• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

మా బిడ్డకు ఉప్పును ఎప్పుడు మరియు ఎలా ఇవ్వాలి.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 29, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మాతృత్వ ప్రారంభ రోజులలో తల్లి ఎదుర్కొనే కష్టమైన పని ఏమిటంటే, తన బిడ్డకు ఆహారం ఇవ్వడం. తన బిడ్డ ఆహారం తినడానికి నిరాకరిస్తే ప్రపంచం తలకిందులు అయినట్లుగా ఆందోళన చెందుతుంది. బిడ్డ ఆహారం తిననట్లయితే తల్లి మొట్టమొదటిసారిగా అనుకునేది ఋచిలేని ఆహారం ఇస్తున్న అందువల్ల అని నిర్ధారించుకుటుంది. ఆ రుచి లేని దానికి పూర్తి కారణం ఉప్పు అని నిందిస్తుంది.

 

ఉప్పు...!! కానీ, ఎక్కువమంది శిశు వైద్యులు ఒక సంవత్సరం వరకు ఉప్పును ఎందుకు తీసుకోకూడదు అని చెబుతారు?

 

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉప్పు ఎందుకు సిఫార్స్ చేయబడలేదు?

 

మీ శిశువుకు ఆహారంలో అదనపు ఉప్పును చేర్చకుండా ఉండడం మంచిది. శిశువులకు మరియు పిల్లలకు వారి ఆహారంలో చాలా తక్కువ ఉప్పు మాత్రమే అవసరం ఉంటుంది. సాధారణంగా ఆ ఉప్పు  తల్లిపాల ద్వారా లేదా శిశువు ఆహారం ద్వారా తీర్చ పడుతుంది. రోజుకి శిశువుకు ఒక్క గ్రాము కన్నా తక్కువ ఉప్పు అవసరం ఉంటుంది. ఉప్పు తల్లిపాల ద్వారా లేదా ఫార్ములా పాల ద్వారా అందుతుంది. బిడ్డ ఆరు నెలల సమయంలో ఘానాహారాన్ని తినడం ప్రారంభించిన తరువాత మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారం లేదా బయట నుండి తెచ్చిన బేబీ ఫుడ్ లో ఉప్పును కలప వలసిన అవసరం లేదు. బిడ్డ పెద్దయ్యాక  టేబుల్ మీద స్వయంగా ఆహారం తినడం ప్రారంభించే సమయం లో పుష్కలంగా ఉప్పు ను తీసుకుంటాడు.

 

నా బిడ్డకు నేను ఎప్పుడు ఉప్పు ఇవ్వడం మొదలుపెట్టాలి?

 

మీ బిడ్డకు మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత వారంతట వారు స్వయంగా ఆహారాన్ని తినడం ప్రారంభించే సమయంలో వారి ఆహారంలో చాలా తక్కువ ఉప్పు చేర్చి ఇవ్వొచ్చు. ఆహారంలో చాలా తక్కువ ఉప్పు ని చేర్చాలి అని గుర్తుంచుకోండి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లకు పునాది వేయండి. తద్వారా మీ బిడ్డ తాజా పండ్లు మరియు కాయగూరలతో ప్రకృతి యొక్క స్వచ్ఛమైన మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తాడు.

 

ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఉప్పు ఇవ్వడం సురక్షితమేనా ?

 

శిశువు యొక్క ఆహారంలో ఎక్కువ ఉప్పు ని చేర్చడం మీ శిశువు యొక్క అపరిపక్వ మూత్రపిండాలకు హానికరం. అవి అదనపు ఉప్పును ప్రక్రియ చేయలేకపోవచ్చు. బిడ్డల ఆహారంలో ఉప్పుని చేర్చడం వలన వారికి జీవితం అంతా కూడా ఉప్పు గా ఉండే ఆహారం మీద ఎక్కువ ఇష్టం కలుగుతుంది. అది పిల్లల భవిష్యత్తులో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

 

శిశువుకి రోజుకి ఒక గ్రాము కంటే కూడా తక్కువ ఉప్పు మాత్రమే అవసరం ఉంటుంది. ఇది తల్లిపాల ద్వారా గాని లేదా ఫార్ములా పాల ద్వారా బిడ్డకు అందుతుంది. మీరు పిల్లల ఆహారంలో చిటికెడు ఉప్పుని చేర్చి నట్లయితే, ఆ చిటికెడు ఉప్పు 1/4 గ్రాములకు సమానం అని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు బిడ్డ ఆహారంలో ఉప్పు చేర్చే సమయంలో దానిని లెక్కించుకోండి. తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మరియు ఘన పదార్థాలు కూడా ! ఉప్పును అదనంగా తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై భారం పడుతుంది . అధిక భారం కారణంగా మూత్రపిండాలు సరిగా పనిచేయలేవు. ఇది మూత్రపిండాల వ్యాధులకు దారి తీయవచ్చు. మరియు వయసు వచ్చాక  రక్త పోటుకు కారణం అవుతుందని నిరూపించబడింది. బాల్యంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వలన ఎముకల వ్యాధులు , హృదయ సంబంధమైన వ్యాధులు మరియు శ్వాసకోస వ్యాధుల వంటి అనారోగ్యాలకు దారి తీయవచ్చు.

 

నా శిశువు ఆహారంలో ఉప్పును ఎలా పరిచయం చేయాలి ?

 

ఆహారం యొక్క రుచిని పెంచే ప్రయత్నంలో శిశువు యొక్క ఆహారంలో ఉప్పుని చేర్చడం ఉత్సాహం కలిగిస్తుంది. నిస్సందేహంగా బిడ్డ కూడా ఆహారం తినడానికి ఉత్సాహం చూపించే విధంగా చేయడానికి ఇది చాలా మంచి మార్గం . ఉప్పు యొక్క రుచి ఏమిటో పిల్లలకు తెలియదు. కాబట్టి ఆహారం చక్కగా ఉంది అనడంలో అర్థం లేదు. ఉప్పును జోడించడానికి బదులుగా పిల్లల ఆహారంలో విభిన్న రుచులను మరియు రకరకాల ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించండి. ఆకర్షణీయమైన కప్పులు మరియు ప్లేట్లలో మీ బిడ్డకు ఆహారాన్ని ఇవ్వండి. మీ వంటలను సృజనాత్మకంగా చేయడానికి ప్రయత్నించినట్లయితే ఉప్పులేని ఆహారాలు కూడా రుచికరంగా రావడానికి అవకాశం ఉంది. అందుకే నా ఆలోచన ప్రకారం మీ శిశువు ఆహారంలో ఉప్పును విడిగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారు దానిని అన్ని ఆహార పదార్థాల నుండి సహజంగా గ్రహిస్తారు. అంతేగాక మీ బిడ్డ చుట్టూ ఉన్న ఇతర ఆహార పదార్థాలలో ఉప్పు ఉంటుంది.

 

నా బిడ్డకు అదనపు ఉప్పు ఇవ్వడాన్ని నేను ఎలా నివారించగలను?

 

మీరు నివారించవచ్చు . కానీ, ఉప్పు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా ఇవ్వకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మీ ఇంటిలోనికి పూర్తిగా రానివ్వకండి. ఉప్పు అధికంగా ఉండే ఈ క్రింది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మీ పిల్లలకు ఇవ్వవద్దు.

 

1. పైస్ :

 

మీ బిడ్డకు ఎనిమిది లేదా తొమ్మిది నెలల వయసు వచ్చేసరికి టీవీ లో వచ్చిన ఆహార పదార్థాలను చూసి ప్రలోభాలకు లోను అవుతుండగా ఉప్పు అధికంగా ఉండే  పైస్  ను మీ బిడ్డకు ఇవ్వడం మంచిది కాదు అని గుర్తుంచుకోండి.

 

2. బిస్కెట్లు :

 

సాధారణంగా ఇంట్లో తయారు చేసిన బిస్కెట్లు లో కొంత ఉప్పు ఉంటుంది కాబట్టి బిస్కెట్లను కూడా నివారించండి.

 

3. క్రాకర్స్ :

 

క్రాకర్స్ లో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని శిశువులకు దూరంగా ఉంచాలి.

 

4. సూప్ లు :

 

ఇంట్లో తయారు చేసిన సూప్ లను పిల్లలకు ఇవ్వవచ్చు. కానీ ఉప్పు కలిపే ముందు పిల్లలకు ప్రత్యేకంగా కొంత భాగాన్ని తీసి పెట్టి ఇవ్వండి.

 

5. గ్రేవిస్ :

 

ఉప్పు కలపక ముందు గ్రేవీని శిశువుల కోసం తీసి ఉంచకలిగినట్లయితే ఇవ్వవచ్చు.కానీ బయట నుంచి తెచ్చిన గ్రేవి ఆహారాన్ని పూర్తిగా నివారించండి.

 

6. సాస్ :

 

సాస్ ను పూర్తిగా ఇవ్వకండి . ఎందుకంటే ఇంట్లో తయారుచేసిన సాస్ లో కూడా కొంత ఉప్పు ఉంటుంది.

 

పిజ్జా :

 

పిజ్జా లో సాస్ ఉంటుంది .ఇందులో ఉప్పు అధికంగా ఉంటుంది .పిజ్జా బేస్ లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. మరియు ప్రాసెస్ చేసిన జున్ను లో ఉప్పు అధికంగా ఉంటుంది . శిశువుకి ఇది చాలా ప్రమాదకరం.

 

8. బేకన్ :

 

మీరు శాఖాహారులు అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రొసెస్ చేసిన బేకన్ ఇవ్వడం మంచిది కాదు.

 

9. చిప్స్ :

 

చిప్స్ అనేది పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వకూడదు. దానిని పిల్లలకి ఇవ్వడం గురించి మీరు కూడా మరిచిపోండి.

 

మీ శిశువు యొక్క ఆహారంలో ఉప్పు గురించి గుర్తుంచుకోవలసిన విషయాలు:

 

సిరియల్స్ వంటి పిల్లల ఆహారంలో తక్కువ సాల్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. వీటిని తయారు చేసే సమయంలో ఉప్పు కలపకుండా తయారుచేస్తారు. పసి పిల్లలు మరియు పెద్ద పిల్లలు భోజనం విషయంలో ఉప్పును జాగ్రత్తగా చూసుకోవడం అన్నది ఎంతో ముఖ్యం. పెద్ద పిల్లలకు తయారుచేసే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది అందువల్ల అది శిశువులకు ఇవ్వకూడదు.

 

మీ అలవాట్ల ప్రకారం పిల్లల రుచులను నిర్ణయించండి. మీ పిల్లలు ఉప్పు యొక్క రుచిని కోల్పోవడానికి , వారికి ఆ ఉప్పు లోని రుచి కూడా తెలియదు. అందుకే మీ పిల్లల ఆహారంలో అవసరమైనదానికంటే ఎక్కువ ఉప్పు వేయడం మానుకోండి.


మీ పిల్లలకు ఎప్పుడు ఎలా ఉప్పు ఇవ్వాలి అనే విషయం పై రాసిన బ్లాగ్ మీకు నచ్చిందా? మీ పిల్లల ఆహారంలో ఉప్పు కు సంబంధించిన మీ ఆందోళనలకు మరియు మీ ప్రశ్నలకు సమాధానం లభించిందా ?దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}