• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

వేసవిలో వాడవలసిన దుస్తులు : మీ పిల్లలను దద్దుర్లు లేకుండా చల్లగా ఎలా ఉంచుకోవాలి

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 14, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

దురదృష్టవశాత్తు ఈ వేసవిలో మా పిల్లలకు దద్దుర్లు రాకుండా ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు నేను ఎంతో కష్టపడాల్సి వస్తుంది . వేసవి కోసం పిల్లలకు సరైన దుస్తులు ఎంపిక చేసుకోవడం నాకు చాలా కష్టతరమైన పని . మా పిల్లలకు దద్దుర్లు రాకుండా చల్లగా ఉండేందుకు నేను ఏమి చేయాలి ?

 

బయటకు వెళ్లేందుకు అనుకూల సమయాలు :

 

బయటకు వెళ్లేందుకు ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం బాగా చల్లబడ్డాక  గానీ వెళ్లడం ఉత్తమమైన సమయం. నేను ఎల్లప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తాను. పెద్ద టోపీలను వాళ్లకి దరిస్తాను . మరియు నాతో ఎల్లప్పుడూ ఒక గొడుగును తీసుకు వెళ్తాను. మా పిల్లల బ్రౌన్ రంగు శరీర ఛాయ అంటే నకు ఎంతో ఇష్టం. న పిల్లలుకు వడదెబ్బ లేదా దద్దుర్లు బారిన పడాలని నేను ఎప్పుడూ కోరుకోను.

 

మీరు ధరించే వస్త్రాలు మీకు ఎలా అనిపిస్తాయి :

 

ఈ వేసవిలో నేను మా పిల్లలకు కాటన్ వస్త్రాలను ఎంచుకుంటాను .లేత రంగులు మరియు ఆహ్లాదకరమైన పూల ప్రింట్లను ఇష్టపడతాను . (ప్రింట్ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఎంపిక చేసుకోవచ్చు) బాగా గాలి తగిలే లాంటి బట్టలు అయితే దద్దుర్లు లేకుండా మరియు చమటను కూడా త్వరగా రాకుండా ఉంటుంది.

 

 కొంచెం వదులుగా ఉంటే పైజమాలలాంటివి మరియు పొట్టి నిక్కర్లు, చల్లగా ఉండే టీ షర్ట్ లాంటి వాటిని మారుస్తూ ఉంటాను . బట్టలు కొనేటప్పుడు ఎలాస్టిక్ విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకుంటాము . నేను ఎప్పుడైనా పైజామాలు , డ్రాయర్లు , ప్యాంట్లు , నిక్కర్లు కొనేటప్పుడు ఎలాస్టిక్ స్మూత్ గా మరియు టైట్ గా లేకుండా ఉండేలాగా చూసుకుంటాను.

 

డైపర్స్ విషయంలో ఎంపికలు :

 

ఏ డైపర్స్  ఉపయోగించాలో నిర్ణయించుకునే ముందు నేను కొన్ని బ్రాండ్లను ప్రయత్నించాను. పిల్లలు మోషన్ కు వెళ్లరు అని నేను అనుకునే సమయంలో అయితే ,వారి సౌకర్యం కోసం కొంచెం వదులుగా ఉండే డైపర్లను  వేసేందుకు కూడా ఏమి వెనుకాడను .మనం ప్యాడ్స్ ని ఎలా మార్చుకుంటామో అలాగే డైపర్ లను కూడా నేను  తరచుగా మారుస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల పిల్లల శరీరం ఎప్పుడూ పొడిగా ఉంటుంది.

 

నేను కొబ్బరి నూనెను వాడటానికి బాగా ఇష్టపడతాను.  పొట్ట భాగానికి ఎప్పుడు ఎక్కువగా కొబ్బరినూనెను రాస్తూ ఉంటాను. అధికంగా ఉండే కొబ్బరి నూనెను తుడిచేసి  డైపర్ వేసే ముందు కొంత సమయం డైపర్ లేకుండా ఉంచి ఆ తర్వాత మళ్ళీ డైపర్ వేస్తాను.

 

ఒకసారి మోషన్ కి వెళ్లే విషయం చెప్పడం నేర్చుకున్న తర్వాత పిల్లలకు లోదుస్తులు , డ్రాయర్లు తరచుగా మారుస్తాను . వాళ్ళుఅంతగ వాళ్ళు పోటీ  కి వెళ్ళాలి అని చెప్పడం మొదలు పెడతారో  ,అప్పటినుండి రాత్రిపూట ఎటువంటి లోదుస్తులు వేయకుండా పైజమా లోనే పడుకోబెట్టడం  మొదలుపెడతాను. అలా చేసినట్లయితే దద్దుర్లు రాకుండా కాపాడ గలుగుతాము.

 

రోజుకి రెండుసార్లు స్నానం చేయించండి :

 

ఉదయాన్నే ఒకసారి , పడుకునేముందు మరొకసారి స్నానం చేయించండి .వేసవిలో దాని గురించి వేరొక ఆలోచనే అవసరంలేదు.  పిల్లలకు బట్టలు వేసే ముందు శరీరాన్ని తడిలేకుండా తుడవాలి అని నేను అనుకుంటాను . ఆ తడి వల్ల దద్దుర్లు మరియు ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

 

చలువ చేసే ఆహారాన్ని ఇవ్వండి :

 

పిల్లలు పండ్లు మరియు సలాడ్స్ బాగా ఇష్టపడతారు . నేను మా పిల్లలుకు ఫ్రెష్ పండ్లను మరియు సలాడ్స్ ను కొంచెం చల్లగా సహజంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను .ఇది మంచి పోషకాలను అందిస్తుంది .అదే సమయంలో చల్లదనాన్ని కూడా ఇస్తుంది.

 

పగటి పూట వేడి మరీ ఎక్కువగా ఉండే సమయంలో నేను మజ్జిగను ఇంట్లోనే తయారు చేసి ఫ్రిజ్లో ఉంచుతాను .ఆ మజ్జిగను పిల్లలు తరచూ తాగడానికి ఇష్టపడతారు.

 

పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునే సమయంలో వారు ఒంట్లో నీటి శాతాన్ని మరియు లవణాలను కోల్పోతారు .వారు ఆటల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక గ్లాసు గ్లూ కోన్ డీ, నిమ్మరసం, జెల్జీర లేదా మామిడి పన్నాను కానీ తయారుచేసి ఉంచుతాను .పిల్లలు హాయిగా ,సంతోషంగా ఉండడం పై నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. అది శీతాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి మన కుటుంబాన్ని మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ శ్రద్ధగా చూసుకోవడం మన కర్తవ్యం.

 

ఈ బ్లాగ్ మీకు సహాయ పడిందా ?వేసవిలో మీ పిల్లలకు దద్దుర్లు రాకుండా చల్లగా ఉంచడానికి మీ దగ్గర కూడా ఏమైనా టిప్స్ ఉన్నట్లయితే తెలుసుకోవడానికి మేము ఇష్టపడతాము .ఈ క్రింది కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}