• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

శిశువులకు వెండి సామగ్రిని ఉపయోగించడం వలన కలిగే 5 వైద్య ప్రయోజనాలు

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 19, 2020

 5
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఒక తల్లిగా మీరు, వెండి సామాగ్రి గురించి ఆలోచిస్తున్నారా, మన పెద్దలు చెప్పిన విధంగా వెండి పాత్రలలో పిల్లలకు ఆహారాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? శిశువులకు సంబంధించిన లేదా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అన్ని వేడుకలలో కూడా వెండిని బహుమతిగా ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడతారు? వెండి స్పూన్లు, వెండి కప్పులు, వెండి గ్లాసులు మరియు వెండి గిన్నెలు - చాలా మంది పిల్లలు ఘనపదార్థాలను ప్రారంభించబోతున్న సమయంలో వీటిని బహుమతిగా పొందుతారు. బహు ముఖ్యంగా వారి అన్నప్రాసన వేడుకలో. ఇది పాత కాలపు ఆచారమా లేదా దీనికి సైన్స్ మద్దతు కూడా ఉందా? పిల్లలు ఘన పదార్థాలను తీసుకోవడం ప్రారంభించినప్పుడు వారికి ఆహారాన్ని ఇవ్వడానికి వెండి పాత్రలనే ఎందుకు ఉపయోగిస్తారో అర్థం తెలుసుకుందాం?

 

శిశువులకు ఆహారం ఇవ్వడానికి వెండి పాత్రలను ఎందుకు ఉపయోగిస్తాము ?

 

ఏ తల్లి అయినా తన బిడ్డకు ఘన పదార్థాలను ప్రారంభించే సమయం వచ్చినప్పుడు బిడ్డకు తినిపించేందుకు కప్పులు, గ్లాసులు మరియు చెంచాల కోసం షాపింగ్ చేస్తారు. అవన్నీ కూడా బి పి ఎ ఫ్రీ మరియు బ్రాండ్ల టాగ్లను కలిగి ఉండే వాటిని తీసుకోవాలని నా సలహా. అవి రంగు రంగులు గా ఆకర్షణీయంగా ఉంటాయి. మా అమ్మ మరియు మా అత్తగారు కూడా నేను శిశువుకి వెండి స్పూన్తోనే తినిపించాలని పట్టుబట్టారు. మన ప్రాచీన భారతీయుల యొక్క ఆచారాలు ఎంతో జ్ఞానంతో నిండి ఉన్నాయని మరియు మంచి ఆరోగ్య రహస్యాలు కలిగి ఉన్నాయి అని నేను భావిస్తున్నప్పటికీ, వెండి సామాగ్రి గురించి ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించమనీ నాకు సలహా ఇస్తున్నారు. ఇది కేవలం సాంప్రదాయమా? అవును, నేను తెలుసుకున్న దానిని కింద మీతో పంచుకుంటున్నాను -

 

శిశువులకు వెండి వస్తువులను ఉపయోగించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు :

సాంప్రదాయం మరియు సంపద యొక్క సంకేతం కంటే కూడా శిశువులకు ఆహారం ఇవ్వడానికి వెండి పాత్రలను ఉపయోగించడం కొన్ని ఔషధ మరియు ఆరోగ్య కారణాలను కూడా కలిగి ఉంటుంది.

 

1. వెండి సామాగ్రిపై బ్యాక్టీరియా ఉండదు :

వెండి పాత్రలపై నూరుశాతం బ్యాక్టీరియా లేదని నమ్ముతారు. ఆ కారణంతో వెండి పాత్రలలో పిల్లలకు ఆహారం మరియు పానీయం ఇవ్వాలని మన పెద్దలు సలహా ఇస్తారు. దానితో పాటుగా ఇది బ్యాక్టీరియా లేనిది కనుక స్టెబిలైజేషన్లతో పాత్రలను క్రిమి రహితం చేయవలసిన అవసరం లేదు. మరియు వెచ్చని నీటితో సాధారణంగా శుభ్రపరిస్తే సరిపోతుంది. వీటిని తిరిగి ఉపయోగించినప్పటికీ ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

2. వెండి శిశువులను రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :

వెండి దానిలోని బ్యాక్టీరియా పోరాట లక్షణాలతో శిశువులలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అని నమ్ముతారు. అందువలన కొత్తగా తల్లి అయిన వారికి వెండి చెంచాతో వారి శిశువులకు ఆహారం ఇవ్వమని సలహా ఇస్తారు. వెండి యొక్క మరొక ఉపయోగం ఏమిటంటే, మనం వెచ్చని ఆహారాన్ని వడ్డించేటప్పుడు లోహం ఆహారంతో కలిసిపోతుంది మరియు దానిలోని కొన్ని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను ఆహారం లోకి విడుదల చేస్తుంది. అందువలన శిశువులు మరియు చిన్న పిల్లలకు వెండి పాత్రలలో ఆహారాన్ని తినిపించడానికి ఇష్టపడతారు.

 

3. వెండి పాత్రలు విషపూరితమైనవి కావు:

స్వచ్ఛమైన వెండి విషపూరితంగా పరిగణించబడుతుంది. వెండిలోని ఈ విషయం చర్చనీయాంశం అయినప్పటికీ, అదే సమయంలో లోహాన్ని పాత్రలగా మార్చే ప్రక్రియ కారణంగా అది విష రహితం అని నమ్ముతారు. అందువల్లనే వెండి పాత్రలలో తినడం ఎంతమాత్రం విషపూరితం కాదని దానికి బదులుగా రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు.

 

4. వెండి పాత్రల్లో ఆహారం ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది :

వెండి పాత్రల్లో నిల్వ ఉన్న ఆహారము మరియు ధ్రవాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి అని నమ్ముతారు. పురాతన కాలంలో రాజులు మరియు గొప్ప వ్యక్తులు తమ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి నీళ్ళు మరియు వైన్లను వెండి ప్లాస్క్లలో భద్రపరచుకునే వారు. వారు తినే ఆహారాన్ని కూడా వెండి పాత్రలలోనే వడ్డించేవారు.

 

5. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది :

వెండి యొక్క ముఖ్యమైన లక్షణాలలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం అతి ముఖ్యమైనది. దీని కారణంగా నవజాత శిశువు యొక్క వస్తువులు వెండితో తయారు చేయబడతాయి. శిశువులకు వెండి చీలమండలు మరియు ఇతర ఆభరణాలను ధరింప చేయడానికి కారణం ఇదే.

 

శిశువులకు వెండి పాత్రలలో సిట్రిక్ ఆహారాలు ఇవ్వవచ్చా ?

టమాటాలు మరియు సిట్రిక్ పండ్లను వెండి పాత్రలలో వడ్డించడం సురక్షితమేనా అని చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. వెండి పుల్లని ఆహారాలకు ప్రతి స్పందించదు కనుక ఇది సురక్షితం. కానీ ఆహారాల్లో సల్ఫర్ ఉన్నట్లయితే అటువంటి ఆహారాలకు వెండి ప్రతిస్పందిస్తుంది. ఈ కారణంగా వెండి పాత్రలలో తినిపించేటప్పుడు గుడ్డు రుచిని కోల్పోవడాన్ని మీరు గమనించవచ్చు. ఇది మీ బిడ్డకు హానికరం కానప్పటికీ, వెండి పాత్రలలో మీ బిడ్డకు గుడ్లు ఇవ్వడం నివారించడం ఉత్తమం. మీ శిశువు ఆహారంలో గుడ్లను ఎలా చేర్చాలో తెలుసుకోండి.

 

మా బిడ్డ కోసం వెండిని ఎలా ఉపయోగించాలి ?

శిశువు కోసం వెండి పాత్రలను ఉపయోగించడం వలన కలిగే అనేక ప్రయోజనాలు ఇప్పుడు మనకి తెలుసు. మనం ఆ వెండి బహుమతులను మంచిగా ఉపయోగించుకోవచ్చు. మీరు శిశువుకు ఆహారాన్ని సిద్ధం చేసిన తరువాత వెండి గిన్నె, వెండి చెంచాతో తినిపించడం శిశువుకి ఎంతో ఆరోగ్యం. ఇతర ద్రవ పదార్థాలను మరియు జ్యూసులను వాడేటప్పుడు సరైన గ్లాసులను ఎంచుకోండి. శిశువుకు మందులు వెండి ఉగ్గు గిన్నె లేదా పలాడై లో ఇవ్వండి.

 

శిశువులకు ఉపయోగించే వెండి పాత్రలు ఎలా శుభ్రం చేయాలి ?

ప్లాస్టిక్ గిన్నెలవలె వెండి పాత్రలను మరియు స్పూన్లను  స్టెరిలైజ్ చేయవలసిన అవసరం లేదు. శిశువుల వస్తువులను శుభ్రపరిచే తేలికపాటి సబ్బుతో లేదా నీటితో శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రమైన వస్త్రంతో పాత్రలను పొడిగా తుడవండి. మరియు అవసరం అయినప్పుడు వాటిని వాడండి.

 

శిశువు కోసం వెండి పాత్రలను ఎలా ఖరీదు చేయాలి ?

ఎందుకంటే వెండి ఖరీదైనది మరియు చాలా కష్టతరమైనది. మీ బిడ్డ కోసం వెండి వస్తువులను కొనడానికి బయటకు వెళ్లేటప్పుడు కొంత ఆలోచించడం అవసరం.

 

వెండి వస్తువులను ప్రఖ్యాత షోరూమ్ల నుండి కొనుగోలు చేయండి. అలా చేసినట్లయితే మోసగించబడే అవకాశం ఉండదు.

 

స్పూన్న్లను ఎంచుకునేటప్పుడు గుండ్రని అంచులను కలిగి ఉన్న వాటిని ఎంచుకోండి. మరియు అవి శిశువుకు గుచ్చుకోకుండా ఉంటాయి.

 

ప్లేట్లు మరియు గిన్నెలను ఖరీదు చేసే టప్పుడు డిజైన్లు తక్కువగా ఉండే వాటినే కొనండి. ఎందుకంటే అది శుభ్రం చేయడం సులభమవుతుంది. ఆహార కారణాలు వాటి మెలికలలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

 

మన పెద్దల అనుభవాన్ని విశ్వసించడం మరియు సాంప్రదాయాన్ని అనుసరించడం అంత సులభం కాదని నాకు తెలుసు. మనం పిల్లల కోసం వెండి సామాగ్రిని ఉపయోగించడం ఖచ్చితంగా కొంత ఉపయోగకరం అని మనలో చాలామంది అంగీకరిస్తారు అని నాకు తెలుసు. పెద్దలు మన పిల్లలకు వెండి పాత్రలో ఆహారం ఇవ్వమని పట్టడానికి ఈ కారణాలు ఉన్నాయని మా అమ్మమ్మ కూడా నాకు చెప్పింది.


ఒకవేళ  వెండి సామాగ్రి యొక్క ఇతర ప్రయోజనాలు మీకు తెలిసినట్లయితే దయచేసి వాటిని ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}