• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ విద్య మరియు శిక్షణ గర్భం

రెండవ సారి గర్భ ధారణా ప్రణాళిక మొదటి బిడ్డతో ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలు

Sreelakshmi
3 నుంచి 7 సంవత్సరాలు

Sreelakshmi సృష్టికర్త
నవీకరించబడిన Nov 23, 2018

ఒక బిడ్డకి తల్లి అయ్యాక మరొక మారు గర్భ ధారణకి ప్రణాళిక రూపొందించుకొంటున్నారా? మరి మొదటి బిడ్డతో ఎదురయ్యే సమస్యలు, అలాగే ఇద్దరు పిల్లల విషయంలో ఎదురయ్యే ఒత్తిడి గురించి కూడా ఆలోచించాలి.  చాలా మంది తల్లిదండ్రులు మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి మధ్య దాదాపు రెండు మూడేళ్ళ ఎడం ఉండాలి అనుకుంటారు. ఐతే మొదటి బిడ్డకి మూడు నుంచి ఏడేళ్ల మధ్య వయసు ఉండగా రెండవ బిడ్డకి జన్మనిచ్చే ఆలోచన చేయడం మంచిది. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి. తల్లి ఆరోగ్య పరిస్థితి, ఆర్ధిక స్థితి, తండ్రి యొక్క వయసు దృష్టిలో ఉంచుకొని రెండవ బిడ్డ గురించి ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది.

మరి రెండవ బిడ్డకి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నాక  మొదటి బిడ్డతో ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి ఇద్దరు పిల్లల పెంపకం విషయంలో వచ్చే ఇబ్బందులు వంటి వాటికి సంసిద్ధంగా ఉండాలి.  ఇప్పటికే ఒక బిడ్డకి జన్మనిచ్చి పెంచినప్పుడు ఆ అనుభవం ఉండడంతో రెండవ సారి కష్టం కాకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో ఇద్దరు చిన్న వయసు పిల్లలు ఉంటే ఇద్దరికీ సరైన సమయం కేటాయించి శ్రద్ధ వహించటంలో కొంత ఇబ్బంది కలగకపోదు.

కొన్ని విషయాలలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏర్పాట్లు చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఒత్తిడిలేకుండా ఇద్దరు చిన్నారుల పెంపకాన్ని ఆస్వాదించవచ్చు.

ఇక ఈ క్రింది అంశాలపై ద్రుష్టిసారించండి అవి మీరు ఏ విధంగా రెండవ గర్భానికి సిద్దపడాలో ఒక అవగాహన కలిగిస్తాయి:

మొదటి బిడ్డ వయసు

మొదటి బిడ్డకి రెండు నుంచి మూడేళ్ళ వయసు ఉంటే  వారు అప్పటికే చిట్టి పొట్టి అడుగులు వేస్తూ చిలక పలుకులు మొదలు పెట్టి ఉంటారు. కానీ వారికి ఇంకా మీ సంరక్షణ లాలింపు అవసరం. ఆహారం తినిపించడం రోజంతా వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండడం తప్పదు. వారు ఇంకా పసిపిల్లల జాబితాలోనే ఉంటారు కాబట్టి రెండవ బిడ్డతో పాటు వారికి కూడా సమానమైన సమయం ఎలా ఇవ్వాలో ఆలోచించుకోండి. కానీ వయసు పరంగా దగ్గరగా ఉన్న పిల్లలు త్వరగా దగ్గరవుతారు. ఆడుకొనే బొమ్మలు ఆటల విషయంలో ఇబ్బంది ఉండదు. అమ్మ నాన్నల ప్రేమ మరియు వారు తమని మాత్రమే చూడాలి అన్న పోటీ సమస్యలు ఉత్పన్నం కావు. ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా ఎక్కువ ఉంటే మాత్రం ఈ సమస్యలు ఉంటాయి. ఒక వేళ  మొదటి బిడ్డకి నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే వారికి అప్పటికే సమాజ పరంగా ఒక అవగాహన వారి పనులు సొంతంగా చేసుకునే అలవాటు వస్తుంది కాబట్టి పసి పాపకి మీరు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఐతే ఈ రెండు ఎంపికల్లోనూ లాభ నష్టాలు ఉంటాయి.

తల్లి ఆరోగ్య పరిస్థితి

మీ శరీరం మరొక సారి బిడ్డకి జన్మనిచ్చే శక్తిని కలిగివుండాలి. శరీర పరంగా సరైన ఎర్ర రక్త కణాల సంఖ్య ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది లేకుండా మానసిక సంసిద్ధతతో  ఉండాలి.

మొదటి బిడ్డ సంరక్షణ

రెండవ కాన్పు తర్వాత తల్లికి శారీరకంగా నీరసం ఉంటుంది, అప్పుడే పుట్టిన బిడ్డపై అధిక శ్రద్ధ పెట్టాలి కాబట్టి మీ మొదటి బిడ్డని చూసేందుకు ఒక సహాయం కావలి. మీ దగ్గర బంధువో లేదా నమ్మకమైన వారో ఉంటే ఈ ఇబ్బంది అధిగమించవచ్చు. కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే వరకు అలాగే ఆ తర్వాత కొంతకాలం మీకు ఒకరి సాయం అవసరం.

కాన్పుసమయంలో గుర్తుంచుకోవలసినవి

రెండవ బిడ్డ ప్రసవ సమయం దగ్గర పడ్డాక మీరు మీ ఇతర కుటుంబ సభ్యులకు మొదటి బిడ్డ బాధ్యతలు అప్పగించాలి. వారికి కావలసిన బట్టలు, ఆహరం మరి ఏ ఇతర పదార్థాలైనా ఒక సంచిలో విడిగా సర్దిపెట్టి ఉంచండి. వారికి సంబందించిన ముఖ్యమైనవి ముందుగానే మీ బిడ్డని చూసుకొనే వారికిచెప్పి ఉంచితే మీకుఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు. ప్రసవ సమయంలో కొంత మంది ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండవలసి రావచ్చు కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి.

మొదటి బిడ్డకి ఒక సమయం కేటాయించండి

ఇక తర్వాతి దశలో ఒక బుజ్జి పాపో బాబో ఇంటికి వచ్చాక మీ మొదటి బిడ్డకి ఒక తోడు వచ్చింది అనిపించేలా మాట్లాడాలి. తమ  తల్లిదండ్రులుఇకపై వారిని పట్టించుకోరేమో అన్న భయం, మానసిక సంఘర్షణ వారికి రాకుండా వారికంటూ కొంత సమయంకేటాయించండి . వారికి ఇష్టమైన కధల పుస్తకాలు చదవండి, కాసేపు వారితో ఆడండి.

ప్రయాణ సమయాలు

ఇక ఎప్పుడైనా ప్రయాణాలు గాని బయటకి వెళ్లే అవసరం పడినప్పుడు ముందుగానే ఇద్దరికీ కావాల్సిన వస్తువులు విడిగా సర్దండి. మంచి నీళ్లు పండ్ల ముక్కలు వంటివి తప్పక ఉండాలి. పిల్లల అవసరానికి తగిన బట్టలు సర్దండి.

ఇద్దరు పిల్లలతల్లిగా మీజీవితంలో వచ్చే మార్పులు

మరి ఇద్దరుపిల్లలతో మీకు రోజంతామహా బిజీగా గడుస్తుంది. కానీ మీ ఆరోగ్యం బాగుంటేనే వాళ్లిదరు బాగుంటారని గుర్తుపెట్టుకోండి. సరైన సమయానికి తినడం మరవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. వీలుంటే కాసేపు ఇష్టమైన సంగీతం విన్నా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇతర అంశాలు

రెండవ బిడ్డ పుట్టాక చాలా మంది తల్లులకు తమ మొదటి బిడ్డని సరిగా చూడలేకపోతున్నామే అనే బెంగ ఉంటుంది. కానీ ఇది సహజం చిన్నిపాపడికి రెండేళ్లు నిండేవరకు ఇద్దరు పిల్లలతో కొన్నిఇబ్బందులు తప్పవు కానీ  వాళ్ళ ఇద్దరి కేరింతలు అల్లరి మీ కుటుంబ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
పైన పేరెంటింగ్ బ్లాగ్లు
Tools

Trying to conceive? Track your most fertile days here!

Ovulation Calculator

Are you pregnant? Track your pregnancy weeks here!

Duedate Calculator
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}