• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

తల్లి పాల ఉత్పత్తిని పెంచే అద్భుతమైన ఆహారాలు...

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 06, 2022

మొదటిసారిగా తల్లి అయిన వారు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది తల్లిపాలు సరిపోకపోకపోవడం. మీ పిల్లల శారీరక , మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో ఉపయోగకరమైనవి. శిశువు యొక్క పోషక అవసరాలు అన్నీ తల్లిపాల ద్వారా తీర్చ పడతాయి. అందుకే శిశువులకు తల్లిపాలు ఇవ్వాలని కోరుకోవడం చాలా సహజం.

 

తల్లి పాల ఉత్పత్తికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. తల్లి పాల ఉత్పత్తి విషయానికొస్తే బిడ్డకు సరిపడా పాలు సరఫరా అవుతున్నాయా అనే విషయంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. తల్లి శిశువుకి ఎంత ఎక్కువ సార్లు పాలు పడుతుందో అంత ఎక్కువ పాల సరఫరా ఉంటుంది. అలా చేసినట్లయితే బిడ్డ అవసరానికి అనుగుణంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది.

 

మరింత తెలుసుకోండి...

 

అది మాత్రమే కాకుండా, తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. పూర్వకాలంలోనూ మరియు ఇప్పుడుకూడా పెద్దలు నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గింజలు, మల్టీ గ్రైన్ లు, సుగంధ ద్రవ్యాలతో కలిపి రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఇవి కొత్తగా తల్లి అయిన వారికి కోలుకోవడానికి కూడా సహాయపడతాయి.  మరియు అదే సమయంలో తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

 

తల్లిపాలు సరిపోవటం లేదు అనడానికి సంకేతాలు:

 

మీ శిశువు యొక్క బరువును తనిఖీచేయడం అన్నది ఎంతో ముఖ్యం. మీ శిశువును క్రమం తప్పకుండా వైద్యుని వద్దకు తీసుకువెళ్లండి . మరియు బరువు పెరుగుదల సక్రమంగా ఉందో లేదో తెలుసుకోండి. పిల్లలు మొదటి పది రోజులు బరువు కోల్పోతారు అని గమనించాలి . మరియు ఆ తర్వాత తిరిగి బరువు పెరగడం ప్రారంభం అవుతుంది.

 

మరింత సమాచారం...

 

తల్లి పాలు ఇవ్వడం వలన కలిగే సంకేతాలు:

 

తల్లి పాలు ఇవ్వడం వలన  సౌకర్యంగా ఉంటుంది మరియు నొప్పి లేకుండా ఉంటుంది.

 

శిశువు మీ పాలు తాగడానికి ఎంతో ఇష్టపడుతుంది.

 

పాలు ఇచ్చిన ప్రతిసారి మీ వక్షోజాలు మృదువుగా తేలికగా ఉంటాయి.

 

శిశువు పాలు తాగిన తర్వాత తనంతట తానుగా వక్షోజాల నుండి బయటకు రావాలని కోరుకుంటారు.

 

మీ శిశువు 24 గంటల్లో కనీసం ఎనిమిది సార్లు మూత్రవిసర్జన చేస్తుంది. మరియు రోజుకి మూడు నుండి నాలుగు సార్లు మలవిసర్జన చేస్తుంది. మలం కొన్ని సార్లు పసుపు రంగులో ఉంటుంది మరి కొన్నిసార్లు పలచగా, గట్టిగా ఉంటుంది.

 

మరింత సమాచారం..

 

తల్లి పాల ఉత్పత్తి పెంచడానికి మీరు తినగలిగే కొన్ని ఆహారాలు ఉన్నాయి. పాల ఉత్పత్తిని పెంచగలిగే ఎన్నో ఆహారాలు ఉన్నాయి. గలాక్టగోగ్స్ గా పరిగణించబడే అనేక ఆహారాలు ఉన్నాయి. ఇది పాల ఉత్పత్తిని పెంచుతాయి. గలాక్టగోగ్స్ తీసుకోవడానికి గల కారణాలు. బిడ్డ పాలు తాగే సమయంలో పాల ఉత్పత్తి ఉన్నప్పటికీ, తల్లి బిడ్డకు పాలు సరిపోవటం లేదు అని భావించినప్పుడు కన్సల్టెంట్ వీటిని సూచిస్తారు.

 

పాల ఉత్పత్తిని పెంచే ఆహార పదార్థాలను పరిశీలిద్దాం:

 

1. మెంతులు :

 

తరతరాలుగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే మెంతులు శక్తివంతమైన గలాక్టగోగ్స్. వాటిలో పాల ఉత్పత్తిని పెంచే సమ్మేళనాలు ఉన్నాయి. ఒమేగా త్రీ ఆమ్లాల తో నిండి ఉంటాయి. అవి మీ శిశువు యొక్క మెదడు అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. మెంతి ఆకుల లో బీటా-కెరోటిన్, బి విటమిన్, క్యాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 

2. ఓట్ మీల్ :

 

మీరు ప్రతి రోజు ఒక బౌల్ ఓట్ మీల్ ను తీసుకోవచ్చు. పాలు ఇచ్చే తల్లులకు పాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి ఓట్స్ బాగా ఉపయోగపడుతాయని తల్లులు ఎప్పటి నుండో నమ్ముతున్నారు.

 

3. వెల్లుల్లి:

 

వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గుండెజబ్బులను నివారిస్తుంది  మరియు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది మీ పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది తల్లిపాల యొక్క రుచి మరియు వాసనను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని మితంగా తినాలి అని సలహా ఇస్తారు.

 

4. సోపు గింజలు :

 

మెంతులు మాదిరిగానే సోపు గింజలలో ఈస్ట్రోజన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది పాల సరఫరాను పెంచుతాయని నమ్ముతారు.

 

5. మాంసము :

 

పంది మాంసము, గొర్రె మరియు పౌల్ట్రీ లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతాయి.

 

6. తెల్ల శనగలు:

 

ప్రోటీన్ మరియు ఫైబర్ లతో నిండి ఉన్న సెనగలు నిజమైన సూపర్ ఫుడ్. ఇందులో బి విటమిన్ , పొటాషియం , ఐరన్ మరియు మెగ్నీషియంలవంటి  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లి పాల ఉత్పత్తిని పెంచే గొప్ప వనరులు.

 

7. క్యారెట్లు :

 

క్యారెట్లో బి కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తి కి బాగా ఉపయోగపడుతుంది. దీనివలన పాలు సమృద్ధిగా లభిస్తాయి.

 

8. నీరు :


పాల ఉత్పత్తిని మెరుగుపరుచుకోవడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. శిశువుకి పాలు పట్టిన ప్రతిసారి తల్లి నీరు తీసుకోవడం ఎంతో అవసరం.

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jun 19, 2021

Ok

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}