తోబుట్టువుల తగాదాలు... తల్లితండ్రులకు చిట్కాలు

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Aug 20, 2020

మీ పిల్లలు ప్రతిసారి ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం వినడం మరియు చూడటం మీకు నిరాశను మరియు కలతను కలిగిస్తుందా ?
మీరు కొన్ని సార్లు తల్లిదండ్రుల కంటే కూడా రిఫరీలు లాగా భావిస్తారా ?
మీ పిల్లల మధ్య అంతం లేని విభేదాలను నియంత్రించేందుకు మార్గాలను అన్వేషించడంలో నిరంతరం ప్రయత్నించే వారిలో మీరు ఉన్నారా ?
అయితే, తోబుట్టువుల మధ్య శతృత్వం అనివార్యం కాబట్టి ఇందులో మీరు ఒంటరి వారు కాదు. ఈ పోరాటాలు తల్లిదండ్రులుగా మనలను నిరాశకు గురి చేస్తాయి. మరియు రెండవ బిడ్డకు జన్మనివ్వడం అన్నది సరైన నిర్ణయమా అని కూడా ఆలోచింపజేస్తాయి. మరియు తోబుట్టువులు ఎప్పుడైనా కలిసి పోతారా ? ఏది ఏమైనప్పటికీ సహోదరుల మధ్య గొడవలు అన్న దానిని మనం అంగీకరించి తీరాలి. కానీ తల్లిదండ్రులు ఆ గొడవలు తీర్చడానికి అంతకంటే బలమైన స్థితిలో ఉంటారు.
తోబుట్టువుల మధ్య వైరం అంటే ఏమిటి ?
తోబుట్టువుల మధ్య పోటీ అన్నది సహోదరీ సహోదరులు మధ్య ఉండే పోరాటం. ఇది రక్తసంబంధం అయినా లేదా రక్తసంబంధం కాకపోయినా తోబుట్టువుల మధ్య ఒక రకమైన పోటీ తో కూడుకొన్న శత్రుత్వం ఉంటుంది. సాధారణంగా ఇది చిన్నతనంలో మొదలయి పెద్దయ్యే వరకు కార్లు మరియు బొమ్మల నుండి ప్రతి వస్తువు కోసం పోటీ పడుతూనే ఉంటారు. ఇది సాధారణంగా బాల్యమంతా కొనసాగుతూనే ఉంటుంది.
తమ పిల్లలు నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుతూ ఉండడం పట్ల తల్లిదండ్రులు ఎలా భావిస్తారు ?
చాలామంది తల్లిదండ్రులు కోపం నిస్సహాయత, నిరాశ , గందరగోళం , ఉద్రేకం , మితిమీరిన ఆందోళనతో ఎంతో శక్తి లేనట్లుగా అలసిపోయినట్లుగా అయిపోతారు. ప్రతిరోజు ఇంట్లో జరిగే నిరంతర గొడవలు మరియు వారు ఆటపాటలలో వ్యవహరించే విపరీతమైన సందర్భాలు తల్లిదండ్రులను నిస్సహాయమైన భావనకు గురిచేస్తున్నాయి.
తోబుట్టువులు ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడతారు ?
రెండవ బిడ్డ పుట్టక ముందే తోబుట్టువులతో వైరం మొదలవుతుంది. తోబుట్టువులు ఎదుగుతూ ఉన్న సమయంలో వివిధ దశలలో వారి అవసరాలను తీరుస్తూ తల్లిదండ్రులకు వారితో ఉన్న సంబంధం విషయంలో గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. తోబుట్టువులు ఒకరితో ఒకరు గొడవలు పడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇవి కొన్ని కారణాలు...
వారికి సంబంధించిన బొమ్మలు , బట్టలు , ఆట వస్తువులు, పుస్తకాలు మరియు తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ మొదలైనవి..
చిన్న పిల్లవాడి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అని ఊహించుకోవడం.
చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపడం.
చిన్న సహోదరులను శ్రద్ధగా చూసుకోవడం.
మానసిక స్థితి , వ్యక్తిత్వం మరియు స్వభావాలలో తేడా.
అనారోగ్యము మరియు మానసిక సమస్యల కారణంగా ఒక పిల్లవాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నప్పుడు..
తల్లిదండ్రుల నుండి ప్రత్యేక గుర్తింపు పొందడానికి, తామే శక్తివంతులము అని నిరూపించుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడడం ద్వారా తోబుట్టువుల మధ్య పోరాటాలు రావచ్చు.
తోబుట్టువులు ఒకరినొకరు రెచ్చగొట్టు కోవడానికి గల కారణాలు ఏమిటి ?
తోబుట్టువుల మధ్య వచ్చే విభేదాలు కొన్నిసార్లు ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అంటే , ఒకరి వస్తువులను మరొకరు దొంగిలించడం, ఒకరిని ఒకరు నిందించు కోవడం, కొట్టుకోవడం,
వాదించుకోవడం, ఒకరిమీద ఒకరు అబద్ధాలు చెప్పడం, ఒకరికి చెందిన వస్తువులను మరొకరు పాడుచేయడం, ఒకరికి సంబంధించిన ముఖ్యమైన వాటిని మరొకరు దాచడం, ఒకరిమీద ఒకరు సవాలు చేసుకోవడం మరియు ఫిర్యాదులు చేయడం..
తోబుట్టువుల మధ్య వైరం ఎప్పుడూ చెడు గా ఉంటుందా?
నిజానికి తోబుట్టువుల మధ్య వచ్చే గొడవలకు తల్లిదండ్రులు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి.
ఒక వస్తువు కోసం ఇద్దరు పోరాడు కోవడం, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయాలనుకోవడం, బ్రతిమాలు కోవడం మరియు సర్దుకుపోవడం వంటి విషయాల ద్వారా వారికి జీవిత పాఠాలు నేర్చుకునేందుకు సహాయపడతాయి. కాబట్టి తోబుట్టువుల మధ్య తలెత్తే వైరం అన్నది చెడ్డది కాదు. మరియు ఇటువంటి నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. కాలక్రమేణా ఒకరితో ఒకరు అన్ని పంచుకుంటూ వారిలోని బేదాభిప్రాయాలను అంగీకరిస్తారు.
తమ పిల్లలు ఒకరితో ఒకరు గొడవ పడేటప్పుడు చూసి తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం అవసరమా ?
పిల్లలు గొడవ పెట్టుకుంటున్న ప్రతిసారి తల్లిదండ్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు తమంతట తాము తమ సమస్యలను పరిష్కరించుకోకుండా తల్లిదండ్రులు వచ్చి తమకు భరోసా ఇస్తారు అని ఆశిస్తారు. తల్లిదండ్రులు అనుకోకుండా వాటి విషయంలో పక్షపాతంగా కూడా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో వారిలో మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది. వారు శారీరకంగా ఒకరితో ఒకరు దెబ్బలాడుకునేటప్పుడు మాత్రమే తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం మంచిది. వారి కోపం తగ్గే వరకు ఇద్దరినీ దూరంగా ఉంచడం మంచిది. వారు ఒకరినొకరు దర్శించుకోవడానికి పాల్పడితే తగిన మాటలతో వారికి శిక్షణ ఇవ్వండి.
తోబుట్టువుల మధ్య శత్రుత్వాన్ని తగ్గించడానికి మార్గాలు ఏమిటి ?
తోబుట్టువుల మధ్య పోటీతత్వాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి...
వయస్సు, జనన క్రమం, లింగ భేదం మరియు బలహీనతల కారణంగా ఎటువంటి అభిప్రాయ భేదాలను పిల్లల మధ్య చూపించకండి.
ఏ ఒక్కరి మీద ప్రత్యేకమైన శ్రద్ధను కనపరచకండి.
పోటీ తత్వం మరింత పెరిగే విధంగా ఒకరితో ఒకరిని ఎప్పుడు పోల్చకండి. ప్రతి పిల్లలలోని బలాలను మరియు ప్రత్యేకతలను గుర్తించండి.
ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఉంచడం ద్వారా సహకారం మరియు రాజీపడే లాంటి వాతావరణాన్ని కల్పించండి. అలా చేసినట్లయితే కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు పోటీ పడకుండా ఒకరినొకరు ఆదరించు కుంటారు.
ఇతర పిల్లలు చెప్పే విషయాన్ని వారి కోణంలో శ్రద్ధగా వినే అలవాటును పిల్లలకు నేర్పించండి.
పిల్లల మధ్య తలెత్తే గొడవలు హానికరంగా మరియు గాయపడే అవకాశాలు లేనంత వరకు మీరు ప్రశాంతంగా వారికి దూరంగా ఉండండి.
వారి మధ్యలో గొడవలు తలెత్తినప్పుడు వాటిని సరిచేసే విధానంలో మీరు వారికి ఒక మాదిరిగా ఉండండి.
మీ కుటుంబ విలువల జాబితాలో కొట్టుకోవడం మరియు పేరు పెట్టి పిలుచుకోవడం ఉండకూడదు అనే విషయాలను ప్రాథమికంగా చేర్చండి.
గొడవకు కారణం ఏమిటి అంటూ చర్చను పొడిగించడం ద్వారా కాకుండా వాదనను ముగించడం పై మీ దృష్టిని కేంద్రీకరించండి.
ఒకరిని ప్రశంసించడం మరియు మరొకరిని దండించడం ద్వారా కాకుండా పరిస్థితులను సానుకూల పరచడానికి మరియు పరిష్కారానికి సహాయపడే విధంగా ప్రవర్తించండి.
సహోదరులు ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పోగొట్టి ఒకరితో ఒకరు మర్యాదపూర్వకంగా ఉండేవిధంగా ప్రోత్సహించండి.
పిల్లలు ఒకరితో ఒకరు మంచిగా ఉన్నట్లయితే ఆ సమయంలో వారి ప్రవర్తనను ప్రశంసించండి.
కలిసికట్టుగా దయ , సానుకూల దృక్పథం, పట్టుదల వంటి విషయాలను ప్రోత్సహించండి.
తోబుట్టువుల మధ్య శత్రుత్వం కుటుంబం యొక్క ఒత్తిడికి కారణం అవుతున్నప్పుడు, అవి తల్లిదండ్రుల చేతిలో లేనప్పుడు బయటి వారి సహాయాన్ని ఆశించండి. ఆ సందర్భంలో కుటుంబ చికిత్స అవసరం ఉంటుంది..
తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన మార్గాలు ఏమిటి ?
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు :
మీకు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు తోబుట్టువుల మధ్య శత్రుత్వం అనివార్యమని మేము చెప్పజాలము మరియు తోబుట్టువుల మధ్య ఎప్పుడు సామరస్యమైన సంబంధాన్ని సృష్టించగలము అనే ఆలోచనను మనం విడిచిపెట్టాలి. కానీ వాటికి కారణాలను తెలుసుకుని సామరస్యానికి ప్రయత్నించడం ద్వారా వీటిని తగ్గించవచ్చు. అలాగే తోబుట్టువుల మధ్య వాదనలు ఎప్పుడూ చెడ్డది కాదు అని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరియు అవి మన పిల్లలు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. మీ విషయంలో మీ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించే వారు గుర్తు చేసుకొని వాటిని మీ పిల్లల విషయంలో ప్రయోగించండి.
సరైన పద్ధతులు మరియు విధానాల ద్వారా దీనికి మనము ముగింపు పలకవచ్చు.
దయచేసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మరియు మీరు తోబుట్టువుల మధ్య శత్రుత్వాన్ని పోగొట్టి మరియు ఆరోగ్యకరమైన సంబంధాలను ఎలా ప్రోత్సహిస్తున్నారు అనే అంశముపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}