• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

మీ శిశువు కొరకు దినచర్య : దాని ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 06, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ప్రసవం అయిన తర్వాత మొదటి సారిగా తల్లి అయిన నాకు చాలా సంతోషంగా సరదాగా ఉండేది . కుటుంబం అంతా చేరి నా మీద, నా కొడుకు మీద విపరీతమైన శ్రద్ధ చూపిస్తూ, ప్రేమను కుమ్మరించే వారు .అయితే క్రమంగా అందరూ వెళ్ళిపోయారు. చివరికి నేను వంటరిగా మిగిలాను నా కుటుంబంలో- నా భర్త ,నా కొడుకు. నాకు భోజనం చేయడానికి మరియు విశ్రాంతి తీసుకునేందుకు కొంత సమయం కూడా దొరకడం లేదు అని నేను గుర్తించాను. అన్నివైపుల నుండి మద్దతు ఉంది. సంరక్షణ బాగుంది . అయితే ,ఎక్కడ పొరపాటు జరుగుతుంది ? అర్థం కాని నా దినచర్య తో నేను చాలా గందరగోళంలో పడిపోయాను.

 

చివరిగా నా భర్త నన్ను కాపాడేందుకు వచ్చారు .(ఎప్పటిలాగానే )అతను ఏమన్నారంటే ,ఒక తల్లిగా నీ దినచర్యను నీ కోసం లేదా మన కొడుకు కోసం సరైన పద్ధతిలో నీవు ప్రణాళిక చేయలేదా ? అలా అయితే , అన్ని పనులు సజావుగా సాగుతాయని ఎలా ఊహించావు.? అన్నారు.అది నాకు ఒక సూటి ప్రశ్న! అవును, నేను సరిగ్గా రూపొందించలేదు . మరికొంత కాలం అలాగే శ్రమపడిన తర్వాత , నేను నా కొడుకు దినచర్యను ఒక క్రమబద్ధంగా, ప్రయోజనకరంగా రూపొదించగలిగాను . ఇప్పటికీ ఆ విషయంలో నేను ఆనందిస్తూ ఉంటాను.

 

1. దినచర్య మరియు దాని ప్రాముఖ్యత :

 

శిశువుకు దినచర్య ! అవునా? శిశువు దినచర్యను అనుసరిస్తుంది ? శిశువు కోసం ఎవరూ తన దినచర్యను ఏర్పాటు చేస్తారు?ఈ ప్రశ్నలు మమ్మల్ని చుట్టుముట్టాయా. దాని తర్వాత కొన్ని వ్యంగ్యమైన సమాధానాలు కూడా వచ్చాయి . నేను మాత్రం నాగురిని విడిచిపెట్టలేదు . నా బిడ్డ కోసం ఒక దినచర్యను తయారు చేశాను .నా కొడుకు దినచర్యను ఒక ప్రణాళికతో ఏర్పాటు చేయడంతో నా పని చాలా సులభమైంది. అతను ఎన్ని గంటలు నిద్ర పోతాడో , ఎప్పుడు నిద్రపోతాడు , ఎప్పుడు నిద్ర లేస్తాడు అనేది ఆ దినచర్యలో నాకు అర్థం అయింది . దానికి అనుగుణంగా నా రోజుని ప్లాన్ చేసుకున్నాను. దీనికి అలవాటు పడటానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది .కానీ శిశువు ఎప్పుడు నిద్రపోతాడు ,ఎప్పుడు ఆడుకుంటాడు, ఎప్పుడు పాలు తాగుతాడు అన్నది త్వరలోనే గుర్తించడం ప్రారంభిస్తారు. ఏ సమయానికి ఏమి అవసరమో శిశువు అడగకముందే ఇవ్వడంతో ఆరోగ్యంగా, హుషారుగా , సంతోషంగా ఉంటుంది . అది పిల్లలలో ఒక సానుకూలతను మరియు నమ్మకాన్ని కలిగిస్తుందని నేను కనుగొన్నాను.

 

2. దినచర్యను రాసుకోండి :

 

శిశువు యొక్క దినచర్యను రాయడానికి సరైన వ్యక్తి తల్లి. ఒక తల్లిగా మీకు మీ శిశువు యొక్క నిద్ర ,ఆహారం ,ఆటల సమయాలను గురించి బాగా తెలుసు. అదే వారి దినచర్య కు మూలం . అంతే, ఈ సమయాలకు అనుకూలంగా మీ చిన్నారి దినచర్యకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి . దీన్ని తయారు చేయడం మీ సొంత పని . బిడ్డ ఏమి చేయదు. అది మీరే , అంటే తల్లిదండ్రులే చేయవలసి ఉంటుంది .దాన్ని ప్రతిరోజు చేస్తూ ఉండండి. కొద్ది రోజుల తరువాత శిశువు ఈ దినచర్య కు అలవాటు పడినట్లు గా మీరే గమనిస్తారు.

 

3. దినచర్యను రూపొందించడం వలన కలిగే ప్రయోజనాలు :

 

శిశువుకు , మీకు ఇద్దరికీ కూడా ఈ దినచర్యను రూపొందించడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి . కాబట్టి ఆ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం !

 

a. తల్లి కోసం :

 

అవును , ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అన్నది మీరు మీకు ఇచ్చుకునే ఒక బహుమతి.  బిడ్డ ఎప్పుడు నిద్ర పోతుందో మరియు ఎంత సమయం నిద్ర పోతుందో  మీకు బాగా తెలుసు . దానికి అనుగుణంగా మీ ప్రణాళికలు వేసుకోవచ్చు . కాబట్టి మీకు విశ్రాంతి దొరుకుతుంది.

 

b. దంపతుల కోసం :

 

ఇలా ఒక దినచర్యను రూపొందించడం మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది .బిడ్డ పుట్టడం అంటే ,మీ సంబంధాలను దూరంగా ఉంచుకోవాలని కాదు .శిశువుకు ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి . అంటే ,తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం తప్పక ఉండాలి . బిడ్డ ఆనందంగా నిద్రపోతున్న సమయంలో మీరు పోగొట్టుకున్న ఆ మధుర క్షణాలను ,  మరియు మీకు మరింత వెచ్చదనాన్ని అందిస్తాయి.

 

c. సంరక్షకులకు సులభం :

 

మీరు శిశు సంరక్షణ కొరకు పనిమనిషిని ఉంచినా లేదా మీ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంచినప్పటికీ మీరు ఇలా బిడ్డ యొక్క దినచర్యను క్రమబద్ధంగా అలవాటు చేసినందువల్ల వాళ్ళు కూడా శిశువు చేయవలసినది పెద్దగా ఏమీ ఉండదు .ఒకవేళ మీరు బిడ్డను విడిచి బయటకు వెళ్లవలసి వచ్చినా , ఇలా వారి దినచర్యను ఏర్పాటు చేసినందువల్ల ఎటువంటి ఆందోళన లేకుండా వెళ్లగలుగుతారు . మరియు శిశువు కూడా తన దినచర్యను అర్థం చేసుకుంటుంది . మీరు తిరిగి ఇంటికి వచ్చాక వారి దినచర్యను తనిఖీ చేస్తే సరిపోతుంది.

 

4. దీన్ని సరదాగా మరియు సరళంగా ఉంచండి :

 

దినచర్య అన్నది కొంచెం సులువుగా ఉండాలి. మారుతున్న వాతావరణం, సమయం మరియు పరిస్థితులకు అనుగుణంగా మీరు మీ దినచర్యను మార్చుకోగలిగే లాగా ఉండాలి.  దినచర్య ఏర్పాటు ఆహ్లాదకరంగా ఉండాలి కానీ భారంగా మరియు కష్టతరంగా ఉండకూడదు . దానిని సరదాగా తీసుకోండి.

 

5. కచ్చితంగా ఉండాలి అంటే విసుగును కలిగిస్తుంది :

 

కచ్చితంగా ఉండాలి అంటే అది సరదాగా ఉండదు . మరియు అంత ఖచ్చితంగా ఉండవలసిన అవసరం లేదు .ఒక్క నిముషం కూడా తేడా లేకుండా కచ్చితంగా ఉండాలి అనే నియమం పెట్టుకోకండి .ఇది మీకు మరియు మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

 

6. పిల్లలు పిల్లలలాగే ఉండగలరు :

 

దినచర్య అనేది మీ సౌలభ్యం కోసమే అని గుర్తుంచుకోండి .అందుకే కొన్ని సార్లు దాన్ని వదిలేయండి . వారు పాలు తాగకూడదు అనుకుంటే , కొంత సేపు వారిని వదిలేయండి. వారు రోజు లాగా నిద్రపోకూడదు అనుకుంటే, వదిలేయండి . వారితో పాటు మీరు ఆడుకోండి . బిడ్డని కూడా ఆనందంగా ఉండనివ్వండి . దినచర్య ప్రకారం జరగాలని వారిని మీరు బలవంతం చేసినట్లయితే మీ బిడ్డ మొండిగా తయారవుతుంది .తద్వారా తేలికగా అయ్యే విషయం కూడా కష్టతరం అవుతుంది.

 

7. ఈ విషయంలో ఆందోళన చెందకండి :

 

ఒకవేళ ఎవరైనా ఈ దినచర్యను అనుసరించ లేకపోతే దీనిపై చర్చను సృష్టించండి. కొన్నిసార్లు వారు మీలాగా దాన్ని చేయలేకపోవచ్చు . వారు ప్రయత్నిస్తున్నట్లు అయితే వారిని అభినందించండి .దాన్ని అనుసరించేందుకు వారికి సహాయం చేయండి.

 

8. తల్లిదండ్రులిద్దరూ అనుసరించాలి :

 

దినచర్యను నిర్వహించడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత .ఒక్కరు మాత్రమే ఈ దినచర్య కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు .ఈ బాధ్యత తండ్రి చేస్తున్నట్లయితే , తల్లి సహాయం చేయవచ్చు .అలా ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.

 

9. మార్పును క్రమంగా తీసుకురండి :

 

ఒకవేళ మార్పు తీసుకు రావాల్సిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే , మార్పు అన్నది క్రమంగా రావాలి . కానీ ఆకస్మికంగా రాదని నిర్ధారించుకోండి .పిల్లలలో మార్పు వస్తుంది . కానీ , ఈ ప్రక్రియ అన్నది నెమ్మదిగా ఉండాలి .అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క పని మాత్రమే అలవాటు చేయండి. ఒక దానికి పూర్తిగా అలవాటు అయ్యాక  మరొక దానికి ప్రయత్నించండి.


దయచేసి మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి .తోటి తల్లిదండ్రుల నుండి వాటిని వినడానికి మేము ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}