• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లలలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే ఉత్తమమైన 10 ఆహార పదార్ధాలు.

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 06, 2020

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

చక్కని ఆరోగ్యానికి కావాల్సిన వాటిలో ప్రధానమైనది రోగనిరోధకశక్తి. ఇది సరైనదా ? ఈ విషయంలో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే మార్గాల కోసం భయపడుతూనే ఉంటారు .ఇక్కడ ఒక విషయం దాగి ఉంది తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా అనారోగ్యం అనేది ఒక భయంకరమైన ప్రక్రియ. వాతావరణం అం మరొక కారణం యాంటీబయాటిక్స్. తరచుగా యాంటీబయాటిక్స్ను వాడుతున్నట్లయితే అది రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసినదే .అందుకే ఇటువంటి చెడు ప్రక్రియ కొనసాగుతుంది. తల్లిగా ఈ ప్రక్రియ ను విచ్ఛిన్నం చేయడానికి ఒక మార్గం కావాలి.అని మీరు కోరుకుంటారా!'మనసుంటే మార్గం ఉంటుంది 'అని చెప్పినట్లుగా ఈ సందర్భం లో సరైన ఆహారాన్ని ఇవ్వడం రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఉత్తమమైన మార్గం అని తెలుపబడింది.

 

కొన్నిసార్లు నేను అనుకుంటాను,నా బిడ్డ ఎప్పుడు అనారోగ్యం పాలవకుండ చూసుకోవాలి అని. కానీ బిడ్డ ఎప్పటికప్పుడు అనారోగ్యంతో బాధ పడడం చూచి, వాస్తవానికి అది చాలా దూరం అని తెలుసుకుని అభిప్రాయాన్ని వదిలేసుకున్నాను. ఆ తరువాత, ఇటీవల నేను ఒక న్యూట్రిషనిస్టు ని కలిసాను .ఆమె ఏమి చెప్పారో తెలుసా ! నాకు అవకాశం ఉంది అని, అయితే అదేమిటి! అదేమిటో తెలుపనా? రోగనిరోధక శక్తిని పంచడం లోనూ మరియు అనారోగ్యాలను నివారించడంలోనూ ముఖ్య పాత్ర వహించే కొన్ని ఆహారాలను గురించి న్యూట్రిషనిస్ట్ నాకు తెలియజేశారు.

 

మా సహ పేరెంట్ బ్లాగర్ 'అంకిత తివారీ ' గారు అలాంటి 10 రకాల మంచి ఆహారాలను పంచుకుంటున్నారు. మన రోజు వారీ ఆహారంలో వీటిని చేరుద్దాం ! మునుపెన్నడూ చూడని విధంగా మన పిల్లలను ఆరోగ్యంగా , బలంగా  చూద్దాం. అది పిల్లలకు మరియు తల్లులకు ఇద్దరికీ లాభకరమైనది. మీరు దీనిని అంగీకరించలేరా !ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా మీ పిల్లల రోగనిరోధకశక్తిని సహాయపడే 10 ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

 

నట్స్ :

 

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ లో మీ పిల్లలకు అత్యవసరమైన అన్ని పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి .కాబట్టి ప్రతిరోజు రెండు లేదా మూడు బాదంపప్పు, జీడిపప్పు మరియు ఇతర డ్రైఫ్రూట్స్ను ఇవ్వండి. మీరు వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వారికి ఇవ్వండి .లేదా వాటిని పేస్టులాగా చేసి ఆహారంలో చేర్చి ఇవ్వండి .  మెదడు చురుకుగా పని చేసేందుకు కావల్సిన ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు వీటిలో అధికంగా ఉంటాయి.

 

హెర్బ్స్ :

 

మీ పిల్లలు మారుతున్న వాతావరణంతో పోరాడగల ఉత్తమమైన ఆహారాలలో ఒకటి మీ వంటగదిలోనే ఉన్నాయి .తులసి మరియు అల్లం.తులసి మరియు అల్లం వంటి ఆహారాలు సాధారణ జలుబు మరియు ద్వారాల నుండి పోరాడి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల కు వ్యతిరేకంగా శరీరాన్ని తయారు చేయడమే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తాయి. జలుబు గా ఉన్నప్పుడు వీటిని నీటిలో ఉడకబెట్టి  రోజుకి కొన్ని సిప్స్ ఇవ్వండి. మీ పిల్లలకు వాటిని ఇచ్చే ముందు ఏదైనా అలర్జీ లాంటివి ఉంటే తనిఖీ చేయండి.

 

రోగనిరోధక శక్తిని పెంచే సలహాలు ఇక్కడ తప్పక చదవండి :

 

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు మరియు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఎలా సహాయపడుతుంది ?

 

కూరగాయలు :

 

ఈ రోజుల్లో పిల్లలు సాధారణంగా కూరగాయలను ఇష్టంగా తినటం లేదు . ఇక్కడ ప్రతి తల్లి తమ అన్వేషణ చాతుర్యాన్ని ప్రదర్శించ వలసి ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినే విధంగా వాటిని వెజిటబుల్ కట్లెట్ లను తయారు చేయవచ్చు .వారు ఇష్టంగా తినే పాస్తా లాంటి వాటిలో కూడా వాటిని కలపవచ్చు. పిల్లలకు ఇష్టమైన ఆకారాలలో కీర దోసకాయ మరియు క్యారెట్లను అందంగా కట్ చేసి ఇవ్వవచ్చు .అలా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

 

కొవ్వులు :

 

మీ పిల్లలకు నెయ్యి లేదా ఇతర కొవ్వు పదార్థాలను ఇవ్వడం మానకండి.టమాటాల లోని లైకోపిన్ ను మరియు ,నారింజ మరియు పసుపు కాయగూరల లోని బీటా కెరోటిన్ వంటి పోషకాలను గ్రహించేందుకు నెయ్యి మరియు ఇతర కొవ్వు పదార్థాల అవసరం ఉంటుంది. ఇవి వారి కీళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి .ప్రతిరోజు రెండు చెంచాల నెయ్యి మీ పిల్లలకు ఇవ్వండి.

 

ప్రొటీన్లు :

 

ప్రొటీన్లు పిల్లలు శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి .ఇవి మీ పిల్లల ఆహారంలో ముఖ్యమైన భాగం కావాలి. మాంసాహారులైతే గుడ్లు (ఉడికించి ,ఫ్రై చేసి లేదా ఆమ్లెట్ అయినా )మరియు చికెన్ లో కూడా చక్కటి ప్రొటీన్ దొరుకుతుంది. శాఖాహారులకు పప్పు ధాన్యాలు మరియు జున్ను లో ప్రొటీన్లు లభిస్తాయి.

 

(మరింత సమాచారం తెలుసుకోండి... పసిబిడ్డలకు ఎంత ప్రోటీన్ అవసరం మరియు వారి అభివృద్ధిలో దాని పాత్ర...)

 

పెరుగు :

 

పెరుగు ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి .పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది . ఇది చిన్న ప్రేగులు మరియు పెద్ద ప్రేగుల పనితీరును పెంచుతుంది .ఇది శరీరం అన్ని పోషకాలను గ్రహించేలా చేస్తుంది .పాల పదార్థాలు సరిపడని పిల్లలకు కూడా పెరుగు చాలా మంచిది .కాబట్టి దీనిని తప్పక ఇవ్వండి.

 

విత్తనాలు :

 

వీటిని పచ్చిగా ఇవ్వండి. లేదా ఫ్రై చేసి స్నాక్ లాగా కూడా ఇవ్వవచ్చు .ఇవి పోషకాలకు మూల బిందువు లాంటివి .పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు గుమ్మడి గింజలలో జింక్ అధికంగా ఉంటుంది .ఇది పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మరియు చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది .పిల్లలు తినే పెరుగు లో వీటిని పొడి చేసి పైన చల్లండి మరియు పిండిలో కూడా కలపండి.

 

పుట్టగొడుగులు :

 

వాస్తవానికి ఈ పుట్టగొడుగులు అంటువ్యాధులతో పోరాడటానికి తల గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున 'గొప్ప యోధులు 'అని కూడా పిలుస్తారు. జలుబు మరియు దగ్గు తో పోరాడేందుకు పుట్టగొడుగులు సహాయపడుతాయి. ఫ్రై చేసిన పుట్టగొడుగులతో స్నాక్ చేసి ఇవ్వండి. తురిమి సూప్ లో కూడా కలిపి ఇవ్వవచ్చు. పుట్టగొడుగులు పచ్చిబఠానీలు తో చేసిన కూర కూడా చాలా బాగుంటుంది.

 

చేపలు :

 

చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి .ఇవి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి .చేపలలో ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి .ఇవి ఇన్ఫెక్షన్లను ధరిచేరనివ్వవు.

 

పండ్లు :

 

ఆయా సీజన్లలో దొరికే పండ్లను ఇవ్వండి .అవి మీ పిల్లల రోగనిరోధక శక్తిని బలపరిచే విషయంలో విటికన్న మంచి స్నేహితులు ఎవరు వుండరు . రంగురంగులతో కలిసిన ఫ్రూట్ ప్లేటు, ఫ్రూట్ చాట్, ఫ్రూట్ క్రీము లేదా ఫ్రూట్ స్మూతీస్ తో మీ పిల్లలను ఊరించండి.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}