• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ శిశువులలో ఎసిడిటీని ఎలా ఎదుర్కోవాలి ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 26, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కొత్తగా తల్లిదండ్రులైన వారు తమ పిల్లల విషయంలో ఆందోళన చెందే విషయాలలో ఎసిడిటీ ఒకటి. పసిపిల్లల్లో జీర్ణ వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందదు. కాబట్టి ఎసిడిటీ మరియు గ్యాస్ అనేవి సాధారణమైన సమస్యలు. సాధారణంగా పిల్లలు పాలు తాగే సమయంలో ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇది పిల్లలలో అనారోగ్యం రావడానికి కారణం అవుతుంది. ఈ ప్రక్రియలో శిశువుల కడుపులో బ్యాక్టీరియా చేరి గ్యాస్ ఏర్పడుతుంది. లేదా మీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా పాలు తాగుతున్న అప్పుడు ఎక్కువశాతం గాలిని మింగుతారు. లేదా పాలిచ్చే తల్లులు క్యాబేజీ, బీన్స్ లేదా మొలకలు వంటి ఆహారం తీసుకోవడం వల్ల వారి పాలు త్రాగే పిల్లలకు గ్యాస్ ఏర్పడడానికి  కారణం అవుతుంది. మీ పిల్లలకు మీరు ఎక్కువగా పండ్ల రసాన్ని ఇస్తున్నట్లు అయితే అది కూడా గ్యాస్ , ఎసిడిటీ , కడుపు నొప్పి మరియు విరోచనాలకు దారి తీస్తుంది.

 

మీ శిశువులో ఎసిడిటి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి ?

గ్యాస్ మీ బిడ్డను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ కారణంగా మీ పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. మీ శిశువు యొక్క ఎసిడిటి సమస్యను తగ్గించడానికి మీరు ప్రయత్నించే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

 

1.మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం :

మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ఇది హైపో అలర్జనిక్. ఇవి ఫార్ములా పాలకంటే త్వరగా జీర్ణమవుతాయి. మీ విషయంలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాకపోతే మీ చిన్నారికి ఏ ఫార్ములా పాలు అనుకూలంగా ఉంటాయో మీ వైద్యుని సంప్రదించండి.

 

2.పాలను చిక్కగా చేయడం :

కొంతమంది శిశువైద్యుడు శిశువు యొక్క ఫార్ములా పాలను కొంచెం చిక్కగా ఉండడానికి తృణధాన్యాలను జోడించమని సలహా ఇస్తారు. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి మరియు పాలు తాగడాన్ని తగ్గిస్తారు. కానీ మీరు వైద్యుడిని సంప్రదించకుండా మరియు అందులోని బాగోగులను తెలుసుకోకుండా వీటిని చేయకండి.

 

3.మీ బిడ్డను నిటారుగా ఉంచండి :

మీ బిడ్డ ఆహారం తీసుకునే సమయంలో కొన్ని నిమిషాల పాటు అయినా నిటారుగా ఉంచండి. ఇది ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన కొన్ని అసౌకర్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది

 

4.కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఆహారాన్ని ఇవ్వండి :

మీరు మీ బిడ్డకు ఆహారాన్ని తరచుగా ఇవ్వాలి . కానీ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఇవ్వాలి.

 

5.తరచుగా త్రేనిపించడం :

ఆహారం తీసుకుంటున్న సమయంలో గ్యాస్ బయటకు వెళ్లడానికి పిల్లలను తరచుగా  త్రేనిపించడం చేసినట్లయితే కొంత ఉపశమనం లభిస్తుంది.

 

6.ఆహారం ఇచ్చిన వెంటనే ఆడుకునేందుకు అనుమతి ఇవ్వకూడదు :

ఆహారం ఇచ్చిన వెంటనే మీ బిడ్డ ఆడుకోవడానికి బోర్ల పడినప్పుడు ఉమ్మివేయడం లేదా వాంతులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారం ఇచ్చిన వెంటనే ఆడుకునేందుకు అనుమతించకండి.

 

7.ఒక పక్కకు తిరిగి నిద్రపోవడం :

శిశువు నిద్రిస్తున్న సమయంలో కొన్ని తలగడలను ఉపయోగించి తనకు ఆసరాగా ఉంచి పడుకునే విధంగా చేయండి. ఇది కొన్ని అసౌకర్యాలను తొలగించడానికి సహాయపడుతుంది. పాలు తాగిన వెంటనే బిడ్డ నిద్రపోతున్నట్లు అయితే ఇది సహాయకరంగా ఉంటుంది.

 

8.బిగుతుగా ఉండే దుస్తులు వేయకండి :

మీరు మీ బిడ్డకు బిగుతుగా ఉండే దుస్తులను మరియు బిగుతుగా ఉన్న డైపర్లను దరింపచేయటం వలన  వారి పొట్ట చుట్టూ వత్తిడిని తెస్తుంది. దీనివలన మీ బిడ్డ మరింత అసౌకర్యానికి గురవుతారు.

 

9. డాక్టర్ ను సంప్రదించండి :

మీరు అందుబాటులో ఉన్న అన్ని నివారణలను ప్రయత్నించినప్పటికీ మీ పిల్లవాడు ఇంకా ఎసిడిటీతో బాధపడుతున్నట్లయితే మీరు వెంటనే శిశు వైద్యుని సంప్రదించాలి.

 

మీ బిడ్డను ఎసిడిటిని నుండి  నివారించగల ఉత్తమ మార్గాలు ఇవి. ఏదిఏమైనప్పటికీ స్పీడ్ డైల్ లిస్టులో మీ డాక్టర్ నెంబర్ ఉంచుకోవడం మంచిది.


ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? మీ శిశువు యొక్క ఎసిడిటీ సమస్యలను మీరు ఎలా ఎదుర్కొన్నారు ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ చిట్కాలను మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}