చనుమొనలపై గాయాలా ? కొత్తగా తల్లి అయిన వారికి 5 ఖచ్చితమైన గృహ వైద్యాలు

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jun 29, 2020

తల్లి పాలు ఇవ్వడం -- ఇది ఒక అద్భుతమైన, ప్రయోజనకరమైన అనుభవం .మరియు బిడ్డతో బంధం బలపడడానికి ఒక మనోహరమైన మార్గం . కానీ , అదే సమయంలో ,అది అంత సౌకర్యవంతమైన పని మాత్రం కాదు . ముఖ్యంగా మొదటిసారిగా తల్లి అయిన వారికి గాయమైన చనుమొనలు నిజంగా చాలా నొప్పిగా ఉంటాయి .అతి సున్నితమైన భాగంలో విపరీతమైన నొప్పి , దురద మరియు వాపు కలిగి ఉంటాయి. కొన్ని సార్లు తెల్లని చీము లేదా ఒక రకమైన నీటి లాంటి ద్రవాన్ని కూడా మీరు గమనించవచ్చు .ఆ సమయంలో మీరు కోరుకునేది తక్షణ ఉపశమనం మాత్రమే ! ఇక్కడ కొన్ని సులభంగా చేసుకోగల నివారణలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వీటిని ప్రయత్నించండి .నేను ప్రయత్నించాను. మా స్నేహితులు కూడా ప్రయత్నించారు. మరియు మేమందరం ఉపశమనం పొందాము . ఇప్పుడు ఇక మీ వంతు !
1.తల్లిపాలు :
మీ సొంత పాలు దానికి ఉత్తమమైన వైద్యం అని మీకు తెలుసా ? ఆశ్చర్యపడుతున్నారా ! అవును, అది నిజం. ప్రకృతి ప్రతి దానికి ఒక నివారణను అందిస్తుంది . కాబట్టి ,మీ పాలు పిండి ఆ పాలతో మీ చనుమొనలపై రుద్దండి .పాలు ఇచ్చే ముందు మరియు పాలు ఇచ్చిన తర్వాత కూడా క్రమం తప్పకుండా పుండ్లు తగ్గేవరకు అలాగే చేయండి.
2. ఆపిల్ పేస్ట్ :
పగిలి ,నొప్పి గా ఉన్న చనుమొనలకు ప్రతి రోజు ఆపిల్ పేస్ట్ రాసినట్లయితే , అది ఆ నొప్పిని దూరం చేస్తుంది.ఒక ఆపిల్ ముక్కను తీసుకుని మెత్తగా గుజ్జులాగా చేసి గాయమైనా చనుమొనలపై రాయండి . బాగా ఎండిన తరువాత మామూలు నీటితో శుభ్రపరచండి .మీకు ఉపశమనం కలిగే వరకు దీనిని రాస్తూ ఉండండి.
3. తులసి ఆకుల పేస్ట్ :
కొన్ని తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ లాగా చేయండి .ఆ పేస్ట్ ను మీ చనుమొనలపై రాయండి .అది ఎండిన తర్వాత మామూలు నీటితో శుభ్రంగా కడిగి వేయండి . దీనిని తగ్గేవరకు రోజుకి మూడు, నాలుగు సార్లు రాసినట్లైతే నొప్పి మాయమవుతుంది.
4. ఆయిల్ మసాజ్ :
నొప్పులకు ప్రధానకారణం చర్మం పొడిగా ఉండడం .అందుకే కొబ్బరి నూనె లేదా ఆవనూనె తో మసాజ్ చేయడం దీనికి మంచి పరిష్కారం .నూనెను కొంచెం వేడి చేసి గాయం పై బాగా మర్దన చేయండి. బిడ్డకు పాలు పట్టే ముందు దీనిని శుభ్రపరచాలి అని గుర్తుంచుకోండి.
5. దేశి నెయ్యి :
దేశి నెయ్యి (ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది )మరొక మంచి పరిష్కారము. దేశి నెయ్యి వాడటం వలన మరొక మంచి విషయం ఏమిటంటే , శిశువుకు మీరు పాలు పట్టే సమయంలో కూడా దీనిని శుభ్రపరచ వలసిన అవసరం లేదు .ఎందుకంటే దేశీ నెయ్యి ప్రమాదకరం కాదు.
కాబట్టి , వీటిని ప్రయత్నించండి .వీటిలో మీకు ఏదైనా సహాయ పడిందా ? మీ అభిప్రాయాన్ని మాకు తెలియపరచండి .దయచేసి మీకు బాగా పనిచేసిన నివారణలు ఏమైనా ఉంటే ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో ఇతర తల్లులతో పంచుకోండి. వారిని కూడా అవసరమైన ఉపశమనాన్ని పొందనివ్వండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు