మీ ఇంటి లోనికి కరోనా వైరస్ (కోవిడ్ -19) ను తీసుకువచ్చే వాటి నుండి ఎలా జాగ్రత్త వహించాలి

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Apr 03, 2020

ఒక విషయంలో మాత్రం మీకు కొంత ఉపశమనం ఇవ్వాలి. ఇది బ్యాక్టీరియా లాంటి జీవి కాదు.కాబట్టి ఇది ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి స్వయంగా వెళ్ళలేదు. దీనికి ఒక రాయబారి కావాలి. ఈ వాతావరణంలో జీవించే వ్యక్తి యొక్క శ్వాస ద్వారా చిందించే తుంపరులే దీనికి రాయబారులు.
అయినప్పటికీ ,దీనిని జీవన శ్వాస ద్వారా తీసుకు వెళ్లేవారు లేకపోయినప్పటికీ ఎక్కువ కాలం ,హానికరంగా జీవించగలదు. ఈ కోవిడ్ -19 కేవలం మనుషుల ద్వారా మాత్రమే ఇతరులకు సంక్రమించదు. మామూలు వస్తువులైన పెట్టెలు, ప్యాకేజీలు, హ్యాండిల్స్ ,ఏటీఎం మిషన్ ల బటన్లు ను ముట్టుకోవడం ద్వారా కూడా ఇది సంక్రమిస్తుంది.
కోవిడ్ -19 వైరస్ అనేది అత్యంత తీవ్రమైన అంటువ్యాధి. ఇది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే భయపెడుతుంది.సామాజిక దూరాన్ని పాటించడం మరియు ఒంటరిగా గడపడం ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందకుండా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది.
మన ఇంట్లోని వస్తువులు ద్వారానే ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంది .వీటి నుండి మనం ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం.
కూరగాయలు మరియు పండ్లు
ఈ వైరస్ గురించి మనకు తెలిసినంత వరకూ ఇది అన్ని రకాల వాతావరణాలోనూ, గాలిలోనూ, ఉపరితల లోనూ జీవించగలదు. ఈ వైరస్ కాయగూరల ద్వారానూ మరియు పండ్ల ద్వారా ను కూడా సంక్రమించేందుకు అవకాశం ఉందా అనే చర్చ కొనసాగుతుండగా దీనిని మనం తిరస్కరించ లేము. తర్వాత బాధపడే కంటే జాగ్రత్త కలిగి ఉండటం మంచిది.
కాబట్టి, మీరు కాయగూరలను, పండ్లను క్రిములు లేకుండా ఎలా శుభ్రపరుస్తారు ? మామూలు క్రిమిసంహారక పద్ధతుల ద్వారా కాదు. క్రిమిసంహారక పద్ధతుల ద్వారా కాయగూరలను ,పండ్లను శుభ్రపరచు కూడదు.
సబ్బు నీటితో కడగడం: సబ్బు అనేది జీర్ణ వ్యవస్థ కోసం కాదు. బయట వస్తువుల ఉపయోగం కోసం మాత్రమే. మరియు దీనిని వాడినట్లయితే విషపూరితం అవుతుంది. కాబట్టి కూరగాయలు మరియు పండ్లు శుభ్రపరిచేందుకు సబ్బు వాడకండి.
బ్లీచ్ మరియు క్లోరిన్ (ద్రావణాన్ని) ఉపయోగించడం:దీన్ని వాడేందుకు ఎంతో నైపుణ్యత అవసరం. మిగతా అన్నిటికంటే కూడా ఇది ఎంతో ప్రమాదకరమైనది .దీనిని ఉపయోగించకపోవడం మంచిది.
ఐశో ప్రొఫైల్ ఆల్కహాల్ లేదా క్రిమిసంహారక మందులు వాడటం: వీటిని కూడా సిఫారసు చేయబడలేదు. ఈ రసాయనాలు ఏవి కూడా ఏ విధంగానూ వాడకూడదు .ఇవి మంచి కంటే కూడా ఎక్కువ హానిని కలిగిస్తాయి.
కాయగూరలను ,పండ్లను క్రిములు లేకుండా చేసేందుకు పైన చెప్పిన వాటి కంటే కూడా ఈ విధానం చాలా సులభమైనది. ఈ క్రింది విధానాన్ని అనుసరించండి.
గోరువెచ్చని నీటిని వాడండి. (30 డిగ్రీల సెల్షియస్ కంటే కొంచెం ఎక్కువ వేడి నీటితో శుభ్రపరచడం మంచిది).
అందులో కూరగాయలను మరియు పండ్లను సుమారు 30 సెకండ్ల నుండి ఒక నిమిషం వరకు నానబెట్టండి. (ఆ నీరు చల్ల పడకముందే వాటిని తీసివేసి)
టాప్ కింద ఉంచి రన్నింగ్ వాటర్ తో శుభ్రపరచండి. (వేడి నీటితో అయితే మంచిది. ఉదాహరణకు ఆ నీరు 26 డిగ్రీల సెల్షియస్ కంటే ఎక్కువగా ఉండాలి)
ఆ తడి ఆరిపోయాక వాటిని నిల్వ చేయండి.
గమనిక - దీని తరువాత 30 సెకండ్ల పాటు మీ చేతులను సబ్బునీటితో కడుక్కోండి.
మీరు కాయగూరలను మరియు పండ్లను కడగకుండా ఉన్నట్లు అయితే ఏమి జరుగుతుంది?
మీరు కొన్ని రకాల కాయగూరలను మరియు పండ్లను కడగకూడదు అని అనుకున్నట్లయితే. ఉదాహరణకు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఇలాంటి వాటి విషయంలో మనం ఏమి చేయాలి?
నిజానికి అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ కాయగూరలను తెచ్చిన తరువాత కనీసం 24 గంటల నుండి 36 గంటల వరకు ఉపయోగించకుండానూ మరియు చేతులతో ముట్టుకోకుండానూ ఉంటే చాలు.వీటి పై తొక్క తీసి వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తొక్క తీసిన తర్వాత మాత్రం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
మీరు ఈ కాయగూరలను పచ్చిగా తీసుకుంటే తప్ప... మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు.ఇంకా ఏమైనా వైరస్ ఉంటే వంట చేసే సమయంలో చనిపోతుంది .కానీ మీరు వాటిని విడిగా గాని లేదా సలాడ్ గా గాని ఉపయోగించాలి అనుకుంటే వాటిని 20 నుండి 30 సెకండ్ల పాటు టాప్ కింద ఉంచి శుభ్రపరుచుకోండి.
మీరు కాయగూరలను ముట్టుకున్న తర్వాత వాటిని కడిగిన ,లేదా కడగకపోయినా మీ చేతులను మాత్రం శుభ్రం చేసుకోండి.
పాల ప్యాకెట్లు మరియు సీసాలు
పాల ప్యాకెట్లు లేదా సీసాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ -19 వైరస్ ప్యాకెట్లపై 16 గంటలు మరియు గాజు పై నాలుగు గంటలపాటు జీవించగలదు. వీటిని సబ్బునీటితో కడగడానికి ప్రయత్నించండి. అది వైరస్ యొక్క ఉనికిని చాలావరకు తగ్గిస్తుంది.
అయినప్పటికీ ఈ ప్యాకెట్ నుండి పాలను పోసిన తరువాత చేతులను కడుక్కోండి. బాగా మరిగించిన పాలను మాత్రమే వాడండి .పచ్చిపాలను వాడకండి.
ఇతర ప్యాకేజీలు మరియు ప్యాక్ చేయని వస్తువులు
ఒక వస్తువు యొక్క పై భాగాన్ని మీరు ముట్టుకునే ముందు దానిని క్రిమిసంహారిణి లతో శుభ్రపరచండి. కొత్తగా తెచ్చిన ప్యాకెట్లను సుమారు మూడు రోజులపాటు సురక్షితమైన స్థానం లో పిల్లలకు దూరంగా ఉంచడం ఉత్తమం. (కోవిడ్ -19 గురించి వారికి అవగాహన కల్పించండి)
మీ ఇంట్లో అనారోగ్యం ఉన్నవారు లేదా వృద్ధులు ఉన్నట్లయితే?
మీ కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా అనారోగ్యంతో ఉన్న లేదా 60 ఏళ్లు పైబడిన వారు ఉన్న ,వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బయట నుండి ఏమైనా వస్తువులు వచ్చినప్పుడు ముందుగా వాటిని క్రిమిసంహారిణిలతో శుభ్రపరిచే వరకు వారిని తాకనివ్వకండి.
మీ ఇంట్లో కోవిడ్ -19 రోగి ఉన్నట్లయితే (లేదా మీరే)
కోవిడ్ -19. ఈ విషయంలో మొట్టమొదటిగా మీరు చేయవలసింది స్వీయ నిర్భంధం. కాబట్టి మీరు మీ ఇంటి వారిని గాని, బయట వ్యక్తులను గానీ కలవడం గానీ సంప్రదించడం కానీ చేయకూడదు.
అటువంటి సందర్భం వచ్చినట్లయితే ఎల్లప్పుడూ మాస్కూలు ధరింప వలసిన అవసరం ఉంది .మీకు ఒకవేళ దగ్గు గానీ, జలుబు గాని వచ్చినట్లయితే టిష్యూస్ ను ఉపయోగించి వెంటనే వాటిని సురక్షితమైన ప్రదేశాలలో పడేయండి. అలాగే మీరు దేనినైనా ముట్టుకునే ముందుగానీ,మీ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లే ముందు గాని మీ చేతులను శుభ్రపరుచుకోండి.
మీలో ఆ వైరస్ లేదు అని నిర్ధారించే వరకు ఒంటరిగా భోజనం చేయడం మరియు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం మంచిది.
ఈ సమయంలో మిగిలిన జనాభా కోసం ఇంట్లోనే ఉండండి. సామాజిక దూరాన్ని కొనసాగించండి. మీ చేతులను శుభ్రం చేసుకుంటూ వుండండి. ఇంట్లో ఉండండి. సురక్షితంగా ఉండండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
1. Novel coronavirus infection and pregnancy - Yang - - Ultrasound in Obstetrics & Gynecology | Wiley Online Library
2. How does coronavirus affect kids, babies and pregnancies? - Health | abc.net.au
3. Coronavirus infection and pregnancy | RCOG UK
4. The protective effects of breastfeeding on chronic non-communicable diseases in adulthood: A review of evidence | NCBI US
5. An Analysis of 38 Pregnant Women with COVID-19, Their Newborn Infants, and Maternal-Fetal Transmission of SARS-CoV-2: Maternal C | Archives of Pathology
6. Pregnancy & Breastfeeding | CDC
7. Novel Coronavirus 2019 (COVID-19) | ACOG
