శిశువు ఆహారంలో మసాలా దినుసులను ఎప్పుడు, ఏమి , ఎలా చేర్చాలి ?

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Jul 15, 2020

మన భారతీయ మార్కెట్ వివిధ మూలికలు, మరియు సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. వాస్తవానికి , పసుపు నుండి దాల్చిన చెక్క వరకు వివిధ మసాలా దినుసులకు భారత దేశం ప్రసిద్ధి చెందినది. భారతీయ వంట గదిలో మరియు ఆహార ఉత్పత్తులలో విస్తృతమైన స్థాయిలో ఇవి ఉపయోగించబడతాయి. అయినప్పటికీ, మీ పిల్లల ఆహారంలో ఈ మసాలా దినుసులు మరియు మూలికలను ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది . కాబట్టి మీ చిన్నారి ఆహారంలో మీరు ఎప్పుడు ఈ మూలికలను మరియు సుగంధ ద్రవ్యాలను చేర్చవచ్చో మీకు తెలియజేయవలసిన సమయం వచ్చింది . కాబట్టి ఇక ప్రారంభిద్దాం..
మనం తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో చేర్చడం అన్నది చాలా సులువు. కానీ, చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవడం అన్నది ఒక ప్రణాళికతో చేయ వలసి ఉంటుంది. అందువల్ల తల్లి బిడ్డ కొత్త ఆహారపు మార్పులకు తగిన సమయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అలాగే మూలికలు మరియు మసాలా దినుసులు మన ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి, అన్ని విధాల వీటి వలన ప్రయోజనం ఉంటుంది.
శిశువులకు ఏ మసాలా దినుసులను ఇవ్వాలి ?
ప్రతి మసాలా దినుసులు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి . మరియు వివిధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. అందువలన మీరు మార్కెట్లో లభించే ప్రతి మసాలా దినుసులను తప్పక పిల్లల ఆహారంలో చేర్చి ఇవ్వాలి. మరియు అది స్వచ్ఛమైన దిగా చూసి ఎంచుకోవాలి. కానీ తక్కువ పరిమాణంలో వీటిని ఉపయోగించాలని మాత్రం గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా ప్రతి మసాలా దినుసులను మీ పిల్లలు రోగనిరోధక శక్తి పెంచే గొప్ప ఔషధ విలువలను కలిగి ఉంటుంది. అలాగే, మీ బిడ్డకు ఏ ఏ నెలలో ఏ ఆహారం ఇవ్వాలో సూచించే పట్టిక ఇక్కడ ఉంది...
1. ఆరు నెలల వరకు ప్రత్యేకంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.
2. 7-9 తల్లి పాలతో పాటుగా మృదువుగా ఉండే ఘన ఆహారాలు మొదలు పెట్టవచ్చు.
3. 10-12 నెలల వయసులో ఘన ఆహారాలు ఇవ్వచ్చు.
మీ చిన్నారికి మసాలాదినుసులు ఎప్పుడు ఇవ్వాలి ?
తమ చిన్న పిల్లలకు మసాలా దినుసులు ఇచ్చేందుకు ఏ సమయం సమయోచితమైనదో తెలియక చాలామంది తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. కొన్ని మసాలా దినుసులు తేలికపాటివి , మరికొన్ని పరిమళభరితమైనవి మరియు కొన్ని వేడిని కలిగించేవి గా ఉంటాయి. మీ పిల్లలు పూర్తిగా పాలు మానేసిన తర్వాత మసాలా దినుసులు ఇవ్వడానికి కొంత సమయం వేచి ఉండండి. మీ బిడ్డకు ఏడు నెలలు నిండిన తర్వాత జాజికాయ, దాల్చిన చెక్క , పసుపు , కుంకుమ , ఏలకులు, పొదీనా , కొత్తిమీర వంటి తేలికపాటి వాటిని మీ శిశువు ఆహారంలో జోడించండి. తగినంత మోతాదులో మాత్రమే వీటిని ఇవ్వండి. మరీ తక్కువగా ఇచ్చినట్లయితే ఏమాత్రం రుచి పెరగదు. మరి ఎక్కువగా ఇచ్చినట్లయితే హానికరం. అందుకే తగిన పరిమాణంలో ఇవ్వండి. స్టార్ , సోంపు , నల్ల మిరియాలు , జీలకర్ర , అల్లం , వెల్లుల్లి , ఆవాలు , మెంతులు వంటి మసాలా దినుసులు తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వారి ఆహారంలో చేర్చాలి.
కొన్ని రకాల మసాలా దినుసులు మరియు అవి ఇవ్వవలసిన సమయ పట్టిక :
జీలకర్ర :
జీలకర్ర విత్తనాలు చాలా చిన్నవి . ఇవి సుగంధ మైనవి . కానీ బలమైన రుచి కలిగి ఉంటాయి . ఈ విత్తనాలు 9 నెలల వయసులో మాత్రమే చేర్చాలి. ఇది ఉదర సంబంధమైన వ్యాధులకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మీ చిన్నారి జీర్ణక్రియను మెరుగు పరచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని పప్పులలోనూను , కూరలలోను కలిపి ఇవ్వవచ్చు.
పసుపు :
పసుపు అనేది పసుపు రంగులో ఉండే మసాలా దినుసు. ఇది చాలా ఆహార పదార్థాలతో కూడా ఉపయోగించబడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది, చర్మ వ్యాధుల నుండి కాపాడడం వంటి ఎన్నో ఉపయోగకరమైన గుణాలను కలిగి ఉంటుంది. మీ బిడ్డకు ఏడు నెలల వయస్సు వచ్చిన తర్వాత దీన్ని వారి ఆహారంలో చేర్చండి.
వెల్లుల్లి :
వెల్లుల్లి అనేది ఒక శక్తివంతమైన మసాలా. ఇది యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తో ఆశీర్వదించ బడుతుంది . విటమిన్ బి6 మరియు విటమిన్ సి లు సమృద్ధిగా ఉండడంతో ఇది మీ చిన్నవారికి ఎంతో మంచిగా సహాయపడుతుంది. ఇది మీ చిన్నారి కి ఏడు నెలల తరువాత వారి ఆహారంలో దీనిని కలిపి ఇవ్వండి . కానుక ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , రోగనిరోధక వ్యవస్థకు బలపరుస్తుంది, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది, మరియు కడుపు నొప్పి నుండి వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది.
ఆవాలు :
ఆవాలు నల్ల రంగులో ఉండే చిన్నచిన్న విత్తనాలు. ఇవి పోపు రూపంలో మన ఆహారం లోకి వెళ్తాయి. అయితే ఇవి మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది అని మీకు తెలుసా ? కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు ? మీ చిన్న పిల్లలకు 8 నెలలు వయస్సు వచ్చిన తర్వాత మీ పిల్లల ఆహారంలో వీటిని చేర్చవచ్చు . వీటిని పప్పు, సాంబార్ మరియు కిచిడిలలో ఉపయోగించవచ్చు . ఇది రుచికరమైనది.
మెంతి గింజలు :
మెంతి గింజలు లేదా మేతీ విత్తనాలను మీ పిల్లలకు 8 నెలల వయస్సు వచ్చిన తర్వాత వారి ఆహారంలో చేర్చవచ్చు . ఇవి జీర్ణక్రియకు తోడ్పడుతుంది, జలుబు మరియు దగ్గులను గుణ పరుస్తాయి. వీటిని కిచిడి మరియు సూపులలో చేర్చి ఇవ్వవచ్చు.
కొత్తిమీర :
కొత్తిమీర ఒక సువాసనతో కూడిన మసాలా. మన వంటగదిలో ఆహారానికి రుచిని తెప్పించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇది పిల్లల అజీర్ణ సమయంలో ఎంతో సహాయపడుతుంది, ఇది మీ బిడ్డ లోని గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది . మరియు యాంటీ మైక్రో బయల్ మరియు క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది . మీ చిన్నారి కి 8 నెలల వయస్సు వచ్చిన తర్వాత దీన్ని వారి ఆహారంలో చేర్చండి.
పసిపిల్లల ఆహారంలో మసాలా దినుసులను ఏ విధంగా చేర్చాలి ?
పప్పు లేదా చికెను ఉడికేటప్పుడు అర అంగుళం అల్లం మరియు వెల్లుల్లి , సగం లవంగాన్ని అందులో కలపండి.
పప్పు, కిచిడి ,సాంబార్ మరియు పప్పు దాన్యాలలో పసుపు ,జీలకర్ర మరియు కొత్తిమీర ను చేర్చి ఇవ్వండి.
పప్పు ,సాంబార్ లేదా కిచిడిలలో పావు స్పూన్ ఆవాలు మరియు జీలకర్ర ను ఉపయోగించవచ్చు.
ఏలకలు , జాజికాయ మరియు దాల్చిన చెక్క పొడిని కీర్, బియ్యం మరియు పండ్ల తో చేసిన హల్వాలలో చిటికెడు చేర్చవచ్చు.
పుదీనా మరియు కొత్తిమీర వంటి దినుసులను పప్పు, కిచడి, మరియు మెత్తగా ఉడికించిన కూరగాయల లో చేర్చి ఇవ్వవచ్చు.
మీ పిల్లలకు 10 నెలల వయస్సు వచ్చిన తర్వాత చిటికెడు నల్ల మిరియాలు మరియు ఎరుపు మిరకాయల పొడిని చేర్చి ఇవ్వవచ్చు.
ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? ఈ దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మేము మీ నుండి వినడానికి ఎంతో ఇష్టపడతాము.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు