మీ శిశువు మాట్లాడే సమయంలో ప్రారంభ సంకేతాలను గుర్తించండి...

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Sep 07, 2020

పిల్లలు మాటల శబ్దాలను సరిగ్గా గుర్తించ లేకపోయినప్పుడు, మరియు సాధారణ మాటలను పలకలేక పోయినప్పుడు అటువంటి సందర్భాలను మాటల రుగ్మతగా గుర్తిస్తారు. మాట్లాడటంలో లోపాలు, అంతరాయం మరియు నత్తిగా మాట్లాడడం మాటల రుగ్మతలకు ఉదాహరణలు.
మాట్లాడటంలో ఇబ్బందులు అంటే ఎస్ లేదా ఆర్ వంటి కొన్ని శబ్దాలను సరిగ్గా పలకలేక పోవడం. ఇతర పిల్లలు రక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలో, మీ పిల్లల మాటల విషయంలో నిరంతరం పెరుగుదల మరియు పురోగతిని చూపిస్తున్నాడని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
ఎలా గమనించాలి?
సామాజికంగా కలవడం అనేది భాషకు పునాది వంటిది. మీ బిడ్డ ఇతరుల మాటల పట్ల శ్రద్ధ వహించాలి. శబ్దాలు , సంగీతం, ఆటలు మరియు కదిలేబొమ్మలకు ప్రతిస్పందించాలి.
4 మరియు 6 నెలల వయసులో మీ పిల్లలు కొన్ని అచ్చు శబ్దాలను (ఏ, ఓ, యు) అస్పష్టంగా పలకడం మొదలుపెడతారు.
సుమారు ఆరు నెలల వయసులో అచ్చులు హల్లులు కలిసి పలకడం మొదలుపెడతారు (ప , బ, ఏ)
6 నుండి 9 నెలల మధ్య మీ బిడ్డ తన సొంత పేరును గుర్తించడం ప్రారంభించాలి.
మీ బిడ్డ మీరు చేసే వివిధ రకాల శబ్దాలకు కూడా ప్రతిస్పందించాలి మరియు బిడ్డ వాటిని అనుకరించడానికి కూడా ప్రయత్నించవచ్చు. తల్లిదండ్రులు బాగా మాట్లాడుతున్నట్లు అయితే పిల్లలలో భాషా నైపుణ్యం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
12 నెలల వయస్సు వచ్చేసరికి బిడ్డ తన మొదటి మాటలైన " మామ" " దాదా " "బాబా" అని చెప్పాలి. పుస్తకాలను చదవడం ద్వారా మరియు మీరు చేస్తున్న పనులను గురించి బిడ్డతో మాట్లాడటం ద్వారా అతని పదజాలాన్ని పెంచడానికి మీరు సహాయపడవచ్చు.
అదేవిధంగా 12 నెలల వయసు వచ్చే సరికి మీ చిన్నారి హాయ్ మరియు బాయ్ చెప్పడం మొదలుపెడతాడు. వద్దు అన్నట్లుగా తలను తిప్పడం కూడా ప్రారంభిస్తారు.
ఏమి చేయాలి ?
మీ చిన్నారి పై వాటిలో ఏ ఒక్కటీ చేయలేకపోతున్నా నట్లయితే అది మాట్లాడే విషయంలో రుగ్మత యొక్క హెచ్చరికలను సూచిస్తుంది. శిశు వైద్యుని లేదా ప్రసంగ భాషా వైద్యుని సలహా తీసుకోవడం చాలా అవసరం.
మన పిల్లలు ఎదిగే ప్రక్రియలోప్రతి ఒక్కటి సక్రమమైన సమయంలో జరుగుతుంది అన్న విషయాన్ని కొన్ని సమయాలలో నిర్ధారించడం చాలా కష్టం. అటువంటి సమయంలో, మీ పిల్లలకు సహాయపడడానికి మీరు ఇలా చేయవచ్చు.
1. మీరు పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. పిల్లలకు అనుకరించడానికి సులభంగా ఉండే పదజాలాన్ని ఉపయోగించండి.
2. పదాలను విస్తరించి మాట్లాడండి. ఉదాహరణకు మీ బిడ్డ మామిడి అని చెప్పినప్పుడు మీరు "అవును నిజమే! అది పసుపు మామిడి అని చెప్పండి".
3. ప్రతి రోజు మీ పిల్లలకి చదివి వినిపించడానికి కొంత సమయాన్ని పెట్టండి. ప్రతి పేజీలోనూ పెద్ద బొమ్మలు మరియు 1, 2 సులభమైన పదాలు ఉండే లాంటి పుస్తకాలను కొనడానికి ప్రయత్నించండి. ప్రతి పేజీలోని బొమ్మలకు పేరు పెట్టండి మరియు దాని గురించి వివరించండి.
4. పాటలు పాడుతూ ఉండండి, ఫింగర్ గేమ్స్‌ను ఆడండి మరియు రైమ్స్ ను పాడండి. ఈ పాటలు మరియు ఆటలు మీ చిన్నారికి భాష యొక్క లయ మరి శబ్దాలను అలవాటు చేస్తాయి.
5. బొమ్మలను మరియు వస్తువులను వేరు వేరుగా ఉంచండి . మరియు మీ చిన్నారిని వాటిని ఎత్తి చూపమని అడగండి.
6. సరళమైన కథాంశం ఉన్న పుస్తకాలను చదవండి. ఆ కథాంశం గురించి వివరిస్తూ మాట్లాడండి.
7. మీ ఫ్యామిలీ ఫోటో ను చూపించండి. దాని గురించి మీ పిల్లలకు వివరించండి.
8. మీ పిల్లల ఆదేశాలను పాటించండి. వారు వారిదైన పద్ధతిలో ఎలా చేయాలో తెలుపుతారు.
9. మీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వారిపై పూర్తిగా శ్రద్ధ వహించండి. వారిని గుర్తించండి, ప్రశంసించండి మరియు ప్రోత్సహించండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
