంతో నిగూఢమైన శక్తి గలవారు. అంతర్ముఖుడు సామాజికంగా గుర్తింపు పొందాలి అనుకోక
పోవచ్చు. కానీ కొన్నిసార్లు వారి జ్ఞానాన్ని పెంచుకోవడానికి వారి పరిధిలో నుండి బయటకు వస్తారు.

అంతర్ముఖ పిల్లవాడిని పెంచడం కష్టతరమైనదా ?

మీరు అంతర్ముఖులు కాకపోతే అంతర్ముఖ పిల్లవాడిని పెంచడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. అంతర్ముఖ పిల్లలు
కొన్నిసార్లు నిరాసక్తంగా, కొంతమందికి దూరంగాను కొన్నిసార్లు దురుసుగా కనిపించవచ్చు. వాస్తవానికి వారు
అంతర్ముఖులు మాత్రమే. కానీ వారు బయటకురావడానికి వారికంటూ కొంత సమయము మరియు సరైన ప్రదేశము
అవసరం. ఎప్పుడైతే వారు నమ్మకాన్ని ఏర్పరచుకొని , సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే బంధాలను పెంచుకోవడం
మరియు ఇతరులతో కలవడం మొదలుపెడతారు.

అంతర్ముఖ పిల్లలను ఎలా పెంచుకోవాలి ?

మీ అంతర్ముఖ పిల్లవాడిని పెంచే ప్రక్రియలో, అంతర్ముఖ పిల్లల యొక్క ఆలోచనా విధానాలను మరియు ప్రవర్తనను
మీరు క్షుణ్ణంగా తెలుసుకోవడం వలన వారితో మీరు ఎలా నడుచుకోవాలో మీకు బాగా సహాయపడుతుంది. ఇక్కడ
నేను మీకోసం 8 విషయాలతో కూడిన జాబితాను పంచుకుంటున్నాను. అవి మీ అంతర్ముఖ పిల్లవాడిని పెంచడానికి
మీకు సహాయ పడతాయి.

1. వారికి కొంత సమయాన్ని మరియు ప్రదేశాన్ని ఇవ్వండి :

మీ బిడ్డ నోరు తెరిచి మాట్లాడడానికి కొంత సమయం కావాలి. వారిని అందరితో కలిసిమెలిసి ఉండమని , బయటకు
వెళ్లి అందరితో స్నేహం చేసుకోమని బలవంతం చేయకుండా ఉండండి. అంతర్ముఖులు తమ చుట్టూ ఎక్కువ మంది
ఉండడాన్ని చూసి ఆనందించరు. అంతర్ముఖులు ఎక్కువమంది స్నేహితులను కలిగి ఉన్న దానికంటే కూడా తక్కువ
మంది మంచి స్నేహితులను కలిగి ఉండడానికి ప్రాముఖ్యత ఇస్తారు.

2. వారిని వారి లాగే ఉండనివ్వండి :

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వద్ద మీ పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడకండి. వారి సహోదరుల ముందు కూడా. ఈ
వ్యాఖ్యలు వారి చిన్ననాటి అనుభవాల మీద, వారి సాధారణ వ్యక్తిత్వం మీద కూడా ప్రభావితం చూపుతాయి. అవి
వారిని ఎప్పుడూ సిగ్గుపడేలా గుర్తుచేస్తూ ఉంటాయి. మీ అంతర్ముఖుడైన పిల్లవాడు ఎంతో బాధాకరమైన అనుభూతిని
చెందుతాడు. మరియు దాని నుండి బయటపడడానికి బదులుగా మరింత ఒంటరితనం లోకి వెళ్ళిపోతాడు.

3. వారిని ఎప్పుడు ఆకర్షణ కోసం వుంచాలని అనుకోకండి :

ప్రతి బిడ్డ సీతాకోకచిలుక లాగా ఎగురుతూ, వసపిట్టలా మాట్లాడాలి అనుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది పిల్లలు
ఆకర్షణీయంగా ఉండడానికి ఇష్టపడరు. మరియు అందరూ తమ మీద శ్రద్ధ వహించడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి
మీ పిల్లలు ఇటువంటి లక్షణాలు చూపిస్తూ ఉంటే వారిని ఇతరుల ముందు ప్రదర్శించాలని బలవంతం చేయవద్దు. ప్రతి
ఒక్కరూ తమ ప్రతిభను అందరి ముందు ప్రదర్శించాలి అన్నది తప్పనిసరి కాదు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి
దానిని నిరూపించుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.

4. వారి కొరకు వారినే మాట్లాడనివ్వండి :

వారిని స్నేహితులు లేదా బంధువులు ఏదైనా కొన్ని ప్రశ్నలు అడుగుతారు . అప్పుడు వారు స్పందించకపోతే దానికి
మీరే సమాధానాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. అలా చేయడం వల్ల మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది.
కాబట్టి దానిని నివారించండి. వారిని అడిగిన ప్రశ్నలకు వారే సమాధానం చెప్పే విధంగా వారికి కొంత సమయం
ఇవ్వండి.

5. వారిని సాధారణంగా ఉండనివ్వండి :

సాధారణంగా అంతర్ముఖులు అయిన పిల్లలు ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడానికి ఇష్టపడరు. ప్రతి పనికి
వారికి ఒక సమయం కావాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వారు కొన్ని పనులను చేయగలరు. వారి మానసిక
స్థితిని మరియు సామాజిక శక్తిని బలపరచుకొనే సమయం ఇవ్వాలి. పెద్ద శబ్దాలతో హడావిడిగా ఉన్న వాతావరణంలో
జరిగే కార్యక్రమాలలో పాల్గొనడానికి వారు ఇష్టపడక పోవచ్చు.

6. సంభాషణ కొనసాగించడానికి వారికి సహాయం చేయండి :

మీ పిల్లవాడు నీ స్నేహితులతో గాని బంధువులతోగాని తన అభిప్రాయాలను వ్యక్తీకరించలేకపోవడంలోనూ, మరియు
స్నేహంగా ఉండలేక పోతున్నంత మాత్రాన అతను అహంకారి అనికాదు. మీ బిడ్డకు మీరు తీర్పు చెప్పే బదులు బిడ్డకు
మర్యాదపూర్వకంగా మాట్లాడడం సున్నితంగా నేర్పడానికి ప్రయత్నించండి. అతను ఎవరికైనా మాటలతో బదులు
చెప్పక పోయినట్లయితే, మరొకసారి ఎవరైనా మాట్లాడినప్పుడు తల ఊపడం ద్వారా గానీ నవ్వడం ద్వారా గాని
బదులు ఇవ్వమని నేర్పండి.

7. వారిని ఎప్పుడు బలవంతం చేయవద్దు :

మీ పిల్లవాడు మానసికంగా సరైన స్థితిలో లేనప్పుడు వారిని బాధించే విషయాల గురించి చెప్పమని పదేపదే
అడగవద్దు. వారి మనోభావాలను బేరీజు వేసుకోవడానికి వారికి కొంత సమయం కావాలి. ఆ విషయంలో మీరు వారిని
ఎక్కువగా బలవంతపెడితే మరింత దిగులు చెందుతారు. మీరు వారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించవచ్చు . కానీ ,

వారికి కొంత సమయాన్ని , గౌరవాన్ని ఇవ్వాలి అని గుర్తుంచుకోండి. కొంత సమయం వారితో మాట్లాడకుండా వారిని
వదిలి పెట్టండి.

8.అతని కొద్దిమంది స్నేహితులను అంగీకరించండి :

మీ అంతర్ముఖుడైన బిడ్డకు ప్రగల్భాలు పలకడానికి చాలామంది స్నేహితులు ఉండరు. కానీ వారికి ఉన్న కొద్ది
మందితో వారు నమ్మకం గాను, సౌకర్యంగాను ఉండగలరు. వారు తన కొద్దిమంది స్నేహితులతో జీవితాంతం
స్నేహంగా ఉంటారు అని మీరు కనుగొంటారు. వారు ఆనందించడానికి ఎక్కువమంది స్నేహితుల గుంపు అవసరం
లేదు.

అంతర్ముఖుడు లేదా బహిర్ముఖుడు కావడం అనేది తనలోని సమస్య కాదు. మనందరికీ భిన్నమైన వ్యక్తిత్వాలు
ఉంటాయి. కానీ తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ గలిగితే
తల్లిదండ్రులుగా బిడ్డతో మీ ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది.

అంతర్ముఖ పిల్లల పెంపకానికి సుగంధగారి చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా? మీ బిడ్డ సంతోషంగా
ఉండడానికి మీరయితే వారికి ఏ విధంగా సహాయం చేస్తారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ నుండి

వినడం మాకు ఎంతో ఇష్టం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}