• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
గర్భం

తల్లిదండ్రులు కానున్న అలియా, రణబీర్- కాబోయే పేరెంట్స్ తెలుసుకోవాల్సిన 5 ముఖ్య పాఠాలు !

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 27, 2022

 5

ప్రముఖ బాలీవుడ్ జంట ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ తల్లితండ్రులు కాబోతున్నరనే వార్త అభిమానులనే కాకుండా అందరినీ ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. 

 తన అల్ట్రాసౌండ్ టెస్ట్ పిక్ ను  Instagram లో షేర్చేయడం  ద్వారా ఆలియా  సుభవార్తను ఈరోజు (సోమవారం) ప్రకటించింది. అలియా భట్ జంతు ప్రేమికురాలు అని మనందరికీ తెలుసు.  అందుకే ఆమె సింహం, శివంగి ఇంకా సింహం పిల్లతో పాటు అనంతం, నక్షత్రం మరియు ఎరుపు రంగు హార్ట్  ఎమోజితో  కూడిన చాలా అందమైన  రెండవ ఫోటోను కూడా షేర్ చేసింది.  గత 5 సంవత్సరాలుగా కలిసి ఉన్న ఈ జంట, ఈ సంవత్సరం  ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. మరి మీరు కూడా  తల్లిదండ్రులు అవనున్నారా? లేదా త్వరలో మీ కుటుంబాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే,మీలాంటి వారికి అవసరమైన పాఠాలతో మేము ఒక సహాయక గైడ్‌ను రూపొందించాము.

కొత్త తల్లిదండ్రులు ఉండవలసిన ముఖ్యమైన పాఠాలు

1. మార్పుల కోసం ఒక కన్ను వేసి ఉంచండి - ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె మానసికంగా, శారీరకంగా అనేక మార్పులకు లోనవుతుందనేది తెలిసిందే. ఈ మార్పులు కేవలం తల్లులకే పరిమితం కాకుండా తండ్రులకు కూడా వర్తింపజేయవచ్చు. ఈ సమయంలో భర్తలు కూడా టన్నుల కొద్దీ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. భార్యను జాగ్రత్తగా చూసుకోవడం నుండి రోజువారీ అపాయింట్‌మెంట్ల కోసం ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం లాంటివి ప్రతి భర్త చేయాల్సిన పని. గర్భధారణ సమయంలో భర్తలు తమ భార్య,బిడ్డల పట్ల శ్రద్ధ మరియు ప్రేమను చూపడం ద్వారా వారి సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చని తెలుసుకోవడం మంచిది.

2. మీ భార్య యొక్క వైద్య దినచర్యను ప్లాన్ చేయండి- పైన చెప్పినట్లుగా, గర్భం అనేక మార్పులను తెస్తుంది.  అందుకే ప్రతి భర్త, తమ భార్య యొక్క వైద్య దినచర్యను జాగ్రత్తగా ప్లాన్ చేయడం మరింత ముఖ్యమైనది. దీనిని ప్రారంభించడానికి ఉత్తమ మార్గం టైమ్ టేబుల్‌ని సిద్ధం చేయడం, మీ భార్య యొక్క రాబోయే చెక్-అప్‌లు, అల్ట్రాసౌండ్ తేదీల గురించి వ్రాయడం. ఇంకా మీ డాక్టర్ సూచించిన మందులు వంటి ఇతర అంశాలను కూడా జోడించవచ్చు. టైమ్ టేబుల్‌లో డాక్టర్ ఫోన్ నంబర్‌లు కూడా ఉండేలా చూసుకోండి. తద్వారా మీరు కమ్యూనికేట్ చేయడం, వారిని కలవడం సులభం అవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ పని చేస్తుంటే ఈ ప్రత్యేక చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.

3. ఆకస్మిక జీవనశైలి మరియు పోషకాహార మార్పులు - ఈ 9 నెలల వ్యవధి జీవనశైలి,  పోషణ పరంగా మీ రోజువారీ షెడ్యూల్‌లో పూర్తి 360 డిగ్రీల మార్పును తీసుకురావచ్చు. మీ భార్య గర్భవతిగా ఉన్న సమయంలో, మీరు మీ డాక్టర్‌తో సరిగ్గా సింక్ లో ఉన్నారని నిర్ధారించుకోండి.  ఆమెతో ప్రతిదీ చర్చించండి. మీ భార్య ఏమి తినాలి అనే దాని నుండి దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్థాలు మొదలైన వాటి గురించి మీ వైద్యునితో  లోతుగా చర్చించాలి. దీనికి అదనంగా, కాబోయే తల్లికి కొన్ని వస్తువుల పట్ల అలెర్జీ ఉంటే, దయచేసి ఆమె వైద్యుడికి తెలియజేయండి. ఆ విధంగా, తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఇలాంటి చిన్న చిన్న మార్పులకు మానసికంగా సిద్ధమయ్యేలా చూసుకోండి. మీరిద్దరూ ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

4. మీ భార్య యొక్క మానసిక స్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించండి - గర్భం అనేది ఏ తల్లికైనా చాలా కష్టమైన కాలం కావచ్చు. ఇది ఆమె శరీరం చాలా మార్పులకు లోనయ్యే సమయం ఇంకా ఇది ఆమె మానసిక ఆరోగ్యం మరియు మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. కాబట్టి, మీరు మీ భార్య మూడ్ స్వింగ్‌లను జాగ్రత్తగా పర్యవేక్షి౦చాలి. ఆమెను అధిక ఒత్తిడికి గురిచేసే పనిని చేయవద్దని తెలుసుకోండి. మీ భార్యకు ఇష్టమైన ఆహారాన్ని వండడం, ఆమెకు ఇష్టమైన ఐస్‌క్రీంని తీసుకురావడం లేదా కలిసి సినిమా చూడటం వంటి వాటి కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు. ఇలాంటి చిన్న చిన్న చిన్న చిన్న ఆమెను చాలా సంతోషపరుస్తాయి, అది మీ బిడ్డను సంతోషపరుస్తుంది.

5. కోవిడ్-19 పరిస్థితి గమనిస్తూ ఉండండి - చివరగా, మహమ్మారి సమయంలో మీ భార్య మరియు బిడ్డను సురక్షితంగా,  భద్రంగా ఉంచుకోవడానికి మీరు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండటం మరింత ముఖ్యం. మీరు మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.అంతేకాకుండా, మీ వైద్యునితో సన్నిహితంగా ఉంటూ ఏవైనా సమస్యలు లేదా ఆందోళనల విషయంలో వారిని సంప్రదించి నిర్ధారించుకోండి.

చివరిగా చెప్పేదేమిటంటే..

రాబోయే చిన్నారి  కోసం ఎదురుచూస్తున్న లేదా త్వరలో కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటున్న తల్లిదండ్రులకు ఇవి 5 ముఖ్యమైన పాఠాలు. గర్భం అనేది సంతోషకరమైన కాలం కాబట్టి మీరు మీ భార్య ఇంకా  శిశువు యొక్క మొత్తం భద్రత ను నిర్ధారించడానికి అన్ని ముఖ్యమైన సూత్రాలను అనుసరించేలా నిర్ధారించుకోండి. మీ భార్యతో సహా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. ఆమె చుట్టూ ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యం. ఇంకా, మీరు మంచి డైటీషియన్తో కనెక్ట్ అవండి.  తద్వారా కాబోయే తల్లికి ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించవచ్చు. ఇలాంటి చిన్న-చిన్న స్టెప్స్, సాఫీ అయిన గర్భధారణ ప్రయాణానికి మార్గం చూపుతాయి. 

బాగా తినండి, సంతోషంగా ఉండండి మరియు సానుకూలంగా ఉండండి!

https://www.parentune.com/parent-blog/alia-bhatt-and-ranbir-kapoor-are-pregnant-here-are-the-essential-lessons-for-new-parents-to-be/7719

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}