• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి మీ శృంగార జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించవచ్చు? మీకు ఎటువంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోండి.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 19, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంభాషణ అనేది ప్రాథమిక రూపం .ఏది ఏమైనా బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నో విషయాలలో మార్పును తీసుకొస్తుంది . మరియు ప్రాధాన్యతలలో కూడా చాలా వ్యత్యాసం వస్తుంది . శృంగారం లేదా ప్రేమను పొందడం అన్నది వివాహం లో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి శారీరకంగా  ఆనందించడం అన్నది చాలా ముఖ్యం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత శృంగారాన్ని ఎప్పుడు తిరిగి ప్రారంభించాలలి అనే కొన్ని ప్రశ్నలు ఎంతోమంది జంటలను బాధిస్తూ ఉంటాయి.

 

గర్భవతిగా ఉండడం అన్నది ఒక పొంగిపోయే విషయం .నా లోపల ఇంకొక జీవి ఉన్నది అన్న వాస్తవం ఒక అద్భుతం .అది ఒక మాయాజాలం . మారిన నా శరీరాకృతి అంటే నాకు ఎంతో ఇష్టం .నా భర్త నన్ను ప్రత్యేకంగా, అపురూపంగా చూడడాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను .దాదాపు అదంతా ఒక అద్భుతమైన కథలాగా సాగుతూ ఉంది .నేను మామూలు ప్రసవం కోసం ఎదురు చూశాను. కానీ 12 గంటల పురిటినొప్పుల తర్వాత సి- సెక్షన్ వెళ్ళవలసి వచ్చింది ...అయ్యో!

 

గర్భం యొక్క తరుణం ముగిసి పోయాక ఆ కలల ప్రపంచం నుంచి బయట పడతాము.

 

కొద్దిరోజుల తర్వాత ఆనందాల మూట తో ఇంటికి తిరిగి వచ్చాము .మరియు అద్భుతమైన కథ అదృశ్యమైంది .శిశువుకి ఎప్పుడూ ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటుంది .తల్లి పాలు ఇవ్వడం అనేది నొప్పి తో కూడుకున్నది . నా అందమైన పొట్ట స్థానంలో ముడతలు పడి ,మసకబారిన కడుపు వెలసింది .నిద్ర లేమి అన్నది ప్రమాణంగా మారింది . భర్త యొక్క ప్రేమ కృతజ్ఞతగా మారిపోయింది .నేను ఎంతో పరధ్యానం లోనూ మరియు చికాకు లోనూ ఉండిపోయాను .శృంగారం గురించి ఆలోచించే మానసిక స్థితిలో నేను లేను.

 

అయితే, మన శృంగార జీవితం ముగిసిపోయిందా ? శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం .ఇది జంటల మధ్య ప్రేమను బంధించడానికి సహాయపడుతుంది. ఇది మనం ఎప్పుడూ ఆనందించే ఒక సహజమైన చర్య .తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినప్పటికీ వీలైనంత త్వరగా దానిని కొనసాగించాలి.

 

బిడ్డ పుట్టిన తర్వాత శృంగార జీవితాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభించ గలము?

 

నాకు సి -సెక్షన్ అయినందున మేము 12 వారాలపాటు శృంగారానికి దూరంగా ఉండాలి. అది అంత పెద్ద విషయం కాకపోయినప్పటికీ ,ప్రారంభంలో ఇద్దరికి కొంచెం కష్టం గానే ఉండేది. తల్లిదండ్రులుగా మారిన తర్వాత అలసిపోయి దిండుపై తల వాల్చిన వెంటనే నిద్రలోకి జారిపోతాము.

 

సమయం గడిచే కొలదీ నేను స్వస్థత పొందాను .తల్లిగా కూడా అనుభవం సంపాదించాను .అప్పుడు శారీరక సాన్నిహిత్యం కోసం కోరిక బలపడింది . మొదట మానసికంగా సిద్దపడ్డాను. ప్రసవం తరువాత వచ్చిన నొప్పులను పక్కన పెట్టి దానిని ఆస్వాదించేందుకు సిద్ధపడ్డాను. నకుల్ యొక్క సహనం నాకెంతో సహాయపడింది. శృంగారం కోసం నన్ను ఎప్పుడూ బలవంత పెట్టలేదు .ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించేది .నిర్ణయాన్ని నాకే వదిలి పెట్టారు . అది బిడ్డ పుట్టిన తరువాత ప్రేమను మరింత బలపరచుకునేందుకు కావాల్సిన అంశము.

 

కానీ, అది 'మాకు 'కానీ మీకు బిడ్డ పుట్టిన తర్వాత శృంగారంలో పాల్గొనే ముందు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు :

 

మీ శరీరానికి స్వస్థత పొందేందుకు కొంత సమయాన్ని ఇవ్వండి :

 

నేను చెప్పినట్లుగా మీరు శారీరకంగా మామూలుగా అయినా తల్లిగా ఇది మీకు మరో జన్మ లాంటిది. తండ్రికి కూడా మీ బిడ్డతో సాన్నిహిత్యం ప్రారంభమవుతుంది .కాబట్టి కొంత సమయం వేచి ఉండండి. మీ శరీరం పూర్తిగా స్వస్థత పొందిన తర్వాత మీ శారీరక కలయికను తిరిగి ప్రారంభించండి.

 

నెమ్మదిగా ప్రారంభించండి :

 

మీ శరీరం నయం అయిన తర్వాత కూడా నిద్ర లేకపోవడం మరియు అలసటగా ఉండటం చేత మీరు మానసికంగా కూడా సిద్ధంగా లేని సందర్భాలూ ఉంటాయి. చింతించకండి .ఒకరి చేతులలో మరొకరు ఒదిగి పడుకోండి. బిడ్డపుట్టిన తర్వాత శృంగారం ,ముందు ఉన్నంత ఫ్రీ గా ఉండదు .కాబట్టి నెమ్మదిగా ప్రారంభించండి. మళ్లీ ముందు స్థితికి చేరుకుంటారు.

 

ఫోర్ ప్లే ని కొనసాగించండి :

 

బిడ్డ పుట్టాక తిరిగి శృంగార జీవితం లోకి రావడానికి ఫోర్ప్లే ఉంటుంది అని గుర్తుంచుకోండి .మీరు నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే నిద్ర మేల్కొన్న తరువాత సన్నిహితమైన స్పర్శలు ,చూపులు మరియు మిమ్మల్ని సేదతీర్చే సుదీర్ఘమైన ముద్దులు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీ శృంగార జీవితం చిరకాలం ఆరోగ్యకరంగా ఉంటుంది అని నమ్మండి.

 

దంపతులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

 

బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చక్కగా, ప్రేమగా చూసుకోవాల్సిన అదనపు బాధ్యత అనేది మన మనసులో ఉంటుంది.

 

మొదటగా, ప్రణాళిక లేని గర్భం కోరుకోలేదు .(మాకు రెండో బిడ్డ కావాలి .కానీ మూడు సంవత్సరాల తరువాత ,అది కూడా మేము సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే) బిడ్డకు పాలిచ్చే సమయంలో కూడా గర్భనిరోధక సాధనాలు వాడటం తప్పనిసరి.

 

రెండవది, మేము ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కోరుకుంటున్నాము .రోజంతా పనితోను మరియు బిడ్డతోనూ అలిసిపోయి కొంత కోల్పోయినప్పటికీ , సంతోషంగా ముందుకి వెళ్లాలని కోరుకుంటాము .నేను భావోద్వేగాలకు లోనుకాకుండా సౌమ్యంగా, దయగా ముందుకు వెళ్లడం అన్నది నాకు చాలా ప్రాముఖ్యమైనది.

 

మూడవది, అసౌకర్యంగా భావించవద్దు .కొన్ని ప్రదేశాలు లేదా కొన్ని కార్యకలాపాలు బాధాకరమైనవి లేదా ఇష్టం లేనివి కావచ్చు. ఒకరినొకరు సంతృప్తి పరచడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి .మా లక్ష్యం కలిసి అనుభూతి చెందడం మరియు ఆనందించడం తో సంభోగం వస్తుంది .సమయం గడిచేకొద్దీ మా బంధం బలపడింది .మరియు మాకూ సమయం కలిసి వచ్చింది.

 

శిశువు పుట్టిన తరువాత శృంగారం కలిగిఉండటం ...తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు...

 

బిడ్డ పుట్టిన తర్వాత శృంగారంలో పాల్గొనాలి అనిపించకపోవడం సాధారణమా?

 

అవును, కొత్తగా తల్లి అయిన వారికి శిశువు పుట్టాక శృంగారం కావాలి అనిపించకపోవడం చాలా సాధారణం. కొత్తగా తల్లి అయిన వారు శృంగారానికి చివరి ప్రాధాన్యత ఇస్తారు. తల్లికి బిడ్డ మీదనే తన శ్రద్ధ మరియు ధ్యాస అంతా ఉంటుంది. ఆవిడ తండ్రిని కూడా ఎంత మాత్రము పట్టించుకోదు . కొత్త బాధ్యతలు, కొత్త జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవడం, కుటుంబ సంబంధాలను సెట్ చేయడంలో చాలా అలసిపోయి శృంగారం పట్ల ఆసక్తి తగ్గడానికి దోహదం చేస్తుంది .ఇది చాలా సహజమైనది మరియు తాత్కాలికమైనది కూడా.

 

నేనైతే  ఏమి చేస్తానంటే అలసటను ఆలోచనలను అన్నింటిని నకుల్ చెవిలో వేసి సానుభూతిని పొందే దాన్ని .దానిని తిరిగి మొదలు పెట్టేందుకు కొంత సమయం పడుతుంది అని... మీరు ఏమి చేయాలంటే,..

 

మీ భర్త తో మాట్లాడండి :

 

ఇంతటి ఆనందాన్ని ఈ ప్రపంచంలోనికి తీసుకురావడంలో ఇద్దరూ సమానంగా బాధ్యత వహిస్తారు . మరియు మీరిద్దరూ ఒక్కటే . కాబట్టి ఇద్దరూ ఒకటే లాగానే వ్యవహరించండి .బేబీ పుట్టిన తర్వాత మీ ఆందోళనలు, భయాలు మరియు సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం గురించి మీ భర్త తో మాట్లాడండి . పడక గది బయట నీకు కొంత ఆనందాన్ని కలిగించే మార్గాలను వెతుక్కోండి. అది ఒత్తిడి , ఆందోళనలను మరియు అలసటను తగ్గిస్తుంది.

 

మీ భర్తను లేదా మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోకండి :

 

మీ బిడ్డ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటుంది అంటే మీరు మీ భర్త ని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించమని కాదు. నేను బిడ్డ యొక్క తండ్రిని గురించి చెప్పటం లేదు .ఒక తండ్రిగా అతను చాలా శ్రద్ధ తీసుకుంటాడు .కానీ అతనికి కొన్ని సార్లు భార్య అవసరం అవుతుంది . మీకు అది కొంచెం కష్టమే అయినా అసాధ్యం కాదు. అందుకే మీరు మీ పట్ల మరియు మీ భర్త పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి. ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి.- భర్తలు -ఇది మీ భార్యలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె శరీరం చాలా అసౌకర్యానికి గురవుతుంది. - భార్యలు - మీరు కొత్త పాత్రకు అలవాటు పడే సమయంలో మీ భర్తల విషయంలో కూడా కొంచెం ఉదారంగా ఉండండి .మీకు 9 నెలలు సంతోషించే సమయం దొరికింది .కాబట్టి అతనికి కొంత సమయం ఇవ్వండి .మరియు అతను బిడ్డ కోసం ఏదైనా చేసినప్పుడు పొగడ్తలతో నింపండి.

 

చిన్న హావభావాలతో సాన్నిహిత్యాన్ని అలాగే ఉంచండి :

 

దీనిని నేను మీకు నిజంగా విడమరిచి చెప్పవలసిన అవసరం ఉందా ? ఆ సమయంలో అతని వేడిని ఎలా తగ్గించాలో మీకే బాగా తెలుసు. అందుకే అతనిని ఎప్పుడూ అదే వేడి లో ఉంచండి. ఒకరోజుకి మీరు కూడా అక్కడికి చేరుకుంటారు.

 

బిడ్డ మనతోనే నిద్రొస్తుంది . మన ప్రేమను మనం ఎలా ఆశ్వాదించ గలము?

 

కాబట్టి, మనస్సును సంసిద్ధం చేసుకోండి, పాటలు వినండి , వెలుతురును సర్దుబాటు చేసుకోండి... మా బేబీ  మా బెడ్ మీదనే నిద్రొస్తుంది... మాకు పిల్లలు పుట్టినప్పుడు ఉమ్మడి కుటుంబం లోనే నివసిస్తూ ఉండే వాళ్ళం. మాకు ప్రత్యేకమైన గది ఉండేంత లగ్జరీ లేదు .అయితే మేము శిశువు కోసం ఒక ప్రత్యేకమైన బెడ్ తీసుకున్నాము .మా ఇద్దరి గోప్యత కోసం మంచాన్ని గది చుట్టూ మార్చడం అన్నది మాకు పెద్ద సమస్య కాలేదు.

 

పిల్లలు పుట్టిన తర్వాత మీ జీవితంలో ప్రాధాన్యతలన్ని మారిపోయి, జీవితాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది .దీన్ని చెప్పడం సులభం ,కానీ చేయడం కష్టం. ఏది ఏమైనా ,ఇద్దరు పిల్లలు పుట్టడం వలన నా జీవితంలో ఏ కోణాన్ని నిజంగా వదులుకోవలసిన అవసరం లేదని నేను నేర్చుకున్నాను . ఎందుకంటే ఇప్పుడు నేను ఒక తల్లిని . ప్రేమను పంచడం అంటే సహజంగా తల్లిదండ్రుల సంభాషణల ద్వారా మరియు భాగస్వాములు ఇద్దరూ ప్రేమగా నడుచుకుంటూ ,ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవడంతో పాటు చివరివరకు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించగలరు.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}