తల్లిపాలల్లో బిడ్డకు అవసరమైనవి ఏ పదార్థాలు ఉంటాయి?

Nishika సృష్టికర్త నవీకరించబడిన Apr 11, 2021

ప్రపంచంలో స్వచ్చతలో తల్లి ప్రేమ తో సరి తూగేవి కొన్నే ఉన్నాయి.వాటిల్లో మొదటిది తల్లిపాలు. ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో కేవలం ఆడజాతులకే పిల్లలను కనే శక్తి, వారికి ప్రకృతిలోనే మంచి పోషకాహారం- తల్లిపాలను ఇవ్వగలిగే శక్తి ఉంటాయి. కొత్తగా అప్పుడే పుట్టిన పాపాయికి ఏ తల్లి అయినా తల్లిపాలకంటే మంచి ఆహారం ఇవ్వలేదు. పుట్టినప్పటి నుంచి కొన్ని నెలల వరకూ, బేబీ సరిగా ఎదిగే వరకూ ఇవే తాగటం మంచిది. నిజానికి తల్లిపాలు ఎంత మంచివి అంటే బేబీకి ఇంకే సప్లిమెంట్ ఫుడ్ కానీ, ప్యూరిఫై చేసిన నీళ్ళు కూడా అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు డాక్టర్లు బేబీకి మొదటి కొన్ని ఎదిగే నెలలు మొత్తం కేవలం తల్లిపాలే తాగించాలని చెప్తూనే ఉంటారు. ఆరోగ్య నిపుణులు తల్లికి,బిడ్డకి ఈ మంచి అలవాటు ఎంత ముఖ్యమో గుర్తుచేస్తూనే ఉంటారు.
అప్పుడే పుట్టినపాపాయికి ప్రత్యేక ఆహారంగా తల్లిపాలను ఎవరో కాదు ప్రకృతే సృష్టించింది, అందులో తప్పు ఎలా చేస్తుంది? మొదటగా పాపాయికి తల్లిపాలు తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతాయి. సరిపోయేంత గాఢత,సరైన పోషకాలుండి బేబీ రోగనిరోధకవ్యవస్థను బలంగా చేస్తాయి. కొత్తగా తల్లయినవారు సాధారణంగా తమ బేబీలకి పోషకాలు ఎంత ఏవి అవసరమోనని సందేహపడుతుంటారు. బేబీ ఆరోగ్యంగా ఉండటానికి తనకి సరిపోయే కరెక్ట్ ఆహారమే పెడుతున్నారో లేదో ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నిశ్చింతగా ఉండటానికి తల్లిపాలను ఇవ్వటం కన్నా మంచి పద్ధతి ఉండదు, ఎందుకంటే బేబీకి కావలసిన అన్ని పదార్థాలు ఇందులో ఉంటాయి. దీనిలో ఏమేం పదార్థాలు ఉంటాయా అని చాలా పరిశోధనలు జరిగాయి. సృష్టి అయినా తల్లి పాలల్లో ఏముంటాయో తెలుసుకుందాం ఇప్పుడు:
- నీళ్ళు : తల్లిపాలల్లో ముఖ్య భాగం నీరు. మీరు మామూలు పాలకన్నా తల్లిపాలు కొంచెం పల్చగా ఉండటం చూసే ఉంటారు. దానికి కారణం తల్లిపాలల్లో 90% నీరు ఉంటుంది కొత్తగా పుట్టిన బేబీ సున్నితమైన పొట్టకి సరిపోతుంది. తన జీర్ణవ్యవస్థ ఇంకా సంక్లిష్ట పదార్థాలను జీర్ణం చేసుకోలేదు. ఇది మీ బేబీని హైడ్రేటడ్ గా ఉండి, లోపలి అవయవాలను రక్షిస్తుంది.
- ప్రోటీన్లు : కండరాలు ఏర్పడటానికి ఇటుకలలాంటివి.బేబీకి ఇవి చాలా అవసరం. తల్లిపాలల్లో బేబీ ఎదగటానికి సాయపడే సింపుల్ ప్రోటీన్లు సరైన మొత్తంలో ఉంటాయి. ఇందులో కన్పించే ముఖ్య ప్రొటీన్ లాక్టోఫెర్రిన్, ఇది మీ బేబీని ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది ఎదగటానికి ముఖ్య ఖనిజలవణమైన ఐరన్ ను కూడా శరీరం పీల్చుకోడంలో సాయపడుతుంది.
- కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు ఒంట్లో శక్తికి ముఖ్య ఆధారాలు. పాలల్లో ఉండే సాధారణ చక్కెర లాక్టోస్ తల్లిపాలల్లో ఎక్కువ ఉండి బేబీకి శక్తినిస్తుంది. తల్లిపాలల్లో ఇతర కార్బొహైడ్రేట్లయిన ఒలిగోసాకరైడ్స్ కూడా ఉంటాయి. ఇవి పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి డయేరియాను దూరంగా ఉంచుతాయి.
- కొవ్వు : మీ బేబీకి కొవ్వు పదార్థాలు రెండు కారణాలవలన కావాలి. కొవ్వుపదార్థాలు శక్తిని ఇస్తాయి అలాగే బరువు పెరిగేలా చేస్తాయి,ఇది బేబీ ఎదగటంలో చాలా ముఖ్యం. ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్లయిన డిహెచ్ ఎ వంటివి బేబీ మెదడు ఎదుగుదల, నాడీ వ్యవస్థ,చూపు సరిగ్గా రూపుదిద్దుకోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- ఇమ్యునోగ్లోబ్లిన్స్ తల్లిపాలల్లో ఇమ్యునోగ్లోబ్లిన్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఇన్ఫెక్షన్లని పెంచే సూక్ష్మజీవులతో పోరాడటానికి శరీరంలో ఉండే యాంటీబాడీస్. మీ బేబీ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా పెరిగి ఉండదు, అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకవచ్చు,ఇవి ఎదుగుదలలో ఆటంకాలు తెస్తాయి.అందుకని తల్లిపాలు తాగటం వలన మీ బేబీ తరచూ జబ్బు పడకుండా ఉంటారు.
- విటమిన్లు కొత్తగా పుట్టిన పాపాయిలకి అవసరమైనది,ముఖ్యమైనవి విటమిన్లు. విటమిన్లు సరైన మొత్తంలో, ముఖ్యంగా విటమిన్ డి పిల్లల్లో స్కర్వీ రాకుండా ఉంచుతుంది. ఈ స్కర్వీ విటమిన్ డి లోపం వలన సాధారణంగా బేబీలలో కన్పిస్తుంది. ఇతర విటమిన్లయిన విటమి ఎ, బి3 వంటివి బేబీలలో జుట్టు,చర్మం ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
- హార్మోన్లు, ఎంజైములు మీ బేబీ శరీరం ఇంకా హార్మోన్లను స్రవించేంత పూర్తిగా ఎదగలేదు కాబట్టి, మీ తల్లిపాలే వాటికి ముఖ్య వనరుగా మారతాయి. ముఖ్య హార్మోన్లయిన ప్రోలాక్టిన్, థైరాక్సిన్, ఎండార్ఫిన్స్ వంటివి మీ బేబీ శరీరం బాగా పనిచేసేలా చూస్తాయి. పాలల్లో ఉండే ఎంజైములు బేబీకి అవి జీర్ణమయ్యేలా చూస్తాయి.
- ఖనిజ లవణాలు మీ బేబీ ఎదిగే శరీరానికి కొన్ని ఖనిజలవణాలు ఐరన్,జింక్, సోడియం వంటివి తక్కువ మొత్తాల్లో కావాలి. ఇవి తల్లిపాలల్లో దొరుకుతాయి. ఈ ఖనిజలవణాలు శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి. వారు పెరిగేటప్పుడు ఆక్సిజన్ ను వివిధ అవయవాలకి రవాణా అయ్యేట్టు చూసి, శ్వాసక్రియ, గుండె కూడా బాగా పనిచేసేలా చూస్తాయి.
శిశువుల ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధికి తల్లి పాలు అపురూపమైన ఆహారం; ఇది పిల్లలకే కాదు, తల్లులకు కూడా ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. తల్లి పలుఅందించడం వాళ్ళ పిల్లలు తల్లికి దగ్గరవుతారు. ఇటువంటి అవకాశం మళ్ళీ తల్లికి కానీ పిల్లలకి కానీ రాదు. అందువల్ల, ప్రపంచం ఎంత ఉందుకెళ్తున్న, ఇంకా ఎన్ని ప్రత్యామ్నాయలు ఉన్న, తల్లి పాలకు మించింది లేదు.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు


| Oct 15, 2019
Naku abu putti 3mnths avthundi milk konne vasthayi assalu okkasari kuda saripovadam ledu motham powder use chesthunnam weight 5kgs unnadu cheppandi plz milk ravalante . cheyyali


| Aug 26, 2020
what is the syrup that we should use for babies to get total vit a b3 nd d.